క్వాలిఫయర్‌తో జొకోవిచ్‌ తొలి పోరు | Serbian Star Tennis Player Novak Djokovic Participate In Grand Slam Tournament, See Details Inside | Sakshi
Sakshi News home page

క్వాలిఫయర్‌తో జొకోవిచ్‌ తొలి పోరు

Published Fri, Aug 23 2024 1:59 PM | Last Updated on Fri, Aug 23 2024 2:45 PM

Serbian Star Tennis Player Novak Djokovic Participate In Grand Slam Tournament

న్యూయార్క్‌: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు యూఎస్‌ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్‌ తలపడతాడు. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్‌ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్‌లో అతనికి జర్మనీ ప్లేయర్‌ జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్‌ జోరు కొనసాగించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్‌ ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా) ఉండే అవకాశముంది.

సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఫైనల్లో టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)లతో జొకోవిచ్‌ ఆడే చాన్స్‌ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్‌ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ తొలి రౌండ్‌లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement