Fahadh Fazil
-
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
బన్వర్ ఈజ్ బ్యాక్
ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని బన్వర్ సింగ్ షెకావత్ చాలా కోపంగా ఉన్నాడు. మరి.. ఆయన కోపం ఏ స్థాయిలో ఉంటుందో ఈ డిసెంబరు 6న థియేటర్స్‌లో చూడొచ్చు. ఎందుకు అంటే ‘పుష్ప: ది రూల్’ సినిమా ఆ రోజున థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’.ఈ చిత్రంలో పుష్ప పాత్రలో అల్లు అర్జున్, ఐపీఎస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్, శ్రీవల్లి పాత్రలో హీరోయిన్ రష్మికా మందన్నా నటించారు. గురువారం (ఆగస్టు 8) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్వర్ ఈజ్ బ్యాక్ అంటూ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో ఫాహద్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఫహాద్ ఫాజిల్ హీరోగా రెండు తెలుగు సినిమాలు!
మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ రెండు తెలుగు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి ‘ఆక్సిజన్’ కాగా మరొకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ లో నటిస్తున్న ఆయన హీరోగా రెండు తెలుగు చిత్రాల ప్రకటన వచ్చింది. మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి, హిట్ కొట్టిన కార్తికేయ (డైరెక్టర్ రాజమౌళి తనయుడు) ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌పై ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఈ సినిమాలను నిర్మించనున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ‘ఆక్సిజన్’ చిత్రంతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ..
Kamal Haasan Vikram Movie Twitter Review: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 3న 'విక్రమ్'గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ఈ మూవీ 1986లో వచ్చిన 'ఏజెంట్ విక్రమ్ 007' సినిమా కథకు లింక్ చేసి రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ తెలుగులో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్లో అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మరీ ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'విక్రమ్' ప్రేక్షకులను ఎలా అలరించాడో ట్విటర్ రివ్యూలో చూద్దాం. #Vikram #VikramFDFS Full 3 hrs of explosive action|Racy screenplay & execution by @Dir_Lokesh Rocked|Stellar casting & performances @ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil & of course @Suriya_offl Tech excellence BGM @anirudhofficial subtitles @rekhshc camera Girish|MUST SEE pic.twitter.com/o9hmFie9yO — Srinivasan Sankar (@srinisankar) June 3, 2022 ఈ సినిమాను మూడు గంటల హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని చెబుతున్నారు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ రాకింగ్‌గా ఉందని పేర్కొన్నారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటన అద్భుతంగా ఉందని తెలిపారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఎక్సలెంట్‌గా ఉందన్నారు. What more we want from @Dir_Lokesh he has given life time settlement in #Vikram Moreover @Suriya_offl as Rolex Thaaaa whataaa screen presence yov loki bring back kaithi 2 or Vikram 2 ASAP cant wait🔥#VikramFDFS — KRISH (@KriahGo) June 3, 2022 'డైరెక్టర్ లోకేష్ నుంచి ఏమైతే కోరుకున్నామో అంతకుమించి ఇచ్చాడు. అన్నిటికిమించి సూర్య ప్రసెన్స్ అదిరిపోయింది. ఖైదీ 2 లేదా విక్రమ్ 2 చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం.' @Suriya_offl getup & elevation 🔥 Literally one of the best scene of his career !!#Vikram — GHOST 🦇 (@MGR_VJ) June 3, 2022 'సూర్య గెటప్, ఎలివేషన్ మాములుగా లేదు. అతని కెరీర్లోనే ఇది బెస్ట్ సీన్' #Vikram - Fire Fire Fire 🔥 🔥🔥🔥🔥🔥. Best cinematic experience l’ve ever had in recent times ,action packed second half deserves multiple watch! @ikamalhaasan , Fafa, @VijaySethuOffl& @Suriya_offl- what a treat to watch all these powerful performers in one film 🙏 @Dir_Lokesh — Rajasekar (@sekartweets) June 3, 2022 'ఈ మధ్య కాలంలో నేను చూసి మంచి అనుభూతికి లోనైన సినిమా ఇది. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్లు మళ్లీ వచ్చి చూసేలా ఉంటాయి. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య పవర్ఫుల్ యాక్టింగ్‌ను ఒకే సినిమాలో చూడటం సూపర్ ట్రీట్.' #Vikram 2nd Half last 20Mins rocks. Length is there. But screenplay holds the play. Suriya cameo 🔥. Clean Blockbuster for @Dir_Lokesh & Co. Congrats Thalaivarey ⚡ — × Kettavan Memes × (@Kettavan__Memes) June 3, 2022 Standing ovation for #Vikram after #FansFortRohini FDFS !! @RohiniSilverScr Thats it! — Nikilesh Surya 🇮🇳 (@NikileshSurya) June 3, 2022 #Suriya Entry In #Vikram Will Make U Go Crazy 🤩🤩🤩🤩 What A Movie @Dir_Lokesh Bro !! #EnowaytionPlus — Enowaytion Plus Vijay (@VijayImmanuel6) June 3, 2022 -
పద.. చూస్కుందాం.. 'విక్రమ్'ను వదిలిన రామ్ చరణ్..
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం (మే 20) విక్రమ్ తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఇందులో మొదటిసారిగా కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించారు. వీరేకాకుండా స్టార్ హీరో సూర్య కూడా 'విక్రమ్'లో అతిథి పాత్రలో అలరించనున్నాడు. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. వీరి ముగ్గురి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా యాక్షన్‌తో నిండిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడం, ముగ్గురు విలక్షణ నటులతోపాటు సూర్య అతిథి పాత్రలో నటించడంతో ఇదివరకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. మే 15న ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. Glad to release the Action packed #Vikram Telugu trailer#VikramHitlisthttps://t.co/3EFvSmFSmt My heartfelt wishes to @ikamalhaasan sir, @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @RKFI & Team! Good luck to @actor_nithiin @SreshthMovies for the Telugu release pic.twitter.com/M2RDYwodID — Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022 చదవండి: హిందీ భాషపై కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
కమల్ హాసన్ చిత్రంలో సూర్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Vikram: Lokesh Kanagaraj Confirms Suriya Cameo With Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (మే 15) ట్రైలర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2 నిమిషాల 38 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్లో కమల్, విజయ్, ఫాహద్ ఫాజిల్ తమ నటనతో అదరగొట్టారు. కాగా ఈ మూవీలో స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై డైరెక్టర్ లోకేష్ కనగరాజు స్పందించారు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని స్పష్టం చేశారు. సూర్య ఒక కీలక పాత్రలో అలరించనున్నాడని తెలిపారు. మే 15న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే విక్రమ్ చిత్రంలో సూర్య నటిస్తున్నాడని డైరెక్టర్ లోకేష్ తెలిపారు. ఇక ఈ నలుగురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులకు, అభిమానులకు పూనకాలే. -
కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్
సాక్షి,కరీంనగర్‌క్రైం: మలయాళ నటుడు ఫహాద్ పాసిల్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పేరుతో పోలీస్ క్యారెక్టర్ చేశారు. కరీంనగర్లో అచ్చు ఆయనలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఈ విషయం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ఘటనలో.. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం సాక్షి,కరీంనగర్: నాణ్యమైన విద్యనందించడమే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ నిర్వన్ బిర్లా అన్నారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ట్రినిటి విద్యాసంస్థల అధినేత దాసరి ప్రశాంత్ రెడ్డిచే స్థాపించబడిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను బుధవారం ఆయన ప్రార ంభించారు. ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో నాణ్యమైన విద్యనందించడాని కి కరీంనగర్‌కు బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రమోటర్ బీవోఎంఐఎస్ డాక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ వీబీఎస్సీ ఎలమంచిలి సందీప్, డైరెక్టర్ ఆఫ్ సౌత్ మాస్టర్ బీవోఎంఐఎస్ ఎల్బీ నగర్ విష్ణువర్దన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవిత విశ్వచేతన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్చ్.. వీళ్లింతే.! -
'విక్రమ్' రిలీజ్ డేట్ అదే.. అదరగొడుతున్న మేకింగ్ వీడియో
Kamal Haasan Vikram Movie Release Date With Making Video: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో 'విక్రమ్' ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ మూవీకి 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సోమవారం (మార్చి 14) ప్రకటిస్తామని కమల్ హాసన్‌తో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా విడుదల తేదిని సోమవారం ఉదయం చిత్రృందం అధికారికంగా ప్రకటించింది. సమ్మర్ కానుకగా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ డేట్‌తోపాటు విక్రమ్ మేకింగ్ వీడియోను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంది మూవీ యూనిట్. ఇందులో యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చూపించారు. పొలిటికల్ యాక్షన్ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో అలరించనున్నారు. ఈ వీడియోలో వీరిద్దరిని చూపించిన తీరు ఆకట్టుకుంది. చూస్తుంటే చాలా రోజుల తర్వాత కమల్‌హాసన్ పవర్ఫుల్లో రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
శౌర్యానిదే కిరీటం!
‘కోడ్: రెడ్’ అంటూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది ‘విక్రమ్’ చిత్రబృందం. కమల్‌హాసన్ హీరోగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. మరి.. కమల్.. విజయ్.. ఫాహద్... ఈ ముగ్గురిలో ‘రెడ్’ కోడ్‌ను ఎవరు? ఎలా? డీ కోడ్ చేశారన్నది వెండితెరపై చూడాల్సిందే. ‘‘శౌర్యానికి మాత్రమే కిరీటాన్ని ధరించే అర్హత ఉంది. నేను మళ్లీ ధైర్యంగా వస్తున్నాను. మాలో ఉత్తమమైనవారిని మీరే నిర్ణయించండి’’ అంటూ శనివారం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు కమల్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఉండటం విశేషం. అలాగే పోస్టర్‌పై ఉన్న కోడ్: రెడ్ ఏమై ఉంటుందా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. త్వరలో ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ప్రతీకార కథతో..
మొదటి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో రూపొందిస్తున్నారట. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్ అని తెలిసింది. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్ ఫాజల్ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్‌లో ఆయన పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు. -
‘అనుకోని అతిథి’ మూవీ స్టిల్స్
-
అనుకోని అతిథి
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ముఖ్య తారలుగా వివేక్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అధిరిన్’. ఈ సినిమా ‘అనుకోని అతిథి’ టైటిల్‌తో తెలుగులో విడుదలకానుంది. దీప సురేందర్ రెడ్డి సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘1970లో కేరళలో జరిగిన వాస్తవ సంఘటల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. సాయిపల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిం చారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్‌ని త్వరలో విడుదల చేసి, సినిమాని కూడా వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు. -
సాయిపల్లవి ‘అనుకోని అతిథి’
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి అనుకోని అతిథి అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కేరళలో భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీమతి దీప సురేందర్ రెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్ ‘సాహో’ సినిమాకి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు. -
సైకలాజికల్ థ్రిల్లర్
సాయి పల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అథిరన్’. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. 1970లలో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటించి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అను మోతేదత్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, సంగీతం: పి.ఎస్. జయహరి. -
మొదలైన చోటుకి వచ్చేశా!
‘భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల’ అని ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి చేసిన అల్లరికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ అంతకంటే ముందే మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యారు సాయిపల్లవి. ఈ చిత్రం తెలుగు రీమేక్ ‘ప్రేమమ్’లో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే మలయాళం ‘ప్రేమమ్’ చిత్రంలో నటించిన తర్వాత తెలుగులో (ఫిదా, ఎమ్సీఏ: మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లెచే మనసు), తమిళం (దియా, మారి 2 ఎన్జీకే: నంద గోపాల కుమరన్) సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు సాయిపల్లవి. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ మలయాళంలోకి వెళ్లారు. ‘అథిరన్’ అనే మలయాళం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘‘నా సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చాను. మూడేళ్ల తర్వాత మలయాళంలో సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సాయిపల్లవి. ఫాహద్ ఫాజల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. -
2018 చాలా స్పెషల్
పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు మలయాళ నటి నజ్రియా నజీమ్. ఆమెకు 2018 ఫుల్ స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ‘కూడే’ సినిమాతో సినిమాలు స్టార్ట్ చేశారు. అలాగే భర్త ఫాహద్ ఫాజల్ నటించనున్న ‘వరతాన్’ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి అమల్ నీరద్ దర్శకుడు. నిర్మాతగా మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం ఓ పాట కూడా పాడారట. శుషిన్ శ్యామ్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌ను నజ్రియా రీసెంట్గా పాడగా, రికార్డ్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్. 2014లో దుల్కర్ సల్మాన్‌తో యాక్ట్ చేసిన ‘సలాలా మొబైల్స్’ సినిమాలో ఫస్ట్ టైమ్ పాట పాడిన నజ్రియాకు ఇది సింగర్‌గా సెకండ్ సాంగ్. ‘వరతాన్’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
మలయాళ నటుడుతో తమిళ తార నాజ్రియా పెళ్లి!
ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో తమిళ నటి నాజ్రియా పెళ్లి కుదిరింది. నాజ్రియా, ఫహద్ లిద్దరూ ఎల్ ఫర్ లవ్ అనే మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్టు తెలిసింది. దాంతో ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లికి ఏర్పాటు జరుగుతున్నాయి. 'ఫహద్ తో తన కూతురు వివాహం కుదిరింది. ఆగస్టు నెలలో పెళ్లికి జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం' అని నజ్రియా తండ్రి మీడియాతో అన్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది. తన నిశ్చితార్ధం వార్తను నజ్రియా సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రాజా రాణి చిత్రంలో నజ్రియా నటించింది. ఫహద్ ఇప్పటి వరకు 12 చిత్రాల్లో నటించారు.