విభిన్నంగా... వినూత్నంగా... | Something newly different ... | Sakshi

విభిన్నంగా... వినూత్నంగా...

Published Sat, May 24 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

విభిన్నంగా... వినూత్నంగా...

విభిన్నంగా... వినూత్నంగా...

చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటెబుల్ బిర్యానీ.. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ, ఉలవచారు బిర్యానీ తెలుసా? ఇలాంటి బిర్యానీ గురించి బహుశా ఎవరూ విని ఉండరు. ఈ వెరైటీ బిర్యానీని తెరపై ఆవిష్కరించనున్నారు ప్రకాశ్‌రాజ్. ఆయన కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉలవచారు బిర్యాని’. ఈ చిత్రానికి కేయస్ రామారావు సమర్పకుడు. స్నేహా, తేజస్ ముఖ్య తారలు. ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్. క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై వల్లభ నిర్మించిన ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఓ వినూత్న ప్రేమకథతో విభిన్నంగా రూపొందించిన చిత్రం ఇది. ఈ ప్రేమకథకు ఇళయరాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్. ఈ ’ఉలవచారు బిర్యాని’ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. నటునిగా, దర్శకునిగా ప్రకాశ్‌రాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే సినిమా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement