Rampur mla
-
Azam Khan: ఎస్పీ సీనియర్ నేతకు ఎదురుదెబ్బ
బరేలీ(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్‌కు సెషన్స్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష ప్రసంగానికి సంబంధించిన కేసులో దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ వేసిన పిటిషన్‌ను రామ్‌పూర్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. దీంతో రామ్‌పూర్‌లో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది. 2019నాటి విద్వేష ప్రసంగం కేసులో ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు అక్టోబర్ 27వ తేదీన అజామ్‌ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్షవేసింది. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. రామ్‌పూర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలనీ ఈసీ నిర్ణయించింది. సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్లో పెండింగ్‌లో ఉండేసరికి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను పరిశీలనలోకి తీసుకోవాలని రామ్‌పూర్ సెషన్స్ కోర్టును దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఆయన పిటిషన్‌ను విచారణ చేపట్టిన రామ్‌పూర్ సెషన్స్ కోర్టు.. కొట్టేసింది. ఇదీ చదవండి: మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది -
ఆజంఖాన్ ఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత, రాంపూర్ సదర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ్యత్వం రద్దయింది. యూపీ అసెంబ్లీ సెక్రటేరియట్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా రాంపూర్ సదర్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్! -
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
-
నీ సంగతి తేలుస్తా.. ఏడ్చేలా చేస్తా
రాంపూర్: ఇటీవలే జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మాజీ మంత్రి ఆజం ఖాన్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. రాంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ నెల 11న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆజం ఖాన్.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అభయ్ కుమార్ గుప్తాతో దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యం వీడియో కెమెరాలో రికార్డయ్యింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత తాను బురద రోడ్డులో వెళ్లి విజయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆజాం ఖాన్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి తన కారును అనుమతించనందుకు ఆజంఖాన్.. గుప్తాను పరుష పదజాలంతో హెచ్చరించారు. 'ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ కోడ్ ఉండదు. అప్పుడు నీ సంగతి తేలుస్తా. నేను బురద రోడ్డులో నడిచి వచ్చేలా చేస్తావా? నువ్వు ఏడ్చేలా చేస్తా. బదిలీ చేయాలని వేడుకొంటావు. అధికారముందని ఇలా ప్రవర్తిస్తావా?' అంటూ ఆజంఖాన్ చిందులు తొక్కారు. ఈ మాటలన్నీ వీడియో కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్పీ సీనియర్ నేత అయిన ఆజం ఖాన్.. అఖిలేష్ యాదవ్ మంత్రి వర్గంలో పనిచేశారు. గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు, చర్యలతో వివాదాస్పదమయ్యారు.