Ulavacharu Biryani
-
మేమిద్దరం భోజన ప్రియులం!
‘‘నేను చేసే సినిమాలు... నా తల్లిదండ్రులు, అత్తమామలు, నా భర్త... ఇలా నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేంత ప్లెజెంట్‌గా ఉండాలి. అలాంటి పాత్రలే ఇక నుంచి చేస్తా’’ అంటున్నారు నటి స్నేహ. ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ... కె.ఎస్.రామారావుతో కలిసి నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌కి జోడీగా నటించారామె. వివాహానంతరం స్నేహ చేసిన సినిమా ఇదే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరును తెచ్చిపెట్టిందని, కావల్సినన్ని ప్రశంసల్ని అందిస్తోందని ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇంకా చెబుతూ- ‘‘ఇందులోని ‘గౌరి’ పాత్ర గురించి ప్రకాశ్‌రాజ్ చెప్పినప్పుడే ఈ సినిమాను మిస్ కాకూడదని నిశ్చయించుకున్నాను. ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ప్రకాశ్‌రాజ్‌కే దక్కుతుంది స్వతహాగా నేను ఇంట్లో ఎలా ఉంటానో, అలాగే ఈ సినిమాలో కూడా బిహేవ్ చేశా. 36 ఏళ్ల యువతిగా నటించడం, డబ్బింగ్ ఆర్టిస్ట్ పాత్ర పోషించడం ఓ కొత్త అనుభూతినిచ్చింది. భవిష్యత్తులో నటించే తెలుగు సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా’’ అని తెలిపారు స్నేహ. మధుమాసం, రాధాగోపాళం, శ్రీరామదాసు, రాజన్న... తనకు మంచి పేరు తెచ్చిన సినిమాలనీ, తొలినాళ్ల నుంచి ఇలాంటి పాత్రలు చేయడానికే తాను ఆసక్తి కనబరిచానని, గ్లామర్ పాత్రలకు ప్రస్తుతం తాను దూరమని, పాత్రలో పవిత్రత ఉంటే... ఏ పాత్రనైనా అంగీకరిస్తానని స్నేహ చెప్పారు. తన వైవాహిక జీవితం గురించి చెబుతూ- ‘‘మంచి కుటుంబానికి నేను కోడలినయ్యాను. నా భర్త ప్రసన్న నాకు మంచి ఫ్రెండ్ కూడా. ‘నా భార్య గౌరి పాత్ర చేయడం గర్వంగా ఉంది’ అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు. అది చూడగానే చెప్పలేని ఆనందం కలిగింది. మేం ఇద్దరం భోజన ప్రియులమే. మంచి ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళతాం. అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. ‘ఉలవచారు బిర్యాని’లోలా కుట్టి దోసెలంటే ఇంకా ఇష్టం’’ అని చెప్పారు స్నేహ. త్వరలో తన భర్త ప్రసన్న భాగస్వామ్యంతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా స్నేహ తెలిపారు. -
సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని
నటీనటులు: ప్రకాశ్ రాజ్, స్నేహ, తేజూస్, సంయుక్త, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, ఊర్వశి నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్ మ్యూజిక్: ఇళయరాజా కెమెరా: ప్రీతా ప్లస్ పాయంట్స్: కొంతలో కొంత ఇళయరాజా మ్యూజిక్, ప్రీతా ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం విభిన్న పాత్రలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ 'ధోని' చిత్రం తర్వాత మరో రీమేక్ 'ఉలవచారు బిర్యాని' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2011లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన కామెడీ చిత్రం 'సాల్డ్ అండ్ పెప్పర్' అనే చిత్రం ఆధారంగా 'ఉలవచారు బిర్యాని చిత్రాన్ని స్యయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. చిత్ర విడుదలకు ముందే టీజర్లు, పాటలతో అంచనాలను పెంచిన 'ఉలవచారు బిర్యాని' చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టే ఉందా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కాళిదాసు( ప్రకాశ్ రాజ్) ఓ పెళ్లికాని ప్రసాద్. ఆయన పురావస్తుశాఖ(అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్లికాని ఓ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్. మోబైల్ రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్)లు ప్రవేశిస్తారు. వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు; కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే 'ఉలవచారు బిర్యాని' సినిమా. నటీనటుల ఫెర్మార్మెన్స్: బ్రహ్మచారి పాత్రలో కాళిదాసుగా ప్రకాశ్ రాజ్, గౌరిగా స్నేహలు నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ కు కాళిదాసు పాత్ర కొత్తేమి కాదు. కాళిదాసు పాత్ర ప్రకాశ్ రాజ్ స్థాయికి సరిపడేంత రేంజ్ లో లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించలేకపోయింది. కాళిదాసు, గౌరీ పాత్రలు క్యారెక్టరైజేషన్ గొప్పగా లేకపోవడంతో వారిద్దరికి కూడా వారి సత్తాను ప్రదర్శించాల్సిన స్కోప్ లేకుండా పోయింది. కథలో వేగం, ఉద్వేగం లేకపోవడంతో మొదటి భాగంలోనే ప్రేక్షకుడికి విషయం లేదని అంశం బోధపడుతుంది. దీనికి తోడు రెండవ భాగం కూడా సాగదీయడంతో ఓ దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఊర్వశి, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, దేవయానిల పాత్రల ప్రాధాన్యత కూడా అంతంతమాత్రమే. టెక్నిషియన్స్ పనితీరు: కథలో పస లేకున్నా ఫోటోగ్రఫీతో ప్రీతా ఆకట్టుకున్నారు. ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించలేకపోయింది. ఫీల్ ఉన్న పాటల్ని ఇళయరాజా అందించినప్పటికి.. చిత్రీకరణ విషయంలో తేలిపోయాయనే చెప్పవచ్చు. ప్రతిభావంతుడైన నటుడిగా ప్రేక్షకులు హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ 'ఉలవచారు బిర్యాని' నిర్మాత, దర్శకుడిగా ప్రకాశ్ రాజ్ సినీ అభిమానులను మెప్పించలేకపోయారు. కథలో క్లారిటీ లేకపోవడం, కాళిదాసు, గౌరీల, నవీన్, మేఘనల మధ్య ప్రేమ కథలకు సరియైన న్యాయం చేయలేకపోవడం, ప్రేమ కథలో ఫీల్ లోపించడం, గిరిజన సామాజిక అంశాన్ని ప్రేమ కథలో జొప్పించడానికి చేసిన ప్రయత్నాలు చిత్ర విజయానికి అనుకూలంగా మారలేకపోయాయి. ప్రకాశ్ రాజ్ నుంచి భారీగా ఆశించి... మంచి ఆకలితో థియేటర్ కెళ్లిన ప్రేక్షకుడికి రుచి లేని 'ఉలవచారు బిర్యాని'ని వడ్డించారని చెప్పవచ్చు. -
'ఉలవచారు బిర్యాని' ట్రైలర్
-
ఉలవచారు బిర్యాని న్యూ మూవీ స్టిల్స్
-
ఉలవచారు బిర్యాని న్యూ వర్కింగ్ స్టిల్స్
-
విభిన్నంగా... వినూత్నంగా...
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటెబుల్ బిర్యానీ.. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ, ఉలవచారు బిర్యానీ తెలుసా? ఇలాంటి బిర్యానీ గురించి బహుశా ఎవరూ విని ఉండరు. ఈ వెరైటీ బిర్యానీని తెరపై ఆవిష్కరించనున్నారు ప్రకాశ్‌రాజ్. ఆయన కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ఈ చిత్రానికి కేయస్ రామారావు సమర్పకుడు. స్నేహా, తేజస్ ముఖ్య తారలు. ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై వల్లభ నిర్మించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఓ వినూత్న ప్రేమకథతో విభిన్నంగా రూపొందించిన చిత్రం ఇది. ఈ ప్రేమకథకు ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్. ఈ ’ఉలవచారు బిర్యాని’ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. నటునిగా, దర్శకునిగా ప్రకాశ్‌రాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే సినిమా’’ అన్నారు. -
విభిన్నంగా... వినూత్నంగా...
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటెబుల్ బిర్యానీ.. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ, ఉలవచారు బిర్యానీ తెలుసా? ఇలాంటి బిర్యానీ గురించి బహుశా ఎవరూ విని ఉండరు. ఈ వెరైటీ బిర్యానీని తెరపై ఆవిష్కరించనున్నారు ప్రకాశ్‌రాజ్. ఆయన కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ఈ చిత్రానికి కేయస్ రామారావు సమర్పకుడు. స్నేహా, తేజస్ ముఖ్య తారలు. ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై వల్లభ నిర్మించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఓ వినూత్న ప్రేమకథతో విభిన్నంగా రూపొందించిన చిత్రం ఇది. ఈ ప్రేమకథకు ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్. ఈ ’ఉలవచారు బిర్యాని’ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. నటునిగా, దర్శకునిగా ప్రకాశ్‌రాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే సినిమా’’ అన్నారు. -
తొలిసినిమా విడుదల కాకముందే..!
ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో అవకాశం కొట్టేస్తే ఏ యువనటీనటులకైనా ఆనందంగానే ఉంటుంది. ప్రస్తుతం తేజస్ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు తేజస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. రామకృష్ణ నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బలసాని ఈ చిత్రం నిర్మించనున్నారు. ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందించనున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. రఘు కారుమంచి, రాజీవ్ కనకాల, అజయ్, ప్రవీణ్, సప్తగిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి మాటలు: రాజు, సంగీతం: సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్వీఏ ప్రకాశ్, సహనిర్మాత: ఎం. శ్రీనివాసరావు. -
ఆ ఘనత తేజూస్‌కే దక్కింది
‘‘తేజూస్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. తేజూస్ ఎనర్జీ చూసి, తప్పకుండా నటుడవుతాడనుకునేవాణ్ణి. కానీ, నా బేనర్ ద్వారానే హీరో అవుతాడని ఊహించలేదు’’ అన్నారు కేయస్ రామారావు. ప్రకాశ్‌రాజ్, స్నేహ ఓ జంటగా, తేజూస్, సంయుక్త మరో జంటగా రూపొందిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు వెర్షన్ నిర్మించిన కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ప్రకాశ్‌రాజ్‌కి తేజూస్ని పరిచయం చేసినప్పుడు తేలికగా తీసుకున్నాడు. ఆ తర్వాత తనలో మంచి హీరో మెటీరియల్ ఉందనే నమ్మకం ఆయనకు కుదిరింది. నాకు తెలిసి ఏ హీరో ఒకేసారి మూడు భాషల ద్వారా పరిచయం కాలేదు. ఆ ఘనత తేజూస్‌కే దక్కింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం. ఇళయరాజాగారు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. రీ-రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా కుదిరింది. ఈ వేసవికి రాబోతున్న చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. తేజూస్ మాట్లాడుతూ - ‘‘ఎప్పటికైనా కె.యస్. రామారావుగారి బేనర్లో చేయాలనుకున్నాను కానీ, నా తొలి సినిమాకే అది కుదరడం, ప్రకాశ్‌రాజ్‌గారి కాంబినేషన్లో, ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ప్రకాశ్‌రాజ్‌గారు నా మామయ్యగా నటించారు. మొదటి రోజు ఆయన కాంబినేషన్లో సీన్ చేయడానికి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ, సులువుగానే చేయగలిగాను. అయితే కన్నడ, తమిళ భాషలు తెలియదు కాబట్టి, అక్కడ కష్టమైంది’’ అని చెప్పారు. తేజ దగ్గర ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేశానని, ఓ ఏడెనిమిదేళ్ల తర్వాత డెరైక్షన్ చేస్తానని పేర్కొన్నారు. -
