Ray Laksmi
-
బోర్ కొట్టేసింది
‘‘ఒకే పనిని అదే పనిగా చేస్తే? బోర్ కొడుతుంది... కచ్చితంగా బోర్ కొడుతుంది. అది ఏ ఫీల్డ్‌లో అయినా సరే. కొత్తదన ం లేనప్పుడు పని రొటీన్ అయిపోతుంది. చేసే పనిలో కిక్కుండదు. నాక్కూడా నేను చేసిన పని బోర్ కొట్టేసింది’’ అంటున్నారు రాయ్‌లక్ష్మీ. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఆ మధ్య అన్నీ ఒకేలాంటి పాత్రలు, సినిమాలు చేశాను. దాంతో బోర్ అనిపించింది. చేసే ఏ పనైనా కొత్తగా ఉంటే నూతనోత్సాహం వస్తుంది. అందుకే నేను చేసిన తప్పులను సరిద్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు, పాత్రలు ఎంచుకుంటున్నాను. తమిళంలో ‘నీయా’ అనే సినిమా చేస్తున్నా. అది పాములకు సంబంధించిన చిత్రం. ‘సిండ్రిల్లా’ అనే హారర్ ఎంటర్టైనర్తో పాటు ‘మిరుగా’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా. ఇందులో విధవరాలిగా చేస్తున్నాను. ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’లోనూ మంచి పాత్ర చేస్తున్నాను. ఇలా డిఫరెంట్ జానర్ సినిమాలు చేస్తుంటే నా పని నాకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
కాస్త వినిపించుకోండి!
అబ్బా.. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే పదే పదే చెప్తున్నారు అని హీరోయిన్ రాయ్‌లక్ష్మీ చిరాకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కమల్‌హాసన్ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్‌బాస్ సెకండ్ సీజన్లో రాయ్‌లక్ష్మీ ఒక పార్టిస్పెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి అలసిపోయాను. కాస్త విని పించుకోండి. తమిళ బిగ్‌బాస్ సెకండ్ షోలో నేను పార్టిస్పేట్ చేయడం లేదు. అనవసరంగా నా పేరును గెస్ చేస్తూ అమాయకులైన వీక్షకులను కొందరు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని కాస్త షూటుగానే రెస్పాండ్ అయ్యారు రాయ్‌లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు ప్రాజెక్ట్‌లు రాయ్‌లక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
రెచ్చిపోతున్న రాయ్‌లక్ష్మి
నటి రాయ్‌లక్ష్మి గ్లామర్ అంతు చూడాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ఆ విధంగా గ్లామర్‌నే సిగ్గుపడేలా దుస్తులు ధరించి వేదికలెక్కెస్తున్నారు. కళ్లార్పకుండా చూడడం చూపరులపనవుతోంది. తమిళంలోనే పలు చిత్రాల్లో గ్లామరస్‌గా నటించి దుమ్మురేపిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్లో మరింతగా రెచ్చిపోతున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ ఒక రౌండ్ కొట్టిన రాయ్‌లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. కబాలి హీరోయిరెచిపోతున్ రాధికాఆప్తే ఇటీవల ఒక ఆంగ్ల చిత్రం కోసం నటించిన టాప్‌లెస్ దుస్తుల సన్నివేశాలు ఇంటర్నెట్లో కలకలం పుట్టించిన విషయం తెలిసిందే. ఇక నటి కాజల్‌అగర్వాల్, శ్రుతిహాసన్ టాప్‌లెస్ దుస్తులతో సినిమాల్లో నటించకపోయినా, ఆ తరహా దుస్తులతో ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు ఫోజులిచ్చి సంచలనం కలిగించారు. ఇప్పుడు వాళ్ల వరుసలో నటి రాయ్‌లక్ష్మి చేరారు. హిందీ చిత్రం జూలీ-2 లో ఇప్పటికే టూ పీస్, ఈత దుస్తుల్లో నటించి బాలీవుడ్ పరిశ్రమ వర్గాల దృష్టిని తనపై తిప్పుకునే ప్రయత్నం చేసిన ఈ సంచలన నటి ఇటీవల టాప్‌లెస్ దుస్తులు ధరించి సినిమా కార్యక్రమంలో పాల్గొని హల్చల్ చేశారు. బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, దీపికాపదుకొనే లాంటి వారు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉంటే, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ రంగప్రవేశం చేయాలన్న తన కోరిక నె రవేరడంతో రాయ్‌లక్ష్మి అక్కడి సినీ వర్గాలను ఆకర్షించి బాలీవుడ్లోనే సెటిల్ అవ్వాలన్న ఆలోచినలో భాగంగానే గ్లామర్ అంతు చూసే ప్రయత్నంలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.