మరుదనాయగమ్‌ ఎవరు? | Kamal Haasan statement on Marudhanayagam | Sakshi
Sakshi News home page

మరుదనాయగమ్‌ ఎవరు?

Published Thu, Oct 31 2019 12:07 AM | Last Updated on Thu, Oct 31 2019 12:09 AM

Kamal Haasan statement on Marudhanayagam - Sakshi

విక్రమ్‌, కమల్‌హాసన్‌

కమల్‌హాసన్‌కి డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ చాలానే ఉన్నాయి. వాటిలో ‘మరుద నాయగమ్‌’ ఒకటి. 1997లో స్వీయదర్శకత్వంలో టైటిల్‌ రోల్‌ చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టారు కమల్‌. అయితే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి ఓ కారణం బడ్జెట్‌ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏదో సందర్భంలో కమల్‌ ప్రస్తావిస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘మరుదనాయగమ్‌’ని పూర్తి చేయాలనుకుంటున్నానని కమల్‌ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమాలో నటించలేనని స్పష్టం చేశారు. విక్రమ్‌ నటిస్తారని టాక్‌. ఇంతకీ ‘మరుదనాయగమ్‌’ ఎవరు? అంటే.. 18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు. ఆయన ఇస్లామ్‌ మతానికి మారాక యూసఫ్‌ ఖాన్‌గా పేరు మార్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement