సగం టార్గెట్‌ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు? | uttar pradesh and key states in lok sabha elections 2024 | Sakshi
Sakshi News home page

సగం టార్గెట్‌ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?

Published Thu, Mar 21 2024 2:04 PM | Last Updated on Thu, Mar 21 2024 3:02 PM

uttar pradesh and key states in lok sabha elections 2024 - Sakshi

దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్‌ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్‌డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్‌సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు.

ఉత్తర ప్రదేశ్‌
ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  యోగి ఆదిత్యనాథ్‌, అఖిలేశ్‌, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్‌బరేలి, మైన్‌పురీ కీలక నియోజకవర్గాలు.  అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

బిహార్‌ 
బిహార్‌లో 40 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్‌డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి.  బిహార్‌ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్‌డీఏ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  నితీష్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్‌ కీలక నేతలు. హాజీపూర్‌, పట్నా సాహిబ్‌, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు.  కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

రాజస్థాన్‌ 
రాజస్థాన్‌లో 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్‌డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  భజన్‌లాల్‌ శర్మ, అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ కీలక నేతలు. జోధ్‌పూర్‌, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

పంజాబ్‌ 
పంజాబ్‌లో 13 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ 8 స్థానాలు, ఎన్‌డీఏ కూటమి 4, ఆప్‌ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్‌ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్‌ అధికారంలో ఉంది.

ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  భగవంత్‌మాన్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, సునీళ​ జాఖడ్‌ కీలక నేతలు. అమృత్‌సర్‌, గురుదాస్‌పుర్‌ కీలక నియోజకవర్గాలు.  రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

హరియాణా 
హరియాణాలో 10 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌, జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, నాయబ్‌సింగ్‌ సైనీ, భూపీందర్‌ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్‌ చౌతాలా కీలక నేతలు. రోహ్‌తక్‌, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు.  రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

ఢిల్లీ 
ఢిల్లీలో 7 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది.  ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్‌ అధికారంలో ఉంది.

బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  అరవింద్‌ కేజ్రీవాల్‌, వీరేందర్‌ సచ్‌దేవ, అర్విందర్‌ సింగ్‌ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు.  సీఏఏ, ఆప్‌-కాంగ్రెస్‌ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

ఉత్తరాఖండ్‌ 
ఉత్తరాఖండ్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  పుష్కర్‌సింగ్‌ ధామీ, కరణ్‌ మాహరా కీలక నేతలు. హరిద్వార్‌, నైనిటాల్‌-ఉద్దమ్‌ సింగ్‌ నగర్‌ కీలక నియోజకవర్గాలు.  యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

హిమాచల్‌ ప్రదేశ్‌ 
హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి.  సుఖ్విందర్‌ సింగ్‌ సుఖ్ఖూ, రాజీవ్‌ బిందల్‌ కీలక నేతలు. హమీర్‌పుర్‌, మండి కీలక నియోజకవర్గాలు.  అయోధ్య రామాలయం, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు.

జమ్మూకశ్మీర్‌ 
ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో 5 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 3 సీట్లు గెలుచుకున్నాయి.

భారతీయ జనతా పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్‌ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్‌ కమిషన్‌ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement