సాక్షి, చెన్నై: బెంగుళూరు వెళ్లాల్సిన భారీ ఏకశిలా విగ్రహం నడిరోడ్డున నిలివేయడం.. తమిళనాట ఉద్రిక్తత రేపింది. బెంగుళూరులోని కోందండరామసామి ఆలయంలో ప్రతిష్టించేందుకు భారీ ఏకశిల మహా విష్ణువు విగ్రహాన్ని తిరువణ్ణామలైలో తయారు చేయించారు. 108 మీటర్ల ఎత్తైన, 11 ముఖాలు, 22 చేతులతో మహావిష్ణువు, పైభాగంలో ఏడు తలల ఆదిశేషుడితో 300 టన్నుల బరువైన విగ్రహాన్ని బెంగుళూరు తరలించేందుకు 205 చక్రాల భారీ కంటైనర్ లారీని రప్పించారు. అయితే, ఈ భారీ విగ్రహాన్ని తీసుకెళుతున్న లారీ టైర్లు పేలడంతో శనివారం వాహనం వడసిలవలూరులో నిలిచిపోయింది.
మరమ్మత్తుల అనంతరం ఈ భారీ విగ్రహాన్ని తరలించేందుకు వీలుగా.. రోడ్డుకు ఇరువైపుల ఉన్న నివాసాలు, దుకాణాలను పాక్షికంగా కూల్చివేశారు. అక్కడినుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక వాహనాన్ని ఒక్కసారిగా స్థానిక గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దారి పొడవునా ఉన్న భవనాల కూల్చివేతకు పరిహారంగా రూ. 30లక్షలు చెల్లస్తామని, ఇంకా రూ. 13.50 లక్షలు చెల్లించకుండానే లారీని ముందుకు తరలించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారితో చర్చలు జరిపి వారి నష్టపరిహారం చెల్లించేలా ఒప్పించారు. నష్టపరిహారాన్ని చెల్లించిన అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని అక్కడి నుండి తరలించారు.
Published Sat, Dec 15 2018 5:23 PM | Last Updated on Sat, Dec 15 2018 5:54 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment