సుప్రీమ్ స్టయిల్! | Sai Dharam Tej's Supreme Audio Launch on April 14th | Sakshi
Sakshi News home page

సుప్రీమ్ స్టయిల్!

Published Mon, Apr 11 2016 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

సుప్రీమ్ స్టయిల్!

సుప్రీమ్ స్టయిల్!

ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. గత ఏడాది రిలీజైన కల్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడికి అదే పని చేసింది. తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయత్నంతో ముందుకు వస్తున్నారు. హీరో సాయిధరమ్ తేజ్‌ని ‘సుప్రీమ్’గా చూపించడానికి సిద్ధమవుతున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాలు నిర్మించిన ‘దిల్’ రాజు ముచ్చటగా మూడోసారి అదే హీరోతో రూపొందించిన సినిమా ఇది.

శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రానికి ‘దిల్’ రాజు సమర్పకులు కాగా, శిరీష్ నిర్మాత. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్. ఈ వేసవి సీజన్‌లోనే విడుదల కానుంది. ముందుగా సంగీత దర్శకుడు సాయికార్తీక్ స్వరాలందించిన పాటలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ ‘సుప్రీమ్’ చిత్రం అందరినీ అలరించే మాస్ ఎంటర్‌టైనర్. సాయిధరమ్‌తేజ్ స్టైల్ ఈ చిత్రానికి హైలైట్.

సాయికార్తీక్ స్వరాలు అందరినీ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. అన్నట్లు, చిరంజీవి హిట్ చిత్రం ‘యముడికి మొగుడు’లో ‘సుప్రీమ్ హీరో’ అంటూ మొదలయ్యే పాపులర్ సాంగ్ ‘అందం హిందోళం...’ రీమిక్స్‌ను ఈ ‘సుప్రీమ్’ సినిమాలో వాడుతున్నారు. మరింకేం? పాట, పాటకు తగ్గట్లు మేనల్లుడి ఆట... అంతా ‘సుప్రీమే’ అన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement