
ఆటగాళ్ళు సినిమాతో నారా రోహిత్, జగపతి బాబు
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ నటుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు.
టీజర్‌లోనే సినిమా కథేంటో రివీల్ చేసేశారు చిత్రయూనిట్. తన భార్యను చంపిన కేసులో రోహిత్ అరెస్ట్ కాగా రోహిత్‌కు వ్యతిరేకంగా వాధించే లాయర్ పాత్రగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment