Mahavishnu
-
సమ్మోహన స్వరూపుడు
రూపు నల్లన.. చూపు చల్లన. మనసు తెల్లన... మాట మధురం. పలుకు బంగారం.నవ్వు సమ్మోహకరం. వ్యక్తిత్వం విశిష్టం..ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే... నమ్మిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం.. అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..అందుకే ఆ నామం ఆరాధనీయం.. సదా స్మరణీయం.కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా చతుర్విధ çపురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకూ శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందన నామ సంవత్సర దక్షిణాయన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. నేడు ఆయన ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ఓ వ్యాస పారిజాతం. చిలిపి కృష్ణునిగా, గో పాలకునిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టపత్నులకూ ఇష్టుడైన వాడిగా... గోపికావల్లభుడిగా... యాదవ ప్రభువుగా, పార్థుడి సారథియైన పాండవ పక్షపాతిగాను, గీతా బోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, రాజనీతిజ్ఞునిగా... ఇలా బహువిధాలుగా శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ద్యోతకమవుతుంటాయి. ఎన్నిసార్లు చదివినా, ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి. శ్రీ కృష్ణుడు బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. గోపికల ఇళ్లలో వెన్నముద్దలను దొంగిలించి తినేవాడు. అది చాలదన్నట్టు వారిలో వారికి తంపులు పెట్టేవాడు. అందులోని అంతరార్థమేమిటంటే.. జ్ఞానానికి సంకేతమైన వెన్న అజ్ఞానానికి చిహ్నమైన నల్లని కుండలలో కదా ఉండేది. అందుకే కుండ పెంకులనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నమైన వెన్నను దొంగిలించడం ద్వారా తన భక్తుల మనసులో విజ్ఞానపు వెలుగులు నింపేవాడు. గోపాలకృష్ణుడు‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. మోహన కృష్ణుడుశ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలిపింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. శ్రీకృష్ణుని పూజించేవారికి మాయవలన కలిగే దుఃఖాలు దరిచేరవని అంటారు.వేణుమాధవుడుకన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...కృష్ణుడికి అర్పించుకోవడం కోసం వేణువు తనను తాను డొల్లగా చేసుకుంటే, ఆ డొల్లలో గాలిని నింపడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దానిని తన పెదవుల దగ్గరే ఉంచుకునేవాడు. అందుకే కృష్ణుడి పెదవులు తనను తాకి నప్పుడు పరవశించి మృదు మధురమైన గానాన్ని వినిపిస్తుంది వేణువు. అందుకే నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఈ తిథులో మహా విష్ణు పూజ చేస్తే అనుగ్రహం వస్తుంది
-
ఈ తిథులలో మహా విష్ణు పూజ చేస్తే అనుగ్రహం వస్తుంది
-
శ్రీకూర్మనాథుని డోలోత్సవానికి వేళాయె...
మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మార్చి 19న కామదహనోత్సవం, 20న పడియ, 21న డోలోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కామదహనోత్సవం... అంటే మనలోని కోరికలను దహనం చేసే ఉత్సవంగా చెబుతారు. మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ... కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది. డోలోత్సవం... డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే... డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు. పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు. కూర్మనాథుని ఆవిర్భావం.... ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని, క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది. గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు. క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు. త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం.... ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు -
నడిరోడ్డున మహా విష్ణువు భారీ ఏకశిలా విగ్రహం.. ఉద్రిక్తత
