
బరేలీ(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్‌కు సెషన్స్ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష ప్రసంగానికి సంబంధించిన కేసులో దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ వేసిన పిటిషన్‌ను రామ్‌పూర్ సెషన్స్ కోర్టు కొట్టేసింది. దీంతో రామ్‌పూర్‌లో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది.
2019నాటి విద్వేష ప్రసంగం కేసులో ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు అక్టోబర్ 27వ తేదీన అజామ్‌ను దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్షవేసింది. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. రామ్‌పూర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలనీ ఈసీ నిర్ణయించింది.
సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్‌లో పెండింగ్‌లో ఉండేసరికి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను పరిశీలనలోకి తీసుకోవాలని రామ్‌పూర్ సెషన్స్ కోర్టును దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఆయన పిటిషన్‌ను విచారణ చేపట్టిన రామ్‌పూర్ సెషన్స్ కోర్టు.. కొట్టేసింది.
ఇదీ చదవండి: మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది
Comments
Please login to add a commentAdd a comment