
రవి ప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విద్రోహి’. వీఎస్‌వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పొస్టర్‌ను రిలీజ్ చేసిన నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది.
రవిప్రకాశ్ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. ‘విద్రోహి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను పొలీసాఫీసర్ పాత్ర చేశాను. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని తెలిపారు రవిప్రకాశ్. ‘‘ఓ సరికొత్త పాయింట్‌తో మేం తీసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు వీఎస్‌వీ. ‘‘విద్రోహి’ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పప్పుల కనకదుర్గా రావు. నటుడు శివకుమార్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment