సాయి పల్లవి
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ముఖ్య తారలుగా వివేక్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అధిరిన్’. ఈ సినిమా ‘అనుకోని అతిథి’ టైటిల్‌తో తెలుగులో విడుదలకానుంది. దీప సురేందర్ రెడ్డి సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘1970లో కేరళలో జరిగిన వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. సాయిపల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిం చారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని త్వరలో విడుదల చేసి, సినిమాని కూడా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment