కాస్త వినిపించుకోండి! | Raai Laxmi clarifies about participating in Bigg Boss Tamil Season 2 | Sakshi
Sakshi News home page

కాస్త వినిపించుకోండి!

Published Sun, Jun 10 2018 1:52 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

Raai Laxmi clarifies about participating in Bigg Boss Tamil Season 2 - Sakshi

అబ్బా.. ఎన్నిసార్లు  చెప్పినా మళ్లీ అదే పదే పదే చెప్తున్నారు అని హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ చిరాకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కమల్‌హాసన్‌ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌లో రాయ్‌లక్ష్మీ ఒక పార్టిస్పెంట్‌ అంటూ కోలీవుడ్‌ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఆమె సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘‘చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి అలసిపోయాను. కాస్త విని పించుకోండి. తమిళ బిగ్‌బాస్‌ సెకండ్‌ షోలో నేను పార్టిస్పేట్‌ చేయడం లేదు. అనవసరంగా నా పేరును గెస్‌ చేస్తూ అమాయకులైన వీక్షకులను కొందరు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని కాస్త షూటుగానే రెస్పాండ్‌ అయ్యారు రాయ్‌లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు ప్రాజెక్ట్‌లు రాయ్‌లక్ష్మీ చేతిలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement