
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇటీవల పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా... సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే ఈ సినిమాలోని రామ్‌చరణ్ లుక్‌ని విడుదల చేశారు.
ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. అదేంటంటే... ఈ చిత్రానికి సంబంధించిన తొలి షాట్‌ను శ్రీరామ నవమి (ఏప్రిల్ 6)కి విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.
మల్టీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమేరా: ఆర్. రత్నవేలు.