Kamal Hasan
-
కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ!
చెన్నై : మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైనట్లే తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గురువారం కమలహాసన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం కమల్ హాసన్ నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లారు. ఆ భేటీని ఎంఎన్ఎం పార్టీ ఎక్స్ వేదికగా ప్రస్తావించింది. దీంతో రాజ్యసభకు కమల్ హాసన్ ప్రచారం జోరందుకుంది. மக்கள் நீதி மய்யம் கட்சியின் தலைவர் திரு. @ikamalhaasan அவர்களை, இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் திரு. @PKSekarbabu அவர்கள் மரியாதை நிமித்தமாகச் சந்தித்து உரையாடினார். தலைவரின் அலுவலகத்தில் நடந்த இந்தச் சந்திப்பின்போது, கட்சியின் பொதுச்செயலாளர் திரு. @Arunachalam_Adv அவர்கள்… pic.twitter.com/ni4Ne3hqFb— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) February 12, 2025 ఈ తరుణంలో కమల్ హాసన్‌తో ఉదయనిధి స్టాలిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్‌తో భేటీ అనంతరం, ఉదయనిధి స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మేం ఈరోజు మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాం. మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు, రాజకీయాలు, సినిమాతో పాటు వివిధ రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నందుకు నా కృతజ్ఞతలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. மக்கள் நீதி மய்யத்தின் தலைவர் - கலைஞானி @ikamalhaasan சாரை இன்று அவருடைய இல்லத்தில் மரியாதை நிமித்தமாக சந்தித்தோம். அன்போடு வரவேற்று அரசியல், கலை என பல்வேறு துறைகள் சார்ந்து கருத்துக்களை பரிமாறிக்கொண்ட கமல் சாருக்கு என் அன்பும், நன்றியும்.@maiamofficial pic.twitter.com/YdLqu4KZs4— Udhay (@Udhaystalin) February 13, 2025 2024లో తమ ఎన్నికల ఒప్పందంలో భాగంగా హాసన్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు సమాచారం. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. గతేడాది మార్చిలో కమల్ హాసన్ డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంను సందర్శించారు. అక్కడ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఒప్పందంపై సంతకం చేశారు.డీఎంకే నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకోవాలనే తన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగిందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కానీ ఈ ఇండియా కూటమికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పదవి కోసం కాదు, దేశం కోసం’అని ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి తరపున లోక్‌సభ ఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేశారు. ప్రతిగా 2025లో డీఎంకే కోటా నుండి రాజ్యసభ నామినేట్ చేయనుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సభ్యులతో సహా కనీసం ఆరుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం జూన్ 2025 నాటికి ముగియనుంది. అందుకే డీఎంకే పార్టీ ఇప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు సిద్ధమైంది. -
'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?
'విక్రమ్' సినిమాతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. దీంతో పలు భారీ చిత్రాల్లో భాగమయ్యారు. వీటిలో ఒకటే 'ఇండియన్ 2'. 'భారతీయుడు' మూవీకి సీక్వెల్ ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దర్శకుడు-హీరో కలిసి పనిచేశారు. ఇలా చూసుకుంటే అంచనాలు ఏ రేంజులో ఉండాలి? కానీ రియాలిటీలో అలా ఉందా?(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)ఇప్పుడు సినిమాల విషయంలో భాషతో ఎవరికీ సంబంధం లేదు. మంచి కంటెంట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పర్వాలేదనిపించాయి. పూర్తి ఆల్బమ్ కూడా ఓకే ఓకే అనుకునేలా ఉంది తప్పితే సూపర్ అనే టాక్ రాలేదు. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ కాజల్ సీన్స్ ఏం లేవంట. అంటే సేనాపతికి భార్య క్యారెక్టర్ ఉండదేమో? అలానే తమిళంలో బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు. ఇప్పటివరకు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మూవీ ఒకటుందని సగటు ప్రేక్షకుడికి ఇంకా రిజిస్టర్ కావట్లేదు. విడుదలకు మరోనెల మాత్రమే ఉన్న నేపథ్యంలో 'భారతీయుడు 2' జోరు పెంచాలి!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్‌తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్‌గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్‌గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్‌కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
INDIAN 2 కొత్త రిలీజ్ డేట్ అప్పుడేనా..!
-
బిగ్ బాస్: బాత్రూంలో లేడీ కంటెస్టెట్స్ రచ్చ.. పురుషులు నచ్చరంటూ..
కోలీవుడ్‌లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయింది. ఇప్పటికే సుమారు 40 రోజులు దాటింది. అక్కడ కమల్ హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ సీజన్లో కమల్ విక్రమ్ సినిమాలో సౌండ్ బోట్ బ్యూటీగా గుర్తింపు పొందిన మాయ కూడా కంటెస్టెంట్‌గా ఉంది. హౌస్‌లో ఆమె ఆటతీరుపై పలు విమర్శలు వచ్చినా గేమ్స్‌లలో బలంగా పోటీపడుతుంది. తాజాగా మాయపై సింగర్ సుచిత్ర వైరల్ కామెంట్ చేసింది. మాయ ఒక లెస్బియన్ అని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్‌తో కలిసి అదే బాత్రూంలోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న మాయ మరో కంటెస్టెంట్ అయిన ఐషుతో కలిసి బాత్రూంలోకి వెళ్లింది. ఆ సన్నివేశాలు విడుదలయ్యాయి. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం చర్చ సమయంలో పోటీదారులు తప్పనిసరిగా మైక్ ఆన్‌లో ఉంచాలి. మీరు బాత్రూమ్కి వెళ్లినప్పుడు మాత్రమే మైక్ తీయగలరు. దీనిని వారు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మైక్ తీసి ఒకే బాత్రూంలోకి వెళ్లి ఏదో మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించినట్లు కనిపిస్తోంది. కానీ బాత్రూమ్లోకి ఒకరు మాత్రమే వెళ్లాలి అనే రూల్ కూడా ఉంది. 'ఆమెకు పురుషులు అంటే ఇష్టం ఉండదు' ఇదే విషయం గురించి తమిళ నటుడు రంగనాథన్ సాకింగ్ సమాచారం ఇచ్చాడు.. హౌస్‌లో మాయ మాత్రమే కాదు, తమిళ సినిమాలో చాలా మంది లెస్బియన్స్ ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో మాయ, పూర్ణిమ మరింత దగ్గరవుతున్నారని ఆయన తెలిపారు. ఆమె పూర్ణిమపై ప్రేమను కలిగి ఉన్నట్లు సందేహాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆమె (మాయ) ఒక లెస్బియన్ అని ఇద్దరు ముగ్గురు నటీమణులు నాకు చెప్పారు. మాయ ట్రాన్స్‌జెండర్ కాకపోవడంతో ట్రాన్స్‌జెండర్ లిస్ట్‌లోనే ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. అందుకే ఆమెను ఎంపిక చేశారు. హౌస్‌లో మాయ చేస్తున్న పనులు, అలవాట్లున్నీ లెస్బియన్ మాదిరే ఉంటున్నాయి. వారు పురుషులను అస్సలు ఇష్టపడరు. సినిమాల్లో కూడా చాలా మంది లెస్బియన్స్ ఉన్నారు. కానీ, ఈ విషయం బయటకి తెలిస్తే పరువు పోతుందని దాస్తున్నారు. అని ఆయన పేర్కొన్నారు. నాతో రిలేషన్ పెట్టుకుంది: అనన్య మాయా కృష్ణన్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకి పాల్పడినట్లు కోలివుడ్ నటి అనన్య రామ్ ప్రసాద్ గతంలో ఆరోపించింది. ''నటి మాయ కృష్ణన్ నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. ఆమె కారణంగా నా కుటుంబానికి, స్నేహితులకి దూరమయ్యాను. ఆమె వలన లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో మానసికంగా కృంగిపోయాను. నన్ను వేధించింది ఒక మగాడు అయి ఉంటే ఈ విషయం చెప్పడానికి ఇంతగా ఇబ్బంది పడేదాన్ని కాదు. కానీ ఓ మహిళ కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. 2016 లో నాకు మాయ కృష్ణన్ తో పరిచయం ఏర్పడింది. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెకి 25.. ఆ సమయంలో నన్ను లొంగదీసుకొని నాతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ ఆరోపణపై మాయ కూడా అప్పట్లో రియాక్ట్ అయింది. అనన్య చెబుతున్న దాంట్లో నిజం లేదని .. కావాలనే తనపై కక్షగట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని పేర్కొంది. Dear @ikamalhaasan FY kind attn.#Maya & #Aishu removed their mic and spoke some secret in the toilet. That’s a serious violation. #BiggBossTamil7 #BiggBossTamil pic.twitter.com/V2xVUh8iN5 — Raja 🖤 (@whynotraja) November 10, 2023 -
కామిక్ కాన్ –2023 వేడుకల్లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్, టైటిల్‌ను జూలై 21న (భారతీయ కాలమానం ప్రకారం) రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్‌హాసన్ , నాగ్ అశ్విన్ లతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ అమెరికాలో సందడి చేసింది. -
కాజల్‌ను ఇండియన్–2 సినిమానే కాపాడింది
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదోవిధంగా వార్తల్లో ఉండడానికి ప్రయత్నించే నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూ ఇండియన్ నటిగా గుర్తింపు పొందిన నటి ఈమె. తెలుగు చిత్రం మగధీరతో కాజల్ అగర్వాల్ లక్ మొదలైందనే చెప్పాలి. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది మగధీర చిత్రం తరువాత స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా వరుసగా ప్రముఖ నటుల సరసన నటించే అవకాశాలను సంపాదించుకుంది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) అలా అగ్రకథానాయకిగా నటిస్తుండగానే గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి 2020లో సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ కెరియర్‌కు ఫుల్స్టాప్ పడినట్టే అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఈమెను ఇండియన్–2 చిత్రం కాపాడిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటిస్తుండగానే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. (ఇదీ చదవండి: Spy Trailer:యాక్షన్ సీన్లతో నిఖిల్ దుమ్ములేపాడు) మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అందుకు చాలా కసరత్తులే చేసింది. కాగా ఇండియన్–2 చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే కాజల్ అగర్వాల్ తెలుగులో మరో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. దీంతో కాజల్ గ్రాఫ్ మళ్లీ పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. -
లియోకి వాయిస్
ఇళయ దళపతి విజయ్ అభిమానులకు లోక నాయకుడు కమల్‌హాసన్ ఓ స్వీట్ షాక్ ఇవ్వనున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం విజయ్ నటిస్తున్న ‘లియో’ చిత్రం టీజర్‌కి కమల్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి యాక్షన్ టీజర్‌ని రెడీ చేస్తున్నారట చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్. విజయ్ ΄ాత్ర పరిచయంతో ఈ టీజర్ సాగుతుందని, ఈ పరిచయం కమల్ మాటల్లో వినబడుతుందని భోగట్టా. కమల్ డబ్బింగ్ చెప్పేశారని, ఆ వాయిస్‌తో టీజర్ రెడీ చేసే పని మీద చిత్ర యూనిట్ ఉందని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ ΄ాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
కమల్, నయన్ క్రేజీ కాంబో మూవీలో బోల్డ్ అండ్ బ్యూటీ..!
చెన్నై: నటుడు కమల్ హాసన్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్లు ఉండరనే చెప్పవచ్చు. కమల్ హాసన్‌కు జతగా నటిస్తే పాపులర్ అవ్వవచ్చునని చాలా మంది భావిస్తుంటారు కూడా. ఆయన చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని అలాంటి సన్నివేశాల వల్ల మరింత పబ్లిసిటీ పొందవచ్చు అని కొందరు భావిస్తుంటారు. కాగా కమలహాసన్‌తో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేక నయనతార ఇప్పటివరకు ఆయనకు జంటగా లభించలేదని ప్రచారం కూడా జరిగింది. తాజాగా కమల్ 234వ చిత్రంలో నటించడానికి నయన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. సుమారు 35 ఏళ్ల తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో తెరకెక్కనున్న చిత్రం ఇది. తాజాగా రూపొందించిన పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతుంది. తదుపరి ఆయన కమలహాసన్‌తో చేసే చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నయనతారతో పాటు మరో నటి కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఆమెనే నటి ఆండ్రియా. బోల్డ్ అండ్ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకొని నటిస్తుంది. ఈ బహుభాషా నటి ఇంతకుముందు కమలహాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం– 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన 234వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్ -
అఫీషియల్: కమల్‌హాసన్ మూవీలో స్టార్ క్రికెటర్ తండ్రి.. పోస్ట్ వైరల్
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్-2'. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చిది. ఇవాళ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. యోగ్ రాజ్.. తన ఇన్‌స్టాలో రాస్తూ...' ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్‌కు థ్యాంక్స్. కమల్ హాసన్ ఇండియన్-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే తిరుపతిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Yograj Singh (@yograjofficial) -
వరుస ఎదురుదెబ్బలు.. తలపట్టుకుంటున్న కమల్‌హాసన్
సాక్షి, చెన్నై: వరుస ఎదురుదెబ్బలు మక్కల్‌నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి. ఆ పార్టీకి ఏకంగా కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. దీంతో ఈ పదవుల భర్తీ కోసం పార్టీ పరంగా ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంక్ ఆ పార్టీలో కొంత మేరకు ఉత్సాహాన్ని నింపాయి. ఆ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలోని ముఖ్యులందరూ గుడ్ బై చెప్పడం మొదలెట్టేశారు. అనేకమంది జిల్లాల పార్టీకార్యదర్శులు ఇతరపార్టీల్లోకి వెళ్లి పోయారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా కమల్ మళ్లీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తమకు పట్టం కడుతారనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అనేక జిల్లాల్లో పార్టీ కార్యదర్శులుగా వ్యవహరించేందుకు స్థానికంగా ఉండే ముఖ్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జేబులకు పడ్డ చిల్లుతో సతమతం అవుతున్న నేతలకు తమకు పదవులు వద్దు బాబోయ్ అని దాట వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సేవల్ని అందిస్తున్న కార్యకర్తల్ని ఆ పదవులకు ఎంపిక చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు కోసం దరఖాస్తులు చేసుకోవాలని మక్కల్ నీది మయ్య పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం కాంచీపురం, చెంగల్పట్టు, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, తెన్కాశి, విరుదునగర్, తూత్తుకుడి, తదితర 15 జిల్లాలకు కార్యదర్శులు కావాలంటూ.. ప్రకటన ఇచ్చుకో వాల్సిన దుస్థితి ఏర్పడడం గమనార్హం. పార్టీకి సేవల్ని అందించే కార్యకర్తలు, కమల్ మీద నమ్మకం కల్గిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రకటించడం విశేషం. చదవండి: Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ? -
కిల్లర్ లుక్‌లో కమల్ హాసన్.. విక్రమ్ వచ్చేది అప్పుడే !
Kamal Haasan Vikram Movie New Poster Released: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో విక్రమ్ ఒకటి. ఇందులో యూనివర్సల్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇదీవరకూ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదిన ఎప్పుడూ ప్రకటిస్తారో ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్ పోస్టర్లో కమల్ హాసన్ ఇంటెన్సివ్‌గా కిల్లర్ లుక్‌లో అదిరిపోయాడు. సూట్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పోస్టర్లో మార్చి 14న ఉదయం 7 గంటలకు విక్రమ్ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని వెల్లడించారు. విక్రమ్ మూవీ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 110 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీ చిత్రీకరణ కోసమే తమిళ బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఇందులో అర్జున్ దాస్, శివానీ నారయణన్, నరేన్, కాళీదాస్ జయరామ్, ఆంటోనీ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు. Vikram theatrical release date to be announced on MARCH 14th, 2022 at 7 Am@ikamalhaasan @VijaySethuOffl #fafa@anirudhofficial @RKFI @turmericmediaTM#KamalHaasan#VikramReleaseAnnouncement#Vikram pic.twitter.com/CvFNholC78 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 11, 2022 -
కమల్‌తో 'అన్బరివు' చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తమిళ బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోలో 'అన్బరివు' చిత్ర యూనిట్ సందడి చేసింది. హిప్ హాప్ ఆది హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ. త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను బిగ్ బాస్ హౌస్‌లో కమల్ హాసన్ ఆవిష్కరించారు. నిర్మాత టీజీ. త్యాగరాజన్, నటుడు హిప్ హాప్ ఆది, దర్శకు డు అశ్విన్ రామ్ పాల్గొన్నారు. -
'ఇండియన్ 2' హీరోయిన్ కోసం అన్వేషణ.. మిల్క్ బ్యూటీ పక్కానా ?
Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇండియన్ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది. 'ఇండియన్ 2' చిత్రం నుంచి చందమామ కాజల్ అగర్వాల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రెగ్నెంట్ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్ 2'లో హీరోయిన్గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్గా చేసేందుకు అంగీకరంచిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్ వార్గాలు. ఇదీ చదవండి: ఇండియన్ 2 నుంచి కాజల్ ఔట్.. మరో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్? -
బిగ్ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్.. కారణం అదేనా?
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్ంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా భారీ హిట్ సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రాబోతుంది. పలు అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఆటంకం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని టాక్. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాజల్ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అన్ని వివాదాలు సద్దుమణిగి తిరిగి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందనంగా ఈ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ్, వివేక్ తదితరులు నటిస్తున్నారు. భారతీయుడు సినిమా పలు రికార్డులను సొంత చేసుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చదవండి: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్ -
కమల్‌తో మన్సూర్ అలీఖాన్ భేటీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో నటుడు మన్సూర్ అలీఖాన్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీఖాన్‌తో పాటు తమిళ దేశీయ పులిగళ్ పార్టీ నాయకులు ఉండడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కమల్‌హాసన్ ఇంట్లో కలిసినట్లు మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. -
శౌర్యానిదే కిరీటం!
‘కోడ్: రెడ్’ అంటూ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది ‘విక్రమ్’ చిత్రబృందం. కమల్‌హాసన్ హీరోగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. మరి.. కమల్.. విజయ్.. ఫాహద్... ఈ ముగ్గురిలో ‘రెడ్’ కోడ్‌ను ఎవరు? ఎలా? డీ కోడ్ చేశారన్నది వెండితెరపై చూడాల్సిందే. ‘‘శౌర్యానికి మాత్రమే కిరీటాన్ని ధరించే అర్హత ఉంది. నేను మళ్లీ ధైర్యంగా వస్తున్నాను. మాలో ఉత్తమమైనవారిని మీరే నిర్ణయించండి’’ అంటూ శనివారం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు కమల్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఉండటం విశేషం. అలాగే పోస్టర్‌పై ఉన్న కోడ్: రెడ్ ఏమై ఉంటుందా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. త్వరలో ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. -
‘విక్రమ్’ కోసం రిస్క్ తీసుకుంటున్న కమల్ హాసన్
ఆరు పదుల వయసులో అదిరిపోయే ఫైట్స్ చేయడానికి కమల్‌హాసన్ రెడీ అవుతున్నారు. అది కూడా సాదాసీదా ఫైట్స్ కాదు. రిస్కీ ఫైట్స్ చేయనున్నారు. ‘కేజీఎఫ్’ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్ అందించి, ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఫైట్ మాస్టర్స్ అన్బు-అరివు జంట లోకనాయకుడు కమల్‌తో ఫైట్స్ చేయించనుంది. కమల్‌హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న తాజా చిత్రం ‘విక్రమ్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి అన్బు-అరివుని యాక్షన్ కొరియోగ్రఫీకి తీసుకున్నట్లు లోకేష్ కనకరాజ్ తెలిపారు. ‘‘కమల్‌హాసన్ వంటి లెజెండ్‌తో పని చేయడానికి ఎగై్జటింగ్‌గా ఉన్నాం. ‘విక్రమ్’ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్బు-రివ్ పేర్కొన్నారు. కాగా ‘కేజీఎఫ్’కి ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీకి జాతీయ అవార్డు సాధించిన అన్బు-అరివు ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’, రవితేజతో ‘ఖిలాడి’, సూర్య 40వ చిత్రాలకు స్టంట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. -
మా తల్లిదండ్రులు విడిపోవడమే మంచిదయింది! : శ్రుతిహాసన్
కమల్‌హాసన్, సారికల పెద్ద కుమార్తె, హీరోయిన్ శ్రుతీహాసన్ దాదాపు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు.. ఇటీవల ఓ సందర్భంలో తన తల్లిదండ్రులు విడిపోయిన విషయం గురించి మాట్లాడారు శ్రుతి. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తనకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది అన్నారామె. ఇంకా శ్రుతి మాట్లాడుతూ – ‘‘మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నప్పుడు నేను ఎగ్జయిట్ కావడానికి కారణం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంలేదని వారికి అనిపించింది. ఆ తర్వాత విడాకులు తీసుకోవాలనుకున్నారు. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడం కరెక్టేనని, వారి నిర్ణయం గౌరవించదగ్గదేనని అనిపించింది. వ్యక్తులుగా వారు విడిపోయినా తల్లిదండ్రులుగా నాకు, నా చెల్లెలి (హీరోయిన్ అక్షరా హాసన్)కి వారి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యక్తిత్వాలు వేరుగా ఉన్న ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు. వారు విడాకులు తీసుకున్నప్పుడు నేను యంగ్ ఏజ్‌లో ఉన్నాను. మా తల్లిదండ్రులు కలిసి లేరన్న విషయాన్ని పక్కన పెడితే, విడివిడిగా ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. అలా హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా’’ అన్నారు. 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. -
Indian 2: కమల్ హాసన్ మధ్యవర్తిత్వం?
‘ఇండియన్ 2’ చిత్రీకరణ విషయంలో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఈ చిత్ర దర్శకుడు శంకర్లకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా ప్రతినిధులు అంటుంటే, షూటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించకుండా, నా తర్వాతి ప్రాజెక్ట్స్‌ను నియంత్రించే హక్కు లైకా వారికి లేదని శంకర్ అంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. అయితే లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు, దర్శకుడు శంకర్ కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు ఇటీవల ఓ సందర్భంలో సూచించింది కూడా. ఇప్పుడు ఈ బాధ్యతను ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్ తీసుకుని వారధిలా ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసే ఆలోచనలో ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్, శంకర్‌తో ముందు విడిగా మాట్లాడి, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కమల్ జోక్యంతోనైనా శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదం కొలిక్కి వస్తుందా? సమస్య పరిష్కారం అయి, షూటింగ్ మొదలవుతుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. 1996లో దర్శకుడు శంకర్, హీరో కమల్‌హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. చదవండి: ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత -
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: దారుణంగా కమల్ పార్టీ పరిస్థితి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టిస్తోంది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది. డీఎంకే 125 స్థానాల్లో.. అన్నాడీఎంకే 77 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన పార్టీలేవీ కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేవు. ఇక, లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్ హాసన్ పోటీ చేస్తున్న కోయంబత్తూర్ సౌత్‌లోనే. అక్కడ కూడా పోటాపోటీగా ఉంది. కమల్ 15 వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ జయకుమార్ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాసన్ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు వేలపై చిలుకు ఓట్ల మెజార్టీలో కమల్ ఉన్నారు. అయితే ఈ మెజార్టీ అలానే కొనసాగుతుందా లేక, తారుమారు అవుతుందా అన్నది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. కాగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. -
వివాదాల సుడిగుండం లో కమల్ హాసన్
-
కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్
తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ముఖ్యంగా సీఎం ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలను పేలుతున్నాయి. మహిళలను అవమానించిన డీఎంకే నేతలకు బుద్ధి చెప్పాలని ఎడపాడి పిలుపునిస్తే.. అవినీతి అన్నాడీఎంకేను ఓడించాలని స్టాలిన్ కోరుతున్నారు. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకులకే ఓటెయ్యాలని పళనిస్వామి విన్నవిస్తుంటే.. ఉదయ సూర్యుడిని గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం తరఫున కమల్‌హాసన్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో నేతలు తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పరస్పరం ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మహిళా ద్రోహి డీఎంకేకు బుద్ధి చెప్పండి : ఎడపాడి మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన డీఎంకే నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నై మైలాపూర్, అశోక్‌నగర్, టీ నగర్ నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. చెన్నై మేయర్‌గా, మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేసిన స్టాలిన్ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలను చులకనగా చూసే డీఎంకేను ఓడించాలని కోరారు. రెండాకులకు ఓటేసి గెలిపిస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తామని హామీ ఇచ్చారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేలా పాలన సాగిస్తామన్నారు. ఆరు నెలల వంట గ్యాస్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. మనీ కోసమే ‘మణి’ల ఆరాటం : స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు ‘మణి’లు మనీ కోసం ప్రజలను యథేచ్ఛగా దోచుకున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎడపాడి పళనిస్వామి కేబినెట్లోని మంత్రులు వేలుమణి, తంగమణి, కేసీ వీరమణి ప్రజాధనం లూటీ చేశారని మండిపడ్డారు. కేసీ వీరమణి, అతని బినామీల ఇళ్లపై నాలుగేళ్ల క్రితం ఐటీ దాడులు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఉదయ సూర్యుడికి ఓటేసి డీఎంకేను గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. డీఎంకే నేత, ఎంపీ కనిమోళి తిరుచెందూరులో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేకు తగిన గుణపాఠం నేర్పా లని పిలుపునిచ్చారు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కమల్ మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గ ప్రజలతో ఆన్లైన్లో ముచ్చటించారు. రమ్య అనే అభిమాని మిమ్మల్ని నేరుగా చూడాలని ఉందన్నారు. ఆదివారం రాత్రి కామరాజపురంలో ప్రచారానికి వచ్చిన కమల్ ప్రసంగం మధ్యలో ఆమె పేరును పేర్కొంటూ ఆహ్వానించారు. ప్రచార వాహనం వద్దకు వచ్చిన నిండు గర్భిణి అయిన రమ్యకు డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచారు. కమల్‌పై గౌతమి ఫైర్ కమల్‌కు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో కమల్‌పై గౌతమి పలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. -
బాయ్‌ఫ్రెండ్ కోసం వంట చేసిన శ్రుతీహాసన్.. పాపం
గత కొద్ది రోజులుగా హీరోయిన్ శ్రుతీ హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే శ్రుతీ, శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రుతీ హాసన్ బాయ్‌ఫ్రెండ్ కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక బాయ్‌ఫ్రెండ్ కోసం శ్రుతి హాసన్ పైనాపిల్‌తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శ్రుతీ చేసిన వంట చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్ ‘‘ఇది వెస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా’’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శంతను హజారికా గువహతికి చెందిన వ్యక్తి. అతను రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్‌తో కలిసి పని చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో శంతను వెల్లడించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్, శంతను హజారికా చెన్నైని సందర్శించారు. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ జంట శ్రుతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా అతని ఇంట్లో కలుసుకున్నారు. చదవండి: మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్! -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్..
-
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట
చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్ చెన్నై, అలందూర్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ సుభా చార్లేస్ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు -
కమల్ సినిమాలో మలయాళ హీరో విలన్!
‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్‌హాసన్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో కమల్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్, టైటిల్‌ను విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో విలన్‌గా మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సూపర్ డీలక్స్’ వేలైకారన్’ వంటి తమిళ సినిమాల్లో నటించారు ఫాహద్. ‘వేలైకారన్’లో చేసిన విలన్ పాత్ర ఫాహద్ కి మంచి పేరు తెచ్చింది. -
అదే మీ చేతిలోని బ్రహ్మాస్త్రం: కమల్
చెన్నై: మరో ఆరు నెలల్లో తమిళనాడులో ఎన్నికల నగారా మోగనుంది. పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్న నటుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటర్లును ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం అన్నారు. అర్హులైన వారంతా ఓటరు ఐడీలకోసం సైన్ అప్ చేసుకోవాలని కోరారు. రెండున్నర నిమిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ‘ఓటరుగా ఉండటం అనేది 18 ఏళ్లు నిండిన వారికి దక్కిన అరుదైన గౌరవం. ఓటరు ఐడి అనేది పెద్ద ఆయుధం. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం.. హక్కులను ఆటోమెటిక్‌గా కోల్పోతుంది. మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగ్గా పని చేయడం లేదని విమర్శించే వారు.. ప్రజా ప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. 2021 ఎన్నికల్లో దీన్ని మీ ఆయుధంగా వాడుకోండి. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కోరారు కమల్. (చదవండి: ఇలాగైతే పార్టీ ఎత్తేస్తా.. కమల్‌హాసన్ హెచ్చరిక..!) ஒன்று கூடுவோம் வென்று காட்டுவோம்#iWillCHANGE_iWillVOTE#என்ஓட்டு_என்பெருமை pic.twitter.com/xvggdOfl6V — Kamal Haasan (@ikamalhaasan) November 20, 2020 వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు లెజండరీ నాయకులైన జయలలిత, కరుణానిధిలను కోల్పోయిన తర్వాత తమిళనాడులో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2018, ఫిబ్రవరిలో కమల్ మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోల బరిలో నిలిచిన కమల్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 4 శాతం ఓట్లు మాత్రమే సంపాదించింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ‘జీవనాధారం, ఉద్యోగాలు, తాగునీరు’ అజెండాతో ప్రజల మధ్యకు వెళ్లనుంది. వచ్చే నెల నుంచి కమల్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి గురించి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ గురించి పునరాలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆయన ఇకలేరంటే నమ్మలేకపోతున్నా
సాక్షి, చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త కోట్లాది మంది అభిమానులనే కాకుండా సినీ నటులను షాక్‌కు గురుచేసింది. తాజాగా నటి శోభన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎస్పీబీని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి తాను నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేశారు. 'ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేసేందుకు వెతుకుతుండగా ఆయన లేరనే విషయన్ని నమ్మలేకపోతున్నానని... అలాంటి వ్యక్తి స్థానాన్ని మరెవరూ పూడ్చలేరని' ఆమె భావోగ్వేదంతో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 25న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. చెన్నై శివారు ప్రాంతం తామరపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్ వద్ద అంతిమ కార్యక్రమం జరిగింది. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి) View this post on Instagram It is difficult to come to terms with his loss especially while I was searching for a song to post in his memory .. Nothing to be said other than we have lost an irreplaceable treasure . We acted together as well . He played a cop and me , a thief . 🙂Unassuming , jovial , pure and song centered was Spb sir . A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) on Oct 2, 2020 at 9:13pm PDT -
‘ఆ చెత్త షోలో పాల్గొనేది లేదు’
చెన్నై : బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 4లో తాను పాల్గొనడం లేదని కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ స్పష్టం చేశారు. అలాంటి చెత్త షోలో తాను పాల్గొనబోనని ఆమె తేల్చిచెప్పారు. ఇతరులు తిన్న ప్లేట్లు కడగడం,ఇతరులు వాడిన టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి పనులు తాను చేయనని, ఇక ముందూ అలాంటి పనులు చేయనని చెప్పారు. బిగ్‌బాస్ షోలో తాను పాల్గొంటున్నట్టు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. షో పేరుతో కెమెరా ముందు ఇతరులతో తాను ఫైట్ చేయాలనుకోనని తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో తెలిపారు. బిగ్‌బాస్ షోపై తాను స్పష్టంగా వివరణ ఇచ్చిన తర్వాత ఈ చెత్త షోలో తాను పాల్గొంటానని ఎవరూ ఊహాగానాలు చేయబోరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజమేనా? కాగా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్లేట్లు కడిగేవారు, టాయిలెట్లను శుభ్రపరిచేవారిని మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన స్టోరీపై పలువురు నెగెటివ్ మెసేజ్‌లు పంపుతున్నారని, ఇది తన అభిప్రాయమని..కొందరు ఈ షోను ఇష్టపడితే మరికొందరు ఇష్టపడరని లక్ష్మీ మీనన్ వివరణ ఇచ్చారు.ఇంటి వద్ద తన ప్లేట్లను తాను కడుగుతానని, తన టాయిలెట్‌ను తాను శుభ్రపరుస్తానని..కెమెరా ముందు అలాంటి పనలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎవరినో బాధపెట్టేందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఇక కమల్ హాసన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ తమిళ్ నాలుగో సీజన్ అక్టోబర్ 4 నుంచి ప్రసారం కానుంది. -
ప్రభుత్వానికి కమల్ పది ప్రశ్నలు
సాక్షి, చెన్నై: అధికారాన్ని కాపాడుకోవడమే ప్రాతిపదికగా, ప్రజాసంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పార్టీ అధినేతగా తన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందు ప్రశ్నలు పెడుతున్నానని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షులు, నటుడు కమలహాసన్ అన్నారు. ప్రజాప్రయోజనాలను ఆశిస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. ఆ ప్రకటనలోని వివరాలు.. విద్యను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పునకు ప్రయత్నాలు చేయకుండా, నీట్ రద్దుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని కేంద్రప్రభుత్వాన్ని దారితెచ్చుకోలేదు. నీట్ పరీక్షకు సరైన శిక్షణావకాశాలను కల్పించకుండా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటారు. నష్టపరిహారతో సమస్యను కప్పిపుచ్చాలని చూస్తున్నారా, జీవనాధారం కోల్పోయి అందే ఆర్థికసహాయం రైతన్నకు చెందకుండా దారిమళ్లింది. ప్రభుత్వం తన అవినీతిని కరోనా కాలంలో కూడా చాటుకోవడం న్యాయమా, ఆన్లైన్ విద్యాబోధనకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడింది. ఆన్లైన్ విద్యాబోధనను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేతులు దులుపేసుకున్నారు. జీవనాధారం కోల్పోయిన ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు ? కరోనా కష్టకాలంలో ఎనిమిది లేన్ల రోడ్డు కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? రుతుపవనాలు, తుపాన్ల కాలంలో నష్టపోయేది మత్స్యకారులే. వారి వృత్తి రక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటి ? చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఆర్థిక దుర్బర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు, ఉద్యోగావకాశాల మెరుగుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ? కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ వాటా పొందడంలో ఉదాసీనత ఎందుకు, ఒత్తిడి చేసేందుకు వెనకడుగు ఎందుకు ? ఈ అమ్మ ప్రభుత్వం టాస్మాక్‌లను మూసివేయడాన్ని ఎపుడు ప్రారంభిస్తారు ? ఈ రుతుపవనాల కాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చేపట్టిన చర్యలు ఏమిటి ? ప్రజల తరఫున ప్రజల్లో ఒకడిగా అడిగిన ఈ పది ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా అని ఆ ప్రకటనలో కమల్ పేర్కొన్నారు. -
ఎర్రగులాబీలులో... కీర్తీ సురేష్
కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో దాదాపు 40 ఏళ్లక్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘శిగప్పు రోజాక్కళ్’. ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’ పేరుతో అనువాదమై, విడుదలైంది. రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలోనూ రీమేక్ అయింది. నలభైఏళ్ల తర్వాత ఇప్పుడు ‘శిగప్పు రోజాక్కళ్’కి సీక్వెల్ తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీరాజా ఈ చిత్రానికి కథ అందించటంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తారు. భారతీరాజా కుమారుడు మనోజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. శ్రీదేవి పాత్రలో ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్‌ని నటింపజేయాలనుకున్నారట. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి కమల్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ‘ఎర్రగులాబీలు’ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజానే ఈ సీక్వెల్‌కు సంగీతాన్ని సమకూరుస్తారని సమాచారం. రివెంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది. -
రాఘవన్‌కి జోడీగా...
లోక నాయకుడు కమల్‌హాసన్‌కు జోడీగా కీర్తీ సురేష్ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వేట్టయాడు విలైయాడు’ (తెలుగులో ‘రాఘవన్’ గా విడుదలైంది). 2006లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్ మీనన్. ఇటీవల కమల్‌హాసన్‌కు స్క్రిప్ట్‌ను కూడా వినిపించారట. కమల్ కూడా ఓకే అన్నారని సమాచారం. అలాగే కీర్తీ సురేష్‌కు కూడా కథ వినిపించారట. ఈ సీక్వెల్లో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. -
‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
చెన్నై: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్, బెనిక్స్లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సీఎం పళనిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోందని విమర్శించారు. అదే విధంగా తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనను కమల్ గుర్తు చేశారు.(ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) ఇప్పడు పి.జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాడి చేశారని ఇది హత్యా నేరం కాదా అని కమల్ తీవ్రంగా ప్రశ్నించారు. కాగా, తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఇక 21న వీరిద్దరూ పోలీసుల రిమాండ్‌లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. -
నీ కోసం నిరీక్షణ
కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో రీమేక్ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు. సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
ప్లాన్ రెడీ
రజనీకాంత్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కోసం ప్లాన్ రెడీ అవుతోంది. కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు ‘మా నగరం (2017), ఖైదీ (2019)’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 169వ చిత్రం. ఆల్రెడీ కథా చర్చల్లో భాగంగా రజనీని లోకేష్ రెండుసార్లు కలిశారని సమాచారం. కథ పట్ల రజనీ సుముఖంగానే ఉన్నారట. అలాగే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులుగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలనే విషయంపై కూడా కమల్–లోకేష్ చర్చించుకుంటున్నారట. ఈ సినిమాని నిర్మించనున్న కమల్ అతిథి పాత్రలోనూ కనిపించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మాధురితో ఏక్.. దో.. తీన్
మనిషిని కడిగేసే శానిటైజర్.. డ్యాన్స్. శుభ్రమైపోతాయి బాడీ అండ్ మైండ్.. డ్యాన్స్ చేసినా.. డ్యాన్స్ చూసినా! ‘తాం.. దిగిదిగి తాం.. దిగిదిగి.. తాం..’ ఇదొకటే కాదు డ్యాన్స్‌కి తాళం. మనసు ఉద్వేగాన్ని తెరిచే ప్రతిదీ! ‘సాగర సంగమం’లో ఇన్విటేషన్ చూసి కమల్‌హాసన్ మనసు నాట్యం చేస్తుంది. నేడూ రేపు మనతో డ్యాన్స్ చేయించడానికి అలాంటి ఇన్విటేషన్నే ఇస్తున్నారు మాధురీ దీక్షిత్. నిలువనివ్వనిదేదో డ్యాన్స్‌లో ఉంది. రక్తప్రసరణలా నృత్యప్రసరణ! మనిషిని నిటారుగా ఉండనివ్వదు. కొద్దిగా వచ్చినవాళ్లను కూడా క్రీస్తుపూర్వపు నృత్య పండితుడు భరతముని ఆవహించి ఆడించేస్తాడేమో! ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్‌కి భరతనాట్యం వచ్చు. కూచిపూడి వచ్చు. కథాకళి వచ్చు. కథక్ కూడా కొంచెం వచ్చు. కొంచెంతో తృప్తిపడడు. దాహం. నృత్యదాహం. డబ్బులుండవు. గురువుగారికి సేవచేసి రుణం తీర్చుకుంటానని చెప్పి కథక్ క్లాసులకు ఎంట్రీని ఇప్పించుకుంటాడు. ఆ ఆనందంలో డాన్స్ చేస్తుంటాడు. ‘‘సరే పదా’’ అంటాడు శరత్‌బాబు వచ్చి. ‘నువ్వు వెళ్లు.. ’ అంటాడు.. చేత్తో ‘వెళ్లు’ అని అభినయిస్తూ. ‘‘సరే, అట్టాగే మణిపురి, భోజ్‌పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, బుస్సాం.. అవి కూడా నేర్చుకో. దాంతోనే జీవితమంతా సరిపోతుంది. తొందరగా ఇంటికొచ్చి ఏడువ్’’ అనేసి తను వెళ్లిపోతాడు శరత్‌బాబు. డ్యాన్సే జీవితం అనుకున్నప్పుడు జీవితమంతా డాన్స్కే సరిపోవడం అంటూ ఏముంటుంది? అయితే కమల్ని గానీ, మాధురీ దీక్షిత్‌ని గానీ.. కోర్సు పూర్తయింది కదా.. అని వదిలేసి పోదు డ్యాన్స్. ఆడిస్తుంది. ఓ పెద్ద వేదిక మీద గిర్రున తిరిగి అలసి పడిపోయేంత వరకు. ‘‘అవునూ.. ప్రతి సంవత్సరం ఆలిండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్ జరుగుతాయంటారు.. అంత గొప్పగా ఉంటాయా?’’.. సాగర సంగమంలోనే.. జయప్రద అడుగుతుంది కమల్ని. ‘మరీ! చాలా విశేషం కదండీ. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, దేశదేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్ కూడానండీ. అంతమంది పెద్దవాళ్ల ఎదుట, తోటి కళాకారుల సమక్షంలో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే జాతకంలో రాసి పెట్టి ఉండాలండీ’ అంటాడు. కనీసం ఆ ఫెస్టివల్స్‌ని చూసే భాగ్యం కూడా కలిగివుండదు కమల్‌కి తన లైఫ్‌లో. ఓసారెప్పుడో గురువుగారి దగ్గర్నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే, సరిగ్గా వెళ్లే టైమ్‌కి డబ్బుల్లేక ఆగిపోతాడు. జయప్రద అడిగితే అదే చెబుతాడు. ‘‘ఈసారి జరిగే డ్యాన్స్ ఫెస్టివల్‌కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్లు ఉన్నాయి. వెళతారా?’’ అని అడుగుతుంది జయప్రద. అతడా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే తన హ్యాండ్ బ్యాగులోంచి ఒక ఇన్విటేషన్ తీసి ఇస్తుంది. డాన్స్ చేసినంత పని చేస్తాడు కమల్. ఇన్విటేషన్ తీసుకుని ఒక్కో పేజీ తిప్పుతుంటాడు. లోపల అంతా ప్రపంచ ప్రసిద్ధ నాట్యకోవిదులు. యామినీ కృష్ణమూర్తి! ‘అమ్మోయ్’ అంటాడు. సోనాల్ మాన్సింగ్! ‘ఓహ్’ అంటాడు. జయప్రద కమల్ కళ్లలోకే చూస్తూ ఉంటుంది. గీతానాయర్! ‘ఆహా’ అంటాడు. గోపి కృష్ణ! ‘ఊప్..’ అంటాడు. అని, జయప్రద వైపు చూసి ‘ఈసారి అంతా పెద్దవాళ్లేనండీ’ అంటాడు. ఇంకో పేజీ తిప్పుతాడు. క్లాసికల్ డ్యాన్స్ రిసైటల్ బై.. శ్రీ బాలకృష్ణ అని ఉంటుంది!! ఆ బాలకృష్ణ కమల్‌హాసనే! జయప్రద వైపు చూస్తాడు. అతడి విస్మయాన్ని, అతడి ఉద్వేగాన్ని, కృతజ్ఞతను మోయలేని అతడి హృదయ భారాన్ని వ్యక్తీకరించే పనిని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఇళయరాజాకు అప్పగించారు కె.విశ్వనాథ్. ఆ సీన్లో కమల్‌లా మనం కూడా గడ్డకట్టుకుని పోతాం. జయప్రద కలవారి అమ్మాయి. ఆమె ప్రయత్నం వల్లనే కమల్‌కి అంతటి అవకాశం వస్తుంది. ముందే చెప్పదు. సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటుంది. ఇన్విటేషన్లో డాన్స్ చేస్తున్న తన ఫొటో, తన పేరు చూస్తుంటాడు కమల్. ‘‘ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే’’ అంటుంది జయప్రద ఇన్విటేషన్లో కమల్ని చూపిస్తూ. కమల్ ఏడ్చేస్తాడు. కమల్ కాదు. కమల్‌లోని డాన్సర్ ఏడ్చేస్తాడు. ఎంత పెద్ద లైఫ్ అచీవ్మెంట్.. కళాకారుడికి. మాధురీ దీక్షిత్ తొమ్మిదేళ్లకే కథక్ డాన్సర్. గురుపూర్ణిమ రోజు తొలి డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ‘దిస్ లిటిల్ గర్ల్ స్టోల్ ద షో’ అని ముంబైలో ఓ పత్రిక రాసింది. ఆ రోజంతా చంద్రమండలం మీదే ఉంది మాధురి. సినిమా స్టార్ కాకపోయుంటే ఆమె డ్యాన్సర్ గానీ, మైక్రోబయాలజిస్ట్ గానీ అయి ఉండేది. సినిమాలొచ్చి క్లాస్‌లోంచి మధ్యలోనే ఆమెను తీసుకెళ్లిపోయాయి. మైక్రోబయాలజిస్ట్ అయి ఉంటే మాధురి ఇప్పుడు కరోనా వైరస్‌కు వాక్సిన్ కనిపెట్టే టీమ్‌లో ఉండేవారేమో! అప్పుడూ ఆమెను డ్యాన్స్ వదలకపోయేది. డ్యాన్స్‌లో ఉన్న గొప్పతనం అది. వదిలిపెట్టదు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈరోజు. లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి.. ఆన్లైన్లో డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మాధురీ.. ఈరోజు, రేపు. తన ఫస్ట్ లవ్ కథక్‌తో పాటు.. ‘ఏక్ దో తీన్..’ పాటలకూ ఆమె తన వెబ్సైట్లో లైవ్‌గా డ్యాన్స్ చేయబోతున్నారు. ‘డాన్స్ విత్ మాధురి’ ఆ ఫెస్టివల్ పేరు. కొరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్, ఫరాఖాన్, కథక్ నాట్యాచార్యులు పండిట్ బిర్జూ మహరాజ్ మరికొంతమంది దిగ్గజాలు మాధురితో కలుస్తున్నారు. హిప్హాప్లు, మసాలా భాంగ్రాలూ ఉంటాయి. డ్యాన్స్‌లో ఏదో ఉంది.. రక్తప్రసరణలా మనిషి లోపల నృత్యప్రసరణ లాంటిది. -
