పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు | Actress Sneha Love, Breakup And Marriage, Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Actress Sneha Love, Breakup Story:పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. అతని బుద్ధి మంచిది కాదని దూరం!

Published Thu, Sep 28 2023 9:32 AM | Last Updated on Thu, Sep 28 2023 10:27 AM

Actress Sneha Before Marriage In Love - Sakshi

సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్​పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది. ఆమె మరెవరోకాదు.. తెలుగుతోపాటు సౌత్​లో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది.

పెళ్లి అనంతరం సినిమాలకు కాస్తా గ్యాప్‌ ఇచ్చిన ఆమె రామ్‌ చరణ్‌ వినయ విధేయ రామతో రిఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నటి స్నేహ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఆమె పూర్వీకులు ఏపీలోని రాజమండ్రిలో నివసించారు. కానీ ఆమె తల్లిదండ్రులు రాజారామ్, పద్మావతి వ్యాపార రిత్యా ముంబాయికి వెళ్లారు. హీరోయిన్ స్నేహ కూడా అక్కడే జన్మించారు.

నిర్మాతతో ప్రేమలో
కోలీవుడ్‌లో స్థిరపడిన స్నేహ, ప్రసన్నలకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కితాబు చాలామంది ఇస్తుంటారు. పదకొండేళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటికీ ఎలాంటి పొరపచ్చాలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. సినీ పరిశ్రమలో విడాకులు తరచు పెరుగుతున్న పరిస్థితుల్లో స్నేహ, ప్రసన్నల కుటుంబ జీవితం అందరికీ ఉదాహరణగా చెప్పుకుంటారు కూడా. పెళ్లయ్యాక ఇద్దరూ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ప్రసన్న కంటే ముందే స్నేహ మరోక వ్యక్తిని ప్రేమించారని తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ వెల్లడించాడు.

(ఇదీ చదవండి: Skanda Review: ‘స్కంద’ మూవీ ట్వీటర్‌ రివ్యూ)

ఆ ప్రేమ విఫలం కావడంతోనే స్నేహ ఇక పెళ్లి చేసుకోదనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రసన్నతో ప్రేమలో పడకముందే స్నేహ ఓ సినీ నిర్మాతతో ప్రేమలో పడిందని, అది విఫలమైందని బెయిల్వాన్ రంగనాథన్ పేర్కొన్నాడు. 'స్నేహ ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో ప్రేమలో ఉన్నారని, కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లిందని ఆయన చెప్పాడు. అంతేకాకుండా వారిద్దరూ  డైమండ్ రింగ్స్ మార్చుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారని తెలిపాడు.

నిశ్చితార్థం తర్వాత, స్నేహ తన ప్రియుడు రవికి తన పట్ల చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని గ్రహించిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడం సరికాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. అలా రవితో తన  ప్రేమకు స్నేహ స్వస్తి చెప్పినట్లు ఆయన గుర్తుచేశాడు. ఈ సంఘటన తర్వాత ప్రసన్నతో పరిచయం ఆమెకు పరిచయం ఏర్పడింది. కానీ ప్రేమ పట్ల తనకు నమ్మకం లేకపోవడంతో మొదట ప్రసన్నకు కూడా ఆమె దూరంగా ఉండేదని తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని ఆయన అన్నాడు. వారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారని  బైల్వాన్ రంగనాథన్ తెలిపారు.

త్వరలో స్నేహ, ప్రసన్న విడిపోవాలని యోచిస్తున్నట్లు తమిళనాట వార్తలు బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత వారిద్దరూ వాటికి బ్రేక్‌ వేసి హ్యాపీ లైఫ్‌ను గడుపుతున్నామని వెల్లడించారు. వాళ్లిద్దరూ మంచి కపుల్స్‌ అని బైల్వాన్‌ కితాబు ఇచ్చారు.  ప్రసన్న, స్నేహ మొదట 2009 థ్రిల్లర్ అచ్చబేడులో వెండి తెరపై జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వారి పెళ్లి అనంతరం స్నేహ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. మళ్లీ కొంత కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ రోల్స్ చెస్తుంది. కొన్నిసార్లు స్నేహ రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపిస్తుంది. ప్రసన్న చివరిసారిగా దుల్కర్ సల్మాన్ చిత్రం కింగ్ ఆఫ్ కొత్తలో నటించాడు. ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement