పవర్‌ఫుల్... ‘టైర్రర్’
చిత్రం: టై, తారాగణం: శ్రీకాంత్, నికిత, కోట, నాజర్, శ్రీ, మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: సాయికార్తీక్, కెమేరా: శ్యామ్‌ప్రసాద్, ఎడిటర్: బసవ పైడిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, నిర్మాత: షేక్ మస్తాన్ , కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీశ్ కాసెట్టి, రిలీజ్: ఫిబ్రవరి 26
దేశం బాగుండాలంటే ముందు వ్యవస్థ బాగుండాలి. ఒక్కరి పనితీరు సరిగ్గా లేకపోయినా అందరికీ నష్టమే అని చూపించడానికి చేసిన ప్రయత్నమే ‘టై’. పోలీసు శాఖ ఎలాంటి ఒత్తిళ్లకూ గురి కాకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే సమాజంలో విద్రోహశక్తులను అంతం చేయొచ్చనే అంశానికి సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి, దర్శకుడు సతీశ్ కాసెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ చేసిన చిత్రాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ‘టై’ ఆ జాబితాలో చేరుతుందా? సతీశ్ కాసెట్టి చెప్పిన కథ నచ్చి, చేశానంటున్న శ్రీకాంత్ నమ్మకం నిజమవుతుందా? తెలియాలంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
పోలీస్ శాఖలో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు పొందిన సీఐ విజయ్ (శ్రీకాంత్). పై అధికారులకు నమ్మిన బంటు. ప్రజలకు హీరోలాంటివాడు. విజయ్ తండ్రి సుధాకర్ (నాజర్)కి స్నేహితుడైన డేవిడ్ (విజయ్‌చందర్) కొడుకు హత్యకు గురవుతాడు. అతని హత్యకి విజయ్, డీజీపీ రాథోడ్‌ల నిర్లక్ష్యమే కారణమని డిపార్ట్‌మెంట్ విచారణ మొదలుపెడుతుంది. స్నేహితుడి కొడుకు మరణానికి తన కొడుకే కారణమని సుధాకర్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పాటు కొడుకును ఇంట్లోంచి గెంటేస్తాడు. వేరే దారి లేక, కష్టపడి ఎమ్మెల్యే రవి (‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ)కి రూ. 40 లక్షలు ఇచ్చి క్లీన్ చిట్ తెచ్చుకుంటాడు విజయ్. కానీ, తండ్రి మాత్రం ఇంట్లోకి రానివ్వడు. కట్ చేస్తే...
నగరంలో ప్రవేశించిన టైస్టులు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని విజయ్‌కి తెలుస్తుంది. ఈ విషయం ముందే తెలిసినప్పటికీ హోం మినిస్టర్ సుదర్శన్‌రావు (కోట శ్రీనివాసరావు), డీజీపీ తమ స్వలాభం కోసం సెలైంట్ అయిపోతారు. ఈ కుట్రను ఆపుదామనుకున్న విజయ్‌ని కిడ్నాప్ చేస్తారు. పై అధికారులకు తలొగ్గి, తెలియక ఒకసారి చేసిన పొరపాటు మళ్లీ జరగకూడదని దేశాన్నీ, ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో విజయ్ పోరాటం మొదలుపెడతాడు. కార్యనిర్వహణలో భాగంగా అతనెలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటాడు? పై అధికారులకు ఎలాంటి సవాల్ విసురుతాడు? అనేది తెరపై చూస్తేనే రసవత్తరంగా ఉంటుంది.
ఈ సినిమా మొత్తం శ్రీకాంత్ భుజాలపైనే నడుస్తుంది. విజయ్ పాత్రలో నటన పరంగా ఆయన విజృంభించారనే చెప్పాలి. ‘థర్టీ’ ఇయర్స్ పృథ్వీ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కాస్త నవ్వించి, సెపరేట్ కామెడీ ట్రాక్ లేని లోటుని భర్తీ చేశారు. సీనియర్ నటుడు కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ గుర్తుండిపోయే పాత్ర చేశాడు. సీఎం పాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం విశేషం. ప్రస్తుతం ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు ఉంటేనే ‘సేఫ్’ అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, దమ్మున్న కథ అయితే రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేయొచ్చనే నమ్మకంతో దర్శక-నిర్మాతలు ఈ సినిమా తీశారు.
పోలీసు-టైస్ట్‌ల కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉండాలి. ఈ సినిమా విషయంలో ఆ జాగ్రత్త తీసు కున్నారు. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్. పోలీసులు పడే మానసిక వేదన, ఎదుర్కొనే ఒత్తిళ్లు వాస్తవికతకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్, ద్వంద్వార్థాలు లేకపోయినా మంచి కథతో సినిమా తీస్తే, ప్రేక్షకుల మనసులను గెల్చుకోవచ్చనడానికి ‘టై’ లాంటి చిత్రాలు ఓ నిదర్శనం. ఇది దర్శక-నిర్మాతలు నిజాయతీగా ప్రయత్నమనే చెప్పాలి.