సాక్షి, చెన్నై: బెంగుళూరు వెళ్లాల్సిన భారీ ఏకశిలా విగ్రహం నడిరోడ్డున నిలివేయడం.. తమిళనాట ఉద్రిక్తత రేపింది. బెంగుళూరులోని కోందండరామసామి ఆలయంలో ప్రతిష్టించేందుకు భారీ ఏకశిల మహా విష్ణువు విగ్రహాన్ని తిరువణ్ణామలైలో తయారు చేయించారు. 108 మీటర్ల ఎత్తైన, 11 ముఖాలు, 22 చేతులతో మహావిష్ణువు, పైభాగంలో ఏడు తలల ఆదిశేషుడితో 300 టన్నుల బరువైన విగ్రహాన్ని బెంగుళూరు తరలించేందుకు 205 చక్రాల భారీ కంటైనర్ లారీని రప్పించారు. అయితే, ఈ భారీ విగ్రహాన్ని తీసుకెళుతున్న లారీ టైర్లు పేలడంతో శనివారం వాహనం వడసిలవలూరులో నిలిచిపోయింది. మరమ్మత్తుల అనంతరం ఈ భారీ విగ్రహాన్ని తరలించేందుకు వీలుగా.. రోడ్డుకు ఇరువైపుల ఉన్న నివాసాలు, దుకాణాలను పాక్షికంగా కూల్చివేశారు. అక్కడినుండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక వాహనాన్ని ఒక్కసారిగా స్థానిక గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దారి పొడవునా ఉన్న భవనాల కూల్చివేతకు పరిహారంగా రూ. 30లక్షలు చెల్లస్తామని, ఇంకా రూ. 13.50 లక్షలు చెల్లించకుండానే లారీని ముందుకు తరలించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారితో చర్చలు జరిపి వారి నష్టపరిహారం చెల్లించేలా ఒప్పించారు. నష్టపరిహారాన్ని చెల్లించిన అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని అక్కడి నుండి తరలించారు. -
అచటనుండును ఆంధ్ర మహావిష్ణువు
• మీసాలున్న మహావిష్ణువు • తెలుగుభాషకు దేవుడు శ్రీకాకుళేశ్వరస్వామి • ‘ఆముక్తమాల్యద’ గ్రంథ రచనకు శ్రీకారమిక్కడే • ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళ గ్రామంలో నెలకొని ఉంది. తెలుగువారికి ఈ క్షేత్రం విశిష్టమైనది. ఎందుకంటే శ్రీమహావిష్ణువు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువుగా కొలువవడమే కాదు... ఆంధ్రనాయకుడుగా, తెలుగు వల్లభుడుగా పూజలందుకుంటున్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకూ పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం. శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి తన ‘ఆముక్తమాల్యద’ రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం మరో విశేషం. ఇంకో విశేషం... ఇక్కడ స్వామి మీసాలున్న మహావిష్ణువు. ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే... శ్రీకాకుళాన్ని 108 దివ్యక్షేత్రాలలో 57వ క్షేత్రంగా చెబుతారు. బ్రహ్మ పులకరించిన ప్రదేశం శ్రీకాకుళానికి సంబంధించి అనేక స్థలపురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. కలియుగంలో పాపాలు పెరిగి పోతున్నాయని దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారట. ఆయన వారి మొర ఆలకించి, ఈ పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట. అందువల్ల బహురూపాలు ధరించి ప్రతి మూలనా నిలబడి ఈ ప్రాంత అందాలు చూడసాగాడట. అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని ‘శ్రీకాకుళం’ అని పిలవడం మొదలుపెట్టారు. ‘శ్రీ’ అంటే శోభాయకరమైన, ‘క’ అంటే బ్రహ్మచే, ‘ఆకుళం’ అంటే వ్యాపించినది అని అర్థం. మరో కథనం ప్రకారం శ్రీమహావిష్ణువుకు సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడట. మరో కథనం ప్రకారం భృగువు, పులస్త్యుడు, సుబాహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దశుడు, వశిష్ఠుడు, మరీచి అనే నవబ్రహ్మలు ఇక్కడి విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారనే నమ్మకం ఉంది. పద్యానికో అంగుళం చొప్పున... ఒకప్పుడు ఆంధ్రనాయకస్వామి ఆలయం కృష్ణానది మధ్యలోని దేవుడిలంకలో ఉండేదనీ, అయితే వరదల వల్ల ఆలయం దెబ్బతినడంతో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పునరుద్ధరణ జరిగిందనీ తెలుస్తోంది. నిజానికి ఈ ఆలయం క్రీ.శ. 4వ శతాబ్దంలోనే ఉండేదనీ, అయితే విచిత్రంగా వెయ్యేళ్లపాటు మూలవిరాట్టు కనిపించకుండా పోయిందనీ మరో కథనం. వెయ్యేళ్ల తర్వాత ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఈ ప్రాంతం గుండా వెళుతూ క్షేత్రాన్ని దర్శించుకుని మూలవిరాట్టు లేకపోవడం గురించి ఆందోళన చెంది, దాని కోసం వెతికించినట్టూ, అయినా ఎక్కడా దొరకనట్టూ, అప్పుడు అతని కలలో స్వామి కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నానని చెప్పినట్టూ, మంత్రి అక్కడికి వెళ్లి తవ్వకాలు జరపగా మూలవిరాట్టు బయటపడినట్టూ ఒక కథ ఉంది. ఇంకో కథనం ప్రకారం 18వ శతాబ్దంలో చల్లపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజా అంకినీడు బహద్దూర్ శ్రీకాకుళస్వామి మహాభక్తుడు. ఆయనకు ఆ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం లేకపోవడం వల్ల బాధ కలిగి అప్పటికే శ్రీకాకుళస్వామి మరో భక్తుడైన కాసుల పురుషోత్తముడనే కవిని ఆలయానికి తీసుకొచ్చి మూలవిరాట్టు భూమి లోపల ఉండవచ్చునని దానిని బయటకు వచ్చేలా చేయాలని కోరాడట. అప్పుడు పురుషోత్తమ కవి అక్కడిక్కడే 108 పద్యాల శతకం భక్తియుక్తంగా చెప్పగా, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున భూమి లోపల నుంచి స్వామివారి విగ్రహం పైకి లేచిందని అంటారు. ఆముక్త మాల్యదకు శ్రీకారం శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తరువాత 1513లో జైత్రయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు రాజ్యాలు జయించి విజయవాటిక, కొండపల్లి మొదలైన దుర్గాలను పట్టుకుని కళింగ వరకూ వెళ్లాడు. అక్కడ నుంచి విజయగర్వంతో తిరిగి వెళుతూ, వినమ్రుడై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలకు శ్రీకాకుళేశ్వరస్వామి కలలో ప్రత్యక్షమై ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ రచన చేయాలని కోరాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఆలయ క్రింది భాగంలో ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనగా, తెలుగురాయుడైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయన చేత తెలుగు సాహిత్యానికి తలమానికమైన ‘ఆముక్త మాల్యద’ ప్రబంధ రచన చేయించాడని ఒక నమ్మకం. ఈ రచన ద్వారా కృష్ణదేవరాయలు ‘సాహితీ సమరాంగణ సార్వభౌమ’ బిరుదునందుకున్నాడు. అంతటి సాహితీవేత్త ప్రస్థానం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామి సన్నిధిలో జరగడం తెలుగువారందరికీ గర్వకారణం. దర్శన వేళలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. రవాణా సౌకర్యం విజయవాడ నుంచి శ్రీకాకుళం గ్రామం కరకట్ట మార్గంలో 35 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల ద్వారా ఘంటసాల మండలం కొడాలి చేరుకోవాలి. అక్కడ నుంచి 7 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలు, ఇతర వాహనాల్లో చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి చల్లపల్లి మీదుగా శ్రీకాకుళం చేరుకోవచ్చు. దూరం 35 కి.మీ. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పులిగడ్డ– విజయవాడ కరకట్ట మీదుగా ఈ క్షేత్రం 26 కి.మీ దూరం. మీసాల వెనుక కథ... శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరస్వామిగా పూజలందు కుంటున్న ఆంధ్ర మహావిష్ణువు మీసాలు కలిగి ఉండటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత. అన్నవరంలోని సత్యనారాయణస్వామికీ, పలుచోట్ల చెన్నకేశవస్వామికీ ఈ విధంగా మీసాలున్నాయి. శ్రీరంగం, తిరుపతి వంటి ప్రసిద్ధి పొందిన వైష్ణవాలయాల్లో స్వామివారికి మీసాలుండవు. అయితే శ్రీకాకుళ స్వామి కేశాల వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వం ఈ ఆలయంలో ఒక అర్చకుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. కానీ వేశ్యాలోలుడు. స్వామికి సమర్పించాల్సిన దండలు మొదట వేశ్యలకు సమర్పించి, ఆ తర్వాత స్వామికి అలంకరించి, ఆ తర్వాత స్థానిక ప్రభువుకు అర్పించే వాడట. ఒకసారి ప్రభువుకు ఆ దండల్లో సువాసనలీనే పొడవాటి వెంట్రుక కనిపించింది. దానిని చూసిన ప్రభువు ‘ఏమిటీ... మన స్వామికి కేశాలు ఉన్నాయా?’ అని అర్చకుణ్ణి అడిగాడు. అప్పుడు అర్చకుడు ‘ఆయన కేశవుడు కదా... కేశాలు లేకుండా ఎలా ఉంటాయి’ అని బదులిచ్చాడు. ‘అయితే రేపొచ్చి నేను చూస్తాను’ అన్నాడు ప్రభువు. భక్తుడైన అర్చకుడు భయపడలేదు. తన మానాన తాను వెళ్లి నిద్రపోయాడు. కానీ తెల్లారి ప్రభువు వచ్చేసరికి స్వామికి మీసాలు, కేశాలు ప్రత్యక్షమయ్యాయి. ‘భక్తుడి మర్యాదే నా మర్యాద’ అని భావించిన స్వామి తనకు తానే మీసాలు తెచ్చుకున్నాడట. ఇది చూసి నమ్మని ప్రభువు మీసాలు లాగి చూడగా స్వామికి చురుక్కమన్నదనీ, ఆ తప్పుకు ప్రభువు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడనీ చెప్పుకుంటారు. ఆంధ్రుల తొలి రాజధాని క్రీ.శ 3వ శతాబ్దం చివరలో అశోకుని మరణానంతరం శాతవాహనాంధ్రులు మౌర్య సామ్రాజ్యాన్ని ధిక్కరించి స్వతంత్య్ర రాజ్యాన్ని స్ధాపించుకున్నారు. కృష్ణానదీ తీరంలోని శ్రీకాకుళాన్ని తొలిరాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. ధాన్యకటకానికి రాజ«ధానిని మార్చేవరకూ శ్రీకాకుళం రాజధానిగా ఉంది. శాతవాహనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, వెలనాటి చోడులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు ఈ ప్రాంతాన్ని పాలించారు. – పుట్టి శ్రీనివాసరావు, ‘సాక్షి’, అవనిగడ్డ, కృష్ణాజిల్లా