‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Indian 2 First Look Out | Sakshi
Sakshi News home page

‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

Published Tue, Jan 15 2019 11:37 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

Indian 2 First Look Out - Sakshi

కమల్‌ హాసన్‌ అభిమానులు ఇప్పుడు కాస్తా ఊరటగా ఫీలవుతున్నారు. కారణం ఏంటంటే కమల హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు శంకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. వీటి గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికి సినిమా ఆగిపోతుందేమోనని అభిమానులు కలవర పడిన మాట వాస్తం. వారి ఆందోళన తగ్గిస్తూ.. అనుమానాలను నివృత్తి చేస్తూ ‘భారతీయుడు 2’ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు  శంకర్‌. దాంతో పాటు అభిమానులకు సంక్రాంతి శుభకాంక్షలు కూడా తెలియజేశారు‌‌.

‘భారతీయుడు 2’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌తో సంక్రాంతి సంబరాలు రెట్టింపయ్యయంటున్నారు అభిమానులు. ఈ పోస్టర్‌లో కమల్‌ ‘భారతీయుడు’ సిగ్నేచర్‌ మూవ్‌మెంట్‌ మర్మకళను ప్రదర్శిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కమల్‌‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. అనిరుధ్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement