participate
-
క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు. -
CSK స్టార్స్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా.. ఎక్కడ మొదలయ్యాయో తెలుసా?
ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది. అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో బానిసలకు, మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పటి నుంచే ఉండేది.ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి రెండు శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే నాలుగు ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి.క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి ఒలింపిక్ క్రీడల వైభవం తగ్గుముఖం పట్టింది. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ హయాంలో క్రీస్తుశకం 393లో చివరిసారిగా ఒలింపిక్ క్రీడలు జరిగినట్లు చరిత్రలో నమోదైంది. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు అదే పరిసమాప్తిగా భావించవచ్చు.గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా, ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొల్లగొట్టాడు. అక్కడ కొల్లగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి, క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు.రోమన్ చక్రవర్తి నీరో హయాంలో ఒలింపిక్ క్రీడలు అభాసుపాలయ్యాయి. పిచ్చిమారాజుల్లో ఒకడిగా పేరుమోసిన నీరో రథాల పందేల్లో తొండి ఆటలాడి తనను తానే విజేతగా ప్రకటించుకునేవాడు. తనను తాను మహా సంగీత విద్వాంసుడిగా భావించే నీరో చక్రవర్తి క్రీస్తుశకం 67లో తొలిసారిగా ఒలింపిక్స్‌లో గాత్ర, వాద్య సంగీత పోటీలను కూడా ప్రవేశపెట్టాడు.రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్‌కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ ఆంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి, క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు.ఇవి చదవండి: యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ -
Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్‌పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్‌ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్‌లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్‌భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్‌పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్‌పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్‌లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్‌లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్‌లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె ఈ మ్యాచ్‌లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్‌పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్‌పై వినేశ్‌ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమె టాప్ సీడ్‌గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్‌కి ఇచ్చిన యూనిఫామ్‌ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్‌లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్‌పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్‌లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్‌ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
‘మేడారం’ జాతరకూ మహిళలకు ఫ్రీ బస్సు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహాజాతరపై మరో మంత్రి కొండా సురేఖతో కలిసి బుధవారం ఉన్నత స్థాయిలో సమీక్షించారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో జాతరను విజయవంతం చేయాలన్నారు. అభివృద్ధి పను ల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లకు వంతపాడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాజాతర అంటే ఎన్ని సౌకర్యాలు కల్పించినా, అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. వాటిని తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒక్కటే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని, సోనియాగాంధీ ఇచి్చన తెలంగాణ రాష్ట్రంలో జరిగే మహాజాతరకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీతక్క వివరించారు. జాతరను విజయవంతం చేస్తాం: మంత్రి కొండా సురేఖ మహాజాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో మంత్రి సీతక్కతో కలిసి పనిచేస్తానని మంత్రి సురేఖ అన్నారు. వరంగల్ ఆడబిడ్డలుగా జాతరలో పనిచేయడం తమ అదృష్టమన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృదిŠధ్ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజాధనం దుర్వింనియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50కోట్లతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో యాదాద్రిలో అభివృద్ధి పేరిట మూల విరాట్‌ను కదిలించి యాదాద్రిని నిర్మించారని, అది శాస్త్రీయంగా తప్పిదమని తెలిపారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10 గదులతో అతిథి గృహనిర్మాణం చేపడుతుందని, వచ్చే మినీ జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, అడిషనల్ ఎస్పీ సదానందం, అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ పీఓఅంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, ఓఎస్డీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొదలైన భక్తుల సందడి మేడారం జాతరకు నెల రోజుముందుగానే భక్తుల తాకిడి మొదలైంది. సంక్రాంతి సెలవుల చివరి రోజు కావడంతో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం, చీర, సారె, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించారు. -
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. -
Live: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలు
-
పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం
-
కాస్త వినిపించుకోండి!
అబ్బా.. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ అదే పదే పదే చెప్తున్నారు అని హీరోయిన్ రాయ్‌లక్ష్మీ చిరాకు పడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కమల్‌హాసన్ హోస్ట్‌గా చేస్తోన్న తమిళ బిగ్‌బాస్ సెకండ్ సీజన్లో రాయ్‌లక్ష్మీ ఒక పార్టిస్పెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి అలసిపోయాను. కాస్త విని పించుకోండి. తమిళ బిగ్‌బాస్ సెకండ్ షోలో నేను పార్టిస్పేట్ చేయడం లేదు. అనవసరంగా నా పేరును గెస్ చేస్తూ అమాయకులైన వీక్షకులను కొందరు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని కాస్త షూటుగానే రెస్పాండ్ అయ్యారు రాయ్‌లక్ష్మీ. ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో రెండు ప్రాజెక్ట్‌లు రాయ్‌లక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
IEA సదస్సులో రాష్ట్రపతి
-
పేదలకు పూర్తిగా వైద్య సేవలు అందించాలి
-
విశాఖ జిల్లాలో జోరుగా గడపగడపకూ YSR
-
బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న మంత్రి నాయిని
-
'ఆధ్యాత్మిక చింతన కోసమే వినాయక ఉత్సవాలు'
-
రైతు క్లబ్లో భాగస్వాములు కావాలి
నూతనకల్ అన్నదాతలు రైతుక్లబ్లో భాగస్వాములై ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సిరి స్వచ్ఛంధ సేవా సంస్థ జిల్లా అధికార ప్రతినిధి రాజేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు ఏర్పాటు చేసుకున్న రైతు క్లబ్‌ల ద్వారా ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో సిరి స్వచ్ఛంద సేవా సంస్థ నియోజకవర్గ కోఆర్డినేటర్ చామకూరి శరత్, రైతులు బాణాల సత్యనారాయణరెడ్డి, తొట్ల శ్రీను, ఎర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఆదిరెడ్డి, ఎల్లయ్య, మల్లయ్య పాల్గొన్నారు. -
నేడు పుష్కరాలకు వైఎస్ జగన్
-
హరితహారంలో భాగస్వామ్యం కావాలి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఎల్లారెడ్డిపేటలో మొక్కలు నాటిన కలెక్టర్ ఎల్లారెడ్డిపేట : హరితహారం ద్వారా మండలంలో 40 లక్షల మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మండలంలోని దేవునిగుట్ట, చింతకుంటతండాల్లో కలెక్టర్ మొక్కలు నాటారు. పీఎల్డీపీ పథకం ద్వారా ఒడ్డెర కులస్తులకు కేటాయించిన 32 ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకానికి అవసరమైన బోరుమోటార్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఒడ్డెర కులస్తులకు కేటాయించిన భూమిలో పండ్లతోటలు పెంచుకుని జీవనోపాధి పొందాలన్నారు. రూ.6లక్షలతో నాలుగు బోర్లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను బిగించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, సర్పంచ్ నాజీం, ఎంపీటీసీ పెంటయ్య, తహశీల్దార్ పవన్‌కుమార్, ఎంపీడీవో చిరంజీవి, ఎంఈవో రాజయ్య, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ కొండ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. చెరువు భూములను కబ్జాచేస్తే చర్యలు చెరువులను అన్యక్రాంతం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రాచర్లగొల్లపల్లిలోని గోదుమకుంట చెరువు భూములను కొందరు కబ్జా చేసి పంటలు సాగుచేస్తున్నార ని రైతులు, యువకులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువులను అన్యక్రాంతం చేసేవాళ్లపై క్షేత్రస్థాయిలో విచారణచేసి తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు భూములను కాపాడాలని తహశీల్దార్ పవన్‌కుమార్, వీఆర్వో శ్రీనివాస్‌ను ఆదేశించారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే
కేతేపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. గురువారం కేతేపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, వివిధ గ్రామాల సర్పంచులు కె.వెంకటరమణ, వి.రాము, కె.లింగయ్య, బి.కవితనరేందర్, నాయకులు బి.శ్రీనివాస్‌యాదవ్ కె.మహేందర్‌రెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, బి.దయాకర్‌రెడ్డి, బి.రామక్రిష్ణ, బి.నరేందర్, ఎ.వెంకట్‌గౌడ్, కె.మహేష్, కీర్తి వెంకన్న, కె.వీరన్న, టి.సాగర్, జె.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి
అశ్వాపురం: హరితహారం పథకంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై మొక్కలు నాటాలని మణుగూరు క్లస్టర్ సీనియర్ హెల్త్ ఆఫీసర్ వీరబాబు, జెడ్పీటీసీ తోకల లత, తహసీల్దార్ కుసుమ, ఎంపీడీఓ శ్రీదేవి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బాణోత్ శారద, ఎంపీటీసీ ఇస్లావత్ నాగ, పీహెచ్ఎన్ కాంతమ్మ, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పీహెచ్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో పాల్గొన్న గవర్నర్
-
నాసా పోటీల్లో భారత 'స్క్రూ డ్రైవర్స్'
హ్యూస్టన్ః అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ (నాసా) ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక పోటీల్లో భారత విద్యార్థులు పాల్గొన్నారు. ముంబై లోని ముఖేశ్ పటేల్ సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న 13 మంది విద్యార్థుల బృందం పోటీకి ఎంపికైంది. ప్రపంచంలోని మొత్తం 40 బృందాలతో ముంబై 'స్క్రూ డ్రైవర్స్' టీమ్ తలపడుతోంది. హ్యూస్టన్ లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు.. మారుమూల ప్రాంతాలనుంచి సందేశాలను అందుకొనే సామర్థ్యం గలవాహనాలను రూపొందిస్తున్నారు. వాహనాలను తయారు చేసేందుకు వ్యర్థాలను వినియోగిస్తున్నారు. -
ప్రెస్‌క్లబ్ క్రికెట్ టోర్నమెంట్లో సాక్షి టీవీ బోణీ
-
తలపాగాతో యువతుల రికార్డులు!!
-
'అవసరమైతే లాఠీ పడతారు, లేకుంటే సేవ చేస్తారు'
హైదరాబాద్: పోలీసులు అవసరమైతే లాఠీలు పడతారని, లేకుంటే ప్రజా సేవ చేస్తారని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మధ్యలోనే ఆగిపోయిందని చెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు అధికారులు పాల్గొంటున్నారు. -
సంక్రాంతి ఉత్సవాల్లో విదేశియులు
-
క్రిస్మస్ వేడుకలలో మంత్రి ఈటెల
-
చీపురు చేతపట్టిన న్యాయమూర్తులు
-
స్వచ్ఛ భారత్ కోసం అందరూ కృషి చేయాలి
తిరుపతి: భారతదేశ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అప్పుడే యువతకు దేశ చరిత్రపై అవగాహన ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. లేకుంటే యువత శ్రమ వృథా అవుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు. -
సర్వేలో అందరూ పాల్గొనాలి : సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించ తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను ప్రజలంతా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రజలంతా తమ ఇళ్ల వద్దకు వచ్చే అధికారులకు సరైన సమాచారం ఇవ్వాలని ఆయున విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి, ఏ కుటుంబంలోని ఏ వ్యక్తి ఏమి కోరుకుంటున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలియడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.ఈ మేరకు సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నార్సింగి ఫాంహౌస్‌లో కేసీఆర్: కేసీఆర్ సోవువారం వుధ్యాహ్నం కొందరు సన్నిహితులైన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో ఉన్న ఒక ఫాంహౌస్‌కు వెళ్లారు. వుంగళవారం జరగనున్న సమగ్ర ఇంటింటి సర్వే, సింగపూర్ పర్యటన నేపథ్యంలో వారు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. వుుఖ్యంగా కేబినెట్ విస్తరణ, మెదక్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఎంపిక, రాష్ట్ర కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం వంటివాటిపై చర్చలు జరిపినట్టు సమాచారం. -
సమగ్ర సర్వేలో పాల్గొననున్న కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మంగళవారం జరిగే సమగ్ర సర్వే కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తన కుటుంబ వివరాలు అందజేయనున్నారు. ఇదిలావుండగా, సమగ్ర కుటుంబ సర్వేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
రాష్ట్రం నలు మూలల నుంచి హైదరాబాద్ కు సమైక్యవాదులు
-
మహిళభేరిలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన
-
ప్రభుత్వ భూములు పరిరక్షించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియలో మండలాధికారులంతా పాల్గొనాలని, భూము ల పరిరక్షణకు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాక్రాంతమైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవో నంబర్ 571 ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రొఫార్మాలో సంబందింత శాఖ సెక్రటరీ ద్వారా దరఖాస్తు ఇవ్వాలన్నారు. రూ.50 లక్షల లోపు భూమిని కలెక్టర్ ఇస్తారని, అంతకంటే ఎక్కువ ధర ఉంటే సీసీఎల్ఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తించామని, వీటిలో భద్రాచలం డివిజన్లో ఎనిమిది మండలాలు, పాల్వంచ డివిజన్ ఆరు మండలాలు ఉన్నాయని తెలిపారు. వరదలతో నష్టపోయిన ఒక్కో భాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 20 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్ అందించినట్లు తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందకు చర్యలు తీసుకుంటామన్నారు. వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యాక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మలేరియా అధికారిని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. వరదనష్టాన్ని గుర్తించి, సహాయక కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా డీఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్, డీఆర్డీఏ పీడీ పద్మాజారాణి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కిరణ్,బొత్సలకు తప్పని సెగ