Thiruvannamalai
-
తిరువణ్ణామలై : భక్త జనసంద్రంగా గిరివలయం (ఫొటోలు)
-
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
నడిరోడ్డున మహా విష్ణువు భారీ ఏకశిలా విగ్రహం.. ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: బెంగుళూరు వెళ్లాల్సిన భారీ ఏకశిలా విగ్రహం నడిరోడ్డున నిలివేయడం.. తమిళనాట ఉద్రిక్తత రేపింది. బెంగుళూరులోని కోందండరామసామి ఆలయంలో ప్రతిష్టించేందుకు భారీ ఏకశిల మహా విష్ణువు విగ్రహాన్ని తిరువణ్ణామలైలో తయారు చేయించారు. 108 మీటర్ల ఎత్తైన, 11 ముఖాలు, 22 చేతులతో మహావిష్ణువు, పైభాగంలో ఏడు తలల ఆదిశేషుడితో 300 టన్నుల బరువైన విగ్రహాన్ని బెంగుళూరు తరలించేందుకు 205 చక్రాల భారీ కంటైనర్ లారీని రప్పించారు. అయితే, ఈ భారీ విగ్రహాన్ని తీసుకెళుతున్న లారీ టైర్లు పేలడంతో శనివారం వాహనం వడసిలవలూరులో నిలిచిపోయింది. మరమ్మత్తుల అనంతరం ఈ భారీ విగ్రహాన్ని తరలించేందుకు వీలుగా.. రోడ్డుకు ఇరువైపుల ఉన్న నివాసాలు, దుకాణాలను పాక్షికంగా కూల్చివేశారు. అక్కడినుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక వాహనాన్ని ఒక్కసారిగా స్థానిక గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దారి పొడవునా ఉన్న భవనాల కూల్చివేతకు పరిహారంగా రూ. 30లక్షలు చెల్లస్తామని, ఇంకా రూ. 13.50 లక్షలు చెల్లించకుండానే లారీని ముందుకు తరలించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారితో చర్చలు జరిపి వారి నష్టపరిహారం చెల్లించేలా ఒప్పించారు. నష్టపరిహారాన్ని చెల్లించిన అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని అక్కడి నుండి తరలించారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని..
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు యువ తి కుంటుంబ సభ్యులపై దారుణానికి ఒడిగట్టాడు. యువతి, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çసంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరువణ్ణామలై : పెళ్లికి అంగీకరించలేదని యువతి, తల్లిదండ్రులపై దాడిచేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో యువతి, తల్లి మృతిచెందగా, యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కణ్ణమంగళం సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని కనికాపురానికి చెందిన శివరామన్(54) వ్యవసాయ కూలీ. ఇతని భార్య చామండీశ్వరి(44), వీరి కుమార్తె నిర్మల(24) ఎంఏ, బీఎడ్ పట్టభద్రురాలు. ఇదే గ్రామానికి చెందిన రాజవేలు కుమారుడు అన్బయగన్(34) వీరికి బంధువు అవుతాడు. ఇతను నిర్మలను వివాహం చేసుకోవాలని ఆశతో ఉన్నాడు. నిర్మల చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా అన్బయగన్ పెట్టినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం శివరామన్ ఇంటికి వెళ్లి నిర్మలను వివాహం చేసుకుంటానని అన్బయగన్ కోరాడు. ఇందుకు చామండీశ్వరి నిరాకరించడం, నిర్మల కూడా వివాహం చేసుకోనని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన అన్బయగన్ ఇంట్లో ఉన్న కత్తితో చామండీశ్వరి, శివరామన్, నిర్మలను పొడిచాడు. నిర్మల, చామండీశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలతో శివరామన్ కేకలు వేశాడు. దీంతో అన్బయగన్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ కేకలు విన్న స్థానికులు ఇంటికి వచ్చి శివరామన్‌ను ఆస్పత్రికి తరలించారు. శివరామన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం అన్బయగన్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని, డీఎస్పీ సెంథిల్, కణ్ణమంగళం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఆరంభం
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యూ యి. వేలాది మంది భక్తజనుల మధ్య ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ ఉత్సవాలు పది రోజులు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగనున్నారు. వేలూరు:తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధిగాంచాయి. ఉత్సవాలకు నాందిగా ఆలయంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు ధ్వజారోహణం నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గం టలకు మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధన లు జరిగాయి. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్, చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చి మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ఈ వేడుకలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హరోం హరా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. చివరగా ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అగ్రి క్రిష్ణమూర్తి, కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ ముత్తరసి, ఎమ్మెల్యే అరంగనాథన్, ఆలయ జాయింట్ కమిషనర్ సెంథిల్వేలవన్, జడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా వాహనసేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, నంది, చిన్న వృషభ వాహనాల్లో ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 2న రథోత్సవం నిర్వహించనున్నారు. 5న ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు కొండపై మహా దీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు విదేశాల నుంచి సైతం భక్తులు తరలిరానున్నారు.