sai karthik
-
సాయికార్తీక్ ఖాతాలో ఏడో డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్లలో ఫైనల్ చేరి... రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్ రెడ్డి (భారత్)–బొగ్డాన్ బొబ్రోవ్ (రష్యా) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాయికార్తీక్–బొగ్డాన్ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్)–జాకుబ్ వోచిక్ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్ »ొగ్డాన్ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా సాయికార్తీక్ కెరీర్లో ఇది ఏడో డబుల్స్ టైటిల్‌కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్. 24 ఏళ్ల సాయికార్తీక్ 2023లో నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను, 2022లో రెండు డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్ మొత్తం 22 ఐటీఎఫ్ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్ గెలిచాడు. -
ఆ పాట ఎంత బాగా వచ్చిదంటే..
పటాస్, సుప్రీమ్, ఈడో రకం.. ఆడో రకం, రాజుగారి గది వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ప్రస్తుతం ఆయన ‘22’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సాయికార్తీక్‌తో ఇంటర్వ్యూ.. 22 మూవీ ఎలా ఉండబోతుంది? నేను చేస్తున్న మొదటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా `22'. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా నిర్మిస్తున్నారు. బి.ఎ రాజు గారి అబ్బాయి శివ దర్శకుడిగా పరిచమవుతున్నారు. రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లు. కాన్సెప్ట్ చాలా బాగుంది.ఒక కొత్త తరహాలో సినిమా ఉంటుంది. హీరోగా రూపేష్‌కు, దర్శకుడిగా శివకు ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో బి.శివకుమార్ అనుభవం సంపాదించుకున్నారు. సంగీతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది? యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే థ్రిల్లర్ సబ్జెక్టు కాబట్టి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాకి వర్క్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ స్కోప్ ఉంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి మంచి ఎలివేషన్స్ కుదిరాయి. డిఫరెంట్ క్రైమ్ కంటెంట్‌తో వస్తున్న ఈ ప్రాజెక్టులో మూడు పాటల్ని దర్శకుడు శివ డిజైన్ చేశాడు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన`మార్ మార్ కే` సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే మరో పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా. ఈ పుట్టినరోజు స్పెషల్? స్పెషల్ అంటూ ఏమీ లేదండి. 22 సినిమా యూనిట్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా 37వ పుట్టినరోజు. నా తొమ్మిదవ ఏట నుండే రిథిమ్ ప్లేయర్ గా పనిచేశాను. తరువాత విజయ్ ఆనంద్ గారి దగ్గర నుంచి దేవిశ్రీ ప్రసాద్ వరకు చాలా మంది సంగీత దర్శకుల దగ్గర డ్రమ్మర్‌గా పనిచేశాను. తరువాత నేను కంపోజర్‌గా మారి పరిశ్రమలో పదేళ్ల కెరీర్ పూర్తయింది. ఇప్పటివరకూ దాదాపు 75 సినిమాలకు సంగీతం సమకూర్చాను. ‘నాలో చిలిపి కలా.. నీలా ఎదురైందా’ పాట మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పటికి దాదాపు 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇంకా మంచి పాటలందించాలన్న నిశ్చయంతో వున్నా. పదేళ్ల కెరీర్ ఎలా అనిపిస్తుంది? టెక్నీషియన్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. కెరీర్ పరంగా నాకు సంగీతం మాత్రమే తెలుసు అదే రంగంలో ఉన్నాను. హిట్ కొడితేనే అవకాశాలు వస్తాయి అంటారు. నా విషయంలో అలా లేదు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా పదేళ్లుగా కెరీర్ నడుస్తోంది. నా వరకు ప్రతి సినిమాకు బెస్ట్ ఇస్తూనే వచ్చాను. నేను న్యాయంగా పనిచేస్తాను. ఇక్కడ టైమ్, అదృష్టం ముఖ్యం. 2014 నుంచి 16 వరకూ మూడేళ్లలో 36 సినిమాలు చేసే అవకాశం దొరికింది. ఆడియెన్స్ అభిరుచి ఎలా ఉంది? ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పాటలకు మంచి గుర్తింపు లభిస్తోంది. టెక్నాలజీ అప్డేట్ అవుతూనే ఉంది. ఎన్నో మార్పులు చూస్తున్నాం. గతంలో ఏదైనా ఒక మార్పు చోటు చేసుకోవాలంటే ఐదేళ్లు పట్టేది. ఇపుడు రెండు, మూడు నెలల్లో మారిపోతోంది. నాకు మెలొడీ పాటలు అంటే చాలా ఇష్టం. అయితే ఎక్కువ మెలోడీలు చేసే అవకాశం రాలేదు. 22లో మంచి మెలోడీగా మదర్ సెంటిమెంట్ సాంగ్ చేశా. అది ఎంత బాగా వచ్చిందంటే ప్రతి సంవత్సరం మదర్స్‌డే కి ఈ పాట ప్లే అవుతుంది. త్వరలో మీరు వింటారు. తదుపరి చిత్రాలు? ప్రస్తుతం ఏకే ఏంటర్‌టైన్‌మెంట్స్‌తో `బంగారు బుల్లోడు`సినిమా చేస్తున్నా. నరేష్‌తో ఒక ప్రాజెక్టు, కొత్త హీరోతో మరొకటి, అలాగే కన్నడంలో రెండు సినిమాలతో బిజీగా వున్నా. -
నమ్మకం నిజమైంది
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను. మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్‌లో కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ బాగా వచ్చాయి. మౌత్ టాకే మా సినిమాకి మెయిన్ పబ్లిసిటీ’’ అన్నారు. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
రన్నరప్ సాయికార్తీక్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో గంటా సాయికార్తీక్ రెడ్డి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో సాయికార్తీక్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచాడు. బాలుర సింగిల్స్ ఫైనల్లో సాయికార్తీక్ 3–6, 4–6తో అబెదల్లా షెల్బే (జోర్డాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సాయికార్తీక్ 6–2, 7–5తో ప్రసన్న ప్రవీణ్ (భారత్)పై గెలిచాడు. డబుల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన అర్జున్ మరియప్పతో జత కట్టిన సాయికార్తీక్ 2–6, 6–7తో అలెక్స్ జియాంగ్ (కెనడా)– కెవిన్ పటేల్ (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సాయి కార్తీక్‌కు పదోస్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–15 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు సీహెచ్ సాయి కార్తీక్ రాణించాడు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ టోర్నీలో కింగ్స్ చెస్ అకాడమీకి చెందిన కార్తీక్ పదోస్థానంలో నిలిచాడు. దీంతో అతని ఎలో రేటింగ్ పాయింట్లలో గణనీయమైన పురోగతి లభించింది. అతని రేటింగ్ 1810 పాయింట్లు నుంచి 2070 పాయింట్లకి పెరిగింది. -
రన్నరప్ సాయి కార్తీక్
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్–5 బాలుర టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయి కార్తీక్ రెడ్డి రాణించాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 614వ స్థానంలో ఉన్న కార్తీక్ శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో 2–6, 5–7తో అబెదల్లా షెల్‌బా (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో కార్తీక్ 6–3, 6–3తో మొహమ్మద్ బర్హామ్ (ట్యునీషియా)పై, క్వార్టర్స్‌లో 6–0, 7–5తో అర్జున్ మరియప్ప (అమెరికా)పై విజయాలు సాధించాడు. -
`ఆటగాళ్ళు' టీజర్ రిలీజ్
-
ఆటగాళ్ళు : రోహిత్ vs జగ్గు భాయ్
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ నటుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు. టీజర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసేశారు చిత్రయూనిట్. తన భార్యను చంపిన కేసులో రోహిత్ అరెస్ట్ కాగా రోహిత్‌కు వ్యతిరేకంగా వాధించే లాయర్ పాత్రగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
`ఇగో` మూవీ రివ్యూ
టైటిల్ : ఇగో జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్షాపంత్, రావు రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సుబ్రమణ్యం నిర్మాత : విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్ ఆసక్తికరమైన కథా కథనాలతో తెరకెక్కిన చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలను రూపొందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే బాటలో ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా ఇంట్రస్టింగ్ పాయింట్ కు లవ్ స్టోరి, కామెడీలను జోడించి ఇగో సినిమాను తెరకెక్కించారు. మరీ ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? కథ : గోపి (ఆశిష్ రాజ్), ఇందు (సిమ్రాన్)లు ఇద్దరు ఇగోతో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. తరతరాలుగా వారిద్దరి కుటుంబాలకు ఒకరంటే ఒకరు పడదు. దీంతో ఇందుని ఇబ్బంది పెట్టాలని గోపి, గోపిని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇందు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ గోడవలు ఇంట్లో తెలియటంతో ఇందుకు పెళ్లి సంబంధం చూస్తారు. అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో ఇందుకి పెళ్లి కుదురుతుంది. ఇగో గోపి ఇందుకు కన్నా ముందే మంచి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వస్తాడు. అప్పుడే ఇందు, గోపిలకు ఒకరంటే ఒకరికి ప్రేమని తెలుస్తుంది. ఇద్దరు కలుసుకునే సమయానికి గోపిని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. పూర్వి (దీక్షాపంత్) అనే అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె ఫోన్లో గోపితో దిగిన సెల్ఫీతో పాటు, హత్య జరగటానికి ముందుకు గోపితో 40 నిమిషాలు మాట్లాడినట్టు, హత్య జరిగిన తరువాతి రోజు పూర్వి అకౌంట్ నుంచి గోపి 40 వేలు డ్రా చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ సాక్ష్యాలుగా ఉంటాయి. దీంతో అంతా గోపినే ఈ హత్య చేశారని భావిస్తారు. అసలు పూర్విని హత్య చేసింది ఎవరు..? ఆ కేసులో గోపిని ఎందుకు ఇరికించారు..? ఈ కేసునుంచి గోపి ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఆకతాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆశిష్ రాజ్, రెండో ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో నటన విషయంలో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ గా పరిచయం అయిన సిమ్రాన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఫేం దీక్షా పంత్‌ది చిన్న పాత్రే అయిన ఉన్నంతలో తన పరిధిమేరకు పాత్రకు న్యాయం చేసింది. రావూ రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీలు రొటీన్ పాత్రల్లో నిరాశపరిచారు. ఫస్ట్ హాఫ్ లో పృధ్వీ కామెడీ కాస్త నవ్విస్తుంది. విశ్లేషణ : తనకేది సంబంధం లేని కేసులో ఇరుక్కున్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ ను కథగా ఎంచుకున్న దర్శకుడు ఆ పాయింట్ ను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మెయిన్ పాయింట్ కు సపోర్ట్ గా ఎంచుకున్న ప్రేమకథ, కామెడీ ఏమాత్రం ఆకట్టకోకపోవటం. అసలు కథ ద్వితియార్థంలో గాని మొదలు కాకపోవటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కావాలని ఇరికించిన పంచ్ డైలాగ్ లు కామెడీ సీన్స్ విసిగిస్తాయి. అయితే హీరో మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. అదే స్థాయిలో సినిమాను ముందుకు నడిపించలేకపోయాడు. సాయికార్తీక్ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. -
రెండు రోజుల్లో 8 సార్లు ‘లగాన్’ చూశా
‘‘నెక్ట్స్ నువ్వే’ నా 60వ సినిమా. ‘పైసా’ సినిమా నాకు పర్ఫెక్ట్ బ్రేక్ ఇస్తే, ‘పటాస్’ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నేను కమర్షియల్ మ్యూజిక్ పక్కాగా చేస్తానని ‘రాజా ది గ్రేట్’ నిరూపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో ‘నెక్ట్స్ నువ్వే’ నిలుస్తుంది’’ అని సంగీత దర్శకుడు సాయికార్తీక్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతోంది. సాయికార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు సినిమాకి వెళ్లినప్పుడు పాటల గురించి కాకుండా నేపథ్య సంగీతం ఎలా ఉందని చూసేవాణ్ణి. ఆర్ఆర్ మీద నాకెంత ఆసక్తి అంటే ‘లగాన్’ చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూస్‌గా చూశా. మొదటి నుంచీ ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో ఉండటంతో కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. కథని బట్టే సంగీతం వస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది’’ అన్నారు. -
ప్రేక్షకులతో సెల్ఫీ కోసం...
‘‘సెల్ఫీల వలన మంచి, చెడు రెండూ జరుగుతాయి. మా హీరోకి సెల్ఫీ అంటే వీక్నెస్. నోటి దురుసు వలన అతనికి వచ్చిన సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించాడు? అనేది చిత్రం ఇతివృత్తం. టైటిల్‌కి తగ్గట్టు నరేశ్ పాత్ర, చిత్రం కొత్తగా ఉంటాయి’’ అని దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్ఫీ రాజా’. సాక్షీ చౌదరి, కామ్నా రానావత్ కథానాయి కలు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు. సాయికార్తీక్ స్వరకర్త. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ -‘‘సమస్యల నుంచి గట్టెక్కడానికి సెల్ఫీరాజా రకరకాల వేషాలు వేస్తుంటాడు. ఈ చిత్రంలో స్పూఫ్‌లు లేవు. నాన్నగారితో ‘నేటిగాంధి’ తీసిన గోపీఆర్ట్స్ సంస్థలో హిట్ సాధించాలని ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేశారు’’ అన్నారు. ‘‘ఈ నెల 8న విశాఖలో రెండో పాటను, 9న విజయవాడలో మూడో పాటను, 10న వరంగల్‌లో నాల్గవ పాటను విడుదల చేస్తున్నాం. చిత్ర బృందం ప్రేక్షకులతో సెల్ఫీలు తీసుకుంటారు’’ అని నిర్మాతలు అన్నారు. సాక్షీ చౌదరి, నాగినీడు, సాయికార్తీక్, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీమ్ స్టయిల్!
ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. గత ఏడాది రిలీజైన కల్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడికి అదే పని చేసింది. తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయత్నంతో ముందుకు వస్తున్నారు. హీరో సాయిధరమ్ తేజ్‌ని ‘సుప్రీమ్’గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాలు నిర్మించిన ‘దిల్’ రాజు ముచ్చటగా మూడోసారి అదే హీరోతో రూపొందించిన సినిమా ఇది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రానికి ‘దిల్’ రాజు సమర్పకులు కాగా, శిరీష్ నిర్మాత. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్. ఈ వేసవి సీజన్లోనే విడుదల కానుంది. ముందుగా సంగీత దర్శకుడు సాయికార్తీక్ స్వరాలందించిన పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ ‘సుప్రీమ్’ చిత్రం అందరినీ అలరించే మాస్ ఎంటర్టైనర్. సాయిధరమ్‌తేజ్ స్టైల్ ఈ చిత్రానికి హైలైట్. సాయికార్తీక్ స్వరాలు అందరినీ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. అన్నట్లు, చిరంజీవి హిట్ చిత్రం ‘యముడికి మొగుడు’లో ‘సుప్రీమ్ హీరో’ అంటూ మొదలయ్యే పాపులర్ సాంగ్ ‘అందం హిందోళం...’ రీమిక్స్‌ను ఈ ‘సుప్రీమ్’ సినిమాలో వాడుతున్నారు. మరింకేం? పాట, పాటకు తగ్గట్లు మేనల్లుడి ఆట... అంతా ‘సుప్రీమే’ అన్న మాట! -
యువ సంగీత దర్శకుడి రికార్డ్
సినీ రంగంలో ఏ కళాకారుడికైనా 50 సినిమాలు పూర్తిచేయటం అన్నది అరుదైన ఘనతే, అలాంటి అరుదైన రికార్డ్‌ను అత్యంత వేగంగా అందుకున్న యువ సంగీతదర్శకుడు సాయి కార్తీక్. ప్రస్తుతం టాలీవుడ్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సంగీత దర్శకుల్లో సాయికార్తీక్ ముందున్నాడు. స్టార్ మ్యుజీషియన్స్‌తో సినిమా చేయించాలంటే భారీగా రెమ్యూనరేషన్లు ఇచ్చుకోవాలి. అలా చేయలేని మీడియం బడ్జెట్ నిర్మాతలకు సాయి కార్తీక్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తున్నాడు. 2008లో అబ్బో ఆడవాళ్లు అనే చిన్న సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి కార్తీక్, బ్రేక్ కోసం చాలాకాలం పాటు ఎదురుచూశాడు. ఓం 3డి సినిమాతో తొలిసారిగా స్టార్ హీరో సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సాయి కార్తీక్, పటాస్ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్నాడు. పైసా, ప్రతినిధి, రౌడీ లాంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పాటలతో కన్నా నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు సాయి కార్తీక్. రేసీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. తాజాగా నారా రోహిత్, నందమూరి తారకరత్న లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రాజా చెయ్యివేస్తే సాయి కార్తీక్‌కు 50వ చిత్రం. అతడి కెరీర్లో మైల్ స్టోన్ లాంటి ఈ సినిమా ఆడియో శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదలైంది. -
క్లీన్‌గా... నీట్‌గా...!
‘‘శ్రీకాంత్‌గారు, నేను ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఇటీవల ఆయన ఎక్కువగా నాతో మాట్లాడింది ‘టెర్రర్’ చిత్రం గురించే. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టెర్రర్’ ప్రచారచిత్రాన్ని ఆయన హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పట్లో సినిమా తీయడం పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని విడుదల చేయడం చాలా కష్టమైన విషయం. మస్తాన్గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. దర్శ కుడు క్లీన్‌గా, నీట్‌గా తీశారు. సాయికార్తీక్ మంచి పాటలు, రీ-రికార్డింగ్ ఇచ్చాడు’’ అని శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి. -
మా సినిమాకు పేరు పెట్టండి..!
సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇప్పటికే పబ్లిసిటీలో కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్న సినీ ప్రముఖులు ఇప్పుడు మరో కొత్త తరహా ప్రచారానికి తెరలేపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమా నేరం రీమేక్‌కు ప్రేక్షకులనే టైటిల్ నిర్ణయించాలంటూ కోరాడు సందీప్ కిషన్. గతంలో జెడి చక్రవర్తి హీరోగా తెరకెక్కిన 'పాపే నా ప్రాణం' సినిమా విషయంలో కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. తాజాగా సందీప్ కిషన్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. సినిమా ఎలా ఉండబోతుందో పరిచయం చేసేలా రూపొందించిన పోస్టర్‌తో పాటు చిత్రయూనిట్ సెలెక్ట్ చేసిన ఐదు టైటిల్స్‌ను ఎనౌన్స్ చేసిన సందీప్, వీటిలో ఒక పేరు సెలెక్ట్ చేయాలని అభిమానులను కోరాడు. ఎక్కువ మంది సెలెక్ట్ చేసిన టైటిల్‌నే సినిమాకు ఫైనల్ చేస్తామంటూ తెలిపాడు. మరి సందీప్ ప్లాన్ సినిమా పబ్లిసిటీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ త్వరలోనే నేరం రీమేక్‌ను స్టార్ చేయనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మిస్టర్ నూకయ్య ఫేం అనీల్ కృష్ణ దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందించనున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. Zeroed down to 5 options :) Meere final chesi pettali :) #NeramRemake @AnilSunkara1 @anikanneganti @anishaambrose :) pic.twitter.com/Ujql10YAdQ — Sundeep Kishan (@sundeepkishan) February 7, 2016 -
రాజు గారి గది... లోపల ఏముంది?