ఉలవచారు బిర్యాని ఆడియో వేడుక విశేషాలు
-
ఉలవచారు బిర్యాని ఆడియో ఆవిష్కరణ
-
ఇళయరాజా ఓ మానస సరోవరం : ప్రకాశ్‌రాజ్
‘‘నా జీవితాన్ని మలిచిన గురువుల్లో ఇళయరాజా ఒకరు. సినీ సంగీతానికి ఆయన మానస సరోవరంలాంటి వారు. సినీ రంగంలో ఆయనకు నేను కూడా సమకాలికుణ్ణి అయినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు, దర్శక - నిర్మాత ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన త్రిభాషా చిత్రం ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం తెలుగు వెర్షన్ పాటలను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర సమర్పకులైన సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు సారథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు సంగీత దర్శకుడు ఇళయరాజాను ఘనంగా సన్మానించారు. చిన్నారులు కీర్తనలను ఆలపిస్తూ, నర్తిస్తుండగా వైవిధ్యంగా ఈ సత్కారం సాగింది. ఈ ఆత్మీయ సత్కారానికి ఇళయరాజా స్పందిస్తూ, ‘‘నా దృష్టిలో పాట అంటే దేనికదే ఉండాలి. ఒకదానిలా మరొకటి ఉండకూడదు. అలా ఉంటే అది కాపీ అవుతుంది’’ అన్నారు. మరింత వివరణనిస్తూ, ‘‘అయితే, ఒక పాటను విని ఆ స్ఫూర్తితో మరో పాట చేయడం వేరు. సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆయన బాణీ కట్టిన ఓ పాట స్ఫూర్తితోనే ‘ఓ నెంజమే...’ అనే తమిళ గీతానికి స్వరరచన చేశాను’’ అన్నారు. సాధారణంగా ఇలాంటి సన్మానాలకు దూరంగా ఉండే ఇళయరాజా, ఆ మాటే చెబుతూ, ‘‘ఉగాది రోజున మీ అందరినీ కలుసుకోవడానికి ఇదొక అవకాశంగా భావించి అంగీకరించాను’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ‘ప్రసాద్ ల్యాబ్స్’ అధినేత రమేశ్‌ప్రసాద్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి. కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, కీరవాణి, మణిశర్మ, ప్రకాశ్‌రాజ్, స్నేహ, ‘ఉలవచారు బిర్యాని’ చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. -
ఉలవచారు బిర్యాని మూవీ స్టిల్స్
-
ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న స్పెషల్ వంటకం
ఉలవచారు ఏంటి? బిర్యాని ఏంటి? అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి? వాటి రెసిపీ వేరు. రుచులు వేరు. మరి.. ఈ మిక్సింగ్ దేనికో? దీని గురించి చెప్పాల్సింది ప్రకాశ్‌రాజే. ఎందుకంటే ఈ స్పెషల్ వంటకానికి సూత్రధారి, పాత్రధారి ఆయనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రేక్షకులకు ఈ ‘ఉలవచారు బిర్యానీ’ని గరమ్ గరమ్‌గా సిద్ధం చేస్తున్నారు ప్రకాశ్‌రాజ్. కేయస్ రామారావు సమర్పణలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వల్లభ నిర్మాత. ప్రకాశ్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త ముఖ్య తారలు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఉగాది సందర్భంగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. నేడు ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ఓ వినూత్న ప్రేమకథాంశంతో ప్రకాష్‌రాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రాణం. ఆడియో వేడుక రోజున ఇళయరాజాను ఘనంగా సత్కరించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రీతా జయరామన్, ఆర్ట్: కదిర్, ఎడిటింగ్: జో.ని. హర్ష. -
ఉలవచారు బిర్యాని వర్కింగ్ స్టిల్స్
-
మెగాఫోన్ పట్టిన ప్రకాశ్‌రాజ్