ఆజంఖాన్‌ ఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు | SP Mla Azam Khan Disqualified After Hate Speech Conviction | Sakshi
Sakshi News home page

ఆజంఖాన్‌ ఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు

Published Sat, Oct 29 2022 8:24 AM | Last Updated on Sat, Oct 29 2022 8:24 AM

SP Mla Azam Khan Disqualified After Hate Speech Conviction - Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్‌ సదర్‌ ఎమ్మెల్యే ఆజంఖాన్‌ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్‌ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఫలితంగా రాంపూర్‌ సదర్‌ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు.
చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement