'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?' | Actress Sneha And Husband Prasanna Gets Trolled For Wearing Footwear During Arunachalam Giri Pradakshina, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sneha Arunachalam Giripradakshina: శివ శివా... అరుణాచలంలో చెప్పులేసుకుని గిరి ప్రదక్షిణా? స్నేహపై భక్తుల మండిపాటు

Published Sat, Mar 29 2025 5:26 PM | Last Updated on Sat, Mar 29 2025 6:12 PM

Sneha, Prasanna gets Trolled for Wearing Footwear in Tiruvannamalai Arunachalesvara Temple

అరుణాచల శివుడిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందంటారు. అరుణాచలం దర్శనానికి ముందు, దర్శనం తర్వాత.. అన్నంతగా జీవితం మారిపోతుందంటారు. విక్టరీ వెంకటేశ్‌, కిరణ్‌ అబ్బవరం.. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. తాజాగా హీరోయిన్‌ స్నేహ (Actress Sneha) కూడా అరుణాచలం వెళ్లింది. భర్త ప్రసన్నకుమార్‌తో కలిసి గిరిప్రదక్షిణ చేసింది. 

గిరి ప్రదక్షిణ
సూర్యుడు ఉదయించడానికి ముందే ముఖానికి మాస్కులు ధరించి భార్యాభర్తలిద్దరూ కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. అంతా బాగుంది కానీ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీళ్లిద్దరూ చెప్పులు, శాండిల్స్‌ ధరించారు. 

కాస్తయినా బుద్ధి లేదా?
అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన భక్తులు, అభిమానులు స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి? కొంచెమైనా బుద్ధి లేదా? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం.. వారు తెలియక చేసుంటారని వెనకేసుకొస్తున్నారు.

సినిమా- పర్సనల్‌ లైఫ్‌
స్నేహ తెలుగు, తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్‌ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవల వచ్చిన డ్రాగన్‌ మూవీలో డాక్టర్‌గా అతిథి పాత్రలో కనిపించింది. ఇకపోతే స్నేహ కథానాయికగా సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ లీడ్‌ చేస్తున్న సమయంలోనే నటుడు ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు, కూతురు జన్మించారు.

 

 

చదవండి: బాలీవుడ్‌లో అంతా గొర్రెలే.. సౌత్‌ను చూసి నేర్చుకోండి: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement