
కౌలాలంపూర్‌లో హెలికాప్టర్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న కమల్‌హాసన్, రజనీకాంత్
తమిళసినిమా(చెన్నై): మలేసియాలో కోలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్స్ క్రికెట్ పోటీ, ఆటపాటలతో సందడి చేశారు.మలేసియాలోని బూకీజాలీ స్టేడియంలో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ సహా దాదాపు 340 మంది నటీనటులు పాల్గొన్నారు. తొలుత క్రికెట్‌తో, అనంతరం పలు సినీ, సాంస్కృతిక కార్యక్రమాలతో మలేసియా ప్రేక్షకులను కోలీవుడ్ స్టార్స్ అలరించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం మలేసియా చేరుకున్న తమిళ నటులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మలేసియా ప్రధాని అబ్దుల్ రజాక్ రజనీకాంత్‌ను కలసి అభినందించారు.