
‘జస్ట్ ఆస్కింగ్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై తన అభిప్రాయలను షేర్ చేసుకుంటుంటారు నటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు ఆయన ప్రజల తరఫున రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘‘ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ (ప్రజలు) సపోర్ట్‌తో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనే వివరాలు త్వరలో వెల్లడిస్తాను. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ప్రస్తుతం ఆయన సౌత్ మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment