కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కానీ వారు పోషించిన పాత్రలను మాత్రం జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా శివ మనసులో శక్తి సినిమాలో హీరో జీవా సోదరిగా నటించిన స్నేహ మురళి ఇప్పటికీ తమిళ మీమ్స్‌లో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఆమెకు బోలెడంత పాపులారిటీ వచ్చింది. 2009లో వచ్చిన శివ మనసులో శక్తి ఆమె తొలి చిత్రం. దాదాపు 14 ఏళ్ల తర్వాత గుడ్‌న్యూస్ చెప్పింది నటి.
త్వరలో ఐడీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది. ఇకపోతే స్నేహ మరో శుభవార్త కూడా చెప్పింది. తను తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది సిద్దార్థ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం నిత్యం టచ్‌లో ఉంది స్నేహ.
Comments
Please login to add a commentAdd a comment