Tennis Player
-
ఇంటివాడైన నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి హిమాని మోర్తో రెండు రోజుల క్రితం నీరజ్ చోప్రా వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను జతచేస్తూ ‘జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను’ అని పోస్ట్ చేశాడు. హరియాణాకు చెందిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. అంతేకాకుండా 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2024 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం... 2018 జకార్తా, 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నీరజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నీరజ్ భార్య హిమాని మోర్ ప్రస్తుతం అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2012లో అండర్–14 జూనియర్ ఫెడ్ కప్‌లో భారత జట్టుకు ఆడిన హిమాని... 2017లో చైనీస్ తైపీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ పోటీపడింది. అఖిల భారత టెన్నిస్ సంఘం నిర్వహించిన టోర్నీలలో కూడా ఆడింది. 2018లో ఆమె సింగిల్స్‌లో అత్యుత్తమంగా 42వ ర్యాంక్‌లో, డబుల్స్‌లో 27వ ర్యాంక్‌లో నిలిచింది. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే మరోవైపు ఆమె ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని ఆమ్హెర్స్ట్ కాలేజీ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది
‘డ్రీమ్ బిగ్... అచీవ్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప కల కనాలి... ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. ఈ రెండు మాటలనూ ఒంట పట్టించుకుందా అమ్మాయి. తనకిష్టమైన టెన్నిస్ రాకెట్‌ని చేతిలోకి తీసుకుంది. టెన్నిస్‌ని ప్రేమిస్తోంది... టెన్నిసేప్రాణం అంటోంది... కానీ... ‘టాలెంట్ ఉంటేనే సరిపోతుందా’ అని పరిహసిస్తోంది రూపాయి. ప్రత్యర్థి మీద గెలవడం ఆమెకు ఏ మాత్రం చాలెంజ్ కాదు. ఆర్థిక పరిస్థితితో నిత్యపోరాటమే ఆమెను కుంగదీస్తోంది. తిరుపతికి చెందిన చందన పోతుగారి టెన్నిస్ ప్లేయర్. నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 30లో ఉంది. మనదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు మాత్రమే ఆడుతోంది. దేశం దాటి వెళ్లడానికి చేతిలో డబ్బు లేదు. ‘దేశంలో ఎక్కడికైనా సరే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లిపోతాను, విదేశాల్లో ఆడాలంటే విమానం టికెట్ కొనుక్కోలేను’ అంటున్నప్పుడు చందన కళ్లలో టెన్నిస్ ఆట పట్ల ప్రేమతోపాటు తన ఆర్థిక పరిస్థితి పట్ల నిస్సహాయత వ్యక్తమైంది. ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది. వెలుగు–చీకటి సామాన్య కుటుంబంలో పుట్టిన చందన ఎనిమిదేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. లెక్కకు మించిన విజయాలతో సాగిపోతోంది. ఆటలో రాణించాలంటే మెరుగైన శిక్షణ అవసరమని నాలుగేళ్ల కిందట కుటుంబం హైదరాబాద్‌కి వచ్చింది. గణేశ్ రామన్ టెన్నిస్ అకాడమీలో చేరింది. చందనలో ఆట పట్ల ఉన్న అంకితభావం, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోచ్ ఫీజు గురించి పట్టుపట్టకుండా దేశం మెచ్చే క్రీడాకారిణిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు.సరిగ్గా ఇక్కడే చందనకు కాలం కొత్త పరీక్షలు పెట్టింది. జీవితంలోకి వెలుగు–చీకటి ఒక్కసారిగా వచ్చినట్లయింది. ‘శిక్షణ కోసం నగరానికి వెళ్లడమేంటి, వయసు వచ్చిన ఆడపిల్ల తెలియని మనుషుల మధ్య మెలగడమేంటి’... అని బంధువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. వారి మాటలను పట్టించుకోలేదు, కానీ తండ్రి కూడా ‘ఇక ఆట చాలు, పెళ్లి చేస్తాను’ అనడంతో హతాశురాలైంది. ఆమె కన్నీళ్లు తల్లికి అర్థమయ్యాయి. కానీ తండ్రిని కరిగించలేకపోయాయి. కుటుంబం రెండయింది. తల్లి మునిలక్ష్మి ఒంటరిగా కూతురి బాధ్యత మోస్తోంది. దేశం తరఫున ఆడాలి! ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించి గెలవాలనేది నా లక్ష్యం’ అంటున్న చందన టోర్నమెంట్లో గెలిచినప్పుడు వచ్చిన డబ్బును బస చేసిన గదికి అద్దె చెల్లించేసి తిరుగు ప్రయాణానికి డబ్బులు లెక్క చూసుకుంటూ జనరల్ టికెట్ కొనుక్కుని ఇంటికి వస్తోంది. చందనకు కొత్త రాకెట్ కూడా లేదని, తోటి క్రీడాకారులిచ్చిన రాకెట్, దుస్తులు, షూస్‌తో టోర్నమెంట్‌కు వెళ్తున్నదని, టెన్నిస్ కోసం చందన పడుతున్న కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మునిలక్ష్మి. భగవంతుడి దయ వల్ల స్పాన్సర్స్ ముందుకు వస్తే రాకెట్లా దూసుకుపోతానని, దేశానికి మెడల్స్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది చందన. రాయలసీమ టోర్నీ నుంచి ఇంటర్నేషనల్ టోర్నీల వరకు నొవాక్ జొకోవిచ్, సెరీనా విలియమ్స్ తన రోల్ మోడల్స్ అంటున్న చందన అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్. అండర్ 12 ఏజ్ గ్రూప్‌లో రాయలసీమ టోర్నమెంట్ గెలిచింది. అండర్ 14లో చిత్తూరు, చెన్నై, పులివెందుల టైటిల్స్ సొంతం చేసుకుంది. చందన తొలి డబుల్స్ టైటిల్ కూడా పులివెందుల నుంచే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్స్‌లో నాలుగు సార్లు పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇంటర్నేషనల్ టోర్నీలు 15 ఆడింది. ఈ రైట్ హ్యాండెడ్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ డబుల్స్ (21), సింగిల్స్ (35), ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒన్ లాక్ రుపీస్ ఉమెన్స్ టోర్నమెంట్ సింగిల్స్‌లో 5 సార్లు విజేతగా, మరో 12 సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆరుదఫాలు డబుల్స్ ఫైనలిస్ట్. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా రాకెట్‌ని వదల్లేదు చందన. సరైన ఆహారం లేక కళ్లు తిరుగుతున్నా అలాగే టోర్నమెంట్ ఆడి, మజిల్ క్రాంప్తో కడుపు నొప్పితో బాధపడినప్పుడు కూడా ‘టెన్నిస్ అంటే నాకుప్రాణం’ ఆట కోసంప్రాణమైనా ఇస్తానన్నది చందన. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
నిశేష్ రెడ్డి ఖాతాలో తొలి ఏటీపీ టైటిల్
కాలిఫోరి్నయా: భారత సంతతికి చెందిన అమెరికా యువ టెన్నిస్ ప్లేయర్ నిశేష్ బసవ రెడ్డి తన కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టిబురోన్ ఓపెన్ ఏటీపీ–75 చాలెంజర్ టోరీ్నలో 19 ఏళ్ల నిశేష్ చాంపియన్‌గా అవతరించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నిశేష్ 6–1, 6–1తో అమెరికాకే చెందిన ఇలియట్ స్పిజిరిపై గెలుపొందాడు. విజేతగా నిలిచిన నిశే‹Ùకు 11,200 డాలర్ల (రూ. 9 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో నిశేష్ ఏడు స్థానాలు ఎగబాకి ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 192వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. -
అనిరుధ్‌కు రెండో టైటిల్
విలేనా (స్పెయిన్): హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. స్పెయిన్‌లో జరిగిన విలేనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోరీ్నలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో కలిసి అనిరుధ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అనిరు«ద్–నిక్కీ ద్వయం 7–6 (7/2), 6–4తో రొమైన్ అర్నియోదో (మొనాకో)–ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్–నిక్కీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. టైటిల్ గెలిచే క్రమంలో భారత జంట ఈ టోర్నీలో ఒక్క సెట్ మాత్రమే కోల్పోయింది. అనిరుధ్–నిక్కీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 26 ఏళ్ల అనిరుధ్ ఈ ఏడాది మనాకోర్ ఓపెన్, ఓల్‌రాస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి... ఓల్‌రాస్ ఓపెన్, విలేనా ఓపెన్లలో టైటిల్స్ సాధించాడు. -
టైటిల్ పోరుకు అనిరుధ్ జోడీ
విలేనా (స్పెయిన్): హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన విలేనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీ సెమీఫైనల్లో అనిరుద్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం 6–3, 7–6 (7/5)తో సెజార్ క్రెటు (రొమేనియా)–వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్–నిక్కీ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. 26 ఏళ్ల అనిరుధ్ ఈ ఏడాది మనాకోర్ ఓపెన్, ఓల్‌రాస్ ఓపెన్, క్వింపెర్ ఓపెన్ టోరీ్నలలో ఫైనల్‌కు చేరాడు. ఓల్‌రాస్ ఓపెన్‌లో టైటిల్ సాధించి, మిగితా రెండు టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు. -
డబ్బు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్
భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అతడు ఫీజును డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు నగాల్ కూడా దీన్ని తోసిపుచ్చలేదు. ‘స్టాండర్డ్ ప్రాక్టీస్’ కోసమే అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు కూడా!‘ఐటా’ విమర్శలుకాగా నగాల్ ఈ ఏడాది అదేపనిగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టైలకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఆడేందుకు నిరాకరించిన అతను ఇటీవల స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం సాకుతో దూరంగా ఉన్నాడు. అయితే చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడంపై ‘ఐటా’ బాహాటంగా విమర్శలు గుప్పించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సాకులు చెబుతున్న ఆటగాడు ఏటీపీ టోర్నీ ఆడేందుకు సై అంటున్నాడని నగాల్‌ను ఉద్దేశించి ‘ఐటా’ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లు కూడా డేవిస్ కప్ ఆడలేదు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడంతో భారత్ 0–4తో చిత్తుగా ఓడింది. రూ.45 లక్షలు అడిగాడుఈ నేపథ్యంలో.. ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ధూపర్ మాట్లాడుతూ ‘ఎవరైనా దేశానికి ఆడేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా చెప్పండి. సుమిత్ నగాల్ తనకు వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. చెల్లింపులు జరగలేదు కాబట్టే అతను ఆడటం లేదు.ఇదేం పద్ధతి. ఇది తప్పా ఒప్పా అనేది జాతి తెలుసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఆటగాళ్లకు ‘టాప్స్’ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు నిర్ణీత మొత్తం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి డేవిస్ కప్‌లో ఆడుతున్నందుకు పార్టిసిపేషన్ ఫీజుగా సుమారు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే చెల్లిస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ‘ఐటా’ వద్ద ఉంటున్నాయి’ అని వివరించారు. ఇదీ సుమిత్ వాదన... అందుకే ఫీజు అడిగాను‘ఐటా’ వ్యాఖ్యల్ని టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఖండించలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వాదన వినిపించాడు. ‘ఫీజు అడిగిన మాట వాస్తవమే. దీనిపై మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయి. నేను డిమాండ్ చేసిన పరిహారం కూడా ఆ కోవకే చెందుతుంది.స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే నేను డిమాండ్ చేశాను తప్ప... డబ్బులు గుంజాలనే ఉద్దేశం కాదు. దేశానికి ఆడటమనేది ఎవరికైనా గర్వకారణమే. అదో గొప్ప గౌరవం. అయితే నేను వెన్నునొప్పి వల్లే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేకపోయాను. ఇప్పుడు కూడా ఇదే సమస్య వల్ల చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాను’ అని వివరణ ఇచ్చాడు.చదవండి: చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం -
సాయికార్తీక్ ఖాతాలో ఏడో డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్లలో ఫైనల్ చేరి... రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్ రెడ్డి (భారత్)–బొగ్డాన్ బొబ్రోవ్ (రష్యా) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాయికార్తీక్–బొగ్డాన్ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్)–జాకుబ్ వోచిక్ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్ »ొగ్డాన్ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా సాయికార్తీక్ కెరీర్లో ఇది ఏడో డబుల్స్ టైటిల్‌కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్. 24 ఏళ్ల సాయికార్తీక్ 2023లో నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను, 2022లో రెండు డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్ మొత్తం 22 ఐటీఎఫ్ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్ గెలిచాడు. -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
Jannik Sinner: యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్ (ఫోటోలు)
-
క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తొలి పోరు
న్యూయార్క్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో జొకోవిచ్ తలపడతాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో ఆడుతున్న జొకోవిచ్ తొలి రౌండ్‌ను దాటితే రెండో రౌండ్లో అతనికి జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ లేదా లాస్లో జెరె (సెర్బియా) ఎదురవుతారు. జొకోవిచ్ జోరు కొనసాగించి క్వార్టర్ ఫైనల్ చేరితే అతనికి ప్రత్యర్థికి ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఉండే అవకాశముంది.సెమీఫైనల్లో నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)లతో జొకోవిచ్ ఆడే చాన్స్ ఉంది. మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు మెకంజీ మెక్‌డొనాల్డ్‌తో ఆడతాడు. -
సినెర్‌కు శిక్ష లేదా!
