nikita
-
Nikita Kaushik: సిటీకి పల్లె కళ
గ్రామీణ మహిళా కళాకారులను ప్రోత్సహించడానికి, వారి వారసత్వ కళను, ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్‌ను భారతదేశం అంతటా పరిచయం చేయడానికి ది వోవెన్ ల్యాబ్ పేరుతో కృషి చేస్తున్నారు భూపాల్ వాసి నిఖితా కౌశిక్. ముంబైలోని నిఫ్ట్ పూర్వవిద్యార్థి అయిన నిఖిత జీరోవేస్ట్ పాలసీతో పాతికమంది గ్రామీణ మహిళల చేత పట్టణ మహిళల కోసం ఆధునికంగా డ్రెస్‌లను డిజైన్ చేయించి, వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘స్టైల్ తత్త్వ’ ఎగ్జిబిషన్లో క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ క్లస్టర్స్‌కి వారధిగా ఉంటూ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఈ రోజు మనం భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నామంటే మన దేశంలోని విభిన్న సంస్కృతులూ, సంప్రదాయాలూ కారణం. వేటికవి సొంత మార్గాలలో ప్రత్యేకమైనవి. ఫలితంగా మన జీవితంలో దుస్తులు ముఖ్యమైన అంశంగా మారాయి. మన గ్రామీణ మహిళా కళాకారుల హస్తకళ శిల్ప నైపుణ్యాన్ని చేతితో నేసిన వస్త్రాలను మరింత మెరుగుపరచడంలో మా పని కీలకంగా ఉంటుంది. చిట్ట చివరగా ఉపయోగించే చిన్న ఫ్యాబ్రిక్ పీస్తో కూడా ‘కళ’ద్వారా అందంగా డిజైన్ చేస్తాం. ఇందుకోసం నిరంతరం పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే, మా బ్రాండ్‌కు ‘ది వోవెన్ ల్యాబ్’ అని పేరు పెట్టాం.జీరో వేస్ట్ పాలసీ రాజస్థాన్, గుజరాత్ భోపాల్.. ్రపాంతాల్లోని గ్రామీణ, గిరిజన మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న మా దుస్తుల డిజైన్స్ బయట షాపుల్లో లభించవు. ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ ద్వారా అమ్మకం చేస్తుంటాం. మన దేశీ కాలా పత్తితో పాటు టెన్సెల్, రీసైకిల్ ఫ్యాబ్రిక్స్, పర్యావరణ అనుకూలమైన క్లాత్‌తోనే డిజైన్ చేస్తున్నాం. అరుదైన కాటన్ ఫ్యాబ్రిక్, ్రపాచీన కళా వైభవం గల మోడర్న్ డిజైనరీ డ్రెస్సులు కాబట్టే వీటి ఖర్చు ఎక్కువే. కానీ, ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంటాయి.మహిళా సాధికారతమా సంస్థకు ఉన్న బలమైన స్తంభాలలో ఒకటి మహిళా సాధికారత. ఇప్పటికి పాతిక మంది గ్రామీణ మహిళలు ఈ డిజైన్స్ కోసం కృషి చేస్తున్నారు. కళ పట్ల ఆసక్తి ఉన్న గ్రామీణ బాలికలను ఎంపిక చేసుకొని, శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి ్రపాథమిక విద్య కూడా సవ్యంగా జరిగేలా చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుగోలు చేస్తే ఆ మొత్తంతో ఆ కళాకారుల ఇల్లు నెలంతా ఏ ఇబ్బంది లేకుండా గడిచి΄ోతుంది. భవిష్యత్తు తరాలు ఆ కళావైభవాన్ని సొంతం చేసుకోవాలన్నదే నా కల. చాలావరకు సేకరించే కాటన్ ఫ్యాబ్రిక్ ఐవరీ, గ్రే కలర్ వే ఎంచుకుంటాం. కొన్నింటికి మాత్రం నేచురల్ రంగులతో డైయింగ్ ప్రక్రియ ఉంటుంది. వ్యర్థాలను నివారిస్తూ, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను వెలుగులోకి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం తప్ప ఫాస్ట్ ఫ్యాషన్ ΄ోటీ పరుగులో చేరం.రాబోయే తరాలకు మన కళప్రాచీన హ్యాండ్ వర్క్స్‌ని వదిలేస్తే అవి అంతే సులువుగా మరుగున పడి΄ోతాయి. క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను కాబట్టి దేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్స్తోనూ, ఈ మార్గంలో వచ్చే అంతరాలను పూడ్చేందుకు నిఫ్ట్‌లోని వివిధ కేంద్రాలతో అనుబంధంగా వర్క్ చేస్తున్నాను.ఫ్యాబ్రిక్ సేకరణ, డిజైన్స్ సృష్టి, వ్యర్థాలు మిగలకుండా జాగ్రత్తపడటం అనేది ఓ సవాల్‌గా ఉంటుంది. కానీ, పర్యావరణ హితంగా, మనసుకు నచ్చిన పని చేస్తుండటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ డిజైన్స్‌ని ఇష్టపడి కొనుగోలు చేసేవారి ద్వారా ప్రాణం పెట్టే కళాకారులకు ఉపాధి ΄÷ందేలా చేయడం మరింత సంతృప్తిని ఇస్తుంది’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్‌లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు. సురేందర్ కు నిఖిత కజిన్ సిస్టర్ గా గుర్తించామన్నారు. నిఖితతో వెంకటకృష్ణకు పరిచయం ఉందని, వీళ్ళిద్దరూ కలిసి సురేష్ తో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సురేందర్ తో కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేయించారు. వారికి సహకరించాలని చెప్పారని ముందే ప్లాన్ వేశారు. అయితే.. నిఖిత, వెంకటకృష్ణ లు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.. సురేష్ తో కలిసి నిఖిత , వెంకట కృష్ణలు కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తెలిపారు. గతంలోనూ వీళ్ళు కిడ్నాప్ లు చేసిన కేసులు వున్నాయని తెలిపారు. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. సురేష్, వెంకటకృష్ణ లపై పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై 21 కేసులు ఉండగా, వెంకటకృష్ణ పై రెండు కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
ధైర్యం చాలట్లేదు, భయమేస్తోంది: బాలీవుడ్ నటి
Nikita Dutta: బాలీవుడ్ నటి నికితా దత్తా సెల్‌ఫోన్‌ను ఆ మధ్య దుండగులు లాక్కెళ్లిన విషయం తెలిసిందే కదా! అయితే ఇప్పటివరకు తన ఫోన్ తిరిగి లభించలేదని చెప్పుకొచ్చింది నికిత. ఆ ఘటన జరిగిన రోజు తానసలు నిద్రపోలేదని తెలిపింది. తాజాగా ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో నికితా దత్తా మాట్లాడుతూ.. 'ఆ రోజు జరిగిన ఘటన నిజంగా భయంకరం. నాకు నా ఫోన్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. కానీ సాధారణ వాకింగ్ చేయడం అంటే నాకిష్టం. కానీ ధైర్యం చేసి నేనిప్పట్లో బయటకు వెళ్లలేను. అదంత మంచిదని కూడా అనిపించడం లేదు.' 'దీన్నో పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ చెప్పొచ్చేదొకటే.. రోడ్డు మీదున్నప్పుడు మీరు ఎవరితోనూ చాట్ చేయవద్దు, మెసేజ్‌లు చేయడంలో మునిగిపోవద్దు' అని సలహా ఇస్తోంది నికితా దత్తా. కాగా నికితా దత్తా.. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, ది బిగ్బుల్, కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించింది. 2012 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ వరకూ చేరింది. -
హృతిక్ రోషన్ పక్కన నటించడం నా కల: నటి
నికిత దత్తా.. సంప్రదాయ వ్యాయామాన్నే కాదు నటననూ ఒక యోగంగా మలచుకుంది. ప్రేక్షకుల ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్ స్క్రీన్ అప్పియరెన్స్ మీదా శ్రద్ధ పెడుతున్న ఆమె గురించే ఈ పరిచయం... పుట్టింది ఢిల్లీలో. తండ్రి అనిల్ దత్తా నేవీ ఆఫీసర్ అవడం వల్ల అతని ఉద్యోగరీత్యా విశాఖపట్టణం, కొచ్చి, ముంబైల్లో నికిత బాల్యం, విద్యాభ్యాసం గడిచాయి. ఆరేళ్ల వయసులో హృతిక్ రోషన్‌కు అభిమానిగా మారింది. ఆ ఇష్టంతోనే నటి కావాలని నిర్ణయించుకుంది. స్వతంత్ర జీవన శైలిని అనుసరిస్తుంది. కాలేజీ రోజుల్లోనే గోవా టూర్ కోసం ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేసి అయిదు వేల రూపాయలు ఆర్జించింది. అదే ఆమె తొలి సంపాదన. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది కూడా అప్పుడే. 2012లో ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకుంది. జూమ్ చానెల్లో ప్రసారమయ్యే ‘మ్యూజిక్ రిక్వెస్ట్’ షోతో బుల్లితెరకు పరిచయమైంది. 2014లో ‘లేకర్ హమ్ దివానా దిల్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా యాడ్స్, షోస్‌తో ఆమె బిజీగానే ఉంది. 2014 టీ20, వరల్డ్ కప్ గేమ్స్‌కు స్టార్‌స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. 2015లో చేసిన ‘డ్రీమ్ గర్ల్’ సీరియల్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. దాంతో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పక్కన ‘గోల్డ్’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. సూపర్ డూపర్ హిట్ ‘కబీర్ సింగ్’లోనూ చేసింది. ప్రస్తుతం ఎమ్ఎక్స్ ప్లేయర్లో ప్రసారమవుతోన్న ‘ఆమ్ఫట్’తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోని ‘మస్కా’తో అలరిస్తోంది నికిత. అందమైన హ్యాండ్ బ్యాగ్స్, షూ, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ను సేకరించడం, డాన్స్, యోగా ఆమె అభిరుచులు, క్రమం తప్పని అలవాట్లు. 'వ్యాయామంతోనే నా రోజు మొదలవుతుంది. కొంతకాలం యోగా గురువుగా కూడా పనిచేశా. ఎప్పటికైనా ఓ పెద్ద యోగా ఆశ్రమం నిర్మించడమే నా లక్ష్యం. హృతిక్ రోషన్ పక్కన నటించడం నా కల' – నికిత దత్తా చదవండి: బిపాసా బసు - జాన్ అబ్రహాంల విఫల ప్రేమ కథ -
#AT21: ఆ వయసులో నేను..
ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు. **** ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు. **** మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత. బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది. నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే. దిశా రవి (21) ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు. సఫూరా జర్గార్ (28) సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రియాంకా పాల్ (19) ప్రియాంకకు ‘ఆర్ట్వోరింగ్’ అనే వెబ్సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. నవ్‌దీప్ కౌర్ (23) నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు. నిఖితా జాకబ్ (29) టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు. -
టూల్‌కిట్ వివాదం: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
ప్రేమించలేదని గొంతుకోసి చంపాడు
-
ప్రేమోన్మాది ఘాతుకం
జిన్నారం(పటాన్చెరు): ప్రేమ పేరుతో పదో తరగతి బాలికను వేధించడమే కాకుండా ఓ ఉన్మాది ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో గురువారం ఈ దారుణ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం .. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తాపేశ్వరరావు, భవానీ దంపతులు బొల్లారంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్నారు. తాపేశ్వరరావు స్థానికంగా ఉన్న పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె నిఖిత (15) బొల్లారంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నిఖిత ఇంటి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన బీటెక్ విద్యార్థి అరవింద్ ఉంటున్నాడు. కాగా, రెండు నెలలుగా తనను ప్రేమించాలంటూ అరవింద్, నిఖిత వెంట పడుతున్నాడు. ఇందుకు బాలిక అంగీకరించకపోవడంతో వేధింపులకు దిగాడు. గురువారం సాయంత్రం తాపేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. లోనికి వెళ్లాడు. ఆపై తనను ప్రేమించాలని నిఖితపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అరవింద్, నిఖిత మెడను కోసేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా.. చుట్టుపక్కల వారు గమనించి పారిపోయేందుకు ప్రయత్నించిన అరవింద్‌ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. రక్తపుమడుగులో ఉన్న నిఖితను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
అమ్మ పేరు అమ్మే
