Prakash raju
-
ఆ సినిమాపై ఉమ్మేసినా సిగ్గురాలేదు.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విమర్శలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కేవలం మొరగడానికే పనికొస్తారుగానీ.. కాటువేసే దమ్ము వీరికి లేదన్నారు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ' ది కశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్ చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఎలాంటి సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. వారు చేసేది కేవలం సౌండ్ పొల్యూషన్. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. అందుకే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు' అని అన్నారు. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 1990లలో కాశ్మీరీ హిందువుల వలసలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. “They needed to ban #Pathaan. It's going 700Cr. These idiots, who needed to #BanPathaan, didn’t run Modi’s movie for 30Cr. They’re simply barking, they do not chew. Don’t fret. Sound air pollution!” says Actor #PrakashRaj at #MBIFL2023 in #Kerala.#PathaanMovie #BoycottGang pic.twitter.com/CismuRxJ4k — Hate Detector 🔍 (@HateDetectors) February 6, 2023 -
పోరు మారుతోంది
-
అందరిని కలుపుకోవడానికే ఈ సమావేశం :ప్రకాష్ రాజ్
-
ఇండిపెండెంట్‌గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్‌రాజ్
-
రంగస్థల నటుడు ప్రకాష్‌రాజు మృతి
సాక్షి, తిరుపతి: నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ప్రకాష్‌రాజ్(82) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో నటించారు. అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్ అంతిమ ఘడియలు నాటకాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. చారిత్రక నాటకాలు ప్రదర్శించడంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1977లో భవాని కళానికేతన్ నాటక సంస్థను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించారు. జిల్లాలోని కళాకారుల్లో ఎక్కువ శాతం మంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. అంతేకాకుండా తన నాటకాల్లో మహిళలకు పెద్ద పీట వేసి వారికి అవకాశాలు కల్పించారు. రియల్ హీరో, రంగస్థలి రారాజు, నాటక దర్శకరత్న బిరుదులు అందుకున్నారు. ప్రకాష్‌రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, పలువురు కళాకారులు నివాళులర్పించారు. చదవండి: టాలీవుడ్లో విషాదం: పొట్టి వీరయ్య కన్నుమూత -
ప్రభుత్వ చీఫ్ విప్‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సోమవారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత పని నిమత్తం వినయ్ భాస్కర్‌ను కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. రాహుల్‌పై ఇటీవల జరిగిన దాడికి, ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాహుల్‌పై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. పబ్‌కు వెళ్లడం తప్పుకాదని, దాడి జరగడం సరికాదని వ్యాఖ్యానించారు. గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకోవాలని.. సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఎవరు పడితే వాళ్లు కొడతారా అని ప్రశ్నించారు. రాహుల్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కాగా, ప్రకాశ్‌రాజ్‌తో భేటీకి సంబంధించి వినయ్ భాస్కర్ కూడా స్పందించారు. ఒక సినిమా వేడుకకు సంబంధించిన అంశంపై మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందని, సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనిమీద ప్రకాశ్‌రాజ్, రాహుల్ సిప్లిగంజ్ తనను కలిశారని వెల్లడించారు. రాహుల్‌తో పబ్‌లో జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. -
‘అనుకోని అతిథి’ మూవీ స్టిల్స్
-
అనుకోని అతిథి
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ముఖ్య తారలుగా వివేక్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అధిరిన్’. ఈ సినిమా ‘అనుకోని అతిథి’ టైటిల్‌తో తెలుగులో విడుదలకానుంది. దీప సురేందర్ రెడ్డి సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘1970లో కేరళలో జరిగిన వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. సాయిపల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిం చారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని త్వరలో విడుదల చేసి, సినిమాని కూడా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు. -
అందుకే ఆప్ తరపున ప్రచారం చేస్తున్నా : ప్రకాశ్ రాజ్
-
స్వతంత్ర అభ్యర్థిగా!
‘జస్ట్ ఆస్కింగ్’ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై తన అభిప్రాయలను షేర్ చేసుకుంటుంటారు నటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు ఆయన ప్రజల తరఫున రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘‘ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ (ప్రజలు) సపోర్ట్‌తో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనే వివరాలు త్వరలో వెల్లడిస్తాను. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ప్రస్తుతం ఆయన సౌత్ మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ముచ్చటగా మూడోసారి
మహేశ్‌బాబు సినిమాల్లో ప్రకాశ్‌రాజ్ ఇప్పటివరకూ ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించారు. కానీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు’ సినిమాల్లో మాత్రం మహేశ్‌కు తండ్రిపాత్రలో నటించిన ప్రకాశ్‌రాజ్ ముచ్చటగా మూడోసారి ఫాదర్‌గా నటించనున్నా రట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న సినిమాలో మహేశ్‌కు తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం డెహ్రా డూన్లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్లో మహేశ్‌బాబు, కథానాయిక పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేశ్ పాల్గొంటున్నారు. ప్రజెంట్ కాలేజీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నార ట. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. -
రాజకీయాల్లోకి వస్తే దేశం నాశనమే!
సాక్షి, బెంగళూరు : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు రాజకీయాల్లో వస్తే గనుక దేశం నాశనమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించడం, రాజకీయ పార్టీలు పెట్టడాన్ని సమర్థించనంటూ బెంగళూరులో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నటుడికి కుల, మతాలకు, వర్గాలకు అతీతంగా అభిమానులు ఉంటారు. రాజకీయాలు అనేవి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని వర్గాల అభిమానులను దూరం చేస్తాయి. అభిమానుల పట్ల నటులు బాధ్యతతో ప్రవర్తించాలంటే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది’’ అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఇక నటులు రాజకీయాల్లోకి రావటాన్ని ప్రకృతి విపత్తుతో పోల్చిన ఆయన.. థియేటర్లలో జాతీయ గీతం వచ్చే సమయంలో లేచి పౌరులు దేశభక్తిని నిరూపించుకోవాలా.. అని అభిప్రాయపడ్డారు. గతంలో పెద్ద నోట్ల రద్దు, హిందూ అతివాదం, ప్రధాని మోదీ తనకంటే మంచి నటుడు అంటూ వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్.. తర్వాత కమల్ కు మద్దతు ఇవ్వటం, పలు రాజకీయ అంశాలపై స్పందించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయాల్లోకి రావటం ఖాయమని అంత అనుకున్నారు. ఆ అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ తాను రాజకీయాలకు దూరమని ప్రకాశ్ రాజ్ ఓ స్పష్టత ఇచ్చేశారు. -
ఆ ఘనత తేజూస్‌కే దక్కింది
‘‘తేజూస్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. తేజూస్ ఎనర్జీ చూసి, తప్పకుండా నటుడవుతాడనుకునేవాణ్ణి. కానీ, నా బేనర్ ద్వారానే హీరో అవుతాడని ఊహించలేదు’’ అన్నారు కేయస్ రామారావు. ప్రకాశ్‌రాజ్, స్నేహ ఓ జంటగా, తేజూస్, సంయుక్త మరో జంటగా రూపొందిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు వెర్షన్ నిర్మించిన కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ప్రకాశ్‌రాజ్‌కి తేజూస్ని పరిచయం చేసినప్పుడు తేలికగా తీసుకున్నాడు. ఆ తర్వాత తనలో మంచి హీరో మెటీరియల్ ఉందనే నమ్మకం ఆయనకు కుదిరింది. నాకు తెలిసి ఏ హీరో ఒకేసారి మూడు భాషల ద్వారా పరిచయం కాలేదు. ఆ ఘనత తేజూస్‌కే దక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం. ఇళయరాజాగారు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా కుదిరింది. ఈ వేసవికి రాబోతున్న చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. తేజూస్ మాట్లాడుతూ - ‘‘ఎప్పటికైనా కె.యస్. రామారావుగారి బేనర్లో చేయాలనుకున్నాను కానీ, నా తొలి సినిమాకే అది కుదరడం, ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్లో, ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్‌గారు నా మామయ్యగా నటించారు. మొదటి రోజు ఆయన కాంబినేషన్లో సీన్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ, సులువుగానే చేయగలిగాను. అయితే కన్నడ, తమిళ భాషలు తెలియదు కాబట్టి, అక్కడ కష్టమైంది’’ అని చెప్పారు. తేజ దగ్గర ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశానని, ఓ ఏడెనిమిదేళ్ల తర్వాత డెరైక్షన్ చేస్తానని పేర్కొన్నారు.