వాషింగ్టన్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)ని పెద్ద వివాదం చుట్టుముట్టింది. అతను రెండుసార్లు స్టెరాయిడ్ పరీక్షల్లో విఫలమైనా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఇతర ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. సినెర్‌ను పోటీల్లో ఇంకా ఎలా ఆడనిస్తున్నారని ప్రశ్నించిన వారు... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది మార్చిలో నిషేధిత అనబాలిక్ ఉ్రత్పేరకాన్ని తీసుకున్నందుకు రెండుసార్లు సినెర్ ‘పాజిటివ్’గా తేలాడు. అయితే మంగళవారం వరకు కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచారని, ఈనెల 26 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో అతడిని ఎలా అనుమతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు’ అంటూ షపవలోవ్ (కెనడా) ట్వీట్ చేయగా... ఇలాంటి పనికి నిషేధం తప్ప మరో శిక్షే లేదని నిక్ కిరియోస్ (ఆ్రస్టేలియా) తీవ్రంగా స్పందించాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సినెర్ జూన్‌లో వరల్డ్ నంబరవన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చేతికి గాయాలు తగిలినప్పుడు లేదా కోసుకుపోయినప్పుడు వాడే ఆయింట్మెంట్, స్ప్రేలలో ఉండే ‘క్లోస్టెబల్’ స్పోర్ట్స్ నిషేధిత జాబితాలో ఉంది. మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ సమయంలోనూ, టోర్నీ ముగిసిన వారం తర్వాత సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో ఈ ఉత్రే్పరకం ఉన్నట్లు తేలింది. దాంతో ఈ టోర్నీలో సినెర్ సెమీస్ చేరడం ద్వారా వచ్చిన 3,25,00 డాలర్ల ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతోపాటు 400 పాయింట్లలో కూడా కోత విధించారు. దీనిపై అప్పీల్ చేసిన సినెర్ తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దానిని వాడిన ఫిజియోథెరపిస్ట్ మసాజ్ చేసిన కారణంగా తన శరీరంలోకి ప్రవేశించిందని, ఇక ముందు అలా జరగకుండా డోపింగ్ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశాడు. అతని వాదనను అంగీకరిస్తూ టెన్నిస్ ఇంటి గ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) సినెర్ తప్పేమీ లేదంటూ క్లీన్ చిట్ కూడా ఇచి్చంది. అయితే తాజాగా ‘దురదృష్టకర ఘటనను మరిచి ముందుకు సాగుతాను’ అని సినెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఇలాంటి విషయాలను సాధ్యమైనని ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచి, అంతా మరచిపోయేలా చేస్తూ అగ్రశ్రేణి ఆటగాళ్లను రక్షించడం కొత్త కాదని... అదే ఏ 400వ ర్యాంక్ ప్లేయర్ అయిఉంటే అది సాధ్యం కాదని మాజీ ప్లేయర్, టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ కూడా అభిప్రాయపడింది. మున్ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరం. -
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
మయామి ఓపెన్ చాంపియన్ కోలిన్స్
ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలకనున్న అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ అద్భుతం చేసింది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో చాంపియన్‌గా నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 30 ఏళ్ల కోలిన్స్ 7–5, 6–3తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. కోలిన్స్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 16 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, స్లోన్ స్టీఫెన్స్ తర్వాత మయామి ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆరో అమెరికన్ ప్లేయర్‌గా కోలిన్స్ గుర్తింపు పొందింది. -
సూపర్ సుమీత్..
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం.. న్యూయార్క్‌లో టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్. ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ బరిలోకి దిగాడు. అతని ఎదురుగా ఉన్న 22 ఏళ్ల కుర్రాడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ డ్రాకి అర్హత సాధించాడు. అంతకు ముందెప్పుడూ అతను అంత పెద్ద స్టేడియంలో ఆడలేదు. సహజంగానే ఎవరూ ఆ మ్యాచ్‌లో ఫెడరర్ ప్రత్యర్థి గురించి పట్టించుకోలేదు. కానీ ఒక సెట్ ముగిసే సరికి అందరిలో చర్చ మొదలైంది. ఆ యువ ఆటగాడు తొలి సెట్‌ను 6–4తో గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఫెడరర్ కోలుకొని ఆ తర్వాత తన స్థాయి ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ గ్రాండ్‌స్లామ్‌లో ఒక కొత్త ఆటగాడు అలా అందరూ గుర్తుంచుకునేలా పరిచయమయ్యాడు. ఆరంభం గుర్తుంచుకునేలా ఉన్నా.. ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆటలో ఓటములతో పాటు గాయాలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. టెన్నిస్‌ను కొనసాగించేందుకు కనీస స్థాయిలో కూడా డబ్బుల్లేని స్థితి. ఆటను వదిలిపెట్టేందుక్కూడా అతను సిద్ధమయ్యాడు. కానీ అతనిలోని పట్టుదల మళ్లీ పోరాడేలా చేసింది. సన్నిహితుల సహకారం మళ్లీ ఆటపై దృష్టి పెట్టేలా చేసింది. దాంతో వరుసగా చాలెంజర్ టోర్నీల్లో విజయాలు.. ఇప్పుడు సింగిల్స్‌లో వరల్డ్ టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు. ఆ కుర్రాడి పేరే సుమీత్ నగాల్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ ఆటగాడు మరిన్ని పెద్ద ఘనతలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొహమ్మద్ అబ్దుల్ హాది ‘నా బ్యాంకు ఖాతాలో 80 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏడాదంతా కలిపి 24 టోర్నీలు ఆడినా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోవడం లేదు. నా జీతం, కొన్ని సంస్థలు చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా టెన్నిస్‌లోనే పెట్టేశా. అంతర్జాతీయ టెన్నిస్‌లో విజయాలు, రికార్డుల సంగతి తర్వాత.. కనీసం ఒక ఆటగాడిగా కొనసాగాలన్నా ఏడాదికి రూ. 80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లను పెట్టుకునే స్థాయి లేక కేవలం ఒకే ఒక ట్రావెలింగ్ కోచ్‌తో టోర్నీలకు వెళుతున్నా. మన దేశంలో టెన్నిస్‌కు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం చాలా తక్కువ!’ కొన్నాళ్ల క్రితమే సుమీత్ నగాల్ వెలిబుచ్చిన ఆవేదన అది. ఆ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయ టెన్నిస్ చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం. శిక్షణ, సాధన మొదలు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టోర్నీల్లో ఆడాలంటే చాలా డబ్బు కావాలి. టోర్నీల్లో ఆడితేనే ఫలితాలు, ర్యాంకింగ్స్ వస్తాయి. స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జూనియర్ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగానే చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. నగాల్ తన కెరీర్లో ఇలాంటి దశను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌ను అమితంగా ప్రేమిస్తూ ఆటపైనే దృష్టి పెట్టాడు. అందుకే ఇప్పుడు అతను సాధించిన రికార్డు, గెలిచిన టోర్నీలు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభంలోనే వేగంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 130కి చేరి ఆపై రెండేళ్ల వ్యవధిలో 638కి పడిపోయిన నగాల్.. ప్రస్తుతం టాప్–100లోకి రావడం అతని ఆటలోని పురోగతిని చూపిస్తోంది. ప్రతిభాన్వేషణతో వెలుగులోకి వచ్చి.. నగాల్ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝఝర్ అతని స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఆరంభంలో తన ఈడు పిల్లల్లాగే క్రికెట్‌నే అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మిత్రులతో కలసి గల్లీ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో టీమ్ ఈవెంట్ కాకుండా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో అతడిని చేర్పించాలనే తండ్రి ఆలోచన నగాల్‌ను టెన్నిస్ వైపు నడిపించింది. రెండేళ్లు స్థానిక క్లబ్లో అతను టెన్నిస్ నేర్చుకున్నాడు. అయితే పదేళ్ల వయసులో ఒక ఘటన నగాల్ కెరీర్‌ను మార్చింది. అప్పటికే భారత టాప్ టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ భూపతి తన అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభాన్వేషణ కార్యక్రమం నిర్వహించాడు. చాలా మందితో పాటు అతను కూడా సెలక్షన్స్‌కు హాజరయ్యాడు. అందరిలాగే హిట్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ భూపతి దృష్టి నగాల్‌పై పడలేదు. చాలాసేపటి తర్వాత ఆ పదేళ్ల కుర్రాడు ధైర్యం చేసి నేరుగా భూపతి వద్దకే వెళ్లాడు. ‘సర్, కాస్త నా ఆట కూడా చూడండి’ అని కోరాడు. ఆశ్చర్యపడ్డ భూపతి అతనిలోని పట్టుదలను గమనించి ప్రత్యేకంగా నగాల్‌తో ప్రాక్టీస్ చేయించాడు. వెంటనే అతని ఆట ఆకట్టుకోవడంతో తన ఎంపిక పూర్తయింది. ‘నేను ఆ ఒక్క మాట ఆ రోజు అనకుండా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోకపోయేవారేమో. ఎందుకంటే అంత డబ్బు పెట్టి మావాళ్లు టెన్నిస్ నేర్పించలేకపోయేవారు’ అని నగాల్ గుర్తు చేసుకుంటాడు. అది ఆ అకాడమీకి మొదటి బ్యాచ్. బెంగళూరులో రెండేళ్ల శిక్షణ తర్వాత భూపతి అకాడమీ కార్యకలాపాలు ఆగిపోయినా.. అప్పటికే మెరుగుపడ్డ నగాల్ ప్రదర్శన అతనికి సరైన దిశను చూపించింది. కుటుంబ మిత్రుల సహకారంతో విదేశాల్లో మరింత మెరుగైన శిక్షణతో అతని ఆట రాటుదేలింది. క్రికెట్‌పై తన చిన్ననాటి ఇష్టాన్ని వదులుకోని నగాల్.. తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నెట్స్‌లో క్రికెట్ ఆడి తన సరదా తీర్చుకోగలిగాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్‌తో.. 18 ఏళ్ల వయసులో నగాల్ ప్రొఫెషనల్‌గా మారాడు. హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో విజయం సాధించి కెరీర్లో తొలి టైటిల్‌ని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక మేజర్ టోర్నీ విజయం నగాల్‌కు గుర్తింపు తెచ్చింది. 2015 జూనియర్ వింబుల్డన్ డబుల్స్‌లో (భాగస్వామి వియత్నాం ఆటగాడు హోంగా నామ్) నగాల్ విజేతగా నిలిచాడు. జూనియర్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఆరో భారత ఆటగాడిగా పేరొందాడు. కెరీర్లో ఎదిగే క్రమంలో మూడేళ్ల వ్యవధిలో 9 ఐటీఎఫ్ ఫ్యూచర్ టైటిల్స్‌ను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చెప్పుకోదగ్గ మలుపు ఏటీపీ చాలెంజర్ టోర్నీ రూపంలో వచ్చింది. 2017లో బెంగళూరులో నగాల్ తన తొలి చాలెంజర్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిరీస్ టోర్నీ రెండో టైటిల్ రూపంలో చేరింది. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. పరాజయాల బాటను వీడి.. నాలుగేళ్ల పాటు నగాల్ కెరీర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండేళ్లు కోవిడ్ సమయంలోనే వెళ్లిపోగా.. మిగిలిన రెండేళ్లలో అతనికి గాయాలు, వాటికి శస్త్రచికిత్సలు. ఫామ్ కోల్పోయి మానసికంగా కూడా కుంగుబాటుకు గురైన స్థితి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. వీటికి తోడు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) నుంచి క్రమశిక్షణరాహిత్యం ఆరోపణలు. ఇలాంటివాటిని దాటి గత ఏడాది నగాల్ మళ్లీ సరైన దారిలో పడ్డాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 2023లో నగాల్ సాధించిన విజయాలు అతని కెరీర్లో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి. ఇటలీ, ఫిన్లండ్ చాలెంజర్ టోర్నీ టైటిల్స్, మరో రెండు టోర్నీలు ఆస్ట్రియా, హెల్సింకీలలో రన్నరప్ నగాల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఈ ఏడాదికి వచ్చే సరికి అతని ఆట మరింత పదునెక్కింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో అలెగ్జాండర్ బబ్లిక్‌పై సంచలన విజయం సాధించిన నగాల్.. 1989 (రమేశ్ కృష్ణన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక సీడెడ్æఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం. ఆపై కొద్దిరోజులకే చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీలో చాంపియన్‌గా సొంతగడ్డపై తొలి టైటిల్‌తో నగాల్ విజయనాదం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఆటనే వదిలేయాలనుకున్న వ్యక్తి.. ప్రతికూలతలపై పోరాడి ఇప్పుడు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. ఆ పట్టుదలకున్న పదును అర్థమవుతోంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా నగాల్ తన ప్రదర్శనతో మరిన్ని అద్భుతాలు చేయగలడని భారత టెన్నిస్ ప్రపంచం విశ్వసిస్తోంది. -
Tennis Tigress: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’!
నాలుగేళ్ల క్రితం.. బెలారస్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం సాగింది. తీవ్ర నిరసనలు, పోరాటాలు జరిగాయి. సహజంగానే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆ దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తటస్థంగా ఉండేందుకే ప్రయత్నించారు. కానీ 22 ఏళ్ల ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి మాత్రం గట్టిగా తన గళాన్ని వినిపించింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ల్యుకాన్షెకో వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. మరో రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై తీవ్ర విమర్శలు కురుస్తున్న సమయంలో బెలారస్ మాత్రం యుద్ధంలో రష్యాకు మద్దతు పలికింది. ఆ సమయంలోనూ ఆ ప్లేయర్ తమ ప్రభుత్వాన్ని, దేశాధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించింది. ‘అమాయకులపై దాడులు చేసే యుద్ధాన్ని నేను సమర్థించను. అందుకే మా ప్రభుత్వాన్ని కూడా సమర్థించను’ అంటూ బహిరంగ ప్రకటన చేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ మహిళా క్రీడాకారిణి తన కెరీర్‌ను పణంగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత దశకు వేగంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పనులు తనను ఇబ్బంది పెడతాయని తెలిసినా తాను నమ్మినదాని గురించి గట్టిగా మాట్లాడింది. ఆమె పేరే.. అరీనా సబలెంకా. ఈ బెలారస్‌కు టెన్నిస్ స్టార్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించడం, వరల్డ్ నంబర్‌వన్ కావడం మాత్రమే కాదు.. ఆటతో పాటు తనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించింది. ‘నేను ఆడ పులిని’.. కెరీర్ ఆరంభంలో సబలెంకా తన గురించి తాను చెప్పుకున్న మాట. అప్పటికి ఆమె పెద్ద ప్లేయర్ కూడా రాదు. ధైర్యసాహసాలు, చివరివరకూ పోరాడే తత్వం వల్ల తనను తాను అలా భావించుకుంటానని చెబుతుంది. ఆమె చేతిపై ‘పులి’ టాటూ ఉంటుంది. ఆ టాటూను చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందుతానని అంటుంది. టెన్నిస్ కోర్టులో సబలెంకా దూకుడైన ఆటే అందుకు నిదర్శనం. పెద్ద సంఖ్యలో విన్నర్స్ ద్వారానే పాయింట్లు రాబట్టడం ఆమె శైలి. ఆరడుగుల ఎత్తు.. పదునైన సర్వీస్.. సబలెంకా అదనపు బలాలు. అవమానించిన చోటే అదరగొట్టి.. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్... సబలెంకా తొలి రౌండ్ మ్యాచ్. అప్పటికి ఆమె అనామక క్రీడాకారిణి మాత్రమే. అంతకు ముందు ఏడాది ఇదే టోర్నీలో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 66వ స్థానంలో ఉంది. అయితే అటు వైపున్న ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ యాష్లీ బార్టీ. చాలా మంది పాతతరం ప్లేయర్ల మాదిరే సబలెంకా కూడా కోర్టులో షాట్ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఏ స్థాయికి చేరినా చిన్నప్పటి నుంచి సాధనతో పాటు వచ్చిన ఈ అలవాటును మార్చుకోవడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. సబలెంకా దూకుడైన ఆటతోపాటు అరుపులు కూడా జోరుగా వినిపించాయి. ఫలితంగా తొలి సెట్ ఆమె సొంతం. దాంతో బార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అరుపులు కొంతవరకు ఓకే గానీ మరీ శ్రుతి మించిపోయాయని ఫిర్యాదు చేసింది. అయితే బార్టీని మించి ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి సబలెంకాను బాగా ఇబ్బంది పెట్టింది. పూర్తిగా నిండిన గ్యాలరీల్లో అంతా బార్టీ అభిమానులే ఉన్నారు. వారంతా సబలెంకాను గేలి చేయడం మొదలుపెట్టారు. సబలెంకా ప్రతి షాట్‌కూ వారు పెట్టిన అల్లరి వల్ల ఆమె ఏకాగ్రత చెదిరింది. దాంతో తర్వాతి సెట్లలో ఓడి మ్యాచ్‌లో పరాజయంపాలైంది. దీనిని సబలెంకా మరచిపోలేదు. అదే వేదికపై తానేంటో నిరూపించుకుంటానని ఈ ‘ఆడ పులి’ ప్రతిజ్ఞ పూనింది. అనుకున్నట్టుగానే తన పట్టుదలను చూపించింది! అరుపులను ఆపలేదు కానీ ఆటలో మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత 2023లో అదే రాడ్ లేవర్ ఎరీనాలో సబలెంకా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది. సంవత్సరం తర్వాతా దానిని నిలబెట్టుకొని అదే మెల్బోర్న్ ఫ్యాన్స్ ద్వారా సగర్వంగా జేజేలు అందుకుంది. సీనియర్‌గానే సత్తా చాటుతూ.. చాలామంది వర్ధమాన టెన్నిస్ స్టార్లతో పోలిస్తే సబలెంకా ప్రస్థానం కాస్త భిన్నం. దాదాపు ప్లేయర్లందరూ జూనియర్ స్థాయిలో చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు వెళతారు. అయితే ఆమె మాత్రం జూనియర్ టోర్నీల్లో ఆడే వయసు, అర్హత ఉన్నా వాటికి దూరంగా ఉంది. గెలిచినా, ఓడినా ప్రొఫెషనల్ సర్క్యూట్లో సీనియర్ స్థాయిలో పోటీ పడటమే మేలు చేస్తుందన్న కోచ్ మాటను పాటిస్తూ సర్క్యూట్లో పోరాడింది. సబలెంకా తన కెరీర్లో ఒక్క జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కూడా పాల్గొనకపోవడం విశేషం. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ఐటీఎఫ్ విమెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లలో ఐదు టోర్నీలూ సొంతగడ్డ బెలారస్‌లోనే ఆడింది. టైటిల్స్ దక్కకపోయినా ఆమె ఆట మెరుగుపడుతూ వచ్చింది. 2015 ముగిసే సరికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 548వ స్థానంలో ఉన్న సబలెంకా.. 2017లో తన తొలి పెద్ద టోర్నీ (ముంబై ఓపెన్) విజయానంతరం 78వ ర్యాంక్‌తో ఆ ఏడాదిని ముగించింది. ఆ తొలి మూడేళ్లను మినహాయిస్తే ఆ తర్వాత అమిత వేగంతో సబలెంకా కెరీర్ దూసుకుపోయింది. అప్పటి వరకు అనామకురాలిగానే ఉన్నా.. 2018 ఆరంభంలో 11వ ర్యాంక్‌కు చేరి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్–10లో తన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. డబుల్ గ్రాండ్‌స్లామ్.. 2016 యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో సబలెంకా ఓడింది. తర్వాతి ఆరేళ్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి 22 సార్లు బరిలోకి దిగినా ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. గరిష్ఠంగా మూడుసార్లు సెమీఫైనల్‌తోనే ఆమె సరిపెట్టుకుంది. అయితే 2023లో సబలెంకా కెరీర్ సూపర్‌గా నిలిచింది. అప్పటికి సింగిల్స్‌లో నాలుగు ప్రధాన డబ్ల్యూటీఏ టైటిల్స్ విజయాలతో ఫేవరెట్లలో ఒకరిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగి.. చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు సింగిల్స్, డబుల్స్‌లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ ఆమె దరి చేరింది. ఆపై శిఖరానికి చేరేందుకు సబలెంకాకు ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెమీస్ చేరిన ఆమె యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన కారణంగా ఇదే టోర్నీ ముగిసే సరికి అధికారికంగా సబలెంకా వరల్డ్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఫలితంగా సింగిల్స్, డబుల్స్‌లలో ఏదో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో ఆమె చేరింది. కొత్త ఏడాది వచ్చేసరికి ఆమె ఆట మరింత పదునెక్కింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఏడు మ్యాచ్‌లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజయఢంకా మోగించింది. రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకొని చిరునవ్వులు చిందించింది. దేశం పేరు లేకుండానే.. తన దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తిన సబలెంకా ఒక క్రీడాకారిణిగా కూడా అదే తరహాలో స్పందించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ బహిరంగ లేఖ రాసింది. బాధితులైన ఉక్రెయిన్ దేశస్థులకు మద్దతునిస్తున్నానంటూ ఆ దేశపు జాతీయ పతాకంలోని రంగుల బ్యాండ్లను మైదానంలో ధరించింది. తన దేశం అనవసరంగా యుద్ధపిపాసి జాబితాలో చేరడంపై బాధను వ్యక్తం చేసింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమె బెలారస్ ప్లేయర్ కావడమే. యుద్ధ నేపథ్యంలో రష్యా, బెలారస్ దేశపు ప్లేయర్లపై వేర్వేరు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించాయి. ఈ జాబితాలో విమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కూడా ఉంది. తర్వాత.. యుద్ధంతో ప్లేయర్లకు సంబంధం లేదని భావించి వారికి ఆడే అవకాశాన్నిచ్చాయి. కానీ తమ దేశం పేరును వాడకుండా.. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించకుండా.. తటస్థులుగా బరిలోకి దిగాలనే నియమంతో! దాంతో చాంపియన్‌గా నిలిచిన తన దేశం పేరును, జెండాను సగర్వంగా ప్రదర్శించుకునే పరిస్థితి సబలెంకాకు లేకపోయింది. ఇటీవలి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే కొనసాగడంతో.. ఇప్పటికీ డబ్ల్యూటీఏ వెబ్సైట్లో ఆమె పేరు పక్కన దేశం పేరు లేదు. 26 ఏళ్ల సబలెంకా తాజా ఫామ్‌ను బట్టి ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని మున్ముందు మరిన్ని ఘన విజయాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
43 ఏళ్ల వయస్సులో సరికొత్త చరిత్ర.. రోహన్ బొప్పన్న పై సచిన్ ప్రశంసలు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వృద్ధ వయసులో పురుషుల డబుల్స్‌లో నెం1 ర్యాంక్‌ను అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 43 ఏళ్ల వయస్సులో రోహన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ డబుల్స్‌లో విజయనంతరం బోపన్న నంబర్ వన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా జోడీ మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రెస్ మోల్టెనీని మాథ్యూ ఎబ్డెన్-బోపన్న జోడి చిత్తు చేసింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో బొప్పన్న జోడి 6-4, 7-6 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇక లేటు వయస్సులో వరల్డ్‌నెం1గా నిలిచిన బొప్పన్నపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం రోహన్ ప్రశంసించాడు. "వయస్సు ఒక సంఖ్య మాత్రమే. కానీ 'నంబర్ 1' అనేది మరొక సంఖ్య కాదు. అభినందనలు రోహన్! పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా గ్రేట్"అని ఎక్స్(ట్విటర్)లో సచిన్ రాసుకొచ్చాడు. చదవండి: బజ్‌బాల్‌తో మాకు సంబంధం లేదు.. గెలవాలంటే అదొక్కటే: రోహిత్ Age is just a number but ‘Number 1’ is not just another number. Congratulations Rohan! Being the oldest World Number 1 in Men’s Doubles is a stellar feat. #AusOpen #AO2024 pic.twitter.com/5rEBxdl1km — Sachin Tendulkar (@sachin_rt) January 24, 2024 -
రోబో బ్యాట్ పట్టుకుంటే..
-
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు. రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం.. -
క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం
మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడింది. మూడు నెలల క్రితం నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పటినుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు దాని నుంచి విముక్తి పొందినట్లు స్వయంగా ప్రకటించింది. ''క్యాన్సర్ మహమ్మారి నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సందర్భంగా 15 పౌండ్ల బరువు తగ్గాను. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్ని భరించి ఇవాళ మహమ్మారి నుంచి విముక్తి సంపాదించా. ఇక క్యాన్సర్ నుంచి విముక్తి కలగగానే టీవీ చానల్ బాధ్యతల్లో లీనమయ్యా.'' అంటూ తెలిపింది. ప్రస్తుతం 66 ఏండ్ల నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాకు చెందిన మార్టినా నవ్రతిలోవా 18 సింగిల్స్ , 31 మహిళల డబుల్స్, 10 మిక్స్డ్ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 1970,80వ దశకంలో ఆమె సమకాలీకురాలు క్రిస్ ఎవర్ట్‌తో పోటీ పడిన నవ్రతిలోవా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.1981లో అమెరికా పౌరసత్వం రాగానే తనను తాను లెస్బియన్‌గా ప్రకటించుకున్న నవ్రతిలోవా అప్పటి నుంచి ఎల్జీబీటీ(LGBT) హక్కుల కోసం పోరాడుతూ వచ్చింది. చదవండి: దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై -
135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది'
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు రోహన్ బోపన్న, సానియా మీర్జా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాడ్ లావర్ ఎరీనాలో బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ మాటోస్, లూయిసా స్టెఫానీ జోడీ బోపన్న-సానియా జోడీని వరుస సెట్లలో 6-7, 2-6తో ఓడించింది. ఈ గేమ్‌తో సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసింది. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ చూడడం కోసం ఆమె ఫ్యామిలీతో పాటు బోపన్న ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. మ్యాచ్‌లో బోపన్న భార్య సుప్రియ అన్నయ్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్ డ్రెస్‌లో సుప్రియ హాట్ లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు మ్యాచ్ సమయంలో తన భర్త బోపన్న-సానియా జోడిని ఎంకరేజ్ చేస్తూ నిలబడి చప్పట్లు కొట్టడం కనిపించింది. బోపన్న భార్యను చూసిన ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. ''బోపన్న మీ భార్య చాలా అందంగా ఉంది.. ప్రపంచంలో అంతటి అందమైన మహిళను ఎప్పుడూ చూడలేదు.'' అంటూ ట్వీట్ చేశాడు. సదరు వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాగా ట్వీట్‌పై బోపన్న స్పందించాడు. ''మీరు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నా'' అంటూ లవ్ ఎమోజీ సింబల్ జత చేశాడు.కాగా బోపన్న, సుప్రియ అన్నయ్యల వివాహం 2012లో జరిగింది. I agree 😉🥰... https://t.co/XVUjZWI1Rm — Rohan Bopanna (@rohanbopanna) January 28, 2023 చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్ కొన్న తల్లి కథ -
మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం!
Roger Federer- Miroslava Mirka Love Story: ‘‘మా అమ్మ, నాన్న.. మిర్కా సమక్షంలో మీతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం.. ఇంతవరకు ఇలా సాఫీగా సాగుతుందని ఎవరు అనుకుని ఉంటారు. జస్ట్ ఇన్క్రెడిబుల్’’... స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ నేపథ్యంలో శనివారం చేసిన ట్వీట్ ఇది. అవును నిజమే.. సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ ప్రయాణం నిజంగా అసాధారణమైనదే. కళాత్మకమైన ఆటకు మారుపేరుగా.. వివాదరహితుడిగా.. జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్న ఫెడ్డీ సాధించిన ఘనతల్లో తన కుటుంబానిది కీలక పాత్ర. తల్లిదండ్రులు రాబర్ట్, లినెట్టె.. ముఖ్యంగా భార్య మిర్కా.. తన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని ఫెదరర్ తరచూ చెబుతూ ఉంటాడు. నిజానికి రోజర్ ఫెదరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. అమ్మానాన్న.. భార్య మిర్కా, నలుగురు పిల్లలు అతడి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మలిచి.. ఆటగాడిగా ఫెదరర్ విజయవంతంగా కొనసాగేందుకు భార్యగా తాను చేయగలిగిదంతా చేసింది.. చేస్తోంది మిర్కా. భర్తను అర్థం చేసుకుంటూ అతడికి అండగా నిలుస్తోంది. ఇంతకీ మిర్కా ఎవరు? మిరస్లొవా మిర్కా ఫెదరర్.. 1978 ఏప్రిల్ 1న జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు మిరొస్లొవా వావ్రింకోవాగా నామకరణం చేశారు. ఈమె కూడా టెన్నిస్ ప్లేయరే! స్లొకేవియాలో జన్మించిన మిర్కాకు రెండేళ్ల వయసు ఉన్నపుడే ఆమె కుటుంబం స్విట్జర్లాండ్‌కు వలస వచ్చింది. మిర్కాకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు జర్మనీలోని ఓ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఆమెను తీసుకువెళ్లాడు తండ్రి. అక్కడే తను మార్టినా నవ్రతిలోవా(చెక్- అమెరికన్ ప్లేయర్)ను చూసింది. చురుకైన మిర్కాను చూసిన నవత్రిలోవా.. ఆమె టెన్నిస్ ప్లేయర్‌గా రాణించగలదని చెప్పడం సహా.. తన రాకెట్‌ను బహుమతిగా పంపింది. అంతేకాదు మిర్కా టెన్నిస్ పాఠాలు నేర్చుకునేలా ఏర్పాట్లు చేసింది కూడా! అలా నవ్రతిలోవా స్ఫూర్తితో తన టెన్నిస్ ప్రయాణం మొదలుపెట్టిన మిర్కా.. 2001లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 76 సాధించింది. రోజర్- మిర్కా ప్రేమకథ అక్కడ మొదలైంది! సిడ్నీ ఒలింపిక్స్- 2000 సందర్భంగా రోజర్ ఫెదరర్- మిర్కాలకు పరిచయం జరిగింది. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు ప్రణయంలో మునిగితేలిన ఈ జంట 2009లో వివాహ బంధంతో ఒక్కటైంది. రోజర్ స్వస్థలం బాసెల్‌లో వీరి పెళ్లి జరిగింది. అదే ఏడాది రోజర్- మిర్కా దంపతులకు కవలలు జన్మించారు. మొదటి సంతానంగా జన్మించిన కుమార్తెలకు చార్లెనీ రివా- మిలా రోజ్గా పేర్లు పెట్టారు. ఆ తర్వాత సుమారు ఐదేళ్లకు అంటే 2014లో ఈ జంట కవల కుమారులకు జన్మినిచ్చారు. వీరి పేర్లు లియో, లిన్నీ. పిల్లలతో కలిసి మ్యాచ్ వీక్షిస్తూ.. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కా.. సిడ్నీ ఒలింపిక్స్‌లో స్విట్జర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించింది. పాదానికి గాయమైన కారణంగా అర్ధంతరంగా ఆమె కెరీర్ ముగిసిపోయింది. పెళ్లి తర్వాత కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన మిర్కా.. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనిపించుకుంది. ఇక కేవలం ఇంట్లోనే కాదు.. మైదానంలో కూడా భర్త వెన్నంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంది మిర్కా. ఫెదరర్ మ్యాచ్ ఉందంటే తమ నలుగురు పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తూ ఉంటుంది. 2017లో రోజర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన సమయంలో.. ఆ అద్భుత క్షణాలకు సాక్షిగా నిలిచింది మిర్కా. మంచి మనసున్న దంపతులు! రోజర్‌కు అన్ని విషయాల్లో అండగా ఉండే మిర్కా.. అతడు చేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తోడుగా ఉంటుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన స్విస్ కుటుంబాలకు ఈ జంట 2020లో ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. అదే విధంగా రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ దంపతులు. ఇందుకోసం మిలియన్ డాలర్లకు పైగా విరాళం అందించారు. ఓ సందర్భంలో రోజర్ మాట్లాడుతూ.. తమ కుమార్తెలు భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని భావిస్తున్నానని.. అందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు. కేవలం ఆటలో మాత్రమే కాదు.. సేవా గుణంలోనూ ఫెదరర్ రారాజే! మరి అతడి హృదయపు పట్టపురాణి మిర్కా.. మహారాణి కాక ఇంకేమవుతుంది!? -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే.. It was beautiful to release the news surrounded by my Mum and Dad and Mirka. Who would have thought that the journey would last this long. Just incredible! pic.twitter.com/0rRAMRSaRu — Roger Federer (@rogerfederer) September 16, 2022 -
ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫెదరర్ టెన్నిస్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు. 20 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ అందరికంటే ముందుగా సాధించింది రోజర్ ఫెదరర్రే. తన ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిన ఫెదరర్.. సంపాదన విషయంలోనూ చాలా ముందుంటాడు. ప్రస్తుత తరంలో టెన్నిస్ దిగ్గజాలుగా పిలవబడుతున్న నాదల్, జొకోవిచ్‌లు వచ్చిన తర్వాత ఫెదరర్ హవా కాస్త తగ్గినప్పటికి.. సంపాదనలో మాత్రం ఫెదరర్ వెనకే ఉండడం విశేషం. 41 ఏళ్ల ఫెదరర్ తన కెరీర్లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు(సుమారు రూ.1042 కోట్లు) సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే వెలేపలే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్మెంట్లు, ఇతర బిజినెస్‌లతో కలిపి ఫెదరర్ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్ కోర్టు బయట ఫెదరర్ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఫెదరర్ తన కెరీర్లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్లో ఫెదరర్ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని రోజర్ ఫెదరర్‌కు చెందిన గ్లాస్ హౌస్ ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్స్టోన్ అందుకున్న ఏడో క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. జాబితాలో ఫెదరర్ కంటే (ముందు..ఆ తర్వాత) లెబ్రన్ జేమ్స్, ఫ్లాయిడ్ మేవెదర్, లియోనెల్ మెస్సీ, ఫిల్ మికెల్సన్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్లు తమ కెరీర్లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. ఇక 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మొత్తంగా 103 సింగిల్స్ టైటిల్స్(ఓపెన్ శకంలో రెండో ఆటగాడు) సాధించాడు. ఖరీదైన రోలెక్స్ వాచ్‌తో ఫెదరర్ చదవండి: రోజర్ ఫెడరర్ వీడ్కోలు.. 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
Roger Federer: రోజర్ ఫెడరర్ వీడ్కోలు..