చిత్రం: రాజు గారి గది తారాగణం: అశ్విన్, ‘షకలక’ శంకర్, ధన్‌రాజ్, సప్తగిరి మాటలు: సాయిమాధవ్ బుర్రా కెమేరా: ఎస్. జ్ఞానమ్ సంగీతం: సాయికార్తీక్ నిర్మాత: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఓంకార్ గతంలో ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేసిన ఓంకార్ ఈసారి లో-బడ్జెట్లో చేసిన హార్రర్ - కామెడీ -క్రైమ్ సినిమా ‘రాజు గారి గది’. అనగనగా నందిగామ అనే ఊరు. అక్కడ ఓ పాడుబడిన మహల్... దానిలోకి వెళ్ళినవాళ్ళంతా చనిపోతుంటారు. ఆ మహల్లో దయ్యం ఉందని ఊరంతా పుకారు. ఆ బంగళాలో ఉన్నదేమిటో నిజం నిరూపించడానికి కొందరు బయలుదేరతారు. తీరా ఆ ముగ్గురూ కూడా చనిపోతారు. అలా అప్పటికి 34 మంది బలైపోయిన ఆ రాజమహల్ రహస్యం ఛేదించడానికి అన్నట్లుగా ఒక టీవీ చానల్ ఒక షో పెడుతుంది. దానిలో పాల్గొనడానికి ఏడుగురు సెలక్ట్ అవుతారు. ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళి, ఆ మహల్లో ఏడు రోజుల పాటు ఉండి, దయ్యాలున్నాయా, లేదా అన్నది కనిపెట్టాలన్నది గేమ్. అలా ఏడు రోజులూ అక్కడే గడిపి, గెలిచినవాళ్ళకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ. అందుకు ఒప్పుకొని, ఆ ఏడుగురూ అక్కడకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందన్నది సినిమా. వెళ్ళిన ఏడుగురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అశ్విన్ (అశ్విన్)కు ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అతని అన్నయ్య డాక్టర్ (రాజీవ్ కనకాల). ఆర్గాన్ డొనేషన్ గురించి జనంలో చైతన్యం తెచ్చే ఆ డాక్టర్ కూడా అనుమానాస్పదంగా ఆ మహల్‌లోని పాడుబడ్డ బావిలో మరణిస్తాడు. ఆ కథకూ, ఈ మహల్లో పెళ్ళి కాకుండా తిరుగుతున్న బొమ్మాళి (పూర్ణ) దయ్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ మహల్లో దయ్యాలున్నాయా? ఎందుకవి అందరినీ చంపుతున్నాయన్నది మిగతా కథ. ఓంకార్ తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, డెరైక్షన్ చేసిన సినిమా ఇది. చూడడానికి అన్న పోలికలు పుష్కలంగా ఉన్న అశ్విన్‌ది ప్రధాన పాత్ర. డాక్టర్ నందన్గా చేతన్ చీను వినూత్నంగా కనిపిస్తారు. బాలా త్రిపురసుందరి అలియాస్ బాలాగా ధన్యా బాలకృష్ణన్ తెలంగాణ మాండలికంలో, గుంటూరు జిల్లా యాసలో శివుడుగా ధన్‌రాజ్, క్రైస్తవ మత ప్రబోధకుడి కుమారుడిగా ఎం.వై. దానం అలియాస్ మైదానంగా ‘షకలక’ శంకర్, బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖా రామన్ - ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో రకం డైలాగ్ డెలివరీ. స్క్రిప్టుకు తగ్గట్లే అందరూ నవ్వించడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు ప్రధాన బలం - ‘షకలక’ శంకర్ చేసిన కామెడీ, చూపిన హావభావాలు. క్షణాల్లో రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ, ఆయన పండించిన సన్నివేశాలు ఆడియన్స్‌కు నచ్చుతాయి. మరిన్ని ఛాన్స్‌లు తెచ్చిపెడతాయి. ధన్‌రాజ్‌తో కాంబినేషన్ సీన్లు పండాయి. సెకండాఫ్‌లో సప్తగిరి చేసే ‘కచ్చేరీ’ లాంటి కామెడీ మాస్‌ను ఉద్దేశించినదనుకోవాలి. పాటలు ఎక్స్పెక్ట్ చేయలేని హార్రర్ సినిమాకు... తగ్గట్లుగా బాగా కుదిరినవి - కెమేరా వర్క్, రీరికార్డింగ్. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల్ని ఉద్విగ్నతకు గురి చేస్తారు. నిడివి పరంగా కేవలం రెండు గంటల చిల్లరే ఉన్న ఈ సినిమాకు ఎడిటింగ్‌లో షాట్స్ ఎంపిక, వాటి ప్లేస్మెంట్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే, హార్రర్ ఎఫెక్ట్ పెరిగేదనిపిస్తుంది. అలవాటైన టీవీ చానల్ గేమ్‌షో కాన్సెప్ట్నే... ఈ సినిమాకూ తీసుకున్నారు యాంకర్ ఓంకార్. ఇవాళ టీవీల్లో ఫేమస్ అయిన ‘బిగ్ బాస్’ తరహా గేమ్‌షోను ఆశ్రయించారు. అక్కడ బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో అభ్యర్థులందరూ ఉండడమనే కాన్సెప్ట్‌కు ఇక్కడ దయ్యాలున్న రాజమహల్‌ను పెట్టుకున్నారు. పేరుకిది హార్రర్ జానర్ సినిమా అయినా, దానికి సోషల్ క్రైమ్ జత చేసి, సందేశం ఇవ్వాలని చూశారు. ఆ మధ్య వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ దగ్గర నుంచి జనరంజక ఫార్ములా అయిన హార్రర్‌లో ఎంటర్టైన్మెంట్ మిళాయింపు పద్ధతినీ పాటించారు. ఇలా అది కొంత, ఇది కొంత - అంటూ విజయసూత్రాలన్నీ వాడుకోవాలని చూశారు. ఫస్టాఫ్ అంతా హార్రర్ ధోరణిలో ఆసక్తిగా నడిచిపోతుంది. నిజానికి, ఈ సినిమాకు ‘రాజు గారి గది’ అని పేరు పెట్టారు కానీ, మొత్తం మహల్కే తప్ప, ప్రత్యేకంగా ఆ గదికి సినిమాలో ఇచ్చిన ఇంపార్టెన్స్ తక్కువే. క్రైమ్ సీరియల్‌గా బాగా నప్పే కాన్సెప్ట్‌ను ఒక చిన్న సినిమాగా తీశారు. మొత్తానికి, రాజు గారి గదిలో ఏముందా అని అతిగా ఊహించుకోకుండా కాసేపు కాలక్షేపానికి వెళితే, ఆశాభంగం తప్పుతుంది. టాయిలెట్ కామెడీల లాంటి జుగుప్సను పక్కన పెడితే, రీరికార్డింగ్ ఎఫెక్ట్లు, ‘షకలక’ శంకర్ కామెడీలతో సర్దుకుపోవచ్చనిపిస్తుంది. -
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్
‘‘తేజస్ నాకు ‘ఉలవచారు బిర్యానీ’ సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం ‘కేటుగాడు’. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత కె.ఎస్. రామారావు ఆవిష్కరించి ప్రకాశ్‌రాజ్‌కు అందించారు. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా మొదలు కాకముందు తేజస్ వచ్చి కథ చెప్పాడు. చాలా బాగుంది. అలాగే చాలా ఎనర్జిటిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయికార్తీక్ చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అని చెప్పారు. మా సంస్థ నుంచి వచ్చినతొలి చిత్రం ఇదని, అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో హీరో తేజస్, హీరోయిన్ చాందినీ చౌదరి, నటుడు అజయ్, చిత్రసమర్పకుడు వీఎస్పీ తెన్నేటి తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్ లఘు చిత్రం ప్రెస్ మీట్
-
ఆ సంకల్పంతోనే ఈ లఘు చిత్రం తీశాం
‘‘సమాజానికి మంచి చేయాలని అందరికీ ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సేవ చేస్తూనే ఉంటారు. నేను సినిమా వాణ్ణి. సినిమా తప్ప నాకు మరొకటి తెలీదు. అందుకే... సినిమా ద్వారానే సమాజానికి ఉపయోగపడే మంచిని చెబుదామనుకున్నాను. ఆ చిరు ప్రయత్నమే... ‘ఐ యామ్ దట్ ఛేంజ్’’’ అని అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి, నిర్మించిన లఘు చిత్రం ‘ఐ యామ్ దట్ ఛేంజ్’. గురువారం హైదరాబాద్‌లో మీడియాకు ఈ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. ‘‘భవిష్యత్ తరాల కోసం ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగఫలమైన మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ స్పృహను భావితరాలకు అందించాలనే సంకల్పంతో చేసిన లఘు చిత్రమిది. నీతులు చెబితే వినే దశలో నేటి యువత లేరని నాకు తెలుసు. ఎందుకంటే... ఓ బిడ్డకు తండ్రినైనా నేనూ యూతే. ఈ లఘు చిత్రం ద్వారా సమాజానికి సేవ చేయమని నేను చెప్పలేదు. మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తే అదే సమాజ సేవ అవుతుందని చెప్పాను’’ అని అల్లు అర్జున్ చెప్పారు. దర్శకుడు సుకుమార్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘రెండ్రోజుల్లో మనం ఓ లఘు చిత్రం చేయనున్నామని సుకుమార్‌కి చెప్పాను. అంతే... వెంటనే కాన్సెప్ట్ కూడా ఆయనే తయారు చేసి ఓ బాధ్యతగా చేసిపెట్టారు. ఆయన స్థాయి దర్శకుడు ఇలాంటి లఘు చిత్రం చేయాలంటే పాతిక లక్షలు తీసుకుంటారు. కానీ... పైసా తీసుకోకుండా చేసిపెట్టారు. అలాగే కెమెరామ్యాన్ అమోల్ రాథోడ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీత దర్శకుడు సాయికార్తీక్ - ఇలా అందరూ సహకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ లఘుచిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలని, ఇలాంటి మంచి లఘు చిత్రానికి దర్శకుణ్ణి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని సుకుమార్ చెప్పారు. -
తొలిసినిమా విడుదల కాకముందే..!
ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో అవకాశం కొట్టేస్తే ఏ యువనటీనటులకైనా ఆనందంగానే ఉంటుంది. ప్రస్తుతం తేజస్ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు తేజస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. రామకృష్ణ నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బలసాని ఈ చిత్రం నిర్మించనున్నారు. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందించనున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. రఘు కారుమంచి, రాజీవ్ కనకాల, అజయ్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: రాజు, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్వీఏ ప్రకాశ్, సహనిర్మాత: ఎం. శ్రీనివాసరావు. -
దెయ్యాలున్నాయా?
అభినవ్ (సర్దార్ పటేల్), మధుమిత జంటగా శుభోదయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గేట్’. ‘దెయ్యాలున్నాయి జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. సాయికార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి. లక్ష్మీసౌజన్యగోపాల్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, వినోదం, సందేశం ఉన్నాయని నిర్మాత తెలిపారు. వచ్చే నెల 10న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 18 రోజుల్లో పూర్తి చేస్తామని మే 2న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని అభినవ్ అన్నారు. బలరామ్, సంతోష్, అలీషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎస్. చక్రవర్తిరెడ్డి, సంగీతం: డిజెఎస్.