కరోనా పై కమల్ పాట
కరోనాపై పోరాటంలో పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు స్టార్స్. చిరంజీవి, నాగార్జున, సల్మాన్ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు ఆల్రెడీ పాటలను విడుదల చేశారు. తాజాగా కమల్ హాసన్ కూడా కరోనాపై ఓ పాటను ఆలపించారని సమాచారం. సంగీత దర్శకుడు జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి పాడారట కమల్ హాసన్. ఈ పాట త్వరలోనే విడుదల కానుందని సమాచారం. -
ఇన్ రాఘవన్
తమిళంలో టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో యాక్ట్ చేశారు నయనతార. ఒక్క కమల్ హాసన్‌తో తప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్ కలవబోతోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2006లో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో ‘రాఘవన్’గా విడుదలయింది) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు గౌతమ్ మీనన్. ఇందులో హీరోయిన్గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నయన ఇన్ రాఘవన్ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. -
ఆగస్ట్‌లో ఆరంభం
కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్, రజనీకాంత్ పలు సినిమాల్లో కలిసి నటించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే నటులుగా కాదు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా వేసవిలో ప్రారంభం కావాలి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ సినిమాను ఆగస్ట్ నెలలో ప్రారంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. మరి ఈ సినిమాకి కమల్ కేవలం నిర్మాతగానే ఉంటారా? అతిథి పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాలి. -
ప్రధానికి కమల్ ఘాటు లేఖ
చెన్నై : కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనే తీరును తప్పుపడుతూ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఘాటైన వ్యాఖ్యలతో బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు ప్రకటించిన లాక్డౌన్ అమలు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానిస్తూ సార్ ఈసారి మీ విజన్ విఫలమైందని లేఖలో ప్రస్తావించారు. ప్రణాళికాబద్ధంగా లాక్డౌన్ ప్రకటించని లోపానికి సాధారణ ప్రజలను నిందించలేమని, ఇంతటి విపత్తుతో ముంచుకొచ్చిన మహమ్మారి కట్టడికి ఎలాంటి ప్రణాళిక, కసరత్తు లేకుండా నోట్ల రద్దు తరహాలోనే లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని నిర్ణయం సరైంది కాదని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను కేవలం 4 గంటల వ్యవధిలో లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చిన మీకు నాలుగు నెలల ముందే వైరస్ సమాచారం ఉన్నా 4 గంటల నోటీసుతోనే ప్రజలకు లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రధానిని ఉద్దేశించి కమల్ హాసన్ పేర్కొన్నారు. నోట్ల రద్దు తరహాలోనే భారీ స్ధాయిలో మరో తప్పిదం చోటుచేసుకుంటుందా అనే భయం తనను వెంటాడుతోందని అన్నారు. మరోవైపు లాక్డౌన్ ప్రకటించిన మరుసటి రోజే ప్రధానికి రాసిన తొలిలేఖలోనూ కమల్ పలు అంశాలు ప్రస్తావించారు. మహమ్మారి వైరస్‌తో అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అణగారిన వర్గాల ప్రజలను ఆదుకునే చర్యలు ప్రకటించాలని కోరారు. ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల కోసం కాకుండా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, పునాదులు దెబ్బతింటే అద్భుత కట్టడాలు సైతం కుప్పకూలుతాయన్నారు. ఏ ఒక్కరూ ఆహారం తీసుకోకుండా నిద్రించే పరిస్థితి ఎదురుకాకూడదని అన్నారు. చదవండి : నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి -
నేను బాగానే ఉన్నాను
‘‘కమల్ హాసన్ క్వారంటైన్లో ఉన్నారు’’ అనే వార్తలు శనివారం తమిళనాడులో హల్ చల్ చేశాయి. దానికి కారణం కమల్ హాసన్ నివాసం వద్ద ‘గృహ నిర్భందంలో ఉన్నారు’ అనే స్టికర్ కనిపించడమే. అయితే ‘ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. ప్రస్తుతం మా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నాం. నేను గృహ నిర్భందంలో లేను. కానీ సామాజిక దూరం పాటిస్తున్నాను’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసి అభిమానుల అనుమానాలను క్లియర్ చేశారు కమల్. అయితే ‘గృహ నిర్భందంలో ఉన్నారు’’ అనే స్టికర్ అంటించడానికి కారణం వేరే ఉందట. కమల్ హాసన్ తో కొన్నేళ్లు సహజీవనం చేసిన గౌతమి ఈ నెల మొదటివారంలో దుబాయ్ నుంచి తిరిగి వచ్చారట. ఆమె పాస్‌పోర్టులో కమల్ పాత నివాస గృహానికి సంబంధించిన అడ్రెస్ ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధులు ఆ ఇంటికి స్టికర్ అంటించారట. అసలు విషయం అది. ఇక గౌతమి తన గురించి మాట్లాడుతూ –‘‘నేను బాగానే ఉన్నాను. దుబాయ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మీరందరు కూడా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటిద్దాం’’ అని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు గౌతమి. -
నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి
‘‘ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎవరికి తోచిన సహాయం వారు చేయాల్సిన సమయం’’ అంటున్నారు కమల్‌హాసన్. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వీలుగా తన ఇంటిని ఆస్పత్రిగా మార్చాలనుకుంటున్నారు కమల్. ‘‘ప్రభుత్వం అనుమతిస్తే నా ఇంటిని తాత్కాలికంగా ఆస్పత్రిగా మార్చుతాను. నా ‘మక్కళ్ నీది మయమ్’ (కమల్ రాజకీయ పార్టీ)లో ఉన్న డాక్టర్లతో రోగులకు వైద్యం చేయిస్తాను’’ అన్నారు కమల్. -
ఇంట్లోనే ఉందాం
కోవిడ్ 19 (కరోనా వైరస్)ను అధిగమించడానికి ప్రధాని మోదీ నేడు (ఆదివారం) జనతా కర్ఫ్యూ (ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటిలోపలే ఉండటం)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పౌరులందరూ ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్‌ను అధిగమించాలని కొందరు స్టార్స్ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్ చేశారు. ఇటలీ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అక్కడ మరణాల సంఖ్య మెండుగా ఉంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకూడదు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో పాల్గొందాం. స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం పాటిద్దాం. – రజనీకాంత్ ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు కట్టుబడి ఉందాం. ఈ అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణ రీతిలో జాగ్రత్తులు తీసుకుందాం – కమల్ హాసన్ మోదీగారు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగస్వాములం అవుదాం. కరోనా విపత్కర పరిస్థితులను కట్టడి చేసేందుకు సామాజిక దూరాన్ని పాటిద్దాం – నాగార్జున ఈ ఆదివారం మార్చి 22 ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటిద్దాం – వెంకటేశ్ జనతా కర్ఫ్యూకు అందరం సపోర్ట్ చేద్దాం. కరోనా వైరస్‌పై సమిష్టిగా పోరాడదాం – మహేశ్‌బాబు కరోనా వైరస్‌పై పోరాడటానికి స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం.. ఈ రెండూ బలమైన ఆయుధాలు. కరోనాని జయించాలంటే అందరం మన వంతు కృషి చేయాలి. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. – ఎన్టీఆర్ జనతా కర్ఫ్యూలో భాగంగా పౌరులందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సమిష్టిగా పోరాడి కరోనాను అధిగమిద్దాం – రాజమౌళి మన ఇంట్లోకి ఎవరైనా వస్తే చెంబుతో నీళ్లిచ్చి, కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రమ్మంటాం, అలాంటి సంప్రదాయం మనది. అలాంటిది ఈ మహమ్మారి కరోనా వస్తానంటే రానిస్తామా? అందుకే మన దేశం కోసం, మనందరి ఆరోగ్యం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు చెప్పిన జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఈ రోజు ఉదయం 7గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లల్లో మనమే ఉంటూ బయటివారిని ఎవరినీ రానివ్వకుండా వీలైనంత పరిశుభ్రతను పాటించడం ఈ రోజు ముఖ్యోద్దేశ్యం. అలా ఇంట్లో ఉండి మన వంటలను మనమే చేసుకుని మనమే తింటూ ఇంట్లో ఉందాం. మనందరం ఒకటే అని నిరూపించటం కోసం సాయంకాలం 5 గంటలకు మన ఆనంద హర్హాతిరేకానికి గుర్తుగా మన దేశ పౌరులందరూ ఒక్కటే అనుకుని చేతులన్నీ శుభ్రం చేసుకొని ఒక్కసారి చప్పట్లు కొడదాం. అలా చేసి, మనందరం ఒకటే అని నిరూపిద్దాం. జైహింద్. – రాజేంద్రప్రసాద్ -
ముహూర్తం కుదిరింది
సుమారు 35 ఏళ్ల విరామం తర్వాత కమల్‌హాసన్ – రజనీకాంత్ కలసి సినిమా చేయబోతున్నారు. అయితే ఇందులో ఇద్దరూ కలసి నటించడం లేదు. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజనీకాంత్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే దర్శకుల పేర్లలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్, ‘ఖాకీ’ తీసిన హెచ్. వినోద్ ఈ రేస్‌లో ఉన్నారు. మరి ఈ సినిమాలో ఏదైనా సన్నివేశంలో కమల్–రజనీ కనిపించే అవకాశం ఉంటుందా? వేచి చూడాలి. ∙రజనీకాంత్, కమల్ హాసన్ -
షాక్ అయ్యాం
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్‌తో మానిటర్లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన. ‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్. -
కరోనా ఎఫెక్ట్
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ చెన్నైలో షూటింగ్ చేసుకుంటున్న ‘ఇండియన్ 2’పై పడింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇండియన్ 2’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో షూట్ చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ఇబ్బంది ఉండటంతో లొకేషన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌ను ఇటలీలో చేయనున్నారని తాజా సమాచారం. -
సూపర్ ఎగ్జైట్మెంట్
మేకప్ రూమ్‌లో చాలా శ్రద్ధగా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ఏకాగ్రత ‘ఇండియన్ 2’ కోసమే. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్‌హాసన్– శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’(తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ షూటింగ్ చెన్నైలో జరుగుతోందని సమాచారం. ఈ షూట్లో కాజల్ పాల్గొన్నారు. ‘‘ఇండియన్ 2’ షూట్లో పాల్గొంటున్నాను.. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది’’ అన్నారు కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో 80ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపిస్తారట కాజల్. ఈ చిత్రంలోని పాత్ర కోసం అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ కూడా సాధన చేశారామె. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
జనవరి 31.. ప్రేమికుల దినోత్సవం!
ప్రేమికుల దినోత్సవం ఎప్పుడంటే.. ‘ఫిబ్రవరి 14’ అని ఎవరైనా చెబుతారు. మరి.. జనవరి 31 అన్నారేంటి అనుకుంటున్నారా? కమల్‌హాసన్‌కి మాత్రం ప్రేమికుల దినోత్సవం అంటే జనవరి 31. ఎందుకు అలా అంటున్నారంటే.. తన స్కూల్ మేట్స్‌ని ఆయన ఆ రోజునే కలుసుకున్నారు. చెన్నైలోని ‘సార్ ఎం.సి.డి. ముత్తయ్య చెట్టియార్ బాయ్స్ హయర్ సెకండరీ స్కూల్’లో కమల్ చదువుకున్నారు. ఇటీవల రీయూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. కమల్ తన స్నేహితులందరినీ కలిశారు. ఆ ఫొటోను షేర్ చేసి, ‘‘జనవరి 31ని నేను ‘లవర్స్ డే’ అంటాను. ఎందుకంటే మా బ్యాచ్‌లో స్నేహాన్ని, లక్ష్యాలను, జ్ఞానాన్ని, దేవుళ్లను, విద్యను.. ఇలా పలు అంశాలను ప్రేమించేవాళ్లు ఉన్నారు. నేర్చుకోవడానికి హద్దు అంటూ ఏదీ లేదు. మనం (స్నేహితులను ఉద్దేశించి) ఇంకా నేర్చుకుంటూనే ఉందాం. మిమ్మల్ని కలవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని పేర్కొన్నారు. -
సరికొత్త కాంబినేషన్?
అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ సినిమా చేయబో తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కానీ వీరిద్దరూ హీరోలుగా నటించడం లేదు. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాతగా రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్ తాజా టాక్. ఈ వార్త నిజమైతే ఓ కొత్త కాంబినేషన్ కుదిరినట్లే. ‘మా నగరం, ఖైదీ’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో రజనీ–కమల్ కలిసి పలు సినిమాల్లో నటించారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్న ఈ హీరోల ముందుంచితే– ‘‘ఇప్పుడు మా కాంబినేషన్ అంటే బడ్జెట్ భారీగా ఉండాలి. దానికంటే ముఖ్యం కథ. అప్పట్లో మా ఇద్దరి ఇమేజ్ వేరు. ఇప్పుడు ఇమేజ్ వేరు. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరాలి. అందుకని కలిసి నటించడానికి కుదరకపోవచ్చేమో’’ అని చెబుతుంటారు. మరి.. హీరో–నిర్మాతగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? అంటే వేచి చూడాల్సిందే. -
స్పెషల్ 2020
సిద్ధార్థ్‌కి ఈ ఏడాది స్పెషల్‌గా ఉండబోతోందని కోలీవుడ్ టాక్. తమిళ సూపర్‌స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల్లో సిద్ధార్థ్ కీలక పాత్రలు చేయడమే అందుకు కారణం. ఇప్పటికే కమల్‌హాసన్–శంకర్ ‘ఇండియన్ 2’లో సిద్దార్థ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్–శివ సినిమాలో ఓ పాత్ర కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించారట. ఈ సినిమాలో మీనా, ఖుష్భూ, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్ కుమార్తెగా కీర్తీ సురేశ్ కనిపిస్తారు. కీర్తీకి జోడీగా సిద్ధార్థ్ పాత్ర ఉండబోతోందట. ఒకేసారి రజనీ, కమల్ సినిమాల్లో కీలక పాత్ర చేయడం అంటే సిద్ధార్థ్‌కి ఈ 2020 స్పెషల్ ఇయర్ అనే చెప్పొచ్చు. -
షారుక్.. కమల్.. 4 నిమిషాల్లో 51మంది
సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన..ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు అని కేరళకు చెందిన ఓ యువతి నిరూపిస్తోంది. మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభతో పలువురిని అబ్బుర పరుస్తోంది. మిమిక్రీ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ప్రతీ సెకనుకు ఆమె గొంతు అద్భుతంగా వంపులు తిరుగుతుంది. ఆడ, మగ తేడా లేదు. సెలబ్రిటీలనుంచి ప్రముఖ రాజకీయవేత్తల దాకా ప్రముఖుల గొంతులను అనుకరిస్తారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం ఆమె సొంతం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ అద్భుతం పేరే అఖిల. న్యూస్ మినిట్ కథనం ప్రకారం తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్ కు చెందిన అఖిలా ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోంది. పాఠశాల స్థాయినుంచే స్వయంగా మిమిక్రీ కళపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఇంటర్ స్కూల్ పోటీల్లో తొలిసారి మిమిక్రీ కళను ప్రదర్శించింది. మొదట జంతువులను అనుకరిస్తూ వచ్చింది. ఆ తరువాత స్కూలు వార్షికోత్సవాల్లో టీచర్లను అనుకరించేంది. అలా జానకమ్మ పాట ‘అజకాదల్’ పాడానని అఖిల గుర్తు చేసుకుంటారు. అనేక టీవీ, మిమిక్రీ షోలను చూస్తూ నిరంతర సాధనతోనే పరిణతి సాధించారు. అలా మిమిక్రీ కళలో రాణిస్తున్న తొలి కేరళ యువతిగా అఖిల నిలవడం విశేషం. ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, షారూక్ ఖాన్ సహా అచ్యుతానందన్, ఉమెన్ చాందీ వంటి రాజకీయ నాయకులు స్వరాలు ఆమె గొంతులో అలవోకగా పలికిస్తుంది. దీంతోపాటు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె గొంతునుంచి జాలువారతాయి. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్ నాయర్ వాయిస్‌ను అఖిల గొంతులో విని తీరాల్సిందే. ఓ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఇంకా చేయాల్సి చాలా వుందంటారు అఖిల ఉత్సాహంగా. -
కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం
పెరంబూరు(చెన్నై): సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు శస్త్ర చికిత్స విజయవంతమైంది. 2016లో తన కార్యాలయంలో మెట్లపై జారి పడడంతో కుడికాలుకు గాయమైంది. వైద్యులు ఆయన కాలిలో స్టీల్ప్లేట్ను అమర్చారు. తాజాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం స్టీల్ప్లేట్ను వైద్యులు తొలగించారు. డీఎంకే నేత స్టాలిన్ తదితరులు కమల్ హాసన్‌ను పరామర్శించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం ఇండియన్–2 చిత్రం షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. -
అభిమానులు షాక్ అవుతారు
సౌత్ స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్ ఒకే వేదికపై కలిశారు. గురువారం కమల్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నాకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌గారికి నా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. రజనీ, నేను ఒకరు చేసే పనులకు మరొకరం అభిమానులం’’ అని పేర్కొ న్నారు. అలాగే తనకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్‌లో ‘గాడ్‌ఫాదర్, తిరువిళైయాడల్æ, హే రామ్’ అని రజనీ పేర్కొన్నారు. ‘హే రామ్’ చిత్రాన్ని దాదాపు 30సార్లు చూసి ఉంటానని రజనీ పేర్కొనడం విశేషం. ఇక పుట్టినరోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు కమల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఐకాన్‌గా రజనీకాంత్ ఎంపిక అయ్యారని తెలియగానే ఫోన్ చేసి అభినందించాను. యాక్టింగ్ మొదలుపెట్టిన తొలి ఏడాదే రజనీ ఐకాన్‌గా నిలిచారు. ఈ గౌరవం రజనీకి 43ఏళ్ల తర్వాత దక్కిందనే చెప్పుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ సినీ కెరీర్లో ముందుకు వెళ్లాలని మేం యువహీరోలుగా ఉన్న రోజుల్లోనే నిర్ణయించుకున్నాం. ఓ సందర్భంలో సినిమాలు వదిలేద్దామనుకుంటున్నానని నాతో అన్నప్పుడు సినిమాలు చేయడాన్ని కొనసాగించమని చెప్పింది నేనే. ఎందుకంటే కొందరు నన్ను కూడా సినిమాలు చేయవద్దని చెప్పారని అప్పుడు రజనీకి చెప్పాను. మా వ్యక్తిగత విషయాలను రజనీ, నేను ఏ స్థాయిలో చర్చించుకుంటామో చెబితే అభిమానులు షాక్ అవుతారు’’ అన్నారు కమల్‌హాసన్. -
భారతీయుడు-2: కమల్ కొత్త స్టిల్!!
చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు శంకర్ గురువారం భారతీయుడు-2 మూవీ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సుమారు 23 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2లో కమల్ లుక్ ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులను.. సర్ప్రైజ్ చేశాడు. విలక్షణ నటుడు కమల్ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాలో ఆయన మరోసారి సేనాపతిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా కమల్ తన పుట్టిన రోజు వేడుకల కోసం భారతీయుడు-2 సినిమా షూటింగ్‌కు 3 రోజుల పాటు బ్రేక్ చెప్పి.. తన స్వగ్రామం పరమక్కుడిలో 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్ని ఆవిష్కరించారు. Happy birthday sir @ikamalhaasan pic.twitter.com/Gpx6LRc2DO — Shankar Shanmugham (@shankarshanmugh) November 7, 2019 ఇక కమల్ హాసన్ ఇండియన్(1996) సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించే సేనాపతి పాత్రలో.. విశ్వరూపం చూపి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. కాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. -
కమల్ @ 65
గురువారం కమల్‌హాసన్ బర్త్‌డే. ఈ ఏడాదితో 65వ సంవత్సరంలో అడుగుపెట్టారు కమల్. అంతే కాదు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 5 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యారు కమల్. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు కమల్‌హాసన్. కుటుంబ సమేతంగా (సోదరుడు చారుహాసన్, కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్) తమ స్వగ్రామం పరమకుడికి ప్రయాణం అయ్యారు. గురువారం నుంచి మూడురోజుల పాటు పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేశారు కమల్ కుటుంబ సభ్యులు. గురువారం తన తండ్రి (డి.శ్రీనివాసన్) విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్. శుక్రవారం దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణను ప్లాన్ చేశారు. కమల్ నటించిన ‘హే రామ్’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన శనివారం చెన్నైలో జరగనుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. -
మరుదనాయగమ్ ఎవరు?
కమల్‌హాసన్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ‘మరుద నాయగమ్’ ఒకటి. 1997లో స్వీయదర్శకత్వంలో టైటిల్ రోల్ చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టారు కమల్. అయితే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి ఓ కారణం బడ్జెట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏదో సందర్భంలో కమల్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ‘మరుదనాయగమ్’ని పూర్తి చేయాలనుకుంటున్నానని కమల్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమాలో నటించలేనని స్పష్టం చేశారు. విక్రమ్ నటిస్తారని టాక్. ఇంతకీ ‘మరుదనాయగమ్’ ఎవరు? అంటే.. 18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు. ఆయన ఇస్లామ్ మతానికి మారాక యూసఫ్ ఖాన్‌గా పేరు మార్చుకున్నారు. -
అప్పుడు 70 ఇప్పుడు 90
శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సినిమా ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఆ సినిమాలో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో 70 ఏళ్ల వృద్ధుడిలా నటించారు కమల్. అప్పుడు 41 ఏళ్ల వయసులో ఉన్న కమల్ హాలీవుడ్ స్థాయి మేకప్, తన నటనతో ప్రేక్షకులను తాను నిజంగానే 70 ఏళ్ళ వృద్ధుడు అన్నట్లు నమ్మించారు. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ వయసు 64. రెండో భాగంలో ఆయన 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారట. యాక్షన్ సీన్స్‌ను కూడా అందుకు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారట ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కమల్ హాసన్‌ను కలిసిన సింధు
చెన్నై: ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం ఇకపై పరిమిత సంఖ్యలోనే టోర్నీల్లోనే ఆడతానని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించాలంటే ఫిట్‌గా ఉండాలని, అందుకోసం ప్రతీ టోర్నీ ఆడకుండా కొన్ని టోర్నీల్లోనే ఆడతానని ఆమె తెలిపింది. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘ఇది ఒలింపిక్ ఏడాది. దీని ముందు జరిగే ప్రతీ టోర్నమెంట్ ముఖ్యమైనదే. అయితే గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండేందుకు కొన్ని టోర్నీలే ఆడతా. ఎప్పుడైతే మనం మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటామో అప్పుడే మనం ఆడే టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయగలం. కోట్లాది భారతీయుల దీవెనలు, మద్దతుతో ఈసారి పసిడి గెలవడానికి ప్రయత్నిస్తా’ అని అన్నారు. అయితే గత ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్ణయం ప్రకారం... సింగిల్స్‌లో టాప్–15లో ఉన్న క్రీడాకారులు, డబుల్స్‌లో టాప్–10 ఉన్న జోడీలు ప్రతి ఏడాది 15 వరల్డ్ టూర్లలో కనీసం 12 టోర్నీలు ఆడాలి. లేకపోతే పెనాల్టీ ఎదురుకోవల్సి వస్తుంది. కమల్ హాసన్‌ను కలిసిన సింధు విఖ్యాత నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను సింధు ఇక్కడి ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఆఫీసులో కలిసింది. అయితే ఇది రాజకీయ భేటీ కాదని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. ఇటీవలే ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు పసిడి గెలవడం దేశమంతా గర్వించదగ్గ అంశం అని ఆమె ఘనతను కొనియాడారు. చెన్నైలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా సింధుని కోరానని ఆయన తెలిపారు. కమల్ హాసన్ తన అభిమాన నటుడని, అతనో సూపర్ స్టార్ అని సింధు వ్యాఖ్యానించింది. -
సెంట్రల్ జైల్లో..
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు కమల్‌హాసన్. తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన జైలుకి వెళ్లింది ‘ఇండియన్ 2’ సినిమా కోసం. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్‌హాసనే హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి సెంట్రల్ జైలులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు పదిహేను రోజుల పాటు జరుగుతుందట. కమల్‌హాసన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రధారులు. అనిరు«ద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. -
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్, శంకర్
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారు. ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొంత పూర్తవగా.. తరువాతి షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్లాన్ చేశారు చిత్ర బృందం. దీనిలో భాగంగా కమల్‌తో సహా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటీనటుల ఈ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19 నుంచి రాజమండ్రి జైల్లో రెగ్యులర్‌గా షూటింగ్ జరగనుందని కోలీవుడ్ టాక్. ఇక్కడ షూటింగ్ ముగిసిన అనంతరం తరువాతి షెడ్యూల్ కోసం విదేశాలకు పయనమయ్యే అవకాశం ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్ 2’ కథనం ఉంటుం దని టాక్. రత్నవేలు కెమెరామేన్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
కన్నడ విషయంలో రాజీపడబోం
బెంగళూరు/ చెన్నై: భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ పడబోం’ అని తెలిపారు. షా, సుల్తాన్లు మార్చలేరు: కమల్ హాసన్ హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ‘భారత్ గణతంత్ర దేశంగా అవతరించగానే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతుందని హామీ లభించింది. దీన్ని ఏ షా(అమిత్ షా), సుల్తాన్, సామ్రాట్లు కూడా మార్చలేరు. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ మా మాతృభాష మాత్రం ఎప్పటికీ తమిళమే’ అని అన్నారు. -
రహస్య భేటీ
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో రహస్యంగా వ్యూహరచన చేస్తున్నారట నటుడు కమల్‌హాసన్. మరి.. కమల్ తాజా ప్రణాళిక లక్ష్యం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో కమల్‌పై వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హాటల్లో కమల్ ఎవరెవరితో రహస్యంగా భేటీ అయ్యారో ప్రస్తుతానికి సస్పెన్స్. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఇండియన్ చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్ 2’ కథనం ఉంటుం దని టాక్. -
నేనొచ్చేశా!
శంకర్ తన సినిమాలతో ఓ ప్రపంచాన్నే సృష్టిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టారు రకుల్ ప్రీత్‌సింగ్. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఇండియన్(తెలుగులో ‘భారతీయుడు)కి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో సోమవారం జాయిన్ అయ్యారు రకుల్. ఇందులో సిద్ధార్థ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది. -
బస్‌లో మహిళలను వేధించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
చెన్నై: బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని అని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. 'సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు' అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు. నెటిజన్ల ఆగ్రహం శరవణన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యను ఒక జోక్‌లా బిగ్ బాస్ షోలో చూపించడం దానికి ఆడియన్స్ చప్పట్లు కొట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై వీడియో క్లిప్‌ని షేర్ చేసిన ఓ అభిమాని.. దీనిపై స్పందించమని సింగర్ చిన్మయిని కోరారు. ఆమె దీనికి సమాధానంగా.. ‘మహిళలను వేధించడానికే నేను బస్సు ఎక్కేవాడినంటూ ఒక వ్యక్తి గర్వంగా చెప్పుకోవడాన్ని కూడా ఛానల్స్ ప్రసారం చేయడం, ఇలాంటి సీరియస్ విషయాన్ని జోక్‌లా చూపెట్టడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడం బాధాకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. బిగ్‌బాస్ షోలో ఇప్పటి దాకా ఇంటి సభ్యుల మధ్య వివాదాల్లో మాత్రమే గొడవలు జరిగేవి. ప్రస్తుతం ఇలాంటి విషయాన్ని తేలికగా చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాజమండ్రికి పోదాం!
రకుల్ ప్రీత్‌సింగ్ రాజమండ్రికి వెళ్లడానికి సూట్‌కేస్ సర్దుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇండియన్ 2’ సినిమా కోసమే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారు. ప్రియాభవానీశంకర్, ఐశ్వర్యా రాజేష్ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వచ్చే నెల 19న రాజమండ్రిలో ప్రారంభించడానికి టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ఈ షెడ్యూల్లో రకుల్, కాజల్ పాల్గొంటారని కోలీవుడ్ టాక్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్ 3’తో బిజీగా ఉన్నారు కమల్. అయితే ఆగిపోయిన ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ (2015లో దర్శక–నిర్మాతగా కమల్ ప్రకటించారు) సినిమా పనులను కూడా కమల్ ఇటీవల మొదలుపెట్టారు. సో.. ‘ఇండియన్ 2’, ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ సినిమా షూటింగ్ లొకేషన్స్‌కి, బిగ్ బాస్ షోతో కమల్ బిజీ బిజీగా ఉంటారన్నమాట. -
అడ్డంకులు మాయం!
ఆర్థికపరమైన సమస్యల వల్ల ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడిందనే వార్తలు ఆ మధ్యకాలంలో బాగానే వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ ‘ఇండియన్ 2’ చిత్రీకరణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని కోలీవుడ్ తాజా సమాచారం. ఆగస్టు మూడో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆగస్టు 19న మొదలు కానుందని చెన్నై కోడంబాక్కమ్ కబర్. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు కథానాయికలు ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్ కీలక పాత్రలు చేయనున్నారని సమాచారం. 1996లో కమల్‌హాసనే హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... 2015లో దర్శక–నిర్మాతగా కమల్‌హాసన్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. కారణాలు ఏవైనా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ‘ఇండియన్ 2’తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకువెళ్తున్నారు కమల్‌హాసన్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ను స్వరకర్తగా తీసుకున్నారు. ‘ఇండియన్ 2’ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన లైకా ప్రొడక్షన్స్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్ నిర్మాణంలోనూ భాగమవ్వడం విశేషం. ఇలా కామా పెట్టిన పాత ప్రాజెక్ట్స్‌ని కూడా ముగించే పనిలో ఉన్న కమల్ ఆగిపోయిన తన ‘శభాష్ నాయుడు’ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారా? వేచి చూద్దాం. -
ఆగస్టులో ఆరంభం?
‘ఇండియన్ 2’ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ‘ఇండియన్ 2’ మూవీ గురించి కోలీవుడ్‌లో ఓ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగస్టులో ప్రారంభం అవుతుందని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ 3తో బిజీగా ఉన్నారు కమల్. -
బిగ్‌బాస్‌కు భారీ షాక్
చెన్నై : కమల్ హాసన్ హోస్ట్‌గా విశేష ఆదరణ పొందిన బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్ ఈనెల 23న ప్రారంభం కావాల్సి ఉండగా ఈ షోపై నీలినీడలు అలుముకున్నాయి. బిగ్ బాస్ షో న్యాయపరమైన వివాదంలో కూరుకుపోయింది. గత రెండు సీజన్లు భారీగా సక్సెస్ కావడంతో మూడో సీజన్‌పై అభిమానులు భారీ ఆశలు పెంచుకోవడంతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు మిన్నంటాయి. కాగా, వివాదాస్పద బిగ్ బాస్ షోను నిషేధించాలని కోరుతూ సుధన్ అనే అడ్వకేట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తమిళ్లో హౌస్మేట్స్ పొట్టి దుస్తులు ధరించడంతో పాటు పిల్లలు, యువతను తప్పుదారిపట్టించేలా అశ్లీల అర్ధాలు ధ్వనించేలా మాట్లాడుతున్నారని పిటిషనర్ తన పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు ఇండియన్ బ్రాడ్కాస్ట్ ఫౌండేషన్ (ఐబీఎఫ్)నుంచి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఈ షోను ప్రసారం చేసేందుకు అనుమతించరాదని కూడా పిటిషనర్ న్యాయస్ధానాన్ని కోరినట్టు సమాచారం. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని, త్వరలోనే విచారణ చేపడతారని తెలిసింది. మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ త్రీ ప్రారంభం కానున్న సమయంలో ఈ షోను న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. -
మోదీ ప్రమాణానికి ‘బిమ్స్టెక్’ నేతలు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రధాని మోదీ ప్రమాణస్వీకార వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రపతిభవన్‌లో మే 30న జరిగే ఈ కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిమ్స్టెక్లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వేడుకకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా మోదీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు సమాచారం. వీరితో పాటు ప్రముఖ నటులు రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్‌లకు ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ జూన్ 6న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. అదేరోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారనీ, ఆయన ఇతర ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. జూన్ 10న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంతవరకూ ప్రొటెం స్పీకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రొటెం స్పీకర్ కోసం బీజేపీ నేతలు సంతోష్‌కుమార్ గంగ్వార్, మేనకాగాంధీల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 6 నుంచి 15 వరకూ సాగనున్నాయి. -
ఇప్పుడు ఓడినా.. భవిష్యత్‌లో గెలుస్తాం
చెన్నై: హీరో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కమల్ బొక్క బోర్లా పడ్డారు. ఆ పార్టీని ప్రజలు తిస్కరించారు. అయితే పార్టీ ఘోర పరాజయంపై కమల్ పెదవి విప్పారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రెండో సారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు దేశంలో ఓ భాగమే.. గుర్తించండి ‘పార్టీని స్థాపించిన 14 నెలల్లో పోరాడి ఈ స్థాయికి వెళ్లగలగటం మాకు బలాన్నిచ్చింది. ఇప్పుడు ఓడిపోవచ్చు.. కానీ భవిష్యత్‌లో గెలుస్తాం. బీజేపీ పాలిత ప్రాంతాల్లోగా బీజేపేతర ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పాటు పడాలి. మీరు విజయం సాధించిన రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమిళనాడు కూడా దేశంలో ఒక రాష్ట్రమే అని గుర్తించాలి. అన్ని రాష్ట్రాలపై ప్రేమను సమానంగానే పంచాలి. ఓటమిపై సమీక్షించుకుని, భవిష్యత్‌లో ప్రజల పక్షాన ప్రతి పోరాటానికి ముందుంటాను’అని కమల్ పేర్కొన్నారు. నిరాశలో కమల్ ఫ్యాన్స్ ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీని కమల్ స్థాపించారు. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు అన్ని స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే కాకుండా అసలు ప్రభావమే చూపించలేక పోవడాన్ని కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
పాము ప్రేమిస్తే?
‘‘ఇప్పటి వరకు వచ్చిన పాము కథా చిత్రాలన్నీ పగ నేపథ్యంలో రూపొందాయి. కానీ, మా ‘నాగకన్య’ చిత్రం పాము నేపథ్య కథావస్తువు అయినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. పగతో కాకుండా ప్రేమ నేపథ్యంలో సాగుతుంది’’ అంటున్నారు నిర్మాత కె.ఎస్.శంకర్ రావు. కమల్‌హాసన్ నటించిన తమిళ ‘నీయా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘నీయా–2’. జై హీరోగా, రాయ్‌లక్ష్మి, వరలక్ష్మీశరత్ కుమార్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ’ వంటి పాము నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. మా సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాము కథాచిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. మా సినిమానే తొలిసారి విడుదలవుతోంది’’ అన్నారు. ఎల్.సురేష్ మాట్లాడుతూ– ‘‘నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. కథ డిమాండ్ మేరకే గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అన్నారు. -
గాడ్సే వ్యాఖ్యలు : కమల్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై : గాడ్సే వ్యాఖ్యలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ హిందూ సంస్థకు చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి పోలీసులు కమల్ హాసన్‌పై కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ప్రేరేపించడం, భిన్న గ్రూపులకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలపై కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రజల్లో తనకున్న మంచిపేరును చెడగొట్టేందుకే తనపై కక్షసాధింపునకు దిగుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. గాడ్సేపై తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకుంటూ గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా దేశ విభజనకు కారణమైన గాంధీని హిందువైన తాను చంపానని గాడ్సే స్వయంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. తాను గాంధీని ఎందుకు చంపాను అనే పుస్తకంలో సైతం గాడ్సే ఇదే విషయం చెప్పారని అన్నారు. కాగా, ముందస్తు బెయిల్ మంజూరుకు అవసరమైన షరతులకు లోబడతానని కమల్ న్యాయస్దానంలో పేర్కొన్నారు. -
ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం అన్నారు. అరెస్టుకు తాను భయపడటం లేదనీ, కానీ తనను అరెస్టు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనుద్దేశిస్తూ కమల్ దేశంలో తొలి తీవ్రవాది హిందువేననడం వివాదమైంది. శుక్రవారం కోయంబత్తూరులోని సులూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉండగా, ఆదివారం నాటి వ్యాఖ్యల కారణంగా ఆయనకు ప్రచారానికి అనుమతి లభించలేదు. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా ప్రజలను ఓట్లు అడిగారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడం అరవకురిచ్చిలోనే తొలిసారి కాదనీ, లోక్‌సభ ప్రచారం సమయంలో చెన్నైలోనే ఇదే మాట అన్నా అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని కమల్ చెప్పారు. -
కమల్ హాసన్‌పై చెప్పుల దాడి
చెన్నై : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పులు విసిరారు. బుధవారం ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది. -
హైకోర్టును ఆశ్రయించిన కమల్
సాక్షి, చెన్నై : హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలు చేసినందుకు తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టు మధురై బ్రాంచ్‌ను ఆశ్రయించారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అని అరవకురుచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో కేసు నమోదవగా, అరవకురుచ్చి పోలీస్స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై కేసులను కొట్టివేయాలని కోరుతూ తన అప్పీల్‌పై తక్షణ విచారణ చేపట్టాలని కమల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారణకు చేపట్టలేదని న్యాయమూర్తి కమల్ వినతిని తోసిపుచ్చారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ బుధవారం పిటిషన్ దాఖలు చేయగా కమల్ వ్యాఖ్యలు తమ కోర్టు పరిధిలో చేయనందున పిటిషన్‌ను స్వీకరించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. -
కమల్ హాసన్‌పై కేసు నమోదు
చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై అరవకురిచి పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో మొదటి తీవ్రవాది హిందువే అంటూ కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. దీంతో హిందువుల మనోభావాలను కించపరిచారంటూ కరూర్ జిల్లా పోలీసులకు రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
చిక్కుల్లో కమల్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీనటుడు మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. కమల్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అరవకురిచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మరోవైపు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సోమవారం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి నివేదించింది. కాగా, చెన్నైలోని కమల్ హాసన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే
సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. కమల్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ సైతం కమల్ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్ సోమవారం ట్వీట్ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఏకీభవించిన నేతలు.. కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి కూడా కమల్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
కమల్ వ్యాఖ్యలపై వివేక్ ఒబెరాయ్ ఫైర్
ముంబై : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రస్తావిస్తూ దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలను ఏ ఒక్కరూ చేయరాదని అన్నారు. ‘కమల్ సార్..మీరు గొప్ప నటులు..కళకు ఎలాగైతే మతం ఉండదో ఉగ్రవాదానికీ మతం ఉండదు..గాడ్సే ఉగ్రవాదని అంటున్న మీరు హిందూ అని నిర్ధిష్టంగా ఎందుకు చెప్పారు..? మీరు ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో ఉన్నందున వారి ఓట్ల కోసం అలా చెప్పారా..? అని వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. దయచేసి దేశాన్ని విభజించేలా వ్యవహరించకండి..మనమంతా ఒక్కటే అంటూ ఒబెరాయ్ పేర్కొన్నారు. -
భారతీయుడికి బ్రేక్?
ప్రస్తుతం కమల్‌హాసన్ చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ కూడా సీక్వెల్సే. ఒకటేమో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘భారతీయుడు 2’ కాగా, మరోటి ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) సీక్వెల్ ‘దేవర్‌మగన్ 2’. ఎన్నికల హడావిడి కారణంగా ‘భారతీయుడు’ సినిమాకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు కమల్. అయితే లేటెస్ట్గా ‘భారతీయుడిని అంతే బ్రేక్‌లో ఉంచి ‘దేవర్ మగన్ 2’ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో కమల్ ఉన్నారని తెలిసింది. ఒకటే షెడ్యూల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత సినిమాల్లో కనిపించను అని కమల్ స్పష్టం చేశారు. మరి ‘భారతీయుడు 2’కు స్మాల్ బ్రేకా? లేకపోతే సినిమా పూర్తిగా ఆగిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. -
కమల్ పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’
చెన్నై: సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. కమల్ ఎన్నికల కమిషన్(ఈసీ)కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలి పారు. ‘మా పార్టీకి టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యమ్ టార్చ్‌బేరర్‌గా మారనుంది’ అని ట్వీట్ చేశారు. గతేడాది ఎంఎన్ం పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తమ పార్టీ త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని, అభ్యర్థుల ఎంపికలో యువతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆయన గత నెలలో చెప్పారు. -
కూటమి పార్టీలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై : తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రాబల్యం పెరుగుతున్నందునే తమను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలో భాగంగానే తమ పార్టీని బీజేపీ బీ టీమ్‌గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తమది తమిళనాడు ఏ టీమ్ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయం సాధించే పార్టీవైపే మహాకూటమిలోని పార్టీలు పరుగులు తీస్తాయని, ఇలాంటి సమయంలో బేరసారాలకు తావులేకుండా తమ పార్టీ నిలకడగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఒక్కడినే లోక్‌సభ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోలేనని, ప్రజలు విరాళాలతో ముందుకు రావాలని, ఇది మెరుగైన భవిష్యత్‌కు పెట్టుబడిగా భావించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. -
కశ్మీర్‌పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ సమయంలోనే కశ్మీర్‌పై కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సినీ హీరో, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పుల్వామా ఘటన చాలా బాధాకరం. ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించడం లేదు. అక్కడి ప్రజలు కోరుకున్నట్లుగా చేయాలి’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలతో ఇంటాబయటా రచ్చ జరగడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కమల్ వ్యాఖ్యలను కావాలని కొందరు వక్రీకరించారని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆరోపించింది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంది. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. (కాపీ కొడతారా! సిగ్గు లేదా: కమల్ ఫైర్) -
ఆ రెండు పార్టీలకు కమల్ ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కొన్నిపార్టీలు మమ్మల్ని పిలిచాయి, ప్రజలకు ఇష్టం లేదని వదులకున్నాం, మరి కొన్నింటిని మేమే వద్దనుకున్నాం, ఒంటరిగానే పోటీచేస్తాం, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ రెండురోజుల క్రితం చెప్పిన మాటలు ఇవి. అయితే అంతలోనే బాణీ మార్చారు. రెండు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపడం ద్వారా సరికొత్త స్వరం ఆలపించారు. ఎన్నికల బరిలో నిలిచి నెగ్గుకురావడం ఆషామాషీ కాదు. అసెంబ్లీ ఎన్నికలైతే ఎంతో కొంత ప్రాంతీయతా భావం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. అదే పార్లమెంటు ఎన్నికలైతే ఓటర్లు జాతీయస్థాయిలో ఆలోచిస్తారు. అందుకే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయపార్టీలు సైతం బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి నడిచేందుకు రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ, ఎన్నికలను ఎదుర్కొనడం కొత్తైన కమల్‌హాసన్ కాంగ్రెస్–డీఎంకే కూటమిలో చేరేందుకు ఆశపడ్డారు. పార్టీని స్థాపించిన కొత్తల్లోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అప్పటి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ దేశంలోని పలువురు జాతీయనేతలను కమల్ కలుసుకున్నారు. వీరంతా కాంగ్రెస్ మిత్రపక్షాలే కావడం గమనార్హం. దీంతో రాబోయే ఎన్నికల్లో కమల్ కాంగ్రెస్‌తో జతకడతారని అందరూ నమ్మారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో పావులు కదిపినా రాష్ట్రస్థాయిలో ఆయనకు పిలుపురాలేదు. అన్నిపార్టీలూ పొత్తులు, సీట్లసర్దుబాట్లలో తలమునకలై ఉన్న తరుణంలో కమల్‌కు దిక్కుతోచలేదు. ఇక ఒంటరిపోరే శరణ్యమని నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరీలోని ఒక్కటి మొత్తం 40 స్థానాల్లో ఏపార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తమపార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఈనెల 6న ఆయన మీడియా వద్ద అధికారికంగా ప్రకటించారు. అనుకున్నదానికంటే వేగంగా అన్నిగ్రామాల్లోనూ పార్టీ బలపడిందని చెప్పారు. మాపార్టీ సిద్ధాతాలను ఇతర పార్టీలు కాపీకొట్టే స్థాయికి ఎదిగామని చెప్పుకున్నారు. ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పెరిగింది, ఆ ధీమాతోనే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమయ్యామని తెలిపారు. పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వారి పలకిని నేను మోయాల్సి ఉంటుందని, ఎవ్వరినీ భుజాలపై మోసేందుకు తాము సిద్ధంగా లేమని కూడా వ్యాఖ్యానించారు. రెండో రోజునే రెండు పార్టీలకు పిలుపు: కమల్ ధైర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్న వేళ ఒంటరి పోరుపై వెనక్కు తగ్గడం ద్వారా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరికివారు కొన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడిపోగా డీఎండీకే, పీఎంకేలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరివైపు వెళదామా అని ఆలోచిస్తున్నాయి. ఇదే అదనుగా కమల్‌హాసన్ కూటమి ఆలోచనలు మొదలుపెట్టారు. ఈరెండు కూట ముల వైపు వెళ్ల వద్దు, కొత్త కూటమిగా కలిసుందాం రండి అంటూ శుక్రవారం అకస్మాత్తుగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, అన్నాడీఎంకే రెండునూ అవినీతి మచ్చపడినవి, ఇది తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో మార్పురావాలి, మంచి తేవాలి అనే మంచి ఉద్దేశంతో రాజకీయపయనం చేస్తున్నపుడు అవినీతిమయమైన పార్టీలు మనకొద్దని అన్నారు. డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్‌లతో కమల్ పొత్తు చర్చలు ప్రారంభించారు. ఈ రెండుపార్టీలూ ఇప్పటి వరకు అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వైపు మొగ్గి ఉన్నాయి. అనారోగ్యం కుదుటపడి త్వరలో అమెరికా నుంచి చెన్నైకి చేరుకోనున్న విజయకాంత్‌ను ఫోన్ ద్వారా కమల్ సంప్రదించినట్లు సమాచారం. -
విక్రమ్ న్యూ లుక్.. వైరల్ అవుతున్న టీజర్
సరైన హిట్టు లేక వరుస పరాజయాలతో కొనసాగుతున్న తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమా దర్శకుడు రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఈ టీజర్లో విక్రమ్ న్యూ లుక్ లో చాలా స్టైలిష్‌గా ఉండటంతో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ కూడా నటించారు. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న కమల్ హాసన్, విక్రమ్‌లు కలిసి చేస్తోన్న ఈ సినిమాతో వీళ్లిద్దరు సక్సెస్ అందుకుంటారా అనేది వేచి చూడాలి. ఇక ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
కమల్ హాసన్ అభిమానులు ఇప్పుడు కాస్తా ఊరటగా ఫీలవుతున్నారు. కారణం ఏంటంటే కమల హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. వీటి గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికి సినిమా ఆగిపోతుందేమోనని అభిమానులు కలవర పడిన మాట వాస్తం. వారి ఆందోళన తగ్గిస్తూ.. అనుమానాలను నివృత్తి చేస్తూ ‘భారతీయుడు 2’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు శంకర్. దాంతో పాటు అభిమానులకు సంక్రాంతి శుభకాంక్షలు కూడా తెలియజేశారు. #indian2 Hi everyone! “ Happy Pongal” pic.twitter.com/rgiuCBBtLq — Shankar Shanmugham (@shankarshanmugh) January 14, 2019 ‘భారతీయుడు 2’ ఫస్ట్ లుక్ రిలీజ్‌తో సంక్రాంతి సంబరాలు రెట్టింపయ్యయంటున్నారు అభిమానులు. ఈ పోస్టర్లో కమల్ ‘భారతీయుడు’ సిగ్నేచర్ మూవ్మెంట్ మర్మకళను ప్రదర్శిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కమల్ సరసన కాజల్ నటిస్తున్నారు. అనిరుధ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. -
ఇండియన్‌లో కొరియన్ భామ?