టెన్నిస్‌ను ఎంత అందంగా ఆడవచ్చో అతను చూపించాడు... బేస్లైన్నుంచి ఆడినా, నెట్‌పైకి దూసుకొచ్చినా అతని ఆటలో కళాత్మకత కనిపించింది...అతని ఫోర్‌హ్యాండ్ ఘనత గురించి చెప్పాలంటే అది ‘టెన్నిస్‌లోనే గొప్ప షాట్’...స్మాష్, స్కై హుక్, హాఫ్ వాలీ, స్లామ్ డంక్...పేరు ఏదైనా అతను ఏ షాట్ కొడితే దానికి ప్రపంచం జేజేలు పలికింది... అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో పాదరసంలా జారుతూ మైదానమంతా చుట్టేసి అతను ప్రత్యర్థుల పని పట్టినప్పుడు చప్పట్లతో తమ సంతోషాన్ని ప్రకటించింది... సుదీర్ఘ కెరీర్లో ఘనమైన రికార్డులెన్నో సాధించినా ఏనాడూ వివాదం దరి చేరనివ్వని అసలైన జెంటిల్మన్ అతను... ఒక్క మాటలో చెప్పాలంటే టెన్నిస్‌లో రాముడు మంచి బాలుడు ఎవరంటే మరో మాటకు తావు లేకుండా అందరూ అతని పేరే చెబుతారు. అందుకే అతను గెలిచిననాడు వహ్వా అని సంబరాన్ని ప్రదర్శించిన ఫ్యాన్స్...అతను ఓడి అందరి ముందు చిన్నపిల్లాడిగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు తమకే ఏదో జరిగినంతగా బాధపడ్డారు... రెండు దశాబ్దాలకు పైగా ఆటపై చెరగని ముద్ర వేసిన ఆ దిగ్గజం పేరు రోజర్ ఫెడరర్. చరిత్రలో నిలిచిపోయే విజయాలను తన బయోడేటాగా మార్చుకున్న ఈ స్విస్ స్టార్ ఆటకు వీడ్కోలు పలికాడు...చిరస్మరణీయ జ్ఞాపకాలను అభిమానులకు పంచి నిష్క్రమించాడు. బాసెల్: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన ఆటతో అభిమానులను అలరించి, ఆటను శాసించిన దిగ్గజ ప్లేయర్ రోజర్ ఫెడరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల 23నుంచి 25 వరకు లండన్‌లో జరిగే లేవర్ కప్‌లో తాను చివరిసారిగా బరిలోకి దిగుతానని, ఆపై ప్రొఫెషనల్ టెన్నిస్‌నుంచి పూర్తిగా తప్పుకుంటానని అతను వెల్లడించాడు. వరుస గాయాలు, ఆపై శస్త్రచికిత్సలతో చాలా కాలంగా కోర్టుకు దూరంగా ఉంటూ వచ్చిన ఫెడరర్ ఎప్పుడైనా తప్పుకోవచ్చనే సంకేతాలు వినిపించాయి. అయితే గత జూలైలో వింబుల్డన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరై ఇక్కడ మరోసారి ఆడాలని ఉందని చెప్పినప్పుడు మళ్లీ బరిలోకి దిగవచ్చని అనిపించింది. కానీ ఆ ఆలోచనను పక్కన పెడుతూ 41 ఏళ్ల రోజర్ తన వీడ్కోలు వివరాలను సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. 1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ 2021 జూలైలో చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో హ్యూబర్ట్ హర్కాజ్ (పోలండ్) చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓడిపోయాక మళ్లీ రాకెట్ పట్టుకోలేదు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్ కొన్నాళ్ల క్రితం వరకు అత్యధిక స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతడిని నాదల్ (22), జొకోవిచ్ (21) అధిగమించారు. ‘గత మూడేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. నేను పునరాగమనం చేసేందుకు చాలా ప్రయత్నించాను. కానీ శరీరం సహకరించడం లేదని నాకు అర్థమైంది. గత 24 ఏళ్లలో 40 దేశాల్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడాను. టెన్నిస్ నేను ఊహించినదానికంటే ఎక్కువ స్థాయిలో గొప్ప జ్ఞాపకాలు అందించింది. లేవర్ కప్ తర్వాత ప్రొఫెషనల్‌గా కాకుండా ఆసక్తి కొద్దీ ఎప్పుడైనా టెన్నిస్ ఆడుతూనే ఉంటా. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమే అయినా నేను సాధించినవాటితో చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. దేవుడు నాకు టెన్నిస్ బాగా ఆడే ప్రత్యేక ప్రతిభను ఇచ్చాడు. అందులో నేను ఊహించని ఎత్తులకు వెళ్లగలిగాను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పోటీ పడగలగడం నా అదృష్టం. నా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, భార్య, కోచ్‌లు, అభిమానులకు కృతజ్ఞతలు. 24 ఏళ్లు 24 గంటల్లా గడిచినట్లు అనిపిస్తున్నాయి. ఆటగాడిగా విజయాలు ఆస్వాదించాను. నవ్వాను, ఏడ్చాను, బాధను భరించాను, భావోద్వేగాలు ప్రదర్శించాను. నా సొంత నగరం బాసెల్‌లో బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు కన్న కలలు నేను పడిన శ్రమతో నిజమయ్యాయి. టెన్నిస్‌ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ – ఫెడరర్ ►కెరీర్లో గెలిచిన మొత్తం టైటిల్స్ – 103 ►గెలుపు–ఓటములు – 1251–275 ►కెరీర్ ప్రైజ్‌మనీ – 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1042 కోట్లు) ►తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ – 02/02/2004 ►ఒలింపిక్ పతకాలు (2) – 2008 బీజింగ్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్ కాంస్యం ►వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ – మొత్తం 310 వారాలు (ఇందులో వరుసగా 237 వారాలు) ►గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ విజయాల సంఖ్య – 369 ►కెరీర్లో కొట్టిన ఏస్‌లు – 11,478 కెరీర్ స్లామ్ పూర్తి ఆల్‌టైమ్ గ్రేట్‌గా అన్ని రకాల కోర్టుల్లో సత్తా చాటినా...ఫెడరర్ కెరీర్లో ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడూ సవాల్‌గానే కనిపించింది. అప్పటికే 13 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి ఫ్రెంచ్ ఓపెన్‌లోకి ఫెడరర్ అడుగు పెట్టాడు. మరో టైటిల్ గెలిస్తే ఆ సమయంలో అగ్ర స్థానంలో ఉన్న పీట్ సంప్రాస్ (14) రికార్డును సమం చేస్తాడు. అయితే ఎర్రమట్టిపై వరుసగా నాలుగేళ్లు టైటిల్ సాధించిన నాదల్ జోరు కొనసాగుతోంది. ఈ దశలో ఫెడరర్‌కు మళ్లీ కష్టమే అనిపించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో సొదర్లింగ్ చేతిలో నాదల్ అనూహ్యంగా ఓడటంతో రోజర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని వృథా చేయని అతను ఫైనల్లో సొదర్లింగ్‌నే ఓడించి తొలిసారి (ఏకైక) ఫ్రెంచ్ ఓపెన్ సాధించాడు. తన ‘కెరీర్ స్లామ్’ను పూర్తి చేసుకోవడంతో పాటు సంప్రాస్‌తో సమంగా నిలిచాడు. ‘గ్రాండ్’ ఫెడెక్స్ ఆస్ట్రేలియా ఓపెన్ (6) – 2004, 2006, 2007, 2010, 2017, 2018 ఫ్రెంచ్ ఓపెన్ (1) – 2009 వింబుల్డన్ (8) – 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017 యూఎస్ ఓపెన్ (5) – 2004, 2005, 2006, 2007, 2008 తన కెరీర్ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ ఒక్కసారి కూడా మ్యాచ్ మధ్యలో రిటైర్ కాలేదు. కవలల జోడి... ఫెడరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. తన విజయాల ఘనతల్లో భార్య మిరొస్లావా (మిర్కా)కు ప్రధాన పాత్ర ఉందని తరచూ చెబుతుంటాడు. వీరికి నలుగురు పిల్లలు. వీరికి 13 ఏళ్ల కవల అమ్మాయిలు, 8 ఏళ్ల కవల అబ్బాయిలు ఉన్నారు. -
లియాండర్ పేస్ గురువు కన్నుమూత
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్ ప్లేయర్, డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ నరేశ్ కుమార్ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్ లియాండర్ పేస్‌కు మెంటార్‌గా వ్యవహరించిన నరేశ్ కుమార్.. పేస్ తన కెరీర్లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్ కప్‌లో పేస్‌కు మెంటార్‌గా వ్యహరించిన నరేశ్ కుమార్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల నరేశ్ కుమార్ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్ కుమార్ 1928 డిసెంబర్ 22న లాహోర్‌లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్‌షిప్స్ ద్వారా టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన నరేశ్ కుమార్.. ఆ తర్వాత మరో టెన్నిస్ ప్లేయర్ రమానాథన్ కృష్ణన్‌తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్ నుంచి టెన్నిస్‌లో కీలకపాత్ర పోషించాడు. ఇక 1952లో డేవిస్ కప్ జర్నీ ఆరంభించిన నరేశ్ కుమార్ ఆ తర్వాత భారత్ తరపున డేవిడ్ కప్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్ కుమార్ తన టెన్నిస్ కెరీర్లో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ తరపున తొలిసారి నాలుగో రౌండ్‌కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్లో అప్పటి టెన్నిస్ ప్రపంచ నెంబర్‌వన్ టోనీ ట్రేబర్ట్ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. ఇక నరేశ్ కుమార్ ఖాతాలో ఐదు సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్ చాంపియన్‌షిప్స్.. 1952లో వెల్ష్ చాంపియన్స్, 1957లో ఎసెక్స్ చాంపియన్షిప్స్లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నరేశ్ కుమార్ తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్ కుమార్.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ కోచ్‌గా నిలిచారు. -
US Open 2022: సరిలేరు సెరెనాకెవ్వరు
2007 ఆస్ట్రేలియన్ ఓపెన్... ఆ సమయంలో 81వ ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్‌స్లామ్ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్ లాంజ్‌లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు. కనీసం క్వార్టర్ ఫైనల్ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్‌స్లామ్స్ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది. అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, రిటర్న్స్‌లో ధాటి, చురుకైన అథ్లెట్ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్‌గా సెరెనాను ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్ గేమ్ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి. బాల్యం నుంచి స్టార్‌గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్ అడ్రస్ లాంటి కాంప్టన్ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్‌తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. విజయ ప్రస్థానం... ఓపెన్ శకంలో (1968 నుంచి) సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్డ్ డబుల్స్‌లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్ మిర్నీతో కలిసి వింబుల్డన్ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్ ఇండోర్ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్ టైటిల్ చేరింది. ఆ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది. ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్‌పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్‌గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్ ఓపెన్ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రెండోసారి ఈ ఫీట్‌ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణాలు కెరీర్‌కు అదనపు హంగును జోడించాయి. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్ డబ్ల్యూటీఏ కెరీర్లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్ సిటీలో జరిగిన ‘బెల్ చాలెంజ్’ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్లోనే ఓడింది. గాయాలను అధిగమించి... టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్నెస్ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. భారత్‌తో బంధం 2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్‌లో... అదీ ఒక టియర్–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్లో అది 29వ టైటిల్. ఆట ముగిసె... సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్‌స్లామ్ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్‌పై గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే కెరీర్ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్‌ను ముగించింది. కెరీర్లో తాను ఆడిన 1,014వ మ్యాచ్‌లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది. భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్‌కు తెర పడింది. న్యూయార్క్: మహిళల టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్‌లు కూడా గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్ ప్రత్యర్థి పోరాడటంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్‌ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్లో మాత్రం తొమ్లాయనోవిచ్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్‌లో ఆరు మ్యాచ్ సెరెనా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్ హ్యాండ్ అన్ఫోర్స్డ్ ఎర్రర్‌తో ఓటమి ఖాయమైంది. కొన్ని వివాదాలూ... ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్‌లో వీనస్ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్ ఫలితాన్ని తండ్రి రిచర్డ్ నిర్ణయించాడని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీస్‌కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్ బాయ్‌ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్‌తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్‌ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది. ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా. –సెరెనా –సాక్షి క్రీడా విభాగం -
30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు
ప్రపంచ మాజీ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనలిస్ట్ అయిన ఆండ్రియా జేగర్ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో ప్రముఖుడు తనకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడని 57 ఏళ్ల ఆండ్రియా జేగర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆండ్రియా జేగర్ 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భుజం గాయం కారణంగా కెరీర్ అర్ధంతరంగా ముగియకముందు ఆమె 10కి పైగా టైటిళ్లు సాధించింది. జేగర్.. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. జేగర్.. ప్రముఖ మహిళల టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా సమకాలీకురాలు. చదవండి: వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా -
బోరిస్ బెకర్‌కు జైలుశిక్ష
లండన్: దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది. మొత్తం నాలుగు కేసులకి సంబంధించి గరిష్టంగా ఏడేళ్లదాకా జైలుశిక్ష విధించే అవకాశముంది. అయితే వాదోపవాదాల అనంతరం రెండున్నరేళ్ల శిక్షను ఖరారు చేసింది. జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
ముచ్చటగా మూడోసారి.. ఈసారి శాశ్వత వీడ్కోలు
Kim Clijsters- న్యూజెర్సీ: గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి.. ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియ్‌స్టర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆటకు వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటన విడుదల చేసింది. కాగా గత ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియ్‌స్టర్స్ తన కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను (2005, 2009, 2010–యూఎస్ ఓపెన్; 2011–ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. ఇక తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన క్లియ్‌స్టర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియ్‌స్టర్స్ 523 మ్యాచ్‌ల్లో గెలిచి, 131 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ. 186 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించింది. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
Ashleigh Barty: బార్టీ బై..బై..!
అంతర్జాతీయ టెన్నిస్‌లో అనూహ్య పరిణామం... వరల్డ్ నంబర్‌వన్‌గా వెలుగొందుతున్న వేళ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన ప్రకటన... ఆడింది చాలని, కోర్టు బయట చేయాల్సింది చాలా ఉందంటూ టెన్నిస్‌కు గుడ్‌బై... సొంతగడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించి రెండు నెలలు కూడా గడవక ముందే రాకెట్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయం... మున్ముందు మరెంతో సాధించాల్సి ఉందంటూ క్రీడాకారులు లక్ష్యాలు పెట్టుకునే 25 ఏళ్ల వయసులోనే బార్టీ ఆటకు వీడ్కోలు పలకడం అసాధారణం! బ్రిస్బేన్: మహిళల టెన్నిస్ వరల్డ్ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత యాష్లే బార్టీ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మాజీ డబుల్స్ భాగస్వామి కేసీ డెలాక్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపై టెన్నిస్‌లో ఏదైనా సాధించాలనే తపన తనలో తగ్గిందని, అందుకు తగిన ప్రేరణ లభించకపోవడం కూడా రిటైర్మెంట్ కు కారణమని బార్టీ స్పష్టం చేసింది. 25 ఏళ్ల బార్టీ గత రెండేళ్లకు పైగా (114 వారాలు) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ► బార్టీ గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. సింగిల్స్‌లో 2019 ఫ్రెంచ్ ఓపెన్, 2021 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్... డబుల్స్‌లో 2018 యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ► బార్టీ సాధించిన మొత్తం టైటిల్స్. (సింగిల్స్‌లో 15, డబుల్స్‌లో 12) తన ప్రొఫెషనల్ సింగిల్స్ కెరీర్లో బార్టీ గెలిచిన మ్యాచ్‌లు. ► 2,38,29,071 డాలర్లు (రూ. 182 కోట్లు) కెరీర్ మొత్తంలో బార్టీ గెలిచిన ప్రైజ్‌మనీ ఈ ఏడాది జనవరి 29న స్వదేశంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన బార్టీ ఆ తర్వాత మరే టోర్నీలోనూ బరిలోకి దిగలేదు. 2008లో జస్టిన్ హెనిన్ (బెల్జియం) కూడా ఇదే తరహాలో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించింది. బార్టీ నిర్ణయం ప్రపంచ టెన్నిస్‌ను నిర్ఘాంతపరచింది. సహచర ప్లేయర్లు, మాజీలు, అభిమానులు ఈ ప్రకటన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అభినందనలు తెలుపగా... కొన్నాళ్ల తర్వాత బార్టీ పునరాగమనం చేస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా ఒకసారి టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చి క్రికెట్‌వైపు వెళ్లిన బార్టీ ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టి ఆపై వరుస విజయాలు సాధించింది. కొంత కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగంతో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నాను. టెన్నిస్ నాకు ఎంతో ఇచ్చింది. గర్వంగా, ఎంతో సాధించిన సంతృప్తితో ఆటను వీడుతున్నా. జీవితకాల జ్ఞాపకాలను నాతో పదిలంగా ఉంచుకుంటా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో సాధించిన తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా నన్ను ఆట ఉత్తేజపరచడం లేదు. నేను టెన్నిస్‌లో చేయగలిగిందంతా చేశాను. కొత్త కలలను నెరవేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిర్ణయం సరైందా, కాదా అనే చర్చ అనవసరం. ఇది నాకు నచ్చినట్లుగా నేను తీసుకున్న నిర్ణయం. వింబుల్డన్ సాధించాలనే నా లక్ష్యం. అది నెరవేరినప్పుడే ఇక చాలని అనిపించింది. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో మరో సవాల్ వచ్చింది. ఆ విజయం నా అద్భుత ప్రయాణానికి తగిన ముగింపుగా భావిస్తున్నా. –యాష్లే బార్టీ చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by Ash Barty (@ashbarty) 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
నాడు ఫెదరర్‌ను మట్టికరిపించిన ఉక్రెయిన్ వీరుడు.. నేడు గన్ పట్టి రష్యా సేనలపై..
2013 వింబుల్డన్‌లో స్విస్ స్టార్, నాటి ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ సెర్గీ స్టాకోస్కీ.. ప్రస్తుతం దేశ రక్షణలో భాగంగా రష్యా సేనలతో తలపడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆకర్షణగా మారాడు. కొన్ని వారాల క్రితమే టెన్నిస్ రాకెట్‌ను(రిటైర్మెంట్) వదిలి గన్ చేత పట్టిన 36 ఏళ్ల సెర్గీ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో దేశం కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు రాకెట్ పట్టుకుని ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు.. ప్రస్తుతం చేతిలో గన్ పట్టుకుని పుట్టిన గడ్డ కోసం పోరాడుతున్నాడు. సెర్గీ చేతిలో గన్ పట్టుకుని కీవ్ వీధుల్లో తిరుగుతున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సెర్గీ.. దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నప్పటికీ, పురిటి గడ్డ కోసం వీరుడిలా పోరాడుతున్నాడనంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో విహారయాత్రలో ఉన్న సెర్గీ.. విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశంలో ఉంచి, తాను రణరంగంలోకి ప్రవేశించాడు. చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని -
నంబర్ 1 ర్యాంకు పోయింది.. అయినా నువ్వు మారవా! ఎందుకీ పంతం?
Serbian Tennis Star Novak Djokovic- న్యూయార్క్: సెర్బియన్ సూపర్‌స్టార్ నొవాక్ జొకోవిచ్ తన మొండివైఖరి వీడట్లేదు. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును కోల్పోయిన అతను, కోవిడ్ వ్యాక్సిన్‌కు ససేమిరా అనడంతో ఇప్పుడు అమెరికాలో జరిగే కీలక టోర్నీలకూ దూరమయ్యాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల దిగ్గజ చాంపియన్ ఇప్పుడు టీకా వ్యతిరేకతతో ప్రముఖ టోర్నీలైన ఇండియన్‌వెల్స్, మయామి, కాలిఫోర్నియా ఈవెంట్లకు దూరమయ్యాడు. ఇతని ఫామ్ దృష్ట్యా ఇందులో ఎదురయ్యే ప్రత్యర్థులు, సాధించే విజయాలు ఏమంత విషయం కానేకాదు. కానీ వ్యాక్సినేషన్‌కు దూరం కావడంతో ఇప్పుడు టైటిళ్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) నిబంధనల ప్రకారం విదేశీయులెవరైనా తప్పనిసరిగా టీకా తీసుకుంటేనే అమెరికాలో అనుమతిస్తారు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఆడలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..! View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫొటోలు
-
తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య
మెల్బోర్న్: ప్రస్తుత సీజన్ తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన భారత స్టార్ సానియా మీర్జా ఇప్పుడు దానిపై పశ్చాత్తాప పడుతోంది. నిర్ణయం సరైనదే అయినా ప్రకటించిన సమయం సరైంది కాదని, ఆ విషయంలో తొందరపడినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్య చేసింది. ‘ఇప్పుడు అంతా నా ఆట గురించి కాకుండా రిటైర్మెంట్ తర్వాతి విషయాలపైనే మాట్లాడుతున్నారు. దాని గురించే అడుగుతున్నారు. ఆఖరి సీజన్ అయినంత మాత్రాన నా ఆటలో, ఆలోచనా ధోరణిలో మార్పు ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. ఆటను ఆస్వాదిస్తూనే గెలిచేందుకు 100 శాతం శ్రమిస్తాను. ఫలితం ఎలా వచ్చినా నా ప్రయత్నంలో లోపం ఉండదు. రిటైర్మెంట్ తర్వాతి అంశాల గురించి నేను అసలు ఆలోచించడమే లేదు. నిజాయితీగా చెప్పాలంటే రిటైర్మెంట్ గురించి నేను చాలా తొందరపడి ప్రకటన చేశాను. ఇప్పుడు దానికి నేను చింతిస్తున్నాను’ అని 35 ఏళ్ల సానియా మీర్జా వ్యాఖ్యానించింది. -
Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి'
మహిళల టెన్నిస్ సూపర్ స్టార్ నయామి ఒసాకా తన బ్రేక్టైమ్ను ఫుల్ స్వింగ్‌తో ఆస్వాధిస్తోంది. ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్‌లో మూడోరౌండ్లోనే ఇంటిబాట పట్టిన ఒసాకా కొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దొరికిన సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న ఒసాకా తనకిష్టమైన వంటల్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వాటికి గమ్మత్తైన పేర్లు పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాగ్యూ కాస్తూ అనే జపనీస్ కర్రీనీ వండిన ఒసాకా దానిని ఇన్‌స్టాలో పంచుకుంటే.. ఈరోజు మీ ముందుకు వాగ్యా కాస్తూ జపనీస్ కర్రీనీ తీసుకొచ్చాడు.. కానీ అది సరిగా కుదిరిందో లేదో చూడాలి.. ఇకపై నన్ను ''చెఫ్ బొయార్డీ'' అని పిలవండి. అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా... బ్రేకప్ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్! ఇక ఈ ఏడాది ఒసాకాకు పెద్దగా కలిసిరాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రెండోసారి గెలిచిన ఒసాకా 2021 ఏడాదిని ఘనంగానే ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరోగ్య సమస్యలతో వింబుల్డన్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మూడోరౌండ్లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది. ఇక 24 ఏళ్ల ఒసాకా తన టెన్నిస్ కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ అందుకుంది. ఇటీవలే టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ''2021లో అత్యంత ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు'' జాబితాలో నయామి ఓసాకా చోటు దక్కించుకోవడం విశేషం. -
టెన్నిస్ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి: యూకే
లండన్: బ్రిటన్ చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ భద్రత దృష్ట్యా ఆమె ఆచూకికి సంబంధించి ధృవీకరించ దగిన ఆధారాలను అందించాలని చైనాను కోరింది. ఆమె అదృశ్యం కావడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని దయచేసి సాధ్యమైనంత వరకు సరైన ఆధారాలను త్వరితగతిన అందించాలంలూ బీజింగ్‌లోని యూకే విదేశీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమకు ఏం జరుగుతోందని భయపడకుండా ప్రతిఒక్కరు మాట్లాడటానికి ముందుకు రావలంటూ విజ్ఞప్తి చేసింది. (చదవండి: అమెజాన్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని నివేదికలు సత్వరమే దర్యాప్తు చేయాలంటూ బ్రిటన్ వక్కాణించింది. పైగా యూనైటెడ్ స్టేట్స్, యూఎన్ టెన్నిస్ స్టార్ ఆచూకి కోసం పిలుపినిచ్చే నేపథ్యంలో చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ చక్కగా నవ్వుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా చైనా పోస్ట్ చేసింది. దీంతోబ్రిటన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రెండుసార్లు గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఛాంపియన్ని గెలుచుకున్న 35 ఏళ్ల పెంగ్ షువాయ్ ఆచూకీ గురించి అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. పైగా పెంగ్ ఈ నెల ప్రారంభంలో ఒక మాజీ వైస్ ప్రీమియర్ తనను సెక్స్ చేయమని బలవంతం చేశాడని ఆరోపించిన నేపథ్యంలోనే ఆమె ఆచూకి కానరాకపోవడం గమనార్హం. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) -
చిన్ననాటి స్నేహితురాలితో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్
Sam Billings Engaged With Long Term Girl Friend.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ తన చిన్ననాటి స్నేహితురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. టెన్నిస్ ప్లేయర్ అయిన సారా కాంట్లేతో లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న సామ్ బిల్లింగ్స్ శనివారం ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా బిల్లింగ్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో లక్కీ పర్సన్ నేనే.. మిస్టర్ బి టూ అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో ట్రోఫీలు గెలుచుకున్న కాంట్లే సైకాలజీలో మేజర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2015లో ఇంగ్లండ్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ 25 వన్డేల్లో 607 పరుగులు.. 33 టి20ల్లో 417 పరుగులు చేశాడు. ఈ ఆరేళ్లలో రొటేషన్ పద్దతిలో ఇన్ అవుట్‌గా ఉన్నప్పటికి ఏనాడు జాతీయ జట్టుకు దూరమైన దాఖలాలు కనిపించలేదు. ఇటీవలే టి20 ప్రపంచకప్ 2021లోనూ సామ్ బిల్లింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సూపర్ 12లో మంచి విజయాలు సాధించినప్పటికి.. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: Mitchell McClenaghan: 72 గంటలు కాలేదు.. భారత్- న్యూజిలాండ్ సిరీస్ 'మీనింగ్లెస్' View this post on Instagram A post shared by Sam Billings (@sambillings) -
టెన్నిస్ క్రీడాకారిణి జాఫ్రీన్‌కు జాతీయ పురస్కారం
సాక్షి, అమరావతి: బధిరుల (డెఫ్) ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ జాతీయ పురస్కారానికి ఎంపికైంది. విభిన్న ప్రతిభావంతుల సాధికారత–2020లో భాగంగా ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాఫ్రీన్ అవార్డును అందుకుంటారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ లేఖ పంపినట్టు జాఫ్రీన్ తండ్రి జాకీర్ ఆదివారం తెలిపారు. కర్నూలుకు చెందిన జాఫ్రీన్ అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు, జాతీయ స్థాయిలో 8 బంగారు పతకాలు సాధించింది. 2017లో టర్కీలో జరిగిన బధిరుల (డెఫ్) ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. భారత డెఫ్ టెన్నిస్ జట్టు సారథిగా ఉన్న ఆమె ర్యాంకింగ్స్ పరంగా దేశంలో 1వ, అంతర్జాతీయంగా 12వ స్థానంలో కొనసాగుతోంది. 2022లో బ్రెజిల్లో జరిగే డెఫ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్టు జాఫ్రీన్ ‘సాక్షి’తో చెప్పింది. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం జాఫ్రీన్ హైదరాబాద్‌లో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదవండి: హరిత టపాసులతో కాలుష్యానికి చెక్ -
ముగ్గురి వల్ల ఆ దేశం మరోసారి వార్తల్లోకెక్కింది..
భూకంపాలో, సునామీలో వస్తే తప్ప జపాన్ సాధారణంగా వార్తల్లో ఉండదు. తన మానాన తను ఉంటుంది. అయితే ఇప్పుడా జపాన్ని ముగ్గురు మహిళలు వార్తల్లోకి తెచ్చారు. ఆ ముగ్గురూ.. సికొ హషిమొటొ (56), మమొకొ నొజొ (22), నవోమి ఒసాక (23). షహిమొటో రాజకీయ నాయకురాలు. మమొకొ నొజొ విద్యార్థిని. నవొమి ఒసాక టెన్నిస్ ప్లేయర్. ఒక ఆర్డర్లో అయితే ముందుగా నవొమి ఒసాక గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇవాళ ఉమెన్స్ సింగిల్ ఫైనల్స్ ఆడుతున్నారు ఆమె. అంటే ఫైనల్ వరకు వచ్చారని గొప్పగా చెప్పుకోవడం కాదు. శుక్రవారం నాడు టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ని ఓడించి మరీ ఆమె ఫైనల్స్‌కి చేరున్నారు. ఈ రోజు ఆమె తలపడుతున్నది అమెరికన్ ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీ మీద. జెన్నిఫర్ ర్యాకెట్ శక్తీ తక్కువేమీ కాదు. పైగా ఒక అమెరికన్ (సెరెనా) ని ఒసాక ఓడించినందుకు బదులుగా ఇంకో అమెరికన్ (జెన్నిఫర్) ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని యూఎస్ లోని సెరెనా అభిమానులు కోరుకుంటున్నారు. వారికంటే ఎక్కువగా.. టైటిల్‌ను ఒసాక గెలుచుకోవాలని జపాన్ క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సెరెనానే ఓడించిందంటే జెన్నిఫర్ ఎంత అనే అనుమానాలూ అమెరికాలో ఉన్నాయి. ఒసాక జపాన్ దేశస్థురాలే అయినా ఉండటం అమెరికాలోనే. సికొ హషిమొటొ ఇప్పుడిక రాజకీయ నేత హషిమొటో గానీ, విద్యార్థిని మమొకో గానీ.. ఈ ఇద్దరిలో మొదట ఎవరి గురించి చెప్పుకున్నా రెండోవారిని తక్కువ చెయ్యడం కాదు. వేర్వేరు రంగాల వారైనా ఇద్దరూ ఒకే విషయమై వార్తల్లోకి వచ్చినవారు. వయసులో పెద్ద కనుక హషిమొటోకే ప్రాధాన్యం ఇద్దాం. గురువారం ఆమె ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం నుంచి వస్తుంది ఆ ఆర్డర్. ఇంకో ఐదు నెలల్లో జపాన్‌లో ఒలింపిక్ గేమ్స్ ఉండగా.. జరిగిన నియామకం ఇది. కమిటీకి చీఫ్‌గా ఇటీవలి వరకు ఉన్న యషిరో మొరి (83) గత శుక్రవారం ఆ పదవికి తప్పనిసరై రాజీనామా చేయవలసి వచ్చింది. జపాన్ మాజీ ప్రధాని కూడా యహిరో మొరి. ఆయనంతటి వారు రాజీనామా చేయవలసి రావడానికి కారణం.. మహిళలపై ఆయన చేసిన కామెంట్లే. ‘‘మీటింగ్స్‌లో ఈ ఆడవాళ్లు ఓవర్‌గా మాట్లాడతారబ్బా.. అదేం అలవాటో’’ అని అన్నారు ఆయన. ఆ మాటలే ఆయన పదవి మీదకు కత్తిని తెచ్చాయచి. అలా ఖాళీ అయిన ఆ సీట్లోకే హషిమొటో వచ్చారు. ప్రస్తుతం ఆమె జపాన్ కేబినెట్లో ‘ఈక్వాలిటీ మినిస్టర్’. ఆ మంత్రి బాధ్యతలకు కొంతకాలం విరామం ఇచ్చి ఒలింపిక్స్ ఏర్పాట్ల విధి నిర్వహణలో ఉండబోతున్నారు. మమొకొ నొజొ అసలు ఆ పెద్దాయన యషిరో మొరి ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్‌గా నిష్క్రమించడానికి కారణం మమొకొ నొజొ విద్యార్థిని. ‘ఆ స్థాయిలో ఉండి మహిళలపై అలాంటి కామెంట్స్ చేయడం తగని పని. ఆయన వెంటనే రాజీనామా చేయాలి’ అని నొజొ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే లేవదీశారు.‘డోంట్ బి సైలెంట్’ అంటూ ఆన్లైన్లో లక్షా 50 వేల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. టోక్యోలోని కియో యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం అర్థశాస్త్రం చదువుతున్నారు ఆమె. చదువే కాకుండా.. ‘నో యూత్ నో జపాన్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, సామాజిక అంశాలపై ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు. జపాన్‌లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని అంటున్న నొజొ.. స్త్రీ పురుష అసమానతలపై స్పందించే వారు జపాన్‌లో నానాటికీ తగ్గిపోతున్నారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ చీఫ్‌ని మార్చేలా చేయడం ద్వారా నొజొ విజయం సాధించారు. ఒలింపిక్ కమిటీకి కొత్తగా వచ్చిన హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చిన ఒక మహిళగా విజేతగా నిలిచారు. ఈరోజు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో ఒసాకా తన ప్రత్యర్థిని ఓడిస్తే అదొక విజయం అవుతుంది. ముగ్గురూ ముగ్గురే. -
‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?
కోల్‌కతా: వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ‘మహమ్మారి బారిన పడతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నేను నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చరిత్ర పుటల్లో భారత్ పేరు లిఖించేందుకే నేను 30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను కొట్టే టెన్నిస్ బంతికి నా వయస్సు గురించి తెలియదు. కేవలం ఎంత బలంగా, వేగంగా బాదుతున్నాననే అంశంపై అది కదులుతుంది. నాలో మరో ఒలింపిక్స్ ఆడేందుకు కావాల్సినంత ప్రేరణ ఉంది. విశ్వ క్రీడల్లో అత్యధికంగా వరుసగా ఎనిమిదిసార్లు టెన్నిస్ ఆడిన వ్యక్తిగా భారత్ పేరిట రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. టోక్యో ద్వారా ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేస్ వివరించాడు. నిజానికి గతేడాది క్రిస్మస్ రోజున... 2020 టెన్నిస్ సీజన్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ముగిస్తానని పేస్ ప్రకటించాడు. ఈ మేరకు ‘వన్ లాస్ట్ రోర్’ స్లోగన్‌తో ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. కరోనా కారణంగా ఏడాదిపాటు ఒలింపిక్స్ వాయిదా పడటంతో పేస్ మళ్లీ రాకెట్‌పట్టడం అనుమానంగా మారింది. తాజాగా పేస్ తన మనసులో మాటను బయటపెట్టడంతో ఒలింపిక్స్‌లో అతని ప్రాతినిధ్యం ఖాయంగానే అనిపిస్తోంది. ఈ సైకిల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్.. సైకిల్‌ను నడిపించే ప్రయత్నంలో ఇలా జారి కిందిపడ్డాడు. -
వాడే నా జీవితం : సానియా
తల్లి కావడం గొప్ప వరం. ప్రతి మహిళ కూడా ‘అమ్మ’ పిలుపును అత్యుత్తమ గౌరవంగా భావిస్తుంది. బిడ్డను ఆడిస్తూ, పాడించాలని కోరుకుంటుంది. పార్కుల్లోకి తీసుకెళ్లి ప్రకృతిని పరిచయం చేయాలని ఆశపడుతుంది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడవన్నీ నాశనం అయ్యాయి. ఈ మహమ్మారి పిల్లల ఆహ్లాదకరమైన పనులన్నీ నాశనం చేసింది. పిల్లలకు స్కూళ్లుల్లేవు, బయటకు తీసుకెళ్దామంటే కరోనా భయం.ఇంట్లో ఉండే పిల్లలు నాలుగు గోడలమధ్యే ఉండాల్సిన పరిస్థితి. ఈ మహమ్మారి తల్లుల జీవితాలను చాలా కష్టతరం చేసింది. ఎందుకంటే చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి వారికి కష్టమైన పని. చిన్న పిల్లలను ఆడించడం, చురుకుగా ఉంచాలంటే మాములు విషయం కాదు. కానీ ప్రతి తల్లి తన పిల్లలను ఇంట్లో వినోదభరితంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. దీనికి భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అతీతం కాదు. కరోనా సమయంలో సానియా మీర్జా తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. ఆమె అటు టెన్నిస్ ప్రాక్టీస్‌ను, ఇటు కొడుకు ఆలనా పాలనను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.(చదవండి : బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ బాదుతాడు) బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే గ్రౌండ్లోకి అడుగుపెట్టిన సానియా.. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు. ఓ వైపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూనే.. తన లిటిల్ హీరో ఇజాన్ మీర్జా మాలిక్‌తో ‘అమ్మ’తనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొడుకును గ్రౌండ్‌కు తీసుకెళ్లి స్వేచ్ఛగా తిప్పుతోంది. బుడ్డోడు చేసే చిలిపి పనులు చూసి మురిసిపోతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంటుంది. ‘వాడే నా జీవితం.. నాలో భాగం నా లిటిల్ హీరో’ అంటూ సానియా మురిసిపోతుంది. తల్లి అయిన తర్వాత తన జీవితమే మారిపోతుందని చెబుతోంది. ఒక తల్లిగా నా కుమారుడిని ఆలనా, పాలన చూసూకోవడం తన బాధ్యత అంటుంది. ‘ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ, ఇది పొందుతున్న అద్భుతమైన అనుభూతి’ అంటూ సానియా తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.అక్టోబర్ 30, 2018న సానియా ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
బరిలో దిగుతానో... లేదో!
న్యూయార్క్: ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్‌లో ఆడాలా... వద్దా... అనే సందిగ్ధంలోనే ఉన్నానని జర్మనీ టెన్నిస్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ తెలిపాడు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటమే అందుకు కారణమని 23 ఏళ్ల జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. ఒక టెన్నిస్ వెబ్సైట్ ఇంటర్వూ్యలో అతను మాట్లాడుతూ ‘ప్రస్తుతం అమెరికా పరిస్థితి బాగా లేదు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో యూఏస్ ఓపెన్‌లో ఆడే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నా టీమ్‌తో చర్చించి త్వరలోనే ఈ విషయంపై స్పష్టతనిస్తా’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ, పురుషుల సింగిల్స్ ఆటగాడు నిక్ కిరియోస్ టోర్నీలో ఆడటం లేదని ప్రకటించారు. యూఎస్ ఓపెన్ ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగనుంది. -
బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ బాదుతాడు
లాక్డౌన్లో భాగంగా పలువురు క్రీడా ప్రముఖులు ఇంటికే పరిమితమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు చేరువవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సానియా మీర్జా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘బాబాయ్ (అసద్) 4 బౌండరీ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారు’ అని సానియా కామెంట్ జతచేశారు. (‘ఆ పది మంది’ లేకుండా...) ఇక ఈ సంభాషణలో.. సానియా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. చిన్నారి ఇజాన్ బౌబౌ అంటూ డాగ్‌లా అనుకరిస్తూ సమాధానం ఇస్తాడు. ఇక అసద్ బాబాయ్ (అసద్) ఏం చేస్తారని అడుగుతూనే.. అసద్ ఫోర్ కొడతారని బదులు ఇస్తారు సానియా. అదే విధంగా బాబా (మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని తన కూమారుడితో సానియా సరదాగా సంభాషిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో పాటు పలువురు క్రీడా ప్రముఖలు లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటికే 1.7 లక్షల మంది లైక్ చేశారు. అక్టోబర్ 30, 2018న సానియా ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram Asad khaalu hits a 4 but Baba hits a 6 😏 he might be a bit biased 💕 🤣@izhaan.mirzamalik #Myizzy A post shared by Sania Mirza (@mirzasaniar) on Jun 27, 2020 at 11:34pm PDT -
నన్నూ అలాగే చేశారు
వాషింగ్టన్: అమెరికా పోలీసులతో కర్కశమైన అనుభవం తనకూ ఎదురైందని నల్లజాతి టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్ వివరించాడు. ఐదేళ్ల క్రితం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ సమయంలో ఈ ఘటన జరిగిందని, అది తలచుకుంటే పోలీసుల తీరుపై ఇప్పటికీ వణుకు పుడుతుందని 40 ఏళ్ల బ్లేక్ చెప్పాడు. ‘2015లో యూఎస్ ఓపెన్ జరుగుతుండగా నేను మన్హటన్ హోటల్ బయట నిల్చున్నాను. ఒక అభిమాని నాకు సమీపంగా వచ్చి నా మ్యాచ్‌ల్ని ఆసక్తిగా చూసేవాడినని చెప్పాడు. తన కూతురు టెన్నిస్ ఆడుతుందన్నాడు. తర్వాత కాసేపటికే న్యూయార్క్ పోలీసులు నన్ను కర్కశంగా అదుపులోకి తీసుకున్నారు. క్రెడిట్ కార్డు మోసానికి పాల్పడిన వ్యక్తి నాలాగే ఉండటంతో నేనే మోసగాడినని నిశ్చయించుకున్న పోలీసులు నా పెడరెక్కలు విరిచేసి తొక్కిపెట్టేశారు. కనీస నిర్ధారణ అంటూ చేసుకోకుండానే నల్లజాతీయులపై ఈ స్థాయిలో అణచివేత ఉంటుంది’ అని ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకర్ బ్లేక్ నాటి భయంకర అనుభవాన్ని వివరించాడు. అమెరికా మాజీ టెన్నిస్ ప్లేయర్ జేమ్స్ బ్లేక్ -
తెల్లని కుర్తాలో మెరిసిన సానియా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రంజాన్ ఈద్ పండగ వేడుకలు’ అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు. ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. ‘చాలా అందంగా కనిపిస్తున్నారు’అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్‌గా ఉన్నాడు. ‘లాక్డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి’ అని సానియా మరో ట్వీట్లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. Eid vibes 🌙🤲🏽 #MyIzzy pic.twitter.com/O9BmeUBjql — Sania Mirza (@MirzaSania) May 25, 2020 -
ఒసాకా ఆర్జన రూ. 284 కోట్లు
వాషింగ్టన్: ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జించిన క్రీడాకారిణిగా జపాన్ టెన్నిస్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా గుర్తింపు పొందింది. ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 ఏళ్ల ఒసాకా ప్రైజ్‌మనీ, ఎండార్స్మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు (రూ. 284 కోట్లు) సంపాదించింది. గత నాలుగేళ్లుగా టాప్ ర్యాంక్‌లో నిలిచిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 3 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 273 కోట్లు) సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో ఒసాకా 29వ ర్యాంక్‌లో, సెరెనా 33వ ర్యాంక్‌లో ఉన్నారు. 2016 తర్వాత టాప్–100లో ఇద్దరు క్రీడాకారిణులు ఉండటం ఇదే తొలిసారి. 2020 సంవత్సరానికి ఎక్కువ మొత్తం ఆర్జించిన క్రీడాకారుల పూర్తి జాబితాను వచ్చే వారం విడుదల చేస్తామని ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. 2013లో ప్రొఫెషనల్‌గా మారిన ఒసాకా 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను... 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ‘బ్యాక్ టు బ్యాక్’ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో ర్యాంక్‌లో ఉన్న ఒసాకా 15 అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. -
ఫైనల్లో సంజన
సాక్షి, హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సంజన సిరిమల్ల విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న రొలాండ్ గారోస్ వైల్డ్ కార్డు టోర్నీ బాలికల సింగిల్స్ విభాగంలో సంజన ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సంజన 6–4, 7–5తో టాప్ సీడ్ రేష్మా మారూరి (కర్ణాటక)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో వైష్ణవి ఆడ్కర్ (మహారాష్ట్ర)తో సంజన ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఆ టోర్నీలో మెక్సికో, బ్రెజిల్, చైనా దేశాల నుంచి అర్హత సాధించిన క్రీడాకారిణులతో ఆడతారు. క్వాలిఫయింగ్ టోర్నీ విజేతకు మే–జూన్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ దేవ్ జవియా 6–2, 6–1తో నితిన్ సింగ్‌పై, మూడో సీడ్ చిరాగ్ 6–1, 6–0తో మోహిత్‌పై గెలుపొందారు. -
జారిపడ్డాడు
అనుకోకుండా చేసే పనులు కొన్నిసార్లు ఆపదలోకి నెట్టేస్తాయి. ఇలియట్ బెంచెట్రిట్కు వచ్చింది ఆపద కాకున్నా.. అందుకు సమానమైనదే. అతడి ఇమేజ్ ఆపదలో పడిపోయింది. (గట్టెక్కే ప్రయత్నం చేశాడు లెండి). ఇలియట్ ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు జరుగుతుంటే అక్కడున్నాడు. తన ఆట మధ్యలో విరామం రావడంతో.. పక్కకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అటుగా బాల్ గర్ల్ వస్తే దగ్గరకు రమ్మని ఆ అమ్మాయిని పిలిచాడు. (ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ కొట్టిన బంతిని తెచ్చి ఇచ్చే అమ్మాయిల్ని బాల్ గర్ల్స్ అంటారు). ఆ అమ్మాయి ఇలియట్ దగ్గరికి వచ్చింది. ఆమెకు అరటి పండు ఇచ్చి ఒలిచి ఇమ్మని అడిగాడు. ఆమె ఒలవబోతుంటే.. చెయిర్ అంపైర్ అడ్డుపడ్డాడు. ‘‘బాల్ గర్ల్ ఏమీ నీ బానిస కాదు’’ అని ఇలియట్పై కోప్పడ్డాడు. అతడు నివ్వెరపోయాడు. ‘తప్పేముందీ! నా రెండు చేతులకూ వ్యాక్స్ ఉంది. ఒలుచుకోలేక తనకు ఇచ్చాను’’ అన్నాడు. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఆ వీడియో వైరల్ అయి నెటిజన్లంతా ‘ఇలియట్ కాదు.. ఇడియట్’ అని తిట్టేస్తున్నారు. దీనికన్నా అరటితొక్క మీద నుంచి జారి పడటమే నయం అని ఇలియట్ అనుకుని ఉండాలి పాపం. -
సైలెంట్ రాకెట్
ఆమెకు స్పష్టమైన వాక్కు లేదు.. అయినా తనకున్న ప్రతిభతో లోకం అవాక్కు అయ్యేటట్లు చేసింది. ధ్వని తరంగాలు ఆమె చెవిని తాకలేవు.. కానీ ఆమె మోగించిన విజయదుందుభి ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. బధిరుల విభాగంలో టెన్నిస్ ఆటలో భారతదేశంలోనే నంబర్ వన్ ర్యాంకర్‌గా, ప్రపంచంలో 12వ ర్యాంకర్‌గా నిలిచిన షేక్ జాఫ్రీన్ విజయగాధ ఇది. షేక్ జాఫ్రీన్‌కు పుట్టకతోనే చెవుడు. ఏమాత్రం వినిపించదు. ఇతరులు మాట్లాడితే ఆర్థం చేసుకోగలరు. అయితే సత్తా చాటేందుకు ఈవేమీ ఆమెకు అడ్డుకాలేదు. లెక్కలేనన్ని పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు సాధించారు. వాస్తవానికి కర్నూలులో టెన్నిస్ క్రీడకు వసతులు, సౌకర్యాలు లేవు. కోచ్ లేరు. అయినా కేవలం ఆ క్రీడ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించిపెట్టింది. జాఫ్రీన్ క్రీడను మెచ్చి ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఆకాడమీలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించారు. జాఫ్రీన్ తండ్రి షేక్ జాకీర్ అహ్మద్ కర్నూలులో న్యాయవాది. ఆమె తల్లి షేక్ మైమున్ రిహాన. బి క్యాంపు ఏరియాలో నివాసం. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు జావీద్ అహ్మద్ బీటెక్ పూర్తి చేశాడు. కుమార్తె షేక్ జాఫ్రీన్ స్థానిక పాఠశాలలో చదివి, ఆరవ తరగతి నుంచి శ్రీలక్ష్మీ ఇంగ్లీషు మీడియం స్కూలులో చేరి, టెన్త్‌లో ‘ఏ’ గ్రేడ్‌తో పాసై ప్రతిభ అవార్డు సాధించింది. ఇంటర్ ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ (బీఏ) ఉస్మానియా మహిళల డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని మెహిదీపట్నం సెయింట్ ఆన్ ఉమెన్స్ కళాశాలలో ఎంసీఏ చేస్తున్నారు. జాఫ్రీన్ తండ్రి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడేవారు. ప్రతిరోజు కూతుర్ని స్టేడియంకు తీసుకెళ్లేవారు. అలా.. పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ వైపు వెళ్లి ఆ ఆటపై మక్కువ పెంచుకుంది పద్నాలుగేళ్ల క్రితమే చిన్న వయసులో ర్యాకెట్ జాఫ్రీన్. అప్పటి నుండి టెన్సిస్‌లో మెరుపులు మెరిపిస్తోంది. జాఫ్రీన్ ఫోర్ హ్యాండ్ షాట్లో ఆరితేరారు. బలమైన షాట్లతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. ఎలాంటి శిక్షణ, మౌలిక సదుపాయాలు లేకున్నా.. దాతల సహకారంతో ఆడి తనకున్న లక్ష్యంతో రాకెట్లా దూసుకు పోతున్నారు. ఊహించని వరం హైదరాబాదులోని ముర్తుజా గూడలో ఉన్న సానియా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం రావడం అంత సులువేమికాదు. దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినా సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. పదునైన షాట్లతో టెన్నిస్ క్రీడలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జాఫ్రీన్ ఆట తీరును చూసి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా నేరుగా జాఫ్రీన్ తండ్రి జాకీర్‌కు ఫోన్ చేసి తన అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని పిలిచారు. ఆ అకాడమీలో జాఫ్రీన్‌కు ఉచితంగా సీటు లభించడం అమె ప్రతిభకు దక్కిన గుర్తింపే. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బెంగళూరులోని జీషాన్ టెన్నిస్ అకాడమీలో జాఫ్రీన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. 2021 వరకు ఈ శిక్షణ ఉంటుంది. ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 19 వరకు టర్కీలోని అంతలియా సిటీలో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్, నవంబరు 1 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే ఏషియన్ పసిఫిక్ డెఫ్ గేమ్స్‌కు జాఫ్రీన్ ఎంపికయ్యారు. 2021లో దుబాయిలో జరిగే ఒలింపిక్స్ డెఫ్ విభాగంలో బంగారు పతకం సాధించడమే ముందున్న లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. టర్కీ, ఏషియన్ ఆటలతోపాటు ఒలింపిక్స్‌లోనూ ఆమె బంగారు పతకం సాధించి, భారతదేశం పేరును ప్రపంచానికి చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. – ఎస్.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు వరుస విజయాలు.. పతకాలు 2012లో న్యూఢిల్లీలో జరిగిన 20వ జాతీయ స్థాయి డెఫ్ (బదిర) క్రీడాపోటీల్లో మహిళల సింగిల్స్, డబుల్స్ పోటీల్లో బంగారు పతకం. 2013లో న్యూఢిల్లీ స్పోర్ట్సు అథారిటి ఆఫ్ ఇండియా తరపున బల్గేరియా లోని సోఫియా సిటీలో జరిగిన డెఫ్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం. జపాన్‌లో జరిగిన మొదటి రౌండ్లో, రెండవ రౌండ్లో టర్కీపై విజయం. 2014లో జర్మనీలోని హంబర్గ్ రాష్ట్రంలో నిర్వహించిన 2వ ఓపెన్ డెఫ్ యూత్ టెన్నిస్ కప్ క్రీడ పోటీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో రెండు వెండి పతకాలు. 2015లో తైవాన్‌లోని తయూనా సిటీలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్ డెఫ్ క్రీడల్లో రజత పతకం. 2016లో స్లోవేనియాలోని పోర్టురోజ్ రాష్ట్రంలో జరిగిన స్లోవెనీయా డెఫ్ టెన్నిస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో రజత పతకం. 2017లో టర్కీలో జరిగిన మిక్స్డ్ డబుల్ ఒలింపిక్‌లో కాంస్య పతకం. అదే ఏడాది జరిగిన స్లోవేనియా డెఫ్ టెన్సిస్ ఓపెన్స్‌లో రజిత పతకం. 2018లో టర్కీలో జరిగిన ప్రపంచ డెఫ్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో 8వ స్థానం. 2019 జనవరి 27 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో 23వ జాతీయ ఆటల్లో బంగారు çపతకం. -
‘సిల్లీ ప్రశ్న.. సూపర్బ్ రియాక్షన్స్’
కెనడా టెన్నిస్ ప్లేయర్ యూజిని బౌచర్డ్ ఆట పరంగా కాకుండా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. బౌచర్డ్ ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో బౌచర్డ్‌కు ట్విటర్లో తెగ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె చేసే పోస్ట్‌లకు అభిమానులు క్షణాల్లోనే రియాక్ట్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. గతంలో సరదాగా చేసిన ఓ ట్వీట్ తెలియని వ్యక్తితో డేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పందెంలో ఓడిపోవడంతో అపరిచిత వ్యక్తితో డేట్‌కు వెళ్లింది. ఈ వార్త అప్పట్లో తెగ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ట్విటర్ వేదికగా బౌచర్డ్ అడిగిన సిల్లీ ప్రశ్నకు నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ టెన్నిస్ భామ తెగ ఉబ్బితబ్బిబవుతోంది. ఇంతకీ ఈ అమ్మడు పోస్ట్ చేసిందేమిటంటే. ‘ఆర్డర్ చేయడానికి బెస్ట్ పిజ్జా ఏంటి?’అని పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. కొందరు నిజాయితీగా తమకు నచ్చిన పిజ్జాలను సూచించారు. అయితే చాలా మంది నెటిజన్లు బౌచర్డ్‌పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేయగా ఆమె ఓపిగ్గా లైక్‌లు కొట్టారు. మరి కొందరు వ్యంగ్యంగా కామెంట్ పెడుతున్నారు. పిజ్జాలు పక్కకు పెట్టి.. ముందు ఆటపై దృష్టి పెట్టు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొందరు ముందు ఒక్క టోర్నీనైనా గెలువు అని సలహాలు ఇస్తున్నారు. ‘నువ్వు టోర్నీ గెలిచి ఎంతకాలమైందో తెలుసా?’అంటూ మరికొందరు కామెంట్ చేశారు. సంచలనాలకు మారుపేరైన బౌచర్డ్ 2012లో జూనియర్ వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి వార్తల్లోకి ఎక్కింది. అనంతరం 2014లో డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచి మరో సంచలనం సృష్టించింది. అదే ఏడాది యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరడంతో భవిష్యత్ టెన్నిస్ ఆమెదే అని అందరూ భావించారు. కానీ అంచనాలకు మించి ఆడకపోవడంతో కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ టోర్నీలో ఏదో ఒక స్టార్ క్రీడాకారిణిని మట్టికరిపిస్తోంది. గతేడాది మాడ్రిడ్ ఓపెన్‌లో రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవాను ఓడించటంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఒక్క టోర్నీలో కూడా ఆమె మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. -
అలిసన్ స్టెప్పేస్తే.. సానియా ఫిదా
హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి అలిసన్ రిస్కే డ్యాన్స్‌కు భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫిదా అయ్యారు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అలిసన్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. భారత మాజీ డేవిస్ కప్ ఆటగాడు, కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజు కొడుకు స్టీఫెన్ అమృత్‌రాజ్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ‘ ఇప్పటినుంచి నాకు భారత అభిమానులుకు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక నుంచి నేను అమృత్‌రాజ్ కుటుంబ సభ్యురాలిని. మీ అభిమానాన్ని గెలుచుకునేందుకు చిన్న ప్రయత్నం చేశాను’అంటూ పోస్ట్ చేసింది. ఇక అలిసన్ చేసిన ట్వీట్‌కు సానియా రీట్వీట్ చేస్లూ..‘వావ్.. వాటే డ్యాన్స్. ఒక్కటి కాబోతున్న ఇద్దరికి కంగ్రాట్స్’అంటూ పేర్కొంది. ఇక ప్రస్తుతం అలిసన్ చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. అంతేకాకుండా స్టీఫెన్, అలిసన్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక 37వ సీడ్ అలిసన్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్ సెరేనా విలియమ్సన్ చేతిలో అలిసన్ ఘోరంగా ఓడిపోయింది. -
విజేత కిరియోస్
అకాపుల్కో (మెక్సికో): వివాదాస్పద ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాడు. మెక్సికో ఓపెన్‌లో అతను విజేతగా అవతరించాడు. ఫైనల్లో కిరియోస్ 6–3, 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించి కెరీర్లో ఐదో సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన కిరియోస్‌కు 3,67,630 డాలర్ల (రూ. 2 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ స్థానంలో ఉన్న కిరియోస్ ఈ టోర్నీలో పలు సంచలన విజయాలు నమోదు చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని నెగ్గగా... క్వార్టర్ ఫైనల్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను... సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ ఇస్నెర్ (అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. -
‘పాకిస్తానీని పెళ్లి చేసుకున్న మీరు..’
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా గ్యాంగ్‌రేప్, హత్య, ఉనావో అత్యాచార కేసు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఘటనలను ఖండిస్తూ ఫర్హాన్ అక్తర్, రితేశ్ దేశ్‌ముఖ్, జావేద్ అక్తర్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ఈ దురాగతాలను ఖండిస్తూ ట్వీట్ చేయగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇదేనా మనం కోరుకున్న దేశం. ఎనిమిదేళ్ల బాలికకు కుల, మత, లింగ, వర్ణ భేదాలకు అతీతంగా మనం అండగా నిలబడలేకపోతే మనం ఇంకే విషయంపైనా పోరాడలేం. అది మానవత్వం అనిపించకోదు కూడా’ అంటూ భావోద్వేగంతో సానియా ట్వీట్ చేశారు. సానియా ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్.. ‘గౌరవనీయులైన మేడమ్.. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు ఒక పాకిస్తానీని పెళ్లాడారు కదా. మీకు భారత్‌తో ఇంకా సంబంధం ఉందా. పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజల గురించి మీరు ట్వీట్ చేస్తే బాగుంటుంది అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు. అయితే సానియా మీర్జా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది ముఖ్యం కాదు. నేను భారత్ కోసం ఆడతాను. నేను భారతీయురాలిని. జీవితాంతం అలాగే ఉంటాను. నేను మీలాగా స్పందించకుండా ఉండలేను. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు ఇలాంటి సమయాల్లో మతాల గురించి, మరే ఇతర అంశాల గురించి మాట్లాడరని’ దీటుగా సమాధానమిచ్చారు. Is this really the kind of country we we want to be known as to the world today ?? If we can’t stand up now for this 8 year old girl regardless of our gender,caste,colour or religion then we don’t stand for anything in this world.. not even humanity.. makes me sick to the stomach pic.twitter.com/BDcNuJvsoO — Sania Mirza (@MirzaSania) April 12, 2018 With all respect madam which country are you talking abt.Last time I checked u had married into Pakistan. You no longer are a Indian. And if u must tweet thn also tweet for the innocents killed by Pak terror outfits.. — Kichu Kannan Namo (@Kichu_chirps) April 12, 2018 -
కుటుంబ రహస్యం చెప్పిన సానియా మీర్జా
పనాజి: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తనకు అమ్మాయిలంటేనే ఇష్టమని చెప్పింది. కుమారుడికన్నా కుమార్తెలంటేనే ఇష్టమని వారి పేర్లలో మా ఇద్దరి ఇంటి పేర్లు కలిసే ఉంటాయని సానియా చెప్పుకొచ్చింది. దీనిపై తన భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇది వరకే తాను మాట్లాడనని ఆమె తెలిపింది. ‘గోవా ఫెస్ట్’కు విచ్చేసిన సానియా మాట్లాడుతూ.. ‘నేనీ రోజు మా కుటుంబం రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో ‘మీరా మాలిక్’ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలని ఆశిస్తున్నాడు’ అని తెలిపింది. లింగవివక్షకు సంబంధించిన చర్చ తమ బంధువులు, సన్నిహితులతో తరచూ జరిగాయని చెప్పింది. ‘మా తల్లిదండ్రులకు మేమిద్దరం అమ్మాయిలమే. మాకు మాత్రం సోదరుడు లేడన్న బెంగ ఎప్పుడూ లేదు. కానీ మా బంధువులంతా మా వాళ్లతో ఓ అబ్బాయి వుంటే బాగుండేదని, మీ ఇంటి పేరు నిలబడేదని ఎప్పుడు చెబుతుండేవారు. దీంతో నేను మా బంధువులతో తగవుకు దిగేదాన్ని. అమ్మాయిలేం తక్కువని గట్టిగా వాదించేదాన్ని. నిజానికి పెళ్లయ్యాక నా ఇంటిపేరేమీ మార్చుకోలేదు. ‘మీర్జా’ను ఇకముందూ కొనసాగిస్తాను. ఈ కాలంలోనూ ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలనే తారతమ్యాలేంటి’ అని సానియా వివరించింది. -
టెన్నిస్ క్రీడాకారుడికి ఎమ్మెల్యే అభినందన
కావలి : అఖిల భారత సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ తరుఫున అఖిల భారత స్థాయిలో వెటరన్స్ విభాగంలో రాష్ట్రం నుంచి టెన్నిస్ పోటీలకు ఎంపికైన స్థానిక క్రీడాకారుడు కె.వి.క్రిష్ణారెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డిప్రతాప్కుమార్రెడ్డి అభినందించారు. ముంబాయిలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీలకు క్రిష్ణారెడ్డి ఎంపికయ్యారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం ఆయనను అభినందించారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్, నాయకులు జె.మహేంద్ర, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, షాహుల్ హమీద్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్ధురాలైన హింగిస్
మూసాపేట (హైదరాబాద్) : హైదరాబాద్ నగరం చాలా బాగుందని, ఇక్కడి అతిథ్యం ఇంకా బాగుందని టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్లో ఎస్వీఎం ఫన్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మార్టినా హింగిస్, థామస్ జాన్సన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు వినోద కేంద్రంలో బౌలింగ్ గేమింగ్ ఎంతో ఉత్సాహంగా ఆడారు. హింగిస్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో ఆడటం సంతోషంగా ఉందని, నిన్న మ్యాచ్ గెలవడం ఆనందాన్నిచ్చిందన్నారు. టైటిల్ కోసం కృషి చేస్తామని చెప్పారు. -
’ఇండియా టెన్నిస్ బేషుగ్గా ఉంది’
-
అబ్బో ఎంత వేడి!
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘భారత దేశానికి ఎన్నోసార్లు వచ్చాను, చెన్నైకి రావడం ఇదే మొదటి సారి, అబ్బో ఈ చెన్నైలో ఎంతవేడి’ అంటూ వ్యాఖ్యానించారు స్పానిష్కు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఫెలిసియానో లోపెజ్. చెన్నై ఓపెన్ టెన్నిస్‌కు ఎయిర్‌సెల్ స్పాన్సర్స్‌గా నిలిచి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నై కీల్కాక్లోని ఎయిర్‌సెల్ స్టోర్‌కు అతిథిగా విచ్చేసిన లోపెజ్ కొంతసేపు సందడి చేశారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. టెన్నిస్ బంతిపై సంతకాలు చేసి అందజేశారు. ఆహూతులతో తన అనుభవాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా లోపెజ్కు స్వాగతం పలికిన ఎయిర్‌సెల్ ఎస్‌బీయూ 1 (చెన్నై, రోటన్) హెడ్ కే శంకరనారాయణ్ అతనితో మాట్లాడుతూ, చెన్నై అనుభవం ఎలా ఉందని ప్రశ్నించగా, ఈ వేడి ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నానన్నారు. మాకు ఇది చలికాలం అని బదులివ్వడంతో లోపెజ్ విస్తుపోయారు. దక్షిణాది వంటలు రుచి చూశారా అని ప్రశ్నించగా పూరీ కూర భలే నచ్చిందన్నాడు. ప్రత్యేక డేటా బ్యాంక్‌తో కూడిన ఎయిర్‌సెల్ 3జీ సిమ్‌కార్డును లోపెజ్కు బహూకరించిన అనంతరం శంకరనారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారుల్లో 14వ స్థానంలో ఉన్న లోపెజ్ తాము స్పాన్సర్చేసే జట్టులో ఉండడం గర్వకారణమని అన్నారు. చెన్నై ఓపెన్ టెన్నిస్‌తో ఎయిర్‌సెల్ కలిసి నడిచి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయిందన్నారు. టెన్నిస్ క్రీడతో మమేకమై తమ ఖాతాదారులకు సెల్‌ఫోన్ సేవలతోపాటూ అదనపు ఆనందాన్ని కలుగజేస్తున్నామని చెప్పారు. తమిళనాడులో 25 మిలియన్లు, దేశంలో 75 మిలియన్ల వినియోగదారులున్నట్లు వివరించారు. -
సోమ్‌దేవ్ వర్మన్‌తో సాక్షి ఫేస్ టు ఫేస్
-
సెక్యూరిటీ ఇవ్వండి ఆభరణాలు కాదు...
ఇప్పటికీ మన దేశంలో... ఆడపిల్ల అనగానే దిగులు పడిపోయే తల్లిదండ్రులకు తక్కువేమీ లేదు. కొందరు గర్భంలోనే తుంచేద్దామని ఆలోచిస్తే, కొందరు పుట్టిన తరువాత ఎలా వదిలించుకుందామా అని చూస్తుంటారు. ఇంకా పాపకి ఊహ కూడా రాకముందే... ఆమెకి పెళ్లి ఎలా చేయాలి, ఎంత కట్నం ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అని టెన్షన్ పడిపోతుంటారు. ఆడపిల్లని చూడగానే పెళ్లి అన్నమాటే ఎందుకు గుర్తొస్తుందో ఇప్పటికీ అర్థం కాదు. సమాజం ఇంతకుముందులా లేదు. ప్రపంచం వాయువేగంతో పరిగెడుతోంది. ఆ వేగాన్ని అందుకోవాల్సిన అవసరం పురుషులకే కాదు, మహిళలకూ ఉంది. జీవన ప్రమాణం పెరిగేకొద్దీ బాధ్యతలను స్త్రీ, పురుషులిద్దరూ పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు బయటకు వస్తున్నారు. అన్ని రంగాల్లో పాదం మోపుతున్నారు. అందలాలు ఎక్కుతున్నారు. కానీ ఇప్పటికీ మహిళలు అని గుచ్చి గుచ్చి అనడం మానలేదు కొందరు. దానికి కారణం ఉంది. శక్తి అవతలివాళ్లకు ఎలా తెలుస్తుంది? బహిర్గతపరిచినప్పుడే కదా? అందుకే ముందు మహిళల్లో చైతన్యం రావాలి. మేము ఈ పని చేయలేము, ఈ ఉద్యోగానికి సూటవము అన్న దృక్పథాన్ని వీడాలి. ఏదైనా సాధించగలిగే సత్తా ఉందని నిరూపించాలి. అయితే మహిళలు ఇలా కావడానికి తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం కూడా అవసరం. నేను మంచి టెన్నిస్ ప్లేయర్‌ని. మ్యాచ్ ఆడి ఇంటికొచ్చేసరికి నా ఒళ్లు, జుట్టు చెమటతో తడిసిపోయేవి. పెద్ద జుట్టు కావడంతో దాన్ని ఆరబెట్టుకోవడం పెద్ద సమస్యగా ఉండేది. అప్పుడు మా పేరెంట్స్ నన్ను జుట్టు కట్ చేసేసుకోమన్నారు. అప్పట్లో ఆడపిల్లలకు జుట్టు కట్ చేసేవాళ్లు మా ఊళ్లో లేకపోవడంతో, మగాళ్లకు చేసే బార్బర్తోనే బాయ్ కట్ చేయించేశారు. ఇది చిన్న విషయమే. కానీ వాళ్ల దృక్పథం చాలా గొప్పది. నేను చేసేదానికి ఆ చిన్న అడ్డు కూడా రాకూడదన్నది వాళ్ల ఉద్దేశం. అందరు తల్లిదండ్రులూ పిల్లల లక్ష్యాల గురించి అంతగా ఆలోచించాలి అని చెప్పేందుకే దీన్ని ఉదహరించాను. మరో విషయం ఏమిటంటే... ఎంత ఎదిగినా స్త్రీలకు సెక్యూరిటీ సమస్య ఉంటుంది. అందుకు కూడా నా తల్లిదండ్రులు ఓ మార్గం ఆలోచించారు. వాళ్లు ప్రతిసారీ నాతో రాలేరు కాబట్టి, నాలోనే చిన్న చిన్న మార్పులు చేశారు. నాకెప్పుడూ వదులుగా ఉండే చొక్కాలు, ప్యాంట్లు వేసి అబ్బాయిలా తయారు చేసి పంపేవారు. దొంగలుంటారని ఆభరణాలు కూడా పెట్టేవారు కాదు. నేను అదే చెబుతున్నాను అందరికీ. పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వండి, ఆభరణాలు కాదు. కాస్త ఆలోచిస్తే ఆడపిల్లలను పెంచడం, వృద్ధిలోకి తేవడం, సెక్యూరిటీ ఇవ్వడం... ఏదీ అంత సమస్య కాదు అని చెప్పేందుకే నేనివన్నీ చెప్పాను. ఎందుకంటే, ఈ కారణాలతోనే చాలామంది ఆడపిల్లలు వెనకబడిపోతున్నారు. ఆ అవసరం లేదు. మీలోని శక్తిని వెలికి తీయాల్సిందే. అందుకు తగిన దారుల్ని వెతికి పట్టుకోవాల్సిందే. దేనికైనా సిద్ధపడి అడుగు ముందుకు వేయాల్సిందే. ఆ తెగువ, ఆత్మవిశ్వాసం, పట్టుదల మీలో ఉండాలే కానీ... మిమ్మల్నెవరు ఆపగలరు చెప్పండి! - కిరణ్‌బేడీ, తొలి మహిళా ఐపీఎస్ -
టెన్నిస్‌లో 13గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన నాదల్
-
సెమీస్‌లో తీర్థ పరాజయం
న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ ఇస్కా తీర్థ పోరాటం ముగిసింది. జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తీర్థ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సెమీఫైనల్లో తీర్థ 3-6, 0-6తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూసింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు విఘ్నేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో విఘ్నేశ్-మహ్మద్ ఫరీజ్ జోడి 4-6, 4-6తో మోహిత్ జయప్రకాశ్ (తమిళనాడు)-అర్జున్ ఖాడే (మహారాష్ట్ర) ద్వయం చేతిలో ఓడిపోయింది.