తొలిసినిమా విడుదల కాకముందే..! | Ulavacharu Biryani Fame Hero Tejas Second Movie On sets soon | Sakshi
Sakshi News home page

తొలిసినిమా విడుదల కాకముందే..!

Published Sun, May 4 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

తొలిసినిమా విడుదల కాకముందే..!

తొలిసినిమా విడుదల కాకముందే..!

 ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో అవకాశం కొట్టేస్తే ఏ యువనటీనటులకైనా ఆనందంగానే ఉంటుంది. ప్రస్తుతం తేజస్ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు తేజస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. రామకృష్ణ నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బలసాని ఈ చిత్రం నిర్మించనున్నారు. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందించనున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. రఘు కారుమంచి, రాజీవ్ కనకాల, అజయ్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: రాజు, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్‌వీఏ ప్రకాశ్, సహనిర్మాత: ఎం. శ్రీనివాసరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement