
సాక్షి, చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త కోట్లాది మంది అభిమానులనే కాకుండా సినీ నటులను షాక్‌కు గురుచేసింది. తాజాగా నటి శోభన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎస్పీబీని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి తాను నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేశారు. 'ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేసేందుకు వెతుకుతుండగా ఆయన లేరనే విషయన్ని నమ్మలేకపోతున్నానని... అలాంటి వ్యక్తి స్థానాన్ని మరెవరూ పూడ్చలేరని' ఆమె భావోగ్వేదంతో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 25న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. చెన్నై శివారు ప్రాంతం తామరపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్ వద్ద అంతిమ కార్యక్రమం జరిగింది. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి)
Comments
Please login to add a commentAdd a comment