ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న స్పెషల్ వంటకం | Prakash served   Special recipe | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న స్పెషల్ వంటకం

Published Wed, Mar 26 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న  స్పెషల్ వంటకం

ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న స్పెషల్ వంటకం

ఉలవచారు ఏంటి? బిర్యాని ఏంటి? అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి? వాటి రెసిపీ వేరు. రుచులు వేరు. మరి.. ఈ మిక్సింగ్ దేనికో? దీని గురించి చెప్పాల్సింది ప్రకాశ్‌రాజే. ఎందుకంటే ఈ స్పెషల్ వంటకానికి సూత్రధారి, పాత్రధారి ఆయనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రేక్షకులకు ఈ ‘ఉలవచారు బిర్యానీ’ని గరమ్ గరమ్‌గా సిద్ధం చేస్తున్నారు ప్రకాశ్‌రాజ్. కేయస్ రామారావు సమర్పణలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వల్లభ నిర్మాత. ప్రకాశ్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త ముఖ్య తారలు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఉగాది సందర్భంగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. నేడు ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ఓ వినూత్న ప్రేమకథాంశంతో ప్రకాష్‌రాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

ఇళయరాజా అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రాణం. ఆడియో వేడుక రోజున ఇళయరాజాను ఘనంగా సత్కరించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రీతా జయరామన్, ఆర్ట్: కదిర్, ఎడిటింగ్: జో.ని. హర్ష.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement