క్లీన్‌గా... నీట్‌గా...!
‘‘శ్రీకాంత్‌గారు, నేను ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఇటీవల ఆయన ఎక్కువగా నాతో మాట్లాడింది ‘టెర్రర్’ చిత్రం గురించే. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టెర్రర్’ ప్రచారచిత్రాన్ని ఆయన హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పట్లో సినిమా తీయడం పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని విడుదల చేయడం చాలా కష్టమైన విషయం.
మస్తాన్‌గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. దర్శ కుడు క్లీన్‌గా, నీట్‌గా తీశారు. సాయికార్తీక్ మంచి పాటలు, రీ-రికార్డింగ్ ఇచ్చాడు’’ అని శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి.