
రైతు క్లబ్‌లో భాగస్వాములు కావాలి
నూతనకల్
అన్నదాతలు రైతుక్లబ్‌లో భాగస్వాములై ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సిరి స్వచ్ఛంధ సేవా సంస్థ జిల్లా అధికార ప్రతినిధి రాజేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు ఏర్పాటు చేసుకున్న రైతు క్లబ్‌ల ద్వారా ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో సిరి స్వచ్ఛంద సేవా సంస్థ నియోజకవర్గ కోఆర్డినేటర్ చామకూరి శరత్, రైతులు బాణాల సత్యనారాయణరెడ్డి, తొట్ల శ్రీను, ఎర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఆదిరెడ్డి, ఎల్లయ్య, మల్లయ్య పాల్గొన్నారు.