తల్లికి ఒక పేరు ఉంటుందని పిల్లలకు గుర్తుండదు. తమకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే. అయినా ఎంత మంచి పేరున్నా ‘అమ్మ’ అనే పేరు కన్నా మంచి పేరు ఉంటుందా?! హీరోలు కథల్లో ఉంటారు. సినిమాల్లో ఉంటారు. పాఠకులను, ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుంటారు, జీవితాలకు కావల్సినంత స్ఫూర్తిని నింపుతుంటారు. అయితే అలాంటి హీరోలు జీవితంలోనూ ఉంటారు. అసలు ఎవరి జీవితానికి వాళ్లే హీరోలు. మనలో ప్రతి ఒక్కరి దగ్గరా మన జీవితాలకే కాదు మరో పదిమందికి స్ఫూర్తినిచ్చే ప్రేరణశక్తి ఉంటుంది. అలాంటి ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి ప్రదాత మా అమ్మ అంటోంది నికితా శెట్టి. ఈ అమ్మాయిది ముంబై. ‘మా అమ్మ పర్వతాలను కదిలించేటంత ప్రేమను పంచుతుంది. ఆమెలో ఓ పోరాటయోధురాలు ఉంది. స్థిరంగా ఉంటూ సమస్యల్ని సంయమనంతో చక్కదిద్దే చాతుర్యమూ ఉంది. నా జీవితంలో నేను చూసిన ఏకైక హీరో ఆమె. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మా అమ్మ ఉక్కుమహిళ’ అంటోంది నికిత ఉద్వేగంగా. ఇటీవల ఆమె తల్లి గొప్పతనం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. బాధ్యతల బరువు ‘‘మా అమ్మ పదహారేళ్లకే తల్లిలేని పిల్లయింది. మా అమ్మమ్మ కేన్సర్‌తో పోయింది. ఆమె పోవడంతో ఆ ఇంటిని ఓ కుదుపు కుదిపేసినట్లయింది. మా అమ్మకు వచ్చిన కష్టం తల్లిని కోల్పోవడం ఒక్కటే కాదు. వాళ్ల నాన్న ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బరువును మోయాల్సిన బాధ్యత ఆమె మీద పడింది. తమ్ముళ్లకు, చెల్లికి తల్లి అయింది. కాలేజీకి పోతూ సాయంత్రాలు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసింది. ఆ వంద రూపాయలే ఇంటి సరుకులకు ఆధారం. డిగ్రీ పూర్తి కాగానే డైమండ్ వ్యాపార దుకాణంలో ఉద్యోగంలో చేరి చిన్న పిల్లలను చదివించే బాధ్యత తలకెత్తుకుంది. చెల్లికి పెళ్లి చేసింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంది. కష్టాలకు ఎదురీత ‘‘నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఒక ఒడ్డుకు చేరిందనే అనుకుంది అమ్మ. నిండా ఐదేళ్లు గడిచాయో లేదో 1999లో ఓ ప్రమాదం. అమ్మ జీవితంలో అది ఒక హఠాత్పరిణామం. నాన్న పోవడం ఆమెను మరింతగా రాయిలా మార్చేసింది. కష్టాలకు ఎదురీదడానికి తనను తాను మరింత దృఢంగా మార్చుకుంది. తన జీవితానికి అన్నీ తానే, తనకు ఆసరాగా ఎవరూ లేరనే వాస్తవం ఆమెలో నిర్వేదాన్ని నింపలేదు. నాకు అమ్మానాన్న తానే అయి తీరాలనే నిజం ఆమెను నడిపించింది. నాన్న పోయిన ఆరేళ్లకు మేము సొంత ఫ్లాట్‌కు మారాం. బ్యాంకు లోన్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ వంటి క్లిష్టమైన పనులన్నీ సొంతంగా చేసుకుంది. వర్కింగ్ ఉమన్, ఇండిపెండెంట్ ఉమన్ ఎలా ఉంటే సొసైటీలో మనగలదో ఆమెను చూసి నేర్చుకోవాలి. నమ్మకమే.. శక్తి ‘‘నాకు ఊహ తెలిసిన తరవాత ఇన్నేళ్లలో అమ్మ పని నుంచి సెలవు తీసుకున్నది పది రోజులే. తనకు ఎదురైన ప్రతి సవాల్‌కూ సమాధానం వెతుక్కుంటూ సాగిపోయేది అమ్మ. నాకు ఎందులోనూ తక్కువ చేయకుండా, నన్ను ఎప్పుడూ ఫస్ట్‌గా ఉంచడానికే ప్రయత్నిస్తుండేది. అలాగని నన్ను మరీ గారాం చేస్తూ ఏమీ పెంచలేదు. చాలా స్ట్రిక్టుగా ఉండేది. కొంచెం ఓల్డ్ స్కూల్ పెంపకం మా అమ్మది. నాకు మంచి ఫ్రెండ్ కూడా అమ్మే. ‘నీకింత ధైర్యం, శక్తి ఎక్కడ నుంచి వస్తాయి? అని అడిగితే, ‘ఈ విశ్వంలో ప్రతి దానిని నడిపించేది దేవుడు. ఆ దేవుడే నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఆ నమ్మకమే నా శక్తి’ అంటుంది. నేను అమ్మలో సగం అయినా కాగలనా అనిపిస్తుంటుంది. నేను చూసిన రియల్ హీరో ఆమె. నేను ఈ రోజు సగర్వంగా నిలబడగలిగానంటే అమ్మ వల్లనే’’ అని చెప్పింది నికిత. ఈ పోస్ట్‌కి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే... నికితా శెట్టి తన కథనంలో ఆద్యంతం ‘మా అమ్మ మాఅమ్మ’ అంటూనే చెప్పింది తప్ప అమ్మ పేరు చెప్పనేలేదు. పిల్లలకు తల్లికి ఒక పేరు ఉంటుందని గుర్తుండదు. తనకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే. – మంజీర -
పవర్ఫుల్... ‘టైర్రర్’
చిత్రం: టై, తారాగణం: శ్రీకాంత్, నికిత, కోట, నాజర్, శ్రీ, మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: సాయికార్తీక్, కెమేరా: శ్యామ్‌ప్రసాద్, ఎడిటర్: బసవ పైడిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, నిర్మాత: షేక్ మస్తాన్ , కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీశ్ కాసెట్టి, రిలీజ్: ఫిబ్రవరి 26 దేశం బాగుండాలంటే ముందు వ్యవస్థ బాగుండాలి. ఒక్కరి పనితీరు సరిగ్గా లేకపోయినా అందరికీ నష్టమే అని చూపించడానికి చేసిన ప్రయత్నమే ‘టై’. పోలీసు శాఖ ఎలాంటి ఒత్తిళ్లకూ గురి కాకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే సమాజంలో విద్రోహశక్తులను అంతం చేయొచ్చనే అంశానికి సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి, దర్శకుడు సతీశ్ కాసెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ చేసిన చిత్రాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ‘టై’ ఆ జాబితాలో చేరుతుందా? సతీశ్ కాసెట్టి చెప్పిన కథ నచ్చి, చేశానంటున్న శ్రీకాంత్ నమ్మకం నిజమవుతుందా? తెలియాలంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే. పోలీస్ శాఖలో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు పొందిన సీఐ విజయ్ (శ్రీకాంత్). పై అధికారులకు నమ్మిన బంటు. ప్రజలకు హీరోలాంటివాడు. విజయ్ తండ్రి సుధాకర్ (నాజర్)కి స్నేహితుడైన డేవిడ్ (విజయ్‌చందర్) కొడుకు హత్యకు గురవుతాడు. అతని హత్యకి విజయ్, డీజీపీ రాథోడ్ల నిర్లక్ష్యమే కారణమని డిపార్ట్మెంట్ విచారణ మొదలుపెడుతుంది. స్నేహితుడి కొడుకు మరణానికి తన కొడుకే కారణమని సుధాకర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు కొడుకును ఇంట్లోంచి గెంటేస్తాడు. వేరే దారి లేక, కష్టపడి ఎమ్మెల్యే రవి (‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ)కి రూ. 40 లక్షలు ఇచ్చి క్లీన్ చిట్ తెచ్చుకుంటాడు విజయ్. కానీ, తండ్రి మాత్రం ఇంట్లోకి రానివ్వడు. కట్ చేస్తే... నగరంలో ప్రవేశించిన టైస్టులు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని విజయ్‌కి తెలుస్తుంది. ఈ విషయం ముందే తెలిసినప్పటికీ హోం మినిస్టర్ సుదర్శన్‌రావు (కోట శ్రీనివాసరావు), డీజీపీ తమ స్వలాభం కోసం సెలైంట్ అయిపోతారు. ఈ కుట్రను ఆపుదామనుకున్న విజయ్‌ని కిడ్నాప్ చేస్తారు. పై అధికారులకు తలొగ్గి, తెలియక ఒకసారి చేసిన పొరపాటు మళ్లీ జరగకూడదని దేశాన్నీ, ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో విజయ్ పోరాటం మొదలుపెడతాడు. కార్యనిర్వహణలో భాగంగా అతనెలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటాడు? పై అధికారులకు ఎలాంటి సవాల్ విసురుతాడు? అనేది తెరపై చూస్తేనే రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం శ్రీకాంత్ భుజాలపైనే నడుస్తుంది. విజయ్ పాత్రలో నటన పరంగా ఆయన విజృంభించారనే చెప్పాలి. ‘థర్టీ’ ఇయర్స్ పృథ్వీ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కాస్త నవ్వించి, సెపరేట్ కామెడీ ట్రాక్ లేని లోటుని భర్తీ చేశారు. సీనియర్ నటుడు కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ గుర్తుండిపోయే పాత్ర చేశాడు. సీఎం పాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం విశేషం. ప్రస్తుతం ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు ఉంటేనే ‘సేఫ్’ అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, దమ్మున్న కథ అయితే రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేయొచ్చనే నమ్మకంతో దర్శక-నిర్మాతలు ఈ సినిమా తీశారు. పోలీసు-టైస్ట్‌ల కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. ఈ సినిమా విషయంలో ఆ జాగ్రత్త తీసు కున్నారు. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్. పోలీసులు పడే మానసిక వేదన, ఎదుర్కొనే ఒత్తిళ్లు వాస్తవికతకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్, ద్వంద్వార్థాలు లేకపోయినా మంచి కథతో సినిమా తీస్తే, ప్రేక్షకుల మనసులను గెల్చుకోవచ్చనడానికి ‘టై’ లాంటి చిత్రాలు ఓ నిదర్శనం. ఇది దర్శక-నిర్మాతలు నిజాయతీగా ప్రయత్నమనే చెప్పాలి. -
విధ్వంసం.... అరాచకం!
హైదరాబాద్ లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నాగం పన్నుతారు. వారి విద్రోహం గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘టై’. శ్రీకాంత్, నికితా జంటగా షేక్ మస్తాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్. సతీశ్ కాసెట్టి దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘ఓ వైవిధ్యమైన పాత్రలో నటించాను. గతంలో నేను చేసిన పోలీస్ పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిఖితా, రవివర్మ, గురుచరణ్ తదితరలు పాల్గొన్నారు. -
అభిమాని వికృతం!
సోషల్ వెబ్సైట్ పేజీల్లో లెక్కకు మించి పెరుగుతున్న ఫ్యాన్స్ లిస్ట్ చూసి మురిసిపోయే తారలకు ఝలక్ ఇది. శాండల్‌వుడ్ భామ నికితా థక్రాల్ మైక్రో బ్లాగింగ్ పేజీలో ఓ తుంటరి తన ‘ప్రైవేట్ అసెట్స్’ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ అసభ్యకర, అభ్యంతరకర ప్రవర్తనకు నికిత షాకైంది. ‘ఇది అభిమానులు నాతో మాట్లాడే ప్లేస్. మతిచెడినవారి వికృత చేష్టల కోసం కాదు. అతడు పంపిన పిక్చర్స్, మెసేజ్‌లు అసహ్యంగా, జగుప్సగా ఉన్నాయి. ఇలాంటివారు మరికొంత మంది కూడా ఉన్నారు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. చాలామంది మహిళలు ఈతరహా పోకిరీల చేష్టలకు బలవుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది నికిత. -
డాలర్స్ కాలనీ న్యూ మూవీ స్టిల్స్
-
చనిపోతూ ప్రాణదానం చేసింది..
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన కుమార్తె కిడ్నీలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు ఠాణేలోని పాటిల్ దంపతులు. ఠాణేలోని బాల్‌కుమ్‌లో పాటిల్ దంపతులు నివసిస్తున్నారు. వీరి కూతురు పదేళ్ల నికితా ఆరవ తరగతి చదువుతోంది. జూన్ తొమ్మిదవ తేదీన తలిదండ్రులతో సాంగ్లీ నుంచి ఠాణే వస్తుండగా ఖాలపూర్‌లో వీరి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నికితను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి నవీముంబైలోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ బి. కె. ఆచార్య ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 12వ తేదీన నికిత మరణించింది. ఈ వార్త ఒక్కసారిగా నికి త తల్లిదండ్రులకు తీవ్ర విషాదానికి గురిచేసింది. అయితే వారు అందరిలా కాకుండా తమ కుమార్తె రెండు కిడ్నీలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నికిత మరో ఇద్దరికి కొత్త జీవితాలను అందించినట్లయింది. ఆమెకు చెందిన రెండు కిడ్నీలలో ఒకటి ఎంజిఎం ఆస్పత్రిలోని పేషెంట్‌కు, మరొకటి ముంబై జెస్లోక్ ఆస్పత్రిలోని పేషెంట్‌కు దానం చేసి వారిద్దరికీ ప్రాణం పోశారు. ఇలా పాటిల్ కుటుంబీకులు ఆదర్శంగా నిలిచారు. -
మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవం సందర్భంగా నగరవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రగతి యూత్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఐమాక్స్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన వాక్‌థాన్‌లో నటి నిఖితా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.