‘ఇండియన్ 2’ సినిమాను కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం చేసే ఉద్దేశంలో లేనట్టున్నారు దర్శకుడు శంకర్. 1995లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్నారాయన. కమల్‌హాసన్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కొంచెం కొరియన్ టచ్ కూడా ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారట శంకర్. ఈ సీక్వెల్లో సూజీ బే అనే కొరియన్ హీరోయిన్ను ఓ కీలక పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారట. కథానుసారం సినిమాలో కొంత భాగం తైవాన్‌లో షూట్ చేయనున్నారు. ఆ సన్నివేశాల్లో ఈ కొరియన్ భామ కనిపిస్తుందని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ సంగీత దర్శకుడు. -
2 కోట్ల సెట్... 2 నిమిషాలే!
‘2.0’ రిలీజ్ టైమ్‌కే దర్శకుడు శంకర్ తన నెక్ట్స్ చిత్రం ‘ఇండియన్ 2’ సినిమా పనులతో బిజీ అయిపోయారు. గతేడాది డిసెంబర్ 14న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ కూడా చేశారు. కానీ ‘భారతీయుడు’ రెగ్యులర్ షూటింగ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభం కానుందట. కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996 వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 18న మొదలు కానుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ కలరి పయ్యట్టు నేర్చుకోనున్నారు. కమల్ కనిపించనున్న పాత్రల్లో తాత పాత్ర ఒకటి. దీని కోసం కమల్‌హాసన్ బరువు తగ్గారు కూడా. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదని దర్శకుడు శంకర్ ఫిక్స్ అయినట్టున్నారు. ఈ సినిమాలో ఓ సెట్ కోసం సుమారు 2 కోట్లు వరకూ వెచ్చించారట. గోల్డ్ సెట్ అని పిలిచే దీని తయారీకు కావాల్సిన వస్తువులను ప్రత్యేకంగా చైనా నుంచి తెప్పించారు. 2 కోట్లతో వేయించిన ఈ సెట్ సినిమాలో 2 నిమిషాలు కూడా కనిపించదట. సెట్స్ వర్క్‌తో పాటు నేచురల్ లొకేషన్స్‌లోనూ పలు సీన్స్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కీలక సన్నివేశాలను ఉక్రెయిన్ దేశంలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింబు కూడా కీలక పాత్రలు పోషించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. 2020లో రిలీజ్ కానుంది. హృతిక్‌తో శంకర్? ‘భారతీయుడు 2’ తర్వాత దర్శకుడు శంకర్ చేయబోయే ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ చిత్రకథ ఉండబోతోందట. ఆల్రెడీ శంకర్ వినిపించిన ఐడియా హృతిక్‌కు నచ్చిందని, ‘భారతీయుడు 2’ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని భోగట్టా. -
పొత్తుల కోసం కమల్ అన్వేషణ
చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ్టలతో జట్టు కట్టాలని సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ నిర్ణయించింది. భావ సారూప్యాలున్న పార్టీని వెతికి, పొత్తు కుదుర్చుకునే బాధ్యతను పార్టీ అధినేత కమల్ హాసన్‌కే అప్పగించింది. శనివారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్, పాలనా కమిటీల చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కూటమి కోసం తాము చేస్తున్న యత్నాలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించగా..ఇప్పుడే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పొత్తు కుదుర్చుకునే పార్టీ సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా, ఆలోచనా విధానం తమిళనాడుకు అనుకూలంగా ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా లోక్‌సభ బరిలో దిగుతామని చెప్పారు. తమిళనాడు డీఎన్ఏను మార్చే పార్టీతో కలసి పనిచేయమని తెలపడం ద్వారా బీజేపీతో పొత్తు ఉండదని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుంటే, డీఎంకేతో పొత్తుకు సిద్ధమేనని కమల్ ప్రకటించగా డీఎంకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే. -
డిష్యూం.. డిష్యూం
ఎంతో ఏకాగ్రతగా పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయారు కథానాయిక కాజల్ అగర్వాల్. హెడ్డింగ్‌కి, పుస్తకానికి ఉన్న అనుబంధం ఏంటి? అంటే... అక్కడికే వస్తున్నాం. ఆమె చదువుతున్నది మామూలు పుస్తకం కాదు. కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్ ‘కలరిపయ్యట్టు’ శిక్షణకు సంబంధించిన పుస్తకం. ‘‘కలరిపయ్యట్టు ట్రైనింగ్ పుస్తకం చదవడం స్టార్ట్ చేశాను. త్వరలో సాధన మొదలుపెడతాను’’ అని కాజల్ పేర్కొన్నారు. మరి... కాజల్ సడన్‌గా ఈ మార్షల్ ఆర్ట్ ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కదూ. ‘ఇండియన్ 2’ కోసమట. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా నటిస్తారు కాజల్. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌కి సంబంధించిన సెట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చిందట. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. అయితే ఈ సినిమా కోసమే కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని డిష్యూం.. డిష్యూం అంటూ వెండితెరపై విలన్స్‌ను రప్ఫాడిస్తారన్నమాట. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ‘ఇండియన్ 2’ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
వయసుకి మించి?
సినిమాలో హీరోయిన్లు ఎంత వీలుంటే అంత అందంగా కనిపించాలనుకుంటారు. దానికి విరుద్ధంగా కొన్నిసార్లు స్క్రిప్ట్ చాలెంజ్ విసిరితే బ్యూటీ కిట్ పక్కన పెట్టి సరికొత్త లుక్‌లోనూ కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి చాలెంజ్కే సిద్ధపడ్డారు కాజల్ అగర్వాల్. శంకర్–కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’లో కాజల్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తారని టాక్. ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్‌కి సీక్వెల్ అయిన ‘భారతీయుడు 2’ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం సెట్ వర్క్ ఇటీవల ఆరంభమైంది. షూటింగ్ ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఇది వరకూ ఎప్పుడూ కనిపించనటువంటి డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే ఈ సినిమాలో కమల్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ ఇటీవలే నిర్వహించారు శంకర్. ఈ పాత్ర కోసం కమల్ బరువు కూడా తగ్గారు. ఫస్ట్ పార్ట్‌లో పెద్ద కమల్ హాసన్, సుకన్యలను గుర్తుపట్టలేనట్లుగా ఉంటాయి వాళ్ల మేకప్. మరి ఇందులోనూ కమల్ అలాంటి ఓల్డ్ లుక్‌లోనే కనిపిస్తారా? కాజల్ కూడా సుకన్యలా వృద్ధురాలిలా కనిపిస్తారా? వేచి చూడాలి. తమిళ, మలయాళ యంగ్ హీరోలు శింబు, దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. -
ఇట్స్ ఇండియన్–2 టైమ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్లు పనిచేశారు శంకర్. సినిమా రిలీజైంది కదా.. కొన్ని నెలలు రిలాక్స్ అవుతారేమో అనుకుంటే.. నో చాన్స్ అంటున్నారు శంకర్. తన తర్వాతి సినిమా ‘ఇండియన్ 2’(తెలుగులో భారతీయుడు)కి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారాయన. కమల్‌హాసన్– శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కించనున్నారు శంకర్. ఈ సినిమా సెట్ వర్క్‌ని ఇటీవల ఆరంభించారు. రెగ్యులర్ షూటింగ్‌కి డిసెంబరు 14న కొబ్బరికాయ కొట్టనున్నాయట చిత్రవర్గాలు. ‘2.ఓ’ సినిమా ప్రమోషన్లో భాగంగా శంకర్, అక్షయ్ కుమార్, నిర్మాత కరణ్ జోహార్ ముంబయ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలోనే ‘ఇండియన్ 2’ సినిమా డిసెంబరు 14న ప్రారంభం కానుందని కరణ్ జోహార్ రివీల్ చేశారు. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన సేనాపతి (తండ్రి కమల్ పాత్ర) పాత్రను ‘ఇండియన్ 2’లో కూడా కొనసాగించబోతున్నారట శంకర్. ఇప్పటికే సేనాపతి పాత్రకి టెస్ట్ షూట్ చేసి కమల్ లుక్ ఫైనల్ చేశారట. -
ఇండియన్ 2లో ఇరుక్కారా?
తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాతో బిజీగా ఉన్నారు శింబు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి శింబు నెక్ట్స్ చిత్రం ఏంటీ? అంటే ‘ఇండియన్ 2’ అంటున్నారు కోలీవుడ్ సినీ వాసులు. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్వకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇండియన్ 2’. ఇటీవల ఈ సినిమా సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికయ్యారని, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీ రోల్ చేయబోతున్నారనీ ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్ 2’లో శింబు కూడా భాగమయ్యారన్నది తాజా టాక్. ఇందులో శింబు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందట. మరి.. ఈ సినిమాలో శింబు ఇరుక్కారా (ఉన్నారా)? లేదా? అనేది అప్పుడు తెలిసిపోతుంది. -
సీక్వెల్ ఉంది
విలక్షణ నటుడు కమల్ హాసన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లిపోతుండటంతో ‘ఇండియన్ 2’ (తెలుగులో భారతీయుడు 2) తన ఆఖరి చిత్రం అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కానీ, ఆ సీక్వెల్ తర్వాత మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్నారు కమల్. 1992లో వచ్చిన ‘థేవర్ మగన్’కి (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని తాజాగా స్పష్టం చేశారట ఈ లోకనాయకుడు. ‘క్షత్రియ పుత్రుడు’ సినిమా కథను కమల్ హాసనే రాయడం విశేషం. ఇటీవల ఓ సందర్భంలో కమల్ మాట్లాడుతూ– ‘నాకు రాజకీయాలవైపు వెళ్లాలనే ఆలోచన ‘థేవర్ మగన్’ సినిమాకు పని చేస్తున్నప్పుడే వచ్చింది’ అని పేర్కొన్నారట. అంటే ఈ సీక్వెల్ ద్వారా తన రాజకీయ ఆలోచనలను పంచుకుంటారా? వేచి చూడాలి. ఆల్రెడీ ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘భారతీయుడు 2’ షూటింగ్ స్టార్ట్ కావాలి. అంటే.. ‘థేవర్ మగన్’ సీక్వెల్ ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత ఉంటుందా? లేకపోతే ఈ రెండు సినిమాలతో పాటే ఈ సీక్వెల్‌నూ సెట్స్ మీదకు తీసుకువెళ్తారా? వేచి చూడాలి. -
‘హౌస్‌ఫుల్’పై మీటూ ఎఫెక్ట్
‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి పది రోజులుగా యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, సింగర్స్‌లపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సినీ కెరీర్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపిస్తున్నట్లుంది. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ కపూర్‌తో కలిసి పని చేయలేనని చెప్పేశారు ఆమిర్‌ఖాన్. ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే బాటలో నడుస్తానంటున్నారు. ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్ ఈ సినిమా నిర్మాత సాజిద్ నడియాడ్వాలాను కోరినట్లు బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘హౌస్‌ఫుల్ 4’ డైరెక్టర్ సాజిద్ ఖాన్, నటుడు నానా పటేకర్లపై ‘మీటూ’ ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని బాలీవుడ్ టాక్. ‘‘విదేశాలు నుండి ఇంటికి తిరిగి రాగానే ‘మీటూ’ ఉద్యమానికి చెందిన కథనాలను చదివి కలత చెందాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలి. బాధితులకు సరైన న్యాయం జరగాలి. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించాలని నేను అనుకోవడం లేదు’’ అన్నారు అక్షయ్ కుమార్. ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో పార్ట్ ‘హౌస్‌ఫుల్ 4’. ఇందులో అక్షయ్‌కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మీటూ’ ఉద్యమంలో భిన్న రంగాల మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆవేదనకు గురి చేశాయి. స్రీలు ఇలా తమ చేదు అనుభవాలను బయటపెట్టడానికి నిజంగా ధైర్యం కావాలి. వారి కథనాలను వినాలి కానీ జడ్జ్ చేయకూడదు. బాధిత స్త్రీలందరికీ నా మద్దతు తెలుపుతున్నా. అలాగే ‘హౌస్‌ఫుల్ 4’కు సంబంధించి అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని నేనూ కట్టుబడి ఉండాలనుకుంటున్నా అన్నారు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్. అలాగే హౌస్‌ఫుల్ 4 సినిమా నుంచి నానా పటేకర్ తప్పుకున్నారని బాలీవుడ్ టాక్. తన వల్ల ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా టీమ్‌కు ఇబ్బంది కలగకూడదని నానా పటేకర్ ఫీల్ అయ్యారని హిందీ చిత్రపరిశ్రమలో తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలకు సాజిద్ ఖాన్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తున్నా ‘మీటూ’ ఉద్యమంలో నాపై వచ్చిన ఆరోపణల కారణంగా నా కుటుంబ సభ్యులు, నా నిర్మాతలు, నా సినిమాల్లోని హీరోల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. అందుకే ఈ ఆరోపణలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ, నిజం నిరూపితమయ్యే వరకు డైరెక్టర్ చైర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. అలాగే నా స్నేహితులకు, మీడియా వారికి ఒక విన్నపం. నిజం నిరూపించబడే వరకు దయచేసి నాపై వస్తున్న ఆరోపణలను పాపులర్ చేయకండి’’ అని ‘హౌస్‌ఫుల్ 4’ దర్శకుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నిర్ణయాల పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘అక్షయ్ కుమార్‌కు సెల్యూట్. మీటూ ఉద్యమంలో భాగంగా అక్షయ్ లాగే చాలా మంది స్పందించి మహిళలకు సమానత్వం, గౌరవం అనే అంశాల్లో అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు మహిళలు ఇండస్ట్రీలో సంతోషంగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది’’ అని కన్నడ కథానాయిక పరుల్ యాదవ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పక్కదారి పట్టకూడదు తాజాగా ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిజాయతీగా సక్రమమైన మార్గంలో వెళితే మంచి మార్పు వస్తుంది. కానీ ఇది పక్కదారి పట్టకూడదు. తప్పుడు ఆరోపణలు తెరపైకి రాకూడదు. నిజం ఉన్నప్పుడు ‘మీటూ’ ఉద్యమం తప్పుకాదు. సమాజంలో మహిళల సమస్యలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు పురాణాల కాలం నుంచే మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అని కమల్ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న ‘మీటూ’ కథనాలు నన్ను బాధించాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటలను షేర్ చేసిన మహిళలందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఇప్పుడు మహిళలందరూ ఏకతాటిపైకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మీటూ గొంతు ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. మాట్లాడాల్సిన సమయం ఇదే. మంచి మార్పుకు కూడా సరైన సమయం ఇదే. – రకుల్ ప్రీత్‌సింగ్ ‘మీటూ’ కథనాల వల్ల బాగా డిస్ట్రబ్ అయ్యాను. మహిళలకు సొసైటీలో గౌరవం, భద్రత ఉండాలి. అందుకు నేను, నా కంపెనీ కట్టుబడి ఉంటాం. మీటూ ఉద్యమ బాధితులకు నా మద్దతు ఉంటుంది. – అజయ్ దేవగన్ బయటకు వస్తున్న పేర్ల కంటే కూడా ఆ సంఘటనలు జరిగిన విధానం నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. అలాగే ఇన్ని భయంకరమైన సంఘటనలు కూడా మంచు కొండలో కోన మాత్రమే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు. – తాప్సీ మా కుటుంబానికి చాలా విషాదకరమైన సమయం ఇది. ఇప్పుడు మేము కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నా తమ్ముడు సాజిద్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఆ బాధిత మహిళలకు ఒక మహిళగా నా సపోర్ట్ ఉంటుంది – ఫరా ఖాన్ కథానాయికలు రిచా చద్దా, కృతీ సనన్, ఫరాఖాన్, చిత్రాంగద సింగ్‌లతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. - -
చాలాసార్లు పెళ్లి చేశారు
బాలీవుడ్లో పెళ్లి టాపిక్ వస్తే... అందులో రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ జంట తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్ ముందు ప్రస్తావిస్తే...‘‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను. ఇప్పటికే నాకు, దీపికాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు (నవ్వుతూ). అసలు నా పెళ్లి ఎప్పుడో అందరితో చెప్పే చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు రణ్వీర్. ఇంకా మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలి. మహిళలపై లైగింక వేధింపులు తప్పు’’ అన్నారు. ‘‘మీటూ’ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించినది కాదు. తప్పొప్పులకు చెందినది’’ అన్నారు దీపికా పదుకోన్. ఇదంతా ఓ ప్రైవైట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్ పాల్గొన్నారు. కమల్‌హాసన్, రణ్వీర్, దీపికలు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తమ అభిప్రాయాలను చెప్పారు. -
40 రోజుల శిక్షణ
నటుడిగా కమల్‌హాసన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం నటుడిగానే కాదు.. కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. మేకప్‌లో కూడా కమల్‌కి నైపుణ్యం ఉంది. మేకప్ విభాగంపై కూడా పట్టు సాధించడానికి శిక్షణ కూడా తీసుకున్నానని అంటున్నారు కమల్ హాసన్. ఆయన శిక్షణ తీసుకున్నది కూడా ఆస్కార్ విజేత దగ్గర కావడం విశేషం. ‘‘హాలీవుడ్ మూవీ ‘స్టార్ ట్రెక్: ఫస్ట్ కాంటాక్ట్’ అప్పుడు మేకప్ నిపుణుడు మైఖేల్ వేస్ట్మోర్ దగ్గర దాదాపు 40రోజులు మేకప్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సినిమాలో విచిత్రమైన ఆకారాల్లో వివిధ జీవులుంటాయి. మేకప్‌కి బాగా స్కోప్ ఉన్న సినిమా. అందుకే ఆ సినిమాకి పని చేశాను’’ అంటూ మేకప్ గురించి తనకు ఉన్న ఆసక్తిని కమల్‌హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ‘ఇండియన్ 2’ చిత్రం కోసం కమల్‌హాసన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 1996లో శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. అలాగే కమల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’కి తాత్కాలిక బ్రేక్ పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. -
మరో సీక్వెల్!
ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్’ షోతో బిజీగా ఉన్నారు కమల్‌హాసన్. ఈ షో పూర్తయిన వెంటనే ఆయన ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికిది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కనుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా కోసం ఇటీవల దర్శకుడు శంకర్ కడపలో లొకేషన్స్ చూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కమల్‌హాసన్ మరో సీక్వెల్ గురించి కూడా ఆలోచిస్తున్నారనే ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. దాదాపు 22 ఏళ్ల క్రితం కమల్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’)కి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి.. ఈ సీక్వెల్ గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్లు.. ‘సన్న జాజి పడక..’ పాట ‘క్షత్రియపుత్రుడు’లోనిదే అనే విషయం గుర్తు చేయక్కర్లేదు. -
రజనీ, కమల్‌ను నమ్ముకుంటే భవిష్యత్ ఉండదు..!
సాక్షి, చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొందరు, లేదు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కూడా తమిళ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రజనీకాంత్ లేదా కమల్ హాసన్ పార్టీలతో జతకట్టనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సొంతంగా ప్రయత్నిస్తే కనీస ఓటు బ్యాంక్ అయినా సాధించవచ్చనీ, రజనీ.. కమల్ పార్టీలతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని మీడియాకు వెల్లడించారు. ఎవరినో నమ్మి ముందుకెళ్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సినీస్టార్ల రాజకీయాలపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలని సూచించారు. కరునానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌కే పార్టీని నడిపించే సమర్థత ఉందని వ్యాఖ్యానించారు. -
తమిళ రాజ‘కీ’యం ఎవరి చేతుల్లో?
సాక్షి ప్రతినిధి, చెన్నై/ సాక్షి నాలెడ్జ్ సెంటర్: జయలలిత కన్నుమూతతో ‘రెండాకులు’ రాలిపోయాయి. కరుణ మరణంతో ‘ఉదయసూర్యుడు’ అస్తమించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తమిళనాడులో కామరాజ్ నాడార్ హయాంలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. అన్నాదురై నేతృత్వంలో ఉదయించిన ద్రవిడ సిద్ధాంతాల డీఎంకే తిరుగులేని పార్టీగా మారింది. తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నాయకత్వంలో ఏర్పడిన అన్నాడీఎంకే తమిళనాట మరో బలీయమైన రాజకీయ పార్టీగా నిలిచింది. ఎంజీఆర్ జనాకర్షణ ధాటికి కరుణానిధి సైతం తల్లడిల్లిపోయారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఇక తమకు తిరుగులేదని ఆశించిన డీఎంకేకు నిరాశే మిగిలింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీని పరుగులు పెట్టించారు. ఎంజీఆర్‌కు ధీటుగా కరుణకు గట్టిపోటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే చాయిస్. ఎంజీఆర్ హయాంలో రెండుసార్లు, జయ హయాంలో ఒకసారి మినహా ప్రతిసారీ ఈ రెండు పార్టీలూ ఐదేళ్లకొకసారి అధికారాన్ని పంచుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేంత స్థాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల అధినేతలు జయలలిత, కరుణానిధి రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో తమిళనాట వారిద్దరి స్థాయి ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం కలిగిన నేతలు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చే స్థాయి ఎవరికి ఉందనే చర్చ మొదలైంది. కమల్, రజనీకాంత్‌ల ప్రభావమెంత? పురచ్చితలైవి జయలలిత జీవించి ఉన్నంతకాలం రాజకీయ ప్రవేశానికి వెనకడుగు వేసిన నటులు.. కమల్‌హాసన్, రజనీకాంత్ జయ మరణం తర్వాత తామున్నామంటూ ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే ఆస్తికత్వం, డీఎంకే నాస్తికత్వం సిద్ధాంతాలతో రాజకీయాలు నెరిపాయి. అలాగే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురూ సినీ నేపథ్యంతో ప్రాచుర్యం పొందినవారే. రజనీకాంత్, కమల్ సైతం సినీ క్రేజుపైనే ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవలతో మమేకమైన సందర్భాలు ఇద్దరికీ లేవు. అంతేకాకుండా అన్నాడీఎంకే, డీఎంకే మాదిరిగానే రజనీ, కమల్ ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ ప్రకటించారు. ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు అనేది ప్రజలందరికీ తెలిసిందే. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు, జిల్లాల్లో పర్యటనలతో కమల్ తన రాజకీయ ప్రయాణ వేగాన్ని పెంచగా, పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ 8 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక తమిళనాడులో సర్వే చేసి కమల్, రజనీ ఇద్దరికీ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేదని తేల్చింది. ఇద్దరికీ కలిపి కనీసం పది శాతం మంది కూడా వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సినీనటులు రాజకీయాల్లో రాణించే రోజులు అంతరించిపోయాయని సర్వేలో పేర్కొంది. స్టాలిన్‌కి తిరుగులేనట్టే.. కరుణానిధి తన రాజకీయ వారసుడిగా మూడో కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా కరుణ రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఆయన మేనల్లుడి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ‘నమక్కు నామే (మనకు మనమే)’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన లుకలుకలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాకుండా సంయమనం పాటించారు. ఈ నిదానమే ప్రజలకు నచ్చిందో ఏమో ఇటీవల జరిగిన సర్వేలో రాబోయేది డీఎంకే ప్రభుత్వం.. కాబోయే సీఎం స్టాలిన్ అని తేలింది. రజనీ చేతుల్లోకి అన్నాడీఎంకే! అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థాయిలో జయలలిత పార్టీని నడిపారు. ఆమె మరణం తర్వాత సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయకత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే అన్నాడీఎంకే బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అన్నాడీఎంకేను చీల్చి కొంతమేరకు బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలం, అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో అన్నాడీఎంకే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తేల్చిచెబుతున్నారు. వాస్తవానికి ‘అమ్మ’ మరణంతో అనాథగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా నిలవడం ద్వారా తమిళనాట వేళ్లూనుకోవాలని బీజేపీ తాపత్రయపడింది. అయితే అధికార పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపి ప్రయత్నాలకు గండిపడింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసిన బీజేపీకి తన మిత్రుడు రజనీకాంత్ కంటపడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విముఖత ప్రదర్శించిన రజనీకాంత్‌ను అన్నాడీఎంకే అధినేతగా చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీ ప్రకటనలో జాప్యాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో రజనీ నాయకత్వంలోని అన్నాడీఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రత్యర్థులుగా తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీకి 2021లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడేళ్ల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి. -
భారతీయుడికి గెస్ట్
కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వడంతో ఇదే తన లాస్ట్ సినిమా అవ్వనుందని ఆ మధ్య కమల్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌కు మించి ఈ సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట శంకర్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మరి అజయ్ విలన్‌గా కనిపిస్తారా? గెస్ట్ పాత్రలో కనిపిస్తారో వేచి చూడాలి. ఆల్రెడీ శంకర్ ‘2.0’లో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇండియన్ 2’లో అజయ్ దేవగన్. ఇలా బాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే సినిమాకి హిందీ మార్కెట్ కూడా బాగుంటుందని శంకర్ ఉద్దేశం అయ్యుండొచ్చు. -
పంద్రాగస్టుకి ముందే!
కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా కమల్‌హాసన్ దర్శకత్వంలోనే ‘విశ్వరూపం 2’ రూపొందింది. ఆస్కార్ ఫిలింస్ (ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారనే వార్తలు వచ్చాయి. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు రవిచంద్రన్. -
అది నా అదృష్టం
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తండ్రి కమల్‌హాసన్‌కు తగ్గ తనయగా మార్కులు కొట్టేస్తూనే, సొంత అభిమానులను సంపాదించుకున్నారామె. కథానాయికగా డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న శ్రుతిలో మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ కూడా ఉందని ప్రత్యేకించి చెప్పకర్లేదు. యాక్టింగ్, మ్యూజిక్వైజ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అన్న ప్రశ్నను శ్రుతీ ముందు ఉంచితే– ‘‘మా నాన్నగారు నటించి, దర్శకత్వం వహించిన ‘హే రామ్’లో నేను ఓ గెస్ట్ రోల్ చేశాను. అయితే నటిగా అది నాకు మొదటి సినిమా అని నేను అనుకోవడంలేదు. కానీ ఆ సినిమాతో కెమెరా ముందుకు వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్లో ‘లక్’ మూవీ చేశాను. యాక్టర్‌గా నా తొలి మూవీ అదే. సినిమా ప్రపంచాన్ని నా కళ్లు అర్థం చేసుకుంది అప్పుడే. అందుకే ‘లక్’ని నా మొదటి సినిమాలా భావిస్తున్నాను. యాక్టర్‌గా నా జర్నీ బాగుంది. ఇక మ్యూజిక్ కంపోజింగ్ అనేది నా న్యాచురల్ ఎక్స్టెన్షన్. సాధారణంగా చాలామందిలో యాక్టింగ్ లేదా మ్యూజిక్ ఏదో ఒక టాలెంట్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ రెండింటినీ నేను చేయగలుగుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ హిందీ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో హీరో విద్యుత్ జమాల్. -
బిగ్‌బాస్2లో లిప్‌లాక్
తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకుని మగాళ్లలాగా నటించారు. ఐశ్వర్య, రమ్య ట్విన్స్లాగా నటించి హౌస్మేట్స్ అడిగిన ప్రశ్నలకు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పారు. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్మేట్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ముగింపుకు వచ్చేసరికి అంత బద్ధకంగా తయారయ్యారు. మొత్తానికి తమిళ్ బిగ్‌బాస్2 షో రోజురోజుకు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అంతకుమించి అనిపించేలా షో సాగిపోతోంది. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. -
సోనియాతో కమల్ భేటీ
న్యూఢిల్లీ: సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిశారు. జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో కలిసి తమిళనాడు రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు అనంతరం కమల్ విలేకరులకు చెప్పారు. తాను కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు భావించాలనీ, ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన..ఆ అంశాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూడా సమావేశమైన విషయం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సమావేశాలు కూడా భాగమని భావిస్తున్నారు. -
రాహుల్ గాంధీతో కమల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ బుధవారం భేటీ అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయాల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ప్రియాంక వాద్రాతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యంను రిజిస్టర్ చేయించడం కోసం మంగళవారం ఎన్నికల సంఘం అధికారులను కూడా కమల్ కలిశారు. కమల్‌తో భేటీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఈరోజు ఢిల్లీలో కమల్ హసన్‌తో భేటీ అవడం సంతోషంగా ఉంది. మా రెండు పార్టీలకు సంబంధించిన విషయాల గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి కూడా చర్చించామని’ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. Enjoyed meeting @ikamalhaasan in Delhi today. We discussed a wide range of issues concerning our two parties, including the political situation in Tamil Nadu. pic.twitter.com/cPWQd8w7YY — Rahul Gandhi (@RahulGandhi) June 20, 2018 -
ఇండియన్ కంటే ముందే..
ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ తండ్రీ కూతుళ్లుగా కమల్‌హాసన్, శ్రుతీహాసన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘శభాష్ నాయుడు’. ఈ చిత్రం గత ఏడాదే ప్రారంభం అయినప్పటికీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఈ సినిమాను ‘ఇండియన్ 2’ (భారతీయుడు సీక్వెల్) స్టార్ట్ అయ్యేలోపే కంప్లీట్ చేస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘దశావతారం’ సినిమాలోని బలరామ్ నాయుడు క్యారెక్టర్‌కి కొన సాగింపుగా స్వీయ దర్శకత్వంలో ‘శభాష్ నాయుడు’ సినిమాని రూపొందిస్తున్నారు కమల్ హాసన్. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి కమల్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్2’తో బిజీగా ఉన్నాను. అది అయిపోగానే ‘శభాష్ నాయుడు’ పనులు మొదలుపెడతాం. ‘ఇండియన్ 2’ షూటింVŠ స్టార్ట్ చేయడానికి కంటే ముందే ఈ సినిమాను కంప్లీట్ చేసి, వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. కమల్ హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొం దించిన ‘విశ్వరూపం 2’ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. -
ఒక మనిషి అనేక రూపాలు
ఫ్యాన్స్‌తో ఇట్టే కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో ప్రతీ మార్గంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ట్వీటర్లో సినిమాలు, రాజకీయాల విషయాలను పంచుకుంటూ బాగా యాక్టీవ్‌గా ఉంటారు కమల్ హాసన్. ఇప్పుడు ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ‘విశ్వరూపం 2’ ఫొటో షేర్ చేసి ఎంట్రీ ఇచ్చారు. అలాగా ‘విశ్వరూపం’ సీక్వెల్ ‘విశ్వరూపం 2’ ట్రెలర్ని సోమవారం కమల్ రిలీజ్ చేస్తూ –‘‘మొదటి భాగానికి ఎదురైనట్టే ఈ సినిమాకు సమస్యలు ఎదురైతే రాజకీయంగా ఎదుర్కో వడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్ రిలీజ్ చేసి– ‘‘ఒక మనిషి అనేక రూపాలు. కమల్‌గారి ‘విశ్వరూపం’ ట్రైలర్ రిలీజ్ చేయడం నిజంగా హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది. -
కాస్త వినిపించుకోండి!
అబ్బా.. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే పదే పదే చెప్తున్నారు అని హీరోయిన్ రాయ్‌లక్ష్మీ చిరాకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కమల్‌హాసన్ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్‌బాస్ సెకండ్ సీజన్లో రాయ్‌లక్ష్మీ ఒక పార్టిస్పెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి అలసిపోయాను. కాస్త విని పించుకోండి. తమిళ బిగ్‌బాస్ సెకండ్ షోలో నేను పార్టిస్పేట్ చేయడం లేదు. అనవసరంగా నా పేరును గెస్ చేస్తూ అమాయకులైన వీక్షకులను కొందరు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని కాస్త షూటుగానే రెస్పాండ్ అయ్యారు రాయ్‌లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు ప్రాజెక్ట్‌లు రాయ్‌లక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
ఇండియన్ 2కి అనిరుద్ స్వరాలు
కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా విడుదలైన 21 ఏళ్లకు ‘ఇండియన్ 2’కి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేమ్ అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు అందించనున్నారని కోలీవుడ్ టాక్. శంకర్ సినిమా అంటే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారనుకోవడం కామన్. ఇప్పటివరకూ శంకర్ తీసిన చిత్రాల్లో ‘అపరిచితుడు, నన్బన్’ మినహా మిగిలిన చిత్రాలన్నింటికీ రెహమానే స్వరకర్త. ‘ఇండియన్ 2’కి అనిరుద్ ఎంటర్ అవ్వడం హాట్ న్యూస్ అయింది. కమల్ హాసన్ ‘బిగ్ బాస్ 2’ పూర్తవగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట. -
పొలిటికల్ పంచ్
దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) లంచాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ తాత లంచగొండులందర్నీ క్లీన్ చేశారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్లో ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలపై దృష్టి పెట్టారని చెన్నై టాక్. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ డైరెక్ట్‌గా అటాక్ చేయకుండా సెటిల్డ్‌గా ప్రస్తావించనున్నారని సమాచారం. కమల్‌హాసన్ పూర్థి స్థాయి పాలిటిక్స్‌లోకి వెళ్లే లోపు ఈ మూవీని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం తమిళ్లో ‘బిగ్ బాస్ సీజన్ 2’ హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ ఈ షో కంప్లీట్ అవ్వగానే ‘ఇండియన్ 2’ షూటింగ్లో జాయిన్ అవుతారట. ఇదిలా ఉంటే ఎప్పటినుంచో ఆగిపోయిన కమల్ ‘విశ్వరూపం 2’ సెన్సార్ పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. -
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తే వాళ్లను తక్కువ చేయడమే
క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ ‘‘క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉంది. కేవలం సినీ పరిశ్రమను ఎందుకు నిందిస్తారు? ఇండస్ట్రీ కనీసం ఉపాధి అయినా కల్పిస్తోంది. మిగతా చోట్లల్లా మహిళలను వాడుకొని వదిలేయడం లేదు కదా?’’ అని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. సరోజ్ ఖాన్ చేసిన ఈ కామెంట్ కరెక్టేనా? అన్న ప్రశ్నను కమల్ హాసన్ ముందుంచితే ఆయన స్పందిస్తూ– ‘‘నేను ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాస్టింగ్ కౌచ్ మీద కూర్చోవాలా వద్దా? లేకపోతే ఆ కౌచ్‌ని కాళ్లతో తన్నేయాలా అన్నది పూర్తిగా ఆ మహిళ రైట్. కానీ క్యాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ దానికి ఫేవర్‌గా మాట్లాడితే ఇండస్ట్రీలో ఉన్న నా చెల్లెళ్లు, కూతుళ్ల రైట్స్‌ను తగ్గించటమే. వాళ్లను తక్కువ చేయడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. -
షారుక్ రీమేక్?
కమల్‌హాసన్ రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘హే రామ్’ (2000). ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో తెలిసిందే. మూడు నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. హిందీ–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. విశేషం ఏంటంటే... ఇప్పుడు ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారట. ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ ఇండియాను సందర్శించినప్పుడు అదే వేడుకలో పాల్గొన్న కమల్‌హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు.‘‘అప్పట్లో హే రామ్’ సినిమాను షారుక్ ఖాన్ కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేశారు. ఈ సినిమాలో నటించినందుకు తనకు వాచ్ మాత్రమే ఇవ్వగలిగాను. ఎందుకంటే సినిమా పూర్తయ్యేసరికి అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. కానీ ఇప్పుడు షారుక్ ఓ వాచ్ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ ఇటీవలే భరత్ షా (‘హే రామ్’ సినిమా కో–ప్రొడ్యూసర్) దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ సినిమా మెమొరీస్ అతని దగ్గర ఉండి ఉంటాయి. ఎందుకంటే అతను ఈ సినిమా కోసం ఫ్రెండ్షిప్, సర్వీస్ ఇచ్చాడు కాబట్టి’’ అని పేర్కొన్నారు కమల్. ఇంతకీ ‘హే రామ్’ రైట్స్‌ను షారుక్ సొంతం చేసుకున్నారంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తారని ఊహించవచ్చు. -
బాడీ ఫిట్.. మైండ్ ఫిట్
పిల్లల్ని తమ మాటలతో ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి, ఈ ప్రపంచాన్ని జయించేలా తయారు చేసే ఫాదర్స్‌ను బెస్ట్ ఫాదర్స్ అంటాం. కమల్ హాసన్ కూడా ఈ కోవలోకి చెందిన వారే. తన ఇద్దరికూతుళ్లను ఎప్పటికప్పుడు తన మాటల ద్వారానో, తాను ఆచరిస్తున్న విషయాల ద్వారానో మోటివేట్ చేస్తూనే ఉంటారాయన. రాజకీయాలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం జిమ్‌ను సందర్శించటం మిస్ కావట్లేదు కమల్. ఇప్పుడు ఆయన కొత్త జిమ్ స్నేహితురాలు ఎవరో తెలుసా? ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్. ప్రస్తుతం చిన్న కూతురు అక్షరా హాసన్‌కు జిమ్ పాఠాలు నేర్పిస్తున్నారు కమల్. ‘‘నీ శరీరాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటే అది నీ మన స్సుని అంత చురుకుగా ఉంచుతుంది. బాడీ ఫిట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మైండ్ కూడా ఫిట్‌గా ఉంటుందని అర్థం. ‘‘జిమ్మింగ్ విత్ మై బేబ్. నీ బాడీ మీద వర్క్ చేయి, అది నీ మెదడుని చురుకుగా ఉంచుతుంది. స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగ్ మైండ్‌ని తయారుచేస్తుంది’’ అని ట్వీటర్లో ఫొటోను షేర్ చేశారు కమల్. -
ఇంకా నేను ఫుల్‌టైమ్ నేతను కాను!
సాక్షి, చెన్నై: తాను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక పర్యటన తన గురించి తాను తెలుసుకోవడానికేనని పేర్కొన్నారు. ‘నేను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదు. నా పార్టీ పేరును ప్రకటించలేదు. ఇప్పుడు రాజకీయాల గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు’ అని రజనీ అన్నారు. రిషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అంశాలపై రజనీ మాట్లాడటం లేదని కమల్ హాసన్ చేసిన విమర్శలపై స్పందించాలని మీడియా ఆయనను కోరగా.. ఈ విధంగా బదులిచ్చారు. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆయన జమ్మూలోని శివగుహను, ధర్మశాలను సందర్శించిన ఆయన.. రిషికేష్‌లోని దయానంద సరస్వతి ఆశ్రయంలో కొన్నిరోజులు ధ్యానం చేయనున్నారు. రజనీకాంత్ విధానాలను విమర్శించేందుకు తాను సిగ్గుపడబోనని కమల్ హాసన్ తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 'నేను రజనీకాంత్ మంచి మిత్రులం.. అయితే, ఆయన విధానాలు విమర్శించేందుకు సిగ్గుపడబోను. అది కేవలం ఆయన విధానాలకు, నిబంధనలకు మాత్రమే పరిమితమై ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఉండబోదు. ఆయనను ముందు రానివ్వండి (రాజకీయాల్లోకి).. పార్టీ పేరును ప్రకటించనివ్వండి. నేను మాత్రం ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను.. నా పార్టీ ముఖ్య విధానం ప్రజా సంక్షేమం. అలాగే, రజనీని కూడా ఆయన విధానాలు ప్రకటించనివ్వండి.. అందులో ఏవైనా మా పార్టీకి సంబంధించి ఉంటాయేమో చూద్దాం. ఇరువురి విధానాల్లో కొంత భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నేను మాత్రం పార్టీ విధాన పరంగానే విమర్శలు చేస్తానుగానీ వ్యక్తిగతంగా కాదు.. అదే రాజకీయపరంగా గౌరవం కూడా' అని కమల్ అన్నారు. మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీని ప్రకటించిన కమల్ ప్రస్తుతం జిల్లాల పర్యటన చేపడుతున్నారు. -
పార్టీ విధివిధానాలు ప్రకటించిన కమల్
సాక్షి, చెన్నై : కుల రాజకీయాల కంటే మనం అలవాటు పడిన రాజకీయాలు, అత్యంత భయంకరమైనవి, ప్రమాదకరమైనవని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కమల్ తమ పార్టీ విధి విధానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ప్రమాద కరంగా మారిపోయందన్నారు. ఓటరు నోటు తీసుకొని వేయడం ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకుడికి అమ్మడమేనని అన్నారు. ఖద్దరు వేసిన వాడే రాజకీయ నాయకుడు అనే భ్రమలో ప్రజలు ఉన్నారని వారిని చైతన్య వంతులని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుత పార్టీలు, నాయకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నని విస్మరిస్తున్నారని, రైతు ఎలా పోతే నాకేంటి, నాకు ముద్ద దొరికితే చాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. మూడు పూటలా కడుపు నిండా తింటున్న నేతలకు తిండి ఎక్కడ నుంచి వస్తుందో తెలియకపోవడం మన దురదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సమాజం మురికి కూపంలా మారిపోయిందని, ఆ వాసనకు అలవాటు పడి అదే గొప్ప అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందన్నారు. అందరు కలిసి రాజకీయాలను, సమాజాన్ని శుభ్రం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుళ్లిపోయిన రాజకీయాలను మార్పు తెచ్చేందుకు తాను సిద్ధం అని అందరూ కలిసి ముందుకు రావాలని కోరారు. మార్పు అనేది ఏ ఒక్కరితోనే రాదని, అందరు కలిసి ముందుకు సాగితేనే సాధ్యం అని కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు. -
రజనీ–కమల్ రహస్య భేటీ
చెన్నై: రాజకీయ అరంగేట్రానికి ముందు తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రహస్యంగా సమావేశమైనట్లు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తెలిపారు. ఈ భేటీలో తన రాజకీయ ప్రవేశంపై రజనీతో చర్చించినట్లు పేర్కొన్నారు. తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు రాసిన వ్యాసంలో కమల్ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ భేటీ ఎప్పుడు జరిగిందన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. చెన్నై సమీపంలో పూనామాళ్లిలోని ఓ స్టూడియోలో బిగ్‌బాస్ షూటింగ్ జరుగుతుండగా, అక్కడికి సమీపంలోనే రజనీ ‘కాలా’ చిత్రం షూటింగ్ కూడా జరుగుతుండేదన్నారు. మనం రహస్యంగా కలుసుకోవచ్చా? అని రజనీకి తాను ప్రతిపాదించినట్లు కమల్ తెలిపారు. దీంతో తామిద్దరం ఓ కారులో రహస్యంగా సమావేశమయ్యామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ అరంగేట్రంపై తన నిర్ణయాలను రజనీకి వివరించినట్లు పేర్కొన్నారు. తొలుత రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయాన్ని విన్న రజనీ ఆశ్చర్యపోయారన్నారు. దీనికోసం కొన్నేళ్ల క్రితమే మానసికంగా సిద్ధమైపోయాననీ, ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నానని రజనీకి సమాధానమిచ్చినట్లు కమల్ వ్యాసంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు, మార్గాలు వేరైనా పరస్పరం గౌరవించుకోవాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కాషాయీకరణ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వ్యాసంలో కమల్ మరోసారి స్పష్టం చేశారు. ‘కాషాయాన్ని కమల్ కించపరుస్తున్నాడని కొందరంటున్నారు. అది ఎంత మాత్రం నిజం కాదు. త్యాగానికి ప్రతీకైన కాషాయానికి అత్యంత గౌరవముంది. అంతకంటే ముఖ్యంగా జాతీయ జెండాలోనూ కాషాయానికి చోటుంది’ అని కమల్ చెప్పారు. -
కమల్ కొత్త పార్టీ
తమిళనాడులో మరో సినీ ప్రముఖుడు కమల్‌హాసన్ ‘మక్కళ్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరిట బుధవారం లాంఛనంగా తన పార్టీని ప్రారంభిం చారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో కనుమరుగ య్యాక అక్కడి రాజకీయాల్లో ఏర్పడిందని చెబుతున్న శూన్యాన్ని భర్తీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నవారిలో ఆయన కూడా చేరారు. నూతన సంవత్సర ఆగమన వేళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించినా పార్టీ ఏర్పాటును మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వాయిదా వేసుకున్నారు. ఇద్దరూ వర్తమాన తమిళనాడు దుస్థితిని చూసి ఆగ్రహించి రాజకీయా ల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే రజనీకాంత్ ఇంతవరకూ ఎవరికీ పరిచయం లేని, బోధపడని ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ గురించి ప్రస్తా విస్తే.. హేతువాద దృక్పథం ఉన్న కమల్‌హాసన్ తాను ప్రజల చేతిలో ఆయుధాన్నని ప్రకటించారు. రజనీకాంత్ ఎవరితో వెళ్తానన్న అంశంలో స్పష్టతనీయకపో యినా ఆయన వెనక బీజేపీ ఉన్నదన్న అనుమానాలు తలెత్తాయి. కమల్ మాత్రం బీజేపీకి, హిందుత్వకు వ్యతిరేకంగా ప్రకటనలిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సద స్సులో కమల్ ప్రజాసేవ గురించి, అవినీతి నిర్మూలన గురించి మాట్లాడటం తప్ప తన పార్టీ విధానాలేమిటో స్పష్టతనీయలేదు. ఒకపక్క అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హీరో అని ఆయన ప్రకటించడం సహజంగానే అందరినీ విస్మయపరిచి ఉంటుంది. పొరుగునున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడానికి పాలక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపిన ఉదంతం కమల్‌కు తెలియదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆడియో, వీడియో సాక్ష్యాలున్నప్ప టికీ ఆ కేసు ఎందుకు ముందుకు సాగటం లేదో కూడా ఆయనకు అర్ధమై ఉండాలి. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23మంది ఎమ్మెల్యేలనూ, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకోవడం, ఫిరాయింపు ఎమ్మె ల్యేల్లో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టడం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియ దంటే ఆయన రాజకీయ పరిణతిపైనా, చిత్తశుద్ధిపైనా సంశయం కలుగుతుంది. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనబెట్టుకెళ్లిన చందాన పోయి పోయి బాబు ప్రస్తావన తీసు కురావడం ద్వారా పార్టీ ఆవిర్భావ సభ ఔన్నత్యాన్ని కమల్ తగ్గించుకున్నారు. సినిమా మాధ్యమం ప్రజలను ఆకట్టుకునే బలమైన సాధనం కనుక ఆ రంగంలో ప్రజాదరణ పొందినవారు రాజకీయాల్లోకొచ్చి అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటారు. అది సహజం. తమిళనాడులో సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌లు సినిమా రంగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవారే. అయితే వీరందరి మూలాలూ తమిళనాడును ఒకప్పుడు ప్రభంజనంలా చుట్టు ముట్టిన ద్రవిడ ఉద్యమంలో ఉన్నాయి. హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు, కుల నిర్మూలన సిద్ధాంతాలతో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిపిన పెరియార్ రామస్వామి సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తాము సాధించుకున్న విజయాలను సుస్థిరం చేసుకోవడానికి ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. అందులో పాలుపంచుకున్న అన్నాదురై అనంతరకాలంలో ఆయనతో విభేదించి డీఎంకే పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. దాని నేతృత్వంలో సాగిన హిందీ వ్యతిరే కోద్యమం తమిళనాడు రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. అనంతరం 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ నాడార్ ఒక విద్యార్థి నాయకుడి చేతిలో ఓటమి చవిచూడటం పెను సంచలనం. ఆ తర్వాత జాతీయ పార్టీలకు అక్కడ స్థానం లేకుండాపోయింది. కాంగ్రెస్ అయినా, అనం తరకాలంలో బీజేపీ అయినా ద్రవిడ పార్టీల దయాదాక్షిణ్యాలు లేనిదే ఒక్క సీట యినా గెలవలేని దుస్థితిలో పడ్డాయి. ఎంజీఆర్ అనంతరం ఆయన వారసురాలిగా జయలలిత ప్రజాభిమానాన్ని పొందగలిగారు. ప్రధాన ద్రవిడ పార్టీలతో సంబంధం లేకుండా, అసలు ద్రవిడ ఉద్యమం ప్రస్తావనే లేకుండా రాజకీయాల్లోకొచ్చిన తొలి తమిళ తారలు రజనీకాంత్, కమల్ హాసన్లే. వీరు తమ ప్రయత్నాల్లో ఏమాత్రం విజయం సాధించినా తమిళనాడు చరిత్ర మరో మలుపు తిరిగినట్టవుతుంది. గత అయిదు దశాబ్దాల్లో వైకో నేతృ త్వంలోని ఎండీఎంకే, నటుడు విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే, డాక్టర్ రాందాస్ నాయకత్వంలోని పీఎంకే, ఇంకా అనేక ఇతర పార్టీలు రంగంలో కొచ్చాయి. ఇవన్నీ ద్రవిడ ఉద్యమం పేరు చెప్పుకునే ప్రజలను ఆకట్టుకోవాలని చూశాయి. ఉత్థానపతనాలు చవిచూశాయి. విజయకాంత్ పార్టీ ఒకానొక దశలో తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అయిదేళ్లు గడవకుండానే అది కాస్తా కొడిగట్టింది. వర్తమాన తమిళ రాజకీయాల పట్ల అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నది వాస్తవం. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీకి, ముఖ్యమంత్రి పద వికి తాను సహజ వారసురాలినని అంచనా వేసుకుని ఆ దిశగా పావులు కదిపిన జయ సన్నిహితురాలు శశికళ అవినీతి కేసులో శిక్ష పడి జైలు పాలయ్యారు. ఆ తర్వాత తన మేనల్లుడు దినకరన్ ద్వారా పార్టీని నడిపించాలనుకుంటే అది కాస్తా అడ్డం తిరిగి ఆ పార్టీయే చేజారింది. ఆయన ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు అన్నా డీఎంకే తన చెంతకే చేరుతుందన్న విశ్వాసమేదో ఆయనకు ఉన్నట్టుంది. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల మధ్య కొట్టుమిట్టాడుతూ అయోమయంలో కాలం గడుపుతోంది. ఈ పరిస్థితులే కమల్‌నూ, రజనీని రాజకీయాల్లోకి ఆకర్షించి ఉంటాయి. అయితే విస్పష్టమైన విధానాలూ, సిద్ధాంతాలూ, కార్యాచరణ ఉన్న ప్పుడే ఎవరైనా ఈ రంగంలో రాణిస్తారు. ఆ సంగతిని కమల్‌హాసన్, రజనీకాంత్ గ్రహించాలి. -
పార్టీ పేరు ప్రకటించిన కమల్ హాసన్
సాక్షి, మధురై: తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. గత కొంతకాలం నుంచి తలెత్తిన ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన పార్టీ పేరును ప్రకటించారు. మదురైలో బుధవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ పేరును 'మక్కల్ నీతి మయ్యమ్' (పీపుల్స్ జస్టిస్ పార్టీ) అని ప్రకటించగానే సభా ప్రాంగణం మార్మోగిపోయింది. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం కమల్ పార్టీ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. భారీ బహిరంగసభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం కమల్ తన పార్టీ పేరు ప్రకటించారు. అనంతరం కమల్ మాట్లాడుతూ.. 'నేను మీలోంచి వచ్చిన వ్యక్తిని. తలైవాను మాత్రం కాదు. ఒక్కరోజు ఆట కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాయకుడిగా భావించడం లేదు. సామాన్య జనంలో నుంచి పుట్టుకొచ్చిన ఒకడిని. ప్రజా సేవకుడిగా కొనసాగాలని భావిస్తున్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉంటానని' అన్నారు. కొత్తగా స్థాపించిన మక్కల్ నీతి మయ్యం మీ పార్టీ. ఎప్పటినుంచో మనం కోరుకుంటున్న మార్పును తెచ్చేందుకు ఇది ఆవిర్భవించింది. మీకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ సూచనలు, సలహాలు ఇవ్వండంటూ పార్టీ ఏర్పాటుపై కమల్ తొలి ట్వీట్ చేశారు. అంతకుముందు కమల్ బుధవారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలుసుకుని అక్కడి కలాం సమాధి వద్ద అంజలిఘటించారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్ కలుసుకున్న విషయం తెలిసిందే. మక్కల్ నీతి మయ్యం పార్టీ లోగో -
జయలలిత పార్టీ నాశనం అవుతుందా ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజకీయ నేతగా మారిన కమల్ హాసన్ కొత్త పార్టీకి తమిళనాడులో పెద్దగా చోటు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఒకప్పుడు తమిళనాడుకు ఇన్చార్జ్గా వ్యవహరించిన వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన పార్టీ పెద్దగా ఎదగబోదని, చాలా తక్కువ మార్జిన్ మాత్రమే సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలని, మరోపక్క, సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించారని, ఈ నేపథ్యంలో కమల్, రజినీల పార్టీలు ముందుకెళ్లగలగాలంటే డీఎంకే, అన్నాడీఎంకేలతో కలవాల్సిందేనని చెప్పారు. ఆ పార్టీలతో సంబంధాలు పెట్టుకోకుండా వారు మనుగడ సాగించడం కష్టమని అంచనా వేశారు. తమిళనాడులో ఉన్న చోటంతా కూడా డీఎంకే, అన్నాడీఎంకేలే ఆక్రమించాయని, కమల్‌కు భారీగా చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదన్నారు. బహుషా అన్నాడీఎంకే కూలిపోవచ్చని, ఆ స్థానాన్ని తాను ఆక్రమిస్తానని కమల్ అనుకుంటూ ఉండొచ్చేమోనని, అలా జరుగుతుందని మాత్రం తనకు అనిపించడం లేదని మొయిలీ సందేహం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను డామినేట్ చేసేలాగా కమల్ ప్రాంతీయ అజెండా ఉంటే మాత్రం చెప్పలేమని అభిప్రాయపడ్డారు. డీఎంకేతో కాంగ్రెస్ పార్టీది బలమైన సంబంధం అని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఇప్పటికిప్పుడైనా ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నారు. -
కమల్‌హాసన్ పార్టీ ఆవిర్భావం నేడే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు, మంగళవారం ఉదయం మదురై చేరుకున్న కమల్‌కు ఎయిర్‌పోర్టులో అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. కమల్ బుధవారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలుసుకుని అక్కడి కలాం సమాధి వద్ద అంజలిఘటిస్తారు. తర్వాత సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్ కలుసుకున్నారు. -
రజనీతో కమల్‌హాసన్
-
21న మదురైలో కమల్ పార్టీ ప్రకటన
-
కమల్– విక్రమ్–అక్షర ఓ సినిమా
యస్.. కమల్‌హాసన్, ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్, విక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇందులో కమల్ నటించడంలేదు. విక్రమ్, అక్షర జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బేనర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్‌హాసన్ నిర్మించనుండటం విశేషం. ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్ మరో నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. కమల్‌తో ‘తూంగావనమ్’ (తెలుగులో ‘చీకటి రాజ్యం’) చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేశ్ ఎమ్. సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘ఈ కాంబినేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కమల్. ‘‘విక్రమ్, అక్షరాహాసన్‌కు థ్యాంక్స్. నా శక్తి సామర్థ్యాలను నమ్మిన కమల్‌హాసన్‌గారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు రాజేశ్ ఎమ్. సెల్వ. ఇదిలా ఉంటే... కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ‘శభాష్‌నాయుడు’ అనే చిత్రంలో కమల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఇందులో కమల్ కూతురిగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఆ మధ్య కమల్ కాలికి గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. త్వరలో షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
ఫిబ్రవరి 21న ముహూర్తం
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న కొత్త పార్టీని ప్రకటించనున్నారు. తన సొంతూరైన రామనాథపురంలో పార్టీని ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో కమల్ తెలిపారు. ‘నటుడిగా నా అభివృద్ధికి కారకులైన తమిళ ప్రజానీకానికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు మాత్రమే కాదు, ప్రజలకు అంతకంటే ఎంతో చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం నేరుగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని నేను పుట్టిన ఊరైన రామనాథపురం నుంచి వచ్చేనెల 21న ప్రారంభించబోతున్నాను. అదే రోజున పార్టీ పేరును, దాని లక్ష్యాలను ప్రకటించి, నా రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభిస్తాను. రామనాథపురం, మధురై, దిండుగల్లు, శివగంగై జిల్లాల ప్రజలను కలుసుకుంటాను. ఇది నా దేశం, దీనిని కాపాడుకోవాలి అనే భావన నాకు మాత్రం ఉంటే సరిపోదు, మనమంతా కలిసి ఈ రాజకీయ రథాన్ని లాగడమే ప్రజాస్వామ్యం’అని కమల్ పేర్కొన్నారు. కాలమే నిర్ణయిస్తుంది:రజనీ కమల్ పార్టీని ప్రకటించడంపై నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ 1973లో హీరోగా నటించి నిర్మించిన ‘ఉలగం చుట్రు వాలిబన్’ సినిమా సీక్వెల్ యానిమేషన్ చిత్రం ప్రారంభ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో కమల్, రజనీ పాల్గొని ఒకే వేదికను పంచుకున్నారు. -
మలేసియాలో స్టార్స్ క్రికెట్
తమిళసినిమా(చెన్నై): మలేసియాలో కోలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్స్ క్రికెట్ పోటీ, ఆటపాటలతో సందడి చేశారు.మలేసియాలోని బూకీజాలీ స్టేడియంలో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ సహా దాదాపు 340 మంది నటీనటులు పాల్గొన్నారు. తొలుత క్రికెట్‌తో, అనంతరం పలు సినీ, సాంస్కృతిక కార్యక్రమాలతో మలేసియా ప్రేక్షకులను కోలీవుడ్ స్టార్స్ అలరించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం మలేసియా చేరుకున్న తమిళ నటులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మలేసియా ప్రధాని అబ్దుల్ రజాక్ రజనీకాంత్‌ను కలసి అభినందించారు. -
కమల్ సినిమాలో విక్రమ్..!
సాక్షి, తమిళ సినిమా: ఒక సంచలన కలయికకు రంగం సిద్ధం అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో తాజాగా హల్చల్ చేస్తోంది. నటుడు కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఆయన నటిస్తున్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చిత్రాలను తొందరగా విడుదల చేసే పనిలో మునిగిపోయారు. తాజాగా కమలహాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రాజేశ్ ఇంతకుముందు కమలహాసన్, త్రిష జంటగా నటించిన తూంగావనం చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్ ఇంతకుముందు కూడా తాను నిర్మాతగా నాజర్ ప్రధాన పాత్రలో మగళీర్ మట్టుం, సత్యరాజ్ హీరోగా కడమై కన్నియం కట్టుపాటు, మాధవన్ కథానాయకుడిగా నలదమయంతి వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్న కమలహాసన్ చిత్ర పరిశ్రమకు దూరం కాకుండా మంచి చిత్రాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా విక్రమ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆయన అతిథిగా మెరిసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
త్వరలో శృతి హాసన్ వివాహం!
కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తాడో లేదో నాట్ ష్యూర్ గానీ, శృతి హాసన్ మ్యారేజ్లోకి రావడం ఆల్మోస్ట్ కన్ఫామ్డ్ అంటున్నారు. స్వీట్ హార్ట్ నెక్ లైన్ కట్ ఉన్న ఓ తెల్లటి మ్యాక్సీ డ్రెస్ వేసుకుని, జుట్టును బన్ను లాగా ముడేసుకుని, చెవులకు రెండు స్టేట్మెంట్ దుద్దులు పెట్టుకుని ఎంతో క్యాజువల్‌గా, ఎంతో సింపుల్‌గా తన సంతోషం బయట పడకుండా బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సేల్‌తో, తల్లి సారికతో కలిసి ఓ హై క్లాస్ రెస్టారెంట్లో లంచ్ చేశారట శృతి హాసన్! రెండేళ్ల నుంచీ శృతి, కోర్సేల్ ప్రేమాయణం చక్కర్లు కొడుతున్న సిట్యుయేషన్లో సారికకు కోర్సేల్ని కలిపించడంలో పెడర్థం ఏమీ లేదు.. మ్యారేజ్ అర్థమే ఉందని మీడియా అంటోంది. దానికి తోడు సారిక చేతిలో అందమైన పూల గుచ్ఛం ఉంది కాబట్టి కాబోయే అల్లుడు గారే ఇచ్చారని, ఆవిడ స్వీకరించింది కాబట్టి పెళ్లి జరగడం ఖాయమనీ మీడియా మితిమీరి ఎక్సయిట్ అయిపోతోంది. -
రజనీతో కలసి పనిచేయడానికి సిద్ధమే
తమిళసినిమా (చెన్నై): సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలసి పనిచేయడానికి తాను సిద్ధమేనని సినీ నటుడు కమలహాసన్ అన్నారు. చెన్నైలో కమలహాసన్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి రాజకీయ సమావేశం సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పారు. నిజానికి తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదే విధంగా బీజేపీ తదితర పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు భావించడం సరికాదన్నారు. రజనీకాంత్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారని రజనీ, తానూ మంచి మిత్రులమని చెప్పారు. ఇద్దరి రాజకీయపరమైన సిద్ధాంతాలు, అభిప్రాయాలు కలిస్తే రజనీకాంత్‌తో కలసి పని చేయడానికి తాను సిద్ధమేనని కమల్ స్పష్టం చేశారు. -
ఇక ప్రజల్లోకి వెళ్తా!
సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి వచ్చేశానని, ఈ విషయమై ఇప్పటికే పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించుతూ.. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు త్వరలో ఒక మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 63వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో మంగళవారం మీడియాతో కమల్ హాసన్ ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ ఏర్పాటుపై కమల్ స్పందిస్తూ.. ‘నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశాను. మార్పు కోసం మీరు, నేను ఎన్నో ఏళ్లు ఎదురుచూశాం. అందువల్ల హడావుడి అవసరం లేదు. అందరూ చేస్తున్నట్లు మనం చేయడం లేదు. నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన రోజు. పురోగతి దిశగా ముందడుగుగా భావిస్తున్నా. కేవలం వ్యక్తిగత పురోగతే కాదు మొత్తం తమిళనాడు పురోగతి దిశగా ముందడుగు’ అని పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యే వేదిక ‘మయ్యం విజిల్’ యాప్ వెతుకు.. పరిష్కరించు ఇదే యాప్ ప్రధాన నినాదమని, ప్రజలకు చేరువయ్యేలా ఒక వేదికని కమల్ పేర్కొన్నారు. ‘మయ్యం విజిల్ యాప్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. జనవరిలో ప్రారంభిస్తాం. ప్రజలు తమ సమస్యలను, ప్రభుత్వంపై ఫిర్యాదులను యాప్‌లో నమోదు చేయవచ్చు. నేను తప్పు చేస్తున్నా ఎత్తిచూపవచ్చు.పారదర్శకంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదుల్ని అప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ అనుసంధానంగా ఉంటుంది. యాప్‌ను ప్రారంభించాక అది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలియచేస్తా. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రకటనలు చేస్తాం’ అని వెల్లడించారు. వివేకానంద, గాంధీజీలే ఆదర్శంగా.. మొబైల్ యాప్ ప్రారంభించాక తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘ఇప్పటికే అనేకమందితో చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యేందుకు తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తా. తమిళనాడు పర్యటనలో ప్రజలు నన్ను ఒక నటుడిగా కాకుండా వేరే దృష్టితో అర్థం చేసుకునేలా వివరిస్తాం’ అని చెప్పారు. యువతను ఉత్తేజితులను చేస్తూ సమాజంపై అవగాహన కోసం స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ ప్రజల్లో తిరిగారని, వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. హిందూ వ్యతిరేకి ముద్రవేస్తే అంగీకరించను దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతుందని గతవారం ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఏ మతం హింసను బోధించదు. మతం పేరిట హింసను వ్యతిరేకించాను. ఉగ్రవాదం అనే పదం నేనెప్పుడూ వాడలేదు. హిందువుల్ని బాధించేలా నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఆ కుటుంబం నుంచే వచ్చాను. ఆ భావాల నుంచి బయటకు వచ్చి లౌకికవాదిగా మారాను. అలాగని హిందూ వ్యతిరేకి, నాస్తికుడు అని ముద్రవేస్తే అంగీకరించను’అని కమల్ పేర్కొన్నారు. -
అక్కణ్ణుంచి మన డబ్బు వెనక్కి తెస్తా!
‘‘ఎంత మంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎవరేమన్నా నేను ముందుకు వెళతాను. అన్ని వ్యతిరేకతలను తీసుకోవడానికి నేను సిద్ధం. ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ ‘నర్పణి ఇయక్కమ్’ (వెల్ఫేర్ అసోసియేషన్) 39వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో కమల్ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. ‘‘నేను రాజకీయల్లోకి వస్తాను. పొలిటికల్ పార్టీ పెడతాను. స్విస్ బ్యాంక్‌లో నేను డబ్బు దాచుకోలేదు. అక్కడ ఉన్న మన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను’’ అన్నారు. పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఓ మొబైల్ యాప్‌ని రూపొందించారట. పుట్టినరోజు (ఈ నెల 7)నాడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ వివరాలు ఈ యాప్‌లో ఉంటాయట. బర్త్‌డే నాడు ‘విశ్వరూపం–2’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. -
నా వ్యాఖ్యలు కరెక్టే!
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ నాకంటే పెద్ద నటుడు.. అందులో సందేహం లేదని ఆయన మరోసారి చెప్పారు. ప్రధాని మోదీ గురించే కాకుండా కమల్ హాసన్, రజనీకాంత్లపైనా ఆయన స్పందించారు. కమల్, రజనీకాంత్లకు సినిమాలు, నటన పరంగా పెద్ద అభిమానిని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే వారు పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి దిగితే మాత్రం వారికి ఓటు వేయనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అయితే వర్తమాన రాజకీయాలు, ఇతర అంశాలపై నా భావాలను ప్రకటిస్తూనే ఉంటానని తెలిపారు. మెర్శిల్ వివాదాల నేపథ్యంలో.. విశాల్ ఇంటిపై జరిగిన ఐటీ దాడికి బీజేపీ సంబంధలేదని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం విశేషం. -
సెల్యూట్ విజయన్.. పెరియార్ కల నిజం చేశావు!
సాక్షి, చెన్నై: ఆరుగురు దళితులు సహా మొత్తం 36మంది బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఇటీవల కేరళకు చెందిన ట్రావన్‌కోర్ దేవస్థానం నియామక బోర్డు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రావన్‌కోర్ ఆలయ బోర్డు (టీడీబీ) గతంలోనూ బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించినప్పటికీ.. దళితులను పూజారులుగా నియమించడం ఇదే తొలిసారి. మొత్తం 62 మంది పూజారులను తాజాగా టీడీబీ నియమించగా.. అందులో 36మంది బ్రాహ్మణేతరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా రిజర్వేషన్ వర్తింపజేస్తూ.. రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ఆధ్వర్యంలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూజారి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తం 62 పోస్టుల్లో 26మంది బ్రాహ్మణులు పూజారులుగా ఎంపికయ్యారు. కేరళ సర్కారు తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించిన ట్రావన్‌కోర్ ఆలయ బోర్డ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కమల్ హాసన్ సెల్యూట్ అర్పించారు. Bravo Travancore Dewasom board.Salute to Kerala CM Mr. Pinarayi Vijayan.4 appointing 36 non-Brahmin priests. Periar's dream realized — Kamal Haasan (@ikamalhaasan) 9 October 2017 -
రాజకీయాలు మాట్లాడిన సుహాసిని
సాక్షి, చెన్నై : రాజకీయాలకు, సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడులో అయితే అది కాస్త ఎక్కువే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ కొన్ని దశాబ్దాలుగా సినిమా వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాగా జయ మరణం అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం సినిమా వాళ్లే ప్రయత్రాలు ముమ్మరం చేస్తున్నారు. విశ్వనటుడు కమల్‌హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ తమ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారు?, ఎవరు రాణిస్తారోనన్న ఆసక్తి తమిళ ప్రజలతో పాటు దేశమంతటా నెలకొంది. ఇదిలా ఉంటే సినీ మహిళాలోకం మరో పక్క కదులుతోంది. రాజకీయాలకు తామేమీ తక్కువ కాదంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక కార్యక్రమంలో నటి సుహాసిని మణిరత్నం బాహాటంగానే వెల్లడించారు. రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందిస్తూ.. హీరోలే రాజకీయాల్లోకి రావాలా, తాము రాజకీయాల్లోకి రాకూడదా? అంటూ ప్రశ్నించారు. నటీమణులు రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియ కూడా రాజకీయాల్లోకి రావడానికి సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి.. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని నటి సుహాసిని మణిరత్నం వ్యాఖ్యానించారు. దీంతో నటులకే కాదు నటీమణులకు పొలిటికల్ ఫీవర్ పట్టుకుందంటూ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. -
కమల్ రాజకీయాల్లోకి రావాలి: కేజ్రీవాల్
-
కమల్ రాజకీయాల్లోకి రావాలి: కేజ్రీవాల్
చెన్నై : అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని ప్రముఖ నటుడు, త్వరలో రాజకీయ పెట్టనున్నానంటూ ప్రకటించిన కమల్ హాసన్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఎప్పటి నుంచో పోరాడుతున్నారని చెప్పారు. గురువారం అనూహ్యంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ కమల్‌హాసన్‌లు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత వారిద్దరు మీడియాతో మాట్లాడారు. ‘నా తండ్రి కాలం నుంచే మా కుటుంబం కాస్తంత రాజకీయాలకు దూరంగా ఉంది. నేను కూడా దూరంగా ఉన్నాను. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయాలనుకున్న నాకు అరవింద్ కేజ్రీవాల్ సలహా కావాలని అనిపించింది. అందుకే కోరాను’ అని కమల్ చెప్పారు. ఇక కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘కమల్ హాసన్ చేసే పనికి నేనెప్పుడూ పెద్ద అభిమానిని. మే మధ్య చాలా అద్భుతమైన సమావేశం జరిగింది. భవిష్యత్‌లో కూడా మేం ఒకరికొకరం అందుబాటులో ఉండి తరుచుగా సమావేశం అవుతుంటాం. కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలి. కమల్‌తో భేటీ కావడం ఆనందంగా ఉంది’ అని కేజ్రీవాల్ చెప్పారు. -
లోక నాయకుడి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో రోజుకో ఎపిసోడ్ రాజకీయ ప్రకంపలను రేపుతూనే ఉంది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభం రగులుతుండగా.. తాజాగా సినీ లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తమిళనాడులో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, ఈ అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కమల్ తాజాగా పేర్కొన్నారు. అవినీతి కోటను ముట్టడించాలంటూ తన అభిమానులకు ఆయన పిలుపునివ్వడం గమనార్హం. ఈ పోరాటంలో తాను ముందుంటానని, ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే రాజకీయ వ్యాఖ్యలతో కమల్ హాసన్ తమిళనాట గగ్గోలురేపుతున్న సంగతి తెలిసిందే. గతంలో అధికార అన్నాడీఎంకేపై విరుచుకుపడిన ఆయన ఇప్పుడు అన్నాడీఎంకేతోపాటు, ప్రతిపక్ష డీఎంకేపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు మరో సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే కమల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. -
లోక నాయకుడి సంచలన వ్యాఖ్యలు
-
కమల్ కు ఖుష్బూ మద్ధతు
పెరంబూరు: అదే మాటమీద నిలబడండి మీకు నేను ఉన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ నటుడు కమలహాసన్ కు మద్దతు పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామితో సహా మంత్రి జగదీశ్‌కుమార్ తదితరులు కమల్‌పై ప్రతి విమర్శల దాడికి దిగుతున్నారు. కాగా ఇదంతా ఒక కంట కనిపెడుతున్న కుష్బూ సోమవారం సోషల్ మీడియా ద్వారా కమలహాసన్ ను ఉద్దేశించి పేర్కొంటూ మీరు ఇదే మాటపై నిలబడండి. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. రాజకీయాల్లో రెక్కలు విరిగిన కొందరు మీ మీద సవారీ చేసి ప్రచారం పొందాలనుకుంటున్నారు. మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉండండి. మంచి మార్పు కోసం మీ పోరాటం కొనసాగాలి. మీకు నేను ఉన్నాను అంటూ మద్ధతు పలికారు. -
మంత్రులకు నేనొక్కడిని చాలు: కమల్‌హాసన్
చెన్నై: ‘రాష్ట్రాన్ని కాపాడటానికే మీ అవసరం కావలసి వస్తుంది. మంత్రులకు బదులివ్వడానికి నేను చాలు..’ అని నటుడు కమల్‌హాసన్ తన అభిమానులకు హితవు పలికారు. తమిళనాడులో ప్రస్తుతం కమల్‌హాసన్‌కు రాష్ట్ర మంత్రులకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. కమల్ మంత్రులపై అవినీతి ఆరోపణలు చేయడంతో వారి మధ్య వార్‌కు తెరలేచింది. అవినీతికి ఆధారాలుంటే బయట పెట్టాలన్న మంత్రుల డిమాండ్‌తో కమల్‌హాసన్ శాఖల వారీగా అవినీతిపై ఆధారాలు సేకరించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాలలో కమల్‌హాసన్ అభిమానులు మంత్రులపై మాటల దాడి చేస్తూ పోస్టర్లను అంటించారు. ఈ చర్యలకు స్పందించిన నటుడు కమల్‌హాసన్ పోస్టర్లు ముద్రిస్తూ డబ్బును వృధా చేయవద్దనీ, ఆ డబ్బును సహాయకార్యక్రమాలను ఉపయోగిస్తే మంచిదనీ హితవు పలికారు. రాష్ట్రాన్ని కాపాడటానికే మీ అవసరం ఉంటుందనీ, ఇలాంటి మంత్రులకు బదులివ్వడానికి తాను చాలని కమల్ సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కమల్ హాసన్ సంచలన ట్వీట్
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు రాజకీయాల ఆసక్తిని సూచన ప్రాయంగా తెలియజేస్తుండగా.. తాజా గా ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన కవిత ఈ విషయాన్ని మరింత ధృవీకరిస్తోంది. తమిళంలో ఈ 11 లైన్ల ఓ పవర్ ఫుల్ కవితను కమల్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘ఇపుడు ఎవ్వరూ రాజుకాదు , విమర్శిద్దాం.. హృదయపూర్వకముగా ఉద్భవిద్దాం..మనం వాళ్లలాగా రాజులు కాము. ఓడిపోయినా..మరణించినా.. నేను తీవ్రవాదినే. నేను నిర్ణయించుకుంటే నేనే 'ముదుల్వార్' (నాయకుడు)ని..నేను బానిసను కాదు..లొంగి ఉండటానికి..కిరీటాన్ని వదిలినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు..శోధించకపోతే మార్గాలు కనిపించవు. కామ్రేడ్, నాతో పాటు రండి...అసంబద్ధతను బద్దలు గొట్టేవాడే నాయకుడిగా ఉంటారు. " ఇలా తమిళంలో ఆయన కవిత్వం సాగింది. ఇదే ఇపుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. గతవారం కమల్ బిగ్ బాస్ షో పై విలేకరుల సమావేశం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ శాఖలు అవినీతిమయంగా మారాయని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు న్యాయ శాఖమంత్రి షణ్ముగం వ్యాఖ్యలు, ఆర్థికమంత్రి డి.జయకుమార్ దమ్ముంటే రాజకీయాల్లో చేరాలని చేసిన సవాల్‌ను కమల్ సీరియస్‌గా తీసుకున్నారా? అనే చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి అభిప్రాయాలను వినిపించవచ్చన్న పన్నీర్ సెల్వం వ్యాఖ్యల ద్వారా అటు డీఎంకేనుంచి ఈ స్టార్ హీరో కు మద్దతు లభించడం విశేషం. కాగా ఇటీవలి కాలంలో కమల్ వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారనే అనుమానం రాక మానదు. ముఖ్యంతా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. புரியாதோர்க்கு ஆங்கில பத்திரிக்கைகளில் நாளை வரும் சேதி pic.twitter.com/yoFMD8jeJO — Kamal Haasan (@ikamalhaasan) July 18, 2017 -
మళ్లీ సెట్స్ మీదకు 'విశ్వరూపం 2'
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ చిత్రం విశ్వరూపం. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే సీక్వల్‌ను కూడా రెడీ చేశాడు. అయితే అదే సమయంలో విశ్వరూపం 2 చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటంతో విశ్వరూపం 2 ఆగిపోయింది. కొద్ది పాటి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. చాలా రోజులు ఈ సినిమాను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కమల్ ఫైనల్‌గా ఆస్కార్ రవిచంద్రన్ నుంచి విశ్వరూపం 2 సినిమాను తీసేసుకున్నాడు. త్వరలోనే తన సొంతం నిర్మాత సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసిన కమల్, త్వరలో పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఆ భాగాన్ని చెన్నైలోని మిలటరీ ఆఫీసర్స్ అకాడమీలో షూట్ చేసేందుకు నిర్ణయించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కమల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శభాష్ నాయుడు సినిమా కూడా సెట్స్ మీదే ఉంది. -
కమల్‌హాసన్ ముస్లిమా..? అసలు పేరు..
హీరో కమల్‌హాసన్ ముస్లిమా?. కాదు. కానీ, ఆదివారం ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్‌లో లెజండరీ హీరో హిందూ వ్యతిరేక కామెంట్లు చేశారని, ఆయన ఇస్లాంను నమ్ముతారని కాలమిస్టు ఆరోపించారు. కాలమ్ వివాదాస్పదంగా మారడంతో ఆన్లైన్ వెర్షన్ లోని కాలమ్ నుంచి వివాదాస్పద పేరాగ్రాఫ్‌ను తొలగించారు. కమల్ తన మతాన్ని మరచి హిందూ, ముస్లింల మధ్య భేదాలను పొడసూపేలా ప్రవర్తిస్తున్నారని కాలమిస్టు తొలగించిన పేరాగ్రాఫ్‌లో వ్యాఖ్యానించారు. ఆయన మతానికి చెందిన వాళ్లే మహిళను అవమానించారనే విషయాన్ని మరిచిపోయి ఓ ముస్లింలా మాట్లాడుతున్నారని అన్నారు. మహాభారతం లాంటి వాటిపై కామెంట్లు చేయడం కన్నా.. సమకాలీన సమస్యలైన త్రిపుల్ తలాక్ లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మతాలపై మాట్లాడటప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. అసలు కాలమిస్టు కమల్‌ను ఓ ఇస్లామిస్టుగా పేర్కొనడానికి కారణం.. ఆయన మహాభారతాన్ని ఉద్దేశించి చేసిన ఓ కామెంట్. కొద్ది రోజుల కిందట కమల్ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చారు. రెండు కుటుంబాల గొడవల్లో ఓ మహిళను పెట్టి జూదం ఆడిన వాళ్ల పండుగను దేశంలో ఎందుకు జరుపుకుంటారో తనకు అర్ధం కాదని అన్నారు. కమల్ అసలు పేరు ఇది.. తాను దేవుడిని నమ్మనని కమలే చెప్పారు. కమల్ 1952లో తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని పల్లవుల కాలానికి చెందిన ఓ గుడిలో 'పార్ధసారధి' అని తల్లిదండ్రలు నామకరణం చేశారు. కొద్దికాలం తర్వాత తండ్రి శ్రీనివాసన్ పార్ధసారధి పేరును కమల్‌హాసన్‌గా మార్చారు. అయితే, కమల్‌హాసన్ అని పేరును మార్చడం వెనుక కొన్ని ఇతర కారణాలున్నాయని గతంలో ఆన్లైన్లో న్యూస్ హాల్చల్ చేసింది. యాకూబ్ హసన్ అనే తన ఫ్రెండ్ గుర్తుగా శ్రీనివాసన్ కమల్‌కు కమల్‌హాసన్ అని పేరు పెట్టారని దీని సారాంశం. ఈ వార్తలను అప్పట్లో కమల్ ఖండించారు. కమల్ అంటే పద్మం అని, హాసన్ అనే పదం హాస్యం నుంచి వచ్చిందని చెప్పారు. కాగా, జాతీయ దినపత్రికలో వచ్చిన కాలమ్ దేశంలో పెచ్చరిల్లుతున్న మత ఆపాదనలను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా స్వేచ్చగా మాట్లాడే హక్కును ఇది హరిస్తుంది. -
‘కమల్ ఓ బోన్‌లెస్.. స్వామి బాగా రూడ్’
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఉండేది చెన్నైలోనే. వారి ఇళ్ల మధ్య దూరం మూడు కిలో మీటర్లే. కానీ, ఇప్పుడు మాత్రం వారి మధ్య వైరుధ్యాలు పక్కపక్కనే కలిసి ముందుకెళుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాల పుణ్యమా అని వారిద్దరి మధ్య వర్డ్ష్ వార్(మాటల యుద్ధం) నడుస్తోంది. కమల్‌ను తక్కువ చేస్తూ స్వామి ట్వీట్ చేసిన క్షణంలోనే కమల్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. దాదాపు పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న తీరుగా వీరి వ్యవహారం ట్విట్టర్లో దర్శనం ఇస్తోంది. అసలు వీరిద్దరి మధ్య గొడవెలా వచ్చిందంటే ఓ ట్విట్టర్ ఖాతాదారుడు సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నిస్తూ కమల్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాన్ని బీజేపీ ఆహ్వానిస్తుందా అని అడగగా బీజేపీ సంగతి తెలియదుగానీ, తాను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పారు. బోన్‌లెస్ వండర్, డంబాలకు పోయే ఇడియట్ కమల్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆగ్రహించిన కమల్ వెంటనే బదులు ట్వీట్ చేశారు. తనకు ఒక అంశంపై మొండిగా పోరాడే తత్వం ఉందని, అది మాత్రం చాలు. సంతోషం.. సుబ్రహ్మణ్యస్వామి తమిళులను ఎలా పిలుస్తారో ఆయనకు తెలుసు. నేనెప్పుడు ఆయనను వ్యతిరేకించను.. ప్రజలే ఆ పనిచేస్తారు. స్వామి ఓ కరడు వ్యక్తిత్వం ఉన్నవ్యక్తి. ఆయనకు నేను బదులచెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ కమల్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
లైకా ఖాతాలో విశ్వరూపం-2 ?
విశ్వరూపం-2 చిత్రం లైకా ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది. విశ్వనటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం-2. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సమస్యలనెదుర్కొంటున్న కారణంగా విశ్వరూపం-2 చిత్రం విడుదల అయోమయంగా మారింది. కమలహాసన్ తాజాగా శభాష్‌నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ అమెరికా వెళ్లిన తరువాత ఆయన అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతలను కమలే నిర్వహించాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ చిత్ర షూటింగ్‌ను 50 శాతం పూర్తి చేసి చెన్నైకి తిరిగి వచ్చారు కమల్. కాగా తదిపరి షెడ్యూల్‌ను విశాఖపట్టణంలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుండగా కమలహాసన్ అనూహ్యంగా విపత్తుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో శభాష్‌నాయుడు చిత్ర విడుదల తేదీన విశ్వరూపం-2 చిత్రాన్ని విడుదల చేయాలని కమల్ నిర్ణయించినట్లు సమాచారం. ఆస్కార్ ఫిలింకు చిత్ర నిర్మాణ ఖర్చులను చెల్లించి ఈ చిత్రాన్ని ఆయన లైకా సంస్థతో కలిసి తెరపైకి తీసుకురావడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే విశ్వరూపం-2 చిత్రాన్ని లైకా విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఆస్కార్ ఫిలింస్ అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కోట్లలో మోసం..? చిక్కుల్లో రజనీ, కమల్ చిత్రాలు!
చెన్నై: తమిళ సినీ రంగంలో దిగ్గజాలతో సినిమాలను నిర్మిస్తున్న లైకా సంస్థ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తమిళ పత్రికల్లో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్ పోలీసులు ఆ సంస్థకు చెందిన ప్రధాన నిర్వాహకుడి సహా మొత్తం 19 మందిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తపాలాశాఖ ద్వారా కోట్లాది రూపాయలను లైకా సంస్థ రహస్య చిరునామాలకు పంపిందనీ, ఆ డబ్బును అక్కడి నుంచి జర్మనీకి తరలించే ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఈ విషయంపై యూరప్ దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కు చెందిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, లైకా సంస్థ గతంలో శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాలను నడుపుతున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంది. సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్, ఫ్రాన్స్ లలో సిమ్ కార్డుల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కార్యాలయాలను కలిగివుంది. సినీరంగంలో నిర్మాణ సంస్థగా అడుగుపెట్టిన లైకా.. విజయ్ తో కత్తి చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత రజనీకాంత్ తో 2.0, కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాలకు నిర్మాణసంస్థగా వ్యవహరిస్తోంది. విదేశాలకు అక్రమంగా రూ.129 కోట్లను తరలించారని, ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్ పోలీసులు సంస్థ ప్రధాన నిర్వహకుడిని అరెస్టు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న రజనీ, కమల్ ల చిత్రాల నిర్మాణం చిక్కుల్లో పడతాయేమోనని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, లైకా ఈ వార్తలను ఖండించింది. తమ సంస్థ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ప్రకటన వెలువరించింది. సంస్థపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
త్వరలో భారతీయుడు సీక్వెల్
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారతీయుడు. దేశంలో లంచం వల్ల జరుగుతున్న అన్యాయాలపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసే పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ మేకప్‌తో పాటు, ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అందుకే భారతీయుడు రిలీజ్ అయినప్పటి నుంచే ఆ సినిమా సీక్వెల్‌పై చర్చ మొదలైంది. అప్పట్లో భారతీయుడు సినిమాను నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూర్య మూవీస్ ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచన చేస్తోంది. కమల్ హాసన్, శంకర్ కూడా భారతీయుడు సీక్వెల్‌ను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తుండటంతో త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చనుందన్న టాక్ వినిపిస్తోంది. సూర్య మూవీస్ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. తొలి భాగం చివర్లో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు మళ్లీ తన దేశానికి నా అవసరం ఉన్నప్పుడు తిరిగి వస్తానంటూ మాట ఇస్తాడు. అదే లైన్ తీసుకొని సీక్వెల్‌ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో మాత్రం వెల్లడించలేదు.