విజయ్ సేతుపతి, కమల్‌హాసన్, ఫాహద్
‘కోడ్: రెడ్’ అంటూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది ‘విక్రమ్’ చిత్రబృందం. కమల్‌హాసన్ హీరోగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. మరి.. కమల్.. విజయ్.. ఫాహద్... ఈ ముగ్గురిలో ‘రెడ్’ కోడ్‌ను ఎవరు? ఎలా? డీ కోడ్ చేశారన్నది వెండితెరపై చూడాల్సిందే. ‘‘శౌర్యానికి మాత్రమే కిరీటాన్ని ధరించే అర్హత ఉంది. నేను మళ్లీ ధైర్యంగా వస్తున్నాను. మాలో ఉత్తమమైనవారిని మీరే నిర్ణయించండి’’ అంటూ శనివారం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు కమల్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఉండటం విశేషం. అలాగే పోస్టర్‌పై ఉన్న కోడ్: రెడ్ ఏమై ఉంటుందా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. త్వరలో ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment