తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్‌ | tasmac liquor scam protest tamil nadu cops detain bjp leaders annamalai tamilisai | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్‌

Published Mon, Mar 17 2025 12:23 PM | Last Updated on Mon, Mar 17 2025 1:14 PM

tasmac liquor scam protest tamil nadu cops detain bjp leaders annamalai tamilisai

చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.  మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్‌ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.

రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్‌’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా  నిరసన ప్రారంభిస్తే  ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.  ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.

ఇది కూడా చదవండి: పాక్‌లో మరో హత్య: జమీయత్‌ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement