Nikita Dutta: బాలీవుడ్ నటి నికితా దత్తా సెల్‌ఫోన్‌ను ఆ మధ్య దుండగులు లాక్కెళ్లిన విషయం తెలిసిందే కదా! అయితే ఇప్పటివరకు తన ఫోన్ తిరిగి లభించలేదని చెప్పుకొచ్చింది నికిత. ఆ ఘటన జరిగిన రోజు తానసలు నిద్రపోలేదని తెలిపింది. తాజాగా ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో నికితా దత్తా మాట్లాడుతూ.. 'ఆ రోజు జరిగిన ఘటన నిజంగా భయంకరం. నాకు నా ఫోన్ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. కానీ సాధారణ వాకింగ్ చేయడం అంటే నాకిష్టం. కానీ ధైర్యం చేసి నేనిప్పట్లో బయటకు వెళ్లలేను. అదంత మంచిదని కూడా అనిపించడం లేదు.'
'దీన్నో పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ చెప్పొచ్చేదొకటే.. రోడ్డు మీదున్నప్పుడు మీరు ఎవరితోనూ చాట్ చేయవద్దు, మెసేజ్‌లు చేయడంలో మునిగిపోవద్దు' అని సలహా ఇస్తోంది నికితా దత్తా. కాగా నికితా దత్తా.. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, ది బిగ్‌బుల్, కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించింది. 2012 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ వరకూ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment