సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్‌లలో ఫైనల్ చేరి... రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్ రెడ్డి (భారత్)–బొగ్డాన్ బొబ్రోవ్ (రష్యా) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
ఫైనల్లో సాయికార్తీక్–బొగ్డాన్ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్)–జాకుబ్ వోచిక్ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్ »ొగ్డాన్ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా సాయికార్తీక్ కెరీర్‌లో ఇది ఏడో డబుల్స్ టైటిల్‌కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్. 24 ఏళ్ల సాయికార్తీక్ 2023లో నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను, 2022లో రెండు డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్ మొత్తం 22 ఐటీఎఫ్ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్ గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment