Nara rohith
-
'భైరవం' టీజర్ లాంచ్ ఈవెంట్లో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
పవర్ఫుల్ డైలాగ్స్‌తో భైరవం.. టీజర్ చూశారా?
హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవం. ఇది తమిళ 'గరుడన్' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి సోమవారం (జనవరి 20) టీజర్ రిలీజ్ చేశారు. రాత్రి నాకో కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ జయ సుధ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే ప్రాణాలు తీస్తా అని మనోజ్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు. యాక్షన్‌కు ఢోకా లేదన్నట్లుగా ఉన్న ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్‌తో పాటు ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రాజా రవీంద్ర, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
వేడుకగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం
తెలుగు హీరో నారా రోహిత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేశాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి ఉంగరం తొడిగేశాడు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. (ఇదీ చదవండి: రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్)2019లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'సోలో' మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ 'ప్రతినిధి 2' అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం ఇతడికి లైఫ్ పార్ట్నర్ అయిపోయింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా రోహిత్‌కి పెదనాన్న అవుతారు. రోహిత్ ప్రస్తుత వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ రావడంతో సిరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడట. అలా పెద్దలు మాట్లాడుకుని మొత్తానికి నిశ్చితార్థం నిశ్చయించారట. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
హీరో నారా రోహిత్‌తో నిశ్చితార్థం.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు)
-
హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లికి రెడీ అయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు కొడుకు అయిన రోహిత్.. 'బాణం' సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. కారణమేంటో తెలీదు గానీ ఇప్పటివరకు ఒంటరిగా ఉండిపోయాడు. తాజాగా పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)ఈనెల 13న హైదరాబాద్‌లోనే నిశ్చితార్థం జరగనుంది సమాచారం. కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇకపోతే నారా రోహిత్‌కి ప్రస్తుతం 40 ఏళ్లు. అంటే లేటు వయసులో వివాహానికి రెడీ అయ్యాడనమాట. అమ్మాయి ఎవరు? డీటైల్స్ ఏం బయటకు రాలేదుఇతడు హీరోగా నటించిన 'సుందరకాండ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్నాళ్ల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్‌పైనే ఈ మూవీ స్టోరీ ఉండటం విశేషం. ఇక నారా రోహిత్ నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
ఓటీటీలో 'ప్రతినిధి 2'.. అధికారిక ప్రకటన
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతినిధి 2’. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సుమారు పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 10న ఈ చిత్రం విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.‘ప్రతినిధి 2’ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించగా.. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు వంటి వారు నటించారు. -
నారా రోహిత్ 'సుందరకాండ' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ కథే అందరిని కలిపింది టీజర్ నచ్చిందా..
-
చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!
"తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరీస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికలలో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోను గెలవవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు ఓటర్లకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని చాలామంది నమ్ముతారు." 1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించినా, చంద్రబాబు రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్ తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న అప్పటి మంత్రి ఒకరు చెప్పారు. ఆ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన దండు శివరామరాజు మాట్లాడుతూ ఈ డబ్బు ఖర్చేమిటి? అయ్యబాబోయ్ .. ఉప ఎన్నికలో ఈ రకంగా వ్యయం చేస్తే, జనరల్ ఎన్నికలో నా పరిస్థితి ఏమిటి? ఈ స్థాయిలో డబ్బు చంద్రబాబు ఇస్తారో, ఇవ్వరో తెలియదు.. అని స్వయంగా నాతోనే అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా ఎన్నికల మేనేజ్మెంట్లో సిద్దహస్తుడని చెబుతుంది. దొరకకుండా స్కామ్‌లు చేయడంలో కూడా చంద్రబాబు దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని చెబుతుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ స్థాయిలో డబ్బు రావడం కష్టం కనుక ఎన్నికల సమయంలో డబ్బు పోగు చేయడానికి రకరకాల మార్గాలను ఆయన ఎంచుకుంటారు. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడి దారుల నుంచి డబ్బు సమీకరించడం, అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. అమెరికా వంటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులలో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా టీడీపీపై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బు హవాలా ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ధనం పోగు చేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో పవర్లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో, లేదో తెలియదు కాని టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవడం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీనిని నిర్ధారణ చేస్తూ మీడియాలో కథనం వచ్చింది. నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు, మార్వాడీల నుంచి ఐదు రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమచేసి, దానిని రహస్య స్థలానికి తరలించారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్దులను ఎన్నికల ప్రచారానికి, డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019 లో రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పి 300 కోట్లు పోగుచేశారట. ఈసారి అది ఐదు రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే యత్నం చేశారట. మీడియాలో వచ్చిన ఈ కథనాలను ఆయన ఎందువల్లో ఖండించలేదు. 2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయనను మంత్రిగా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్‌లో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. రాజధాని గ్రామాలలో 58 ఎకరాలను నారాయణ తన బినామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్ధిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్‌ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారు. అంతకు ముందు మూడు, నాలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల పైగా వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు నాలుగైదు కోట్లకు మించి వ్యయం కాదని సినీరంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారన్నది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదమూడు సినిమాలు తీసిన వ్యక్తి, ఈ ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాల ముసుగు వేస్తున్నారని అర్ధం అవుతుంది. ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ, గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో, రేవో తేల్చేవిగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తనవెంటబెట్టుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడనుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్‌తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు సాయం చేయడం కోసం పోటీ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. సీపీఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్లి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు ముడుపులకు రోహిత్ వేషం
-
బాబు ముడుపులకు 'రోహిత్' వేషం!
బహుశా.. ఇలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ!! ఆయన ‘స్కిల్’ మామూలుదా!! ముడుపులు పుచ్చుకోవడంలో, తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులోకి తెచ్చుకోవడంలో ఆయన ‘స్కిల్స్’ను బయటపెట్టే ‘సినిమా’ కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే. బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటకు వేరేవారు కనిపించినా... సహ నిర్మాతలుగా, ఫైనాన్షియర్లుగా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాపు సినిమాలు. భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు!. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా? లంచాలు దిగమింగడంలో బాబు మాస్టర్‌మైండ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించే టాలీవుడ్ సినిమాల కథ ఇదిగో... సాక్షి, హైదరాబాద్: అరె! ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపాన పోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని స్థితి) సాధించింది లేదు. ప్రతి సినిమాకూ పెట్టిన పెట్టుబడిలో కనీసం 80 శాతం తిరిగి రాలేదని నిర్మాతలే చెబుతున్నారు. అలాగని అవేవీ చిన్న సినిమాలు కావు. అన్నీ 30–40 కోట్ల రేంజి బడ్జెట్ సినిమాలేనట? మరి ఇలా నష్టాలొచ్చినా సరే వదలకుండా అదే హీరోను పెట్టి వరసగా ఏడాదిలో ఆరేడు సినిమాలు తీసేశారంటే ఏమనుకోవాలి? బ్లాక్ మనీ దండిగా ఉన్నవాళ్లు కూడా నేరుగా డబ్బును కాల్చేయటం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీయరు. కానీ నారా రోహిత్‌తో మాత్రం కొందరు నిర్మాతలు పదేపదే ఫ్లాప్ సినిమాలు తీశారు. ఫ్లాపు సినిమాలిచ్చిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ ఫ్లాపు సినిమాలు తీశారు. ఒకసారి దర్శకత్వం వహించి ఫ్లాపు సినిమా ఇచ్చిన వ్యక్తి అదే హీరోతో మరో సినిమాకు నిర్మాతగా కూడా మారాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదీ... 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ‘సూపర్ స్టార్’గా మారిపోయిన ‘నారా రోహిత్’ కథ. విచిత్రమేంటంటే రోహిత్‌కు 2014కు ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014–1019 మధ్య మాత్రం ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే... చంద్రబాబు అధికారానికీ, నారా రోహిత్ సినిమాలకూ ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏ సంబంధమంటే... ముడుపుల సంబంధం. బ్లాక్ మనీ సంబంధం. బాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు, సంస్థలు ఆయనకు నేరుగా ముడుపులివ్వటానికి ఇబ్బంది పడ్డారు. జీఎస్టీ వచ్చాక కాంట్రాక్టర్లకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఆ డబ్బుల్లో నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడమెలా? దీనికోసం మాస్టర్ మైండ్ చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టాడు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి కొడుకు నారా రోహిత్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా తెలిసిన నిర్మాతలు, దర్శకులకు పురమాయించాడు. దానికి కావాల్సిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టర్లు, తన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు సహ నిర్మాతల రూపంలోనో, ఫైనాన్సియర్లగానో చెల్లిస్తారు. ఓ 5 కోట్లతో పూర్తయ్యే సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించటమే కాక... అంతా ఖర్చుపెట్టినట్లు చూపిస్తారు. వాస్తవంగా రూ.5 కోట్లు ఖర్చయితే.... మిగతా రూ.35 కోట్లు నేరుగా బాబు బంగళాకు చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగూ ఐదారు కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేయదు. దీంతో తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రమేంటంటే ఇలా డిజాస్టర్ అయి నష్టపోయిన నిర్మాతలు... మళ్లీ అదే హీరోతో, మళ్లీ భారీ బడ్జెట్‌తో మరో సినిమా తీయటం. ఇలా ఏడాదిలోనే ఆరేడు సినిమాలు తీశారంటే పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదీ... రోహిత్ ఫ్లాపుల కథ నారా రోహిత్ యావరేజ్ నటుడు. 2009 నుంచి 2014 వరకు.. అంటే చంద్రబాబు సీఎం కుర్చిలో లేని ఆ ఐదేళ్లలో అతను నటించిన సినిమాలు నాలుగే,. బాణం (2009), సోలో (2011), సారొచ్చారు (2012), ఒక్కడినే (2013). మొదటి రెండూ యావరేజ్ కాగా, మిగిలిన రెండూ డిజాస్టర్లు. దాంతో రోహిత్‌కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏడాది తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్ ముఖ ‘చిత్రం’ మారిపోయింది. హిట్ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుస పెట్టి సినీ అవకాశాలొచ్చాయి. 2019లో బాబు దిగిపోయేనాటికి ఏకంగా 17 సినిమాలు. అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలీదు. మళ్లీ 2019లో చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రోహిత్ చేయలేదు. ఇలా, అలా తిప్పి.. కొడుకు చేతికి డబ్బులు ఒక ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టరుకు ప్రభుత్వం రూ.500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీన్లో 50 శాతం అంటే రూ.250 కోట్లు ముడుపులు బాబుకివ్వాలి. నగదు రూపంలో ఇవ్వటం సాధ్యం కాదు కదా? మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాల్లో రూ.250 కోట్లు తరలించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయటం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు. రూ.2–3 కోట్లలో చుట్టేసిన చిన్న చిన్న సినిమాలకు కూడా రూ.30–40 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు. సినిమాలో రోజు వారీ ఖర్చులు కింద / ప్రొడక్షన్ ఖర్చుల కింద వాటికి దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకు రూ.20 కోట్లు– రూ.30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడా టాక్స్ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్‌గా మార్చి, అటుతిప్పి ఇటుతిప్పి ఆఖరుకు చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే రూ.250 కోట్లు చిన్న చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయనే ఇటీవల వాపోయారు. ఇలా నారా రోహిత్‌ను వాడేసుకుని 17 సినిమాలు హడావుడిగా చుట్టేసి.. చాలా మంది కాంట్రాక్టర్ల నుంచి ముడుపుల డబ్బును నారా లోకేశ్‌కు అందించారు. కాంట్రాక్టర్లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని తెలిసింది. దొంగ లెక్కలతో బురిడీ ఆయా సినిమాల అంచనా వ్యయం, లాభనష్టాలు, వాస్తవ బడ్జెట్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. హీరో రెమ్యునరేషన్‌తో సహా నారా రోహిత్ సినిమా బడ్జెట్ ప్రొడక్షన్ స్టార్ కాంబినేషన్‌ను బట్టి రూ.5–10 కోట్లు లోపు మాత్రమే. అయితే రోహిత్‌తో సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం వీటి బడ్జెట్ రూ.30 నుంచి 40, 45 కోట్ల దాకా కూడా చెబుతూవచ్చారు. అదే విధంగా వాళ్ల బంధు గణంతోనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అవతారాలు ఎత్తించి థియేట్రికల్ రైట్స్‌ను రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్లకు కొనిపించినట్లు చూపారు. అంటే ఆ సినిమాలు తీసేవాడూ, వాటిని కొనేవాడూ ఇద్దరూ ఒకరేనని తెలుస్తోంది. సినిమా ఆడలేదు కాబట్టి.. తమకు ఇంత నష్ట్టం వచ్చిందని ప్రభుత్వానికి ఈ ముఠా దొంగ లెక్కలు చూపించింది. ఇలా రోహిత్ సినిమాల ద్వారా లంచాల రూపంలో వచ్చిన బ్లాక్ మనీ సుమారు రూ.300 నుంచి 400 కోట్ల వరకు దండుకున్నారని అంచనా. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోదైనా ఒక సినిమా డిజాస్టర్ అయింది అంటే రెండో సినిమా అవకాశం కనాకష్టం. అలాంటిది వరుసగా ఇన్ని సినిమాల్లో రోహిత్ ఎలా చేయగలిగాడు? ► ఆయన సినిమాల బిజినెస్, కలెక్షన్ల ప్రకారం.. ప్రతి సినిమా రూ.20, 30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే పదే సినిమాలు ఎందుకు తీశారు? ► అతి కొద్ది మంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరూ అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్ర ఉన్న నిర్మాతలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. అలాంటప్పుడు వారు ఈయనతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ► ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో కొందరు.. నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించక పోవడం వెనుక అంతరార్థం ఏమిటి? ► నారా రోహిత్ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండడం వెనుక మతలబు ఏమిటి? బాబు హయాంలో ఏకంగా 17 సినిమాలు 2014: ప్రతినిధి 2015: రౌడీ ఫెలో, అసుర, తుంటరి, సావిత్రి, 2016: రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు 2017: శమంతకమణి, ఒక్కడు మిగిలాడు, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, మెంటల్ మదిలో 2018: నీది నాది ఒకే కథ, ఆటగాళ్లు, వీరభోగ వసంతరాయలు -
రొమాంటిక్ కామెడీ షురూ
నారా రోహిత్, విర్తీ వాఘని జంటగా వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. నారా రోహిత్ కెరీర్లో ఇది 20వ చిత్రం. ఈ సినిమాను సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎం. ప్రదీష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, గౌతమ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీదేవీ విజయ్ కుమార్, నరేశ్ విజయకృష్ణ, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్. -
పొలిటికల్ థ్రిల్లర్
కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘ప్రతినిధి 2’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, 2024 జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ‘‘నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ ఫ్రాంచైజీలో భాగంగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘ప్రతినిధి 2’ని రూపొందిస్తున్నాం. సామాజిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా' సాంగ్ విన్నారా?
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్‌ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ గోపీచంద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. దోస్త్లందరికీ ఇది ఒక ఆంథమ్ సాంగ్ అవుతుందని నా నమ్మకం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ దర్శకుడు గిఫ్టన్ కి దర్శకుడు గురు పవన్ కి థ్యాంక్స్ అన్నారు. చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్! 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? -
అచ్చ తెలుగు కథ
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా ‘గాలి సంపత్’ చిత్రం ప్రారంభమైంది. టైటిల్ రోల్‌ను రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఎస్.కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్‌కి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. వరుణ్ తేజ్ గౌరవ దర్శకత్వం వహించగా, స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు నిర్మాత ఎస్వీసీ శిరీష్ అందజేశారు. ‘‘నేనీ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘అచ్చ తెలుగు స్క్రిప్ట్ ఇది’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమోహన్ బాబు ఎమ్. -
నానికి విలన్‌గా మరో యంగ్ హీరో
ఫలితాలతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు మన నేచురల్ స్టార్ నాని. తను నటించిన చాలావరకు సినిమాలు అరే.. మన పక్కింటి అబ్బాయిలాగే ఉన్నాడే అనిపించేలా ఉంటాయి. కానీ శ్యామ్ సింగరాయ్‌తో కొంచెం రూట్ మార్చినట్టు అనిపిస్తోంది. పాత కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలేవీ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసినవి కావు. అన్నీ సింపుల్‌గా సాగిపోయే ఫీల్ గుడ్ సినిమాలే.. అందుకే అవి చాలావరకు అందరినీ మెప్పిస్తూ నానిని నేచురల్ స్టార్‌గా నిలబెట్టాయి. ఇద్దరు హీరుయిన్లు ఉండే శ్యామ్ సింగరాయ్‌లో సాయి పల్లవితో మరోసారి జోడి కడుతున్నాడు నాని. ఇంకొక హీరోయిన్గా తన మొదటి రిలీజ్ అవ్వకముందే వరుస అవకాశాలు అందుకున్న కృతి శెట్టి అలరించబోతుంది. టాక్సీవాలాతో గుర్తింపు తేచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకట బోయనపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. దసరాకు రిలీజ్ చేసిన సినిమా టైటిల్ పోస్టర్ పర్వాలేదనిపించింది. చదవండి: (ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా) ఇక ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మరో యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నారా రోహిత్ ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తాడా లేక విలన్‌గా నానితో తలబడనున్నాడా తెలియాల్పి ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమాలో నారా రోహిత్ నటిస్తున్నాడని వార్తలు వచ్చినా అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. శ్యామ్ సింగరాయ్ గురించి వస్తున్న వార్తలయినా నిజమా కాదా వేచి చూడాల్పిందే. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నానికి ఏమాత్రం కొత్త కాదు. నాని చివరి చిత్రం 'వి'లో సుధీర్ బాబుతో, గ్యాంగ్‌లీడర్‌లో కార్తికేయతో, అంతకుముందు విజయ్ దేవరకొండతో కూడా కలిసి నటించాడు. యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ నటుడు నాగార్జునతో దేవదాస్ అనే మల్టీస్టారర్ కూడా చేశాడు. -
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగశౌర్య లుక్ అదుర్స్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ప్రీ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ది గేమ్ విల్ నెవర్ బీ ది సేమ్’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో దీనిని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య మునుపెన్నడు చూడని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు . లవర్ బాయ్‌లా కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు. బాడీ షేప్ బాగుందంటూ కితాబిస్తున్నారు. చదవండి: ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు! This can't be any better. My dear bro @IamNagaShaurya you are unmatchable.. Wishing the entire team of #NS20 all the best ! https://t.co/5CrjOtWeQ8 — Rohith Nara (@IamRohithNara) July 27, 2020 ఇక అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా నాగశౌర్య కొత్త సినిమా ప్రీ లుక్‌పై స్పందిస్తున్నారు. నారా లోహిత్ ‘లుక్ డిఫరెంట్, ఇంకా నువ్వు బెటర్ అవ్వాల్సింది ఏం లేదు. నీతో ఎవరు మ్యాచ్ అవలేరు. టీం అందరికి ఆల్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ‘ఇది చూస్తుంటే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు దర్శకుడు శేఖర్ కమ్ముల ‘నారాయణదాస్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. On Narayan Das Ji’s Birthday, delighted to launch the Superb FIRST LOOK of @IamNagashaurya’s next #NS20. Wishing the entire team a grand success!#NarayanDas #RamMohan @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 #KetikaSharma @kaalabhairava7 #NS20FirstLook pic.twitter.com/F245JJZ6b1 — Sekhar Kammula (@sekharkammula) July 27, 2020 -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. సోమవారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ప్రభాస్ – 50 లక్షలు నాని – 30 లక్షలు అల్లు అర్జున్ – 20 లక్షలు నారా రోహిత్ – 30 లక్షలు (ఏపీ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి 10 లక్షలు) సందీప్ కిషన్ – 3 లక్షలు యువీ క్రియేషన్స్ – 10 లక్షలు సుశాంత్ – 2 లక్షలు సంపూర్ణేష్ బాబు – 1 లక్ష బ్రహ్మాజీ – 75 వేలు సతీష్ వేగేశ్న – 50 వేలు (తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ కి) సమీర్ రెడ్డి – 50 వేలు , ప్రసాద్ మూరెళ్ళ – 50 వేలు (తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్‌కి) సాహు గారపాటి, హరీష్ పెద్ది – 5 లక్షలు -
కరోనా: నారా రోహిత్ భారీ విరాళం
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు పలువురు తెలుగు సినీ ప్రముఖుల తమ వంతు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో నారా రోహిత్ కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు రోహిత్ తెలిపారు. మరో రూ. 10 లక్షలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రోహిత్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికోడదామని పిలుపునిచ్చారు. సీసీసీకి రూ. 3లక్షలు విరాళమిచ్చిన సందీప్ కిషన్.. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ మనకోసం నిధికి హీరో సందీప్ కిషన్ రూ. 3లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతలను తీసుకుంటున్నట్టు చెప్పారు. మన పని మనం చేద్దాం, సురక్షితంగా ఉందామని పిలుపునిచ్చారు. (ప్రభాస్, బన్నీ మళ్లీ ఇచ్చారు!) -
వెంకీ–రోహిత్ ఓ రీమేక్?
విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్ దర్శకుడు అని తెలిసింది. మాధవన్ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్లో వెంకటేశ్ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్ – వీవీవినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
తారకరత్న హీరోగా ద్విభాషా చిత్రం
నందమూరి తారకరత్న, మేఘ శ్రీ జంటగా చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘అమృత వర్షిణి’. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరోలు నారా రోహిత్, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాను థ్రిల్లర్, లవ్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చిక్‌మంగళూరులో జరగనున్న సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతున్న ఈసినిమాకు జెస్సీ గిఫ్ట్ సంగీతమందిస్తున్నారు. -
చిక్మగళూరులో...
నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా శివప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అమృత వర్షిణి’. చాందిని క్రియేషన్స్ పతాకంపై నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. తారకరత్న మాట్లాడుతూ– ‘‘కథ నచ్చడంతో పాటు అభిరుచి ఉన్న దర్శక, నిర్మాతలు కావడంతో ఈ సినిమా చేస్తున్నాను. అన్ని రకాల ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ సిట్టింగ్‌లోనే తారకరత్నగారు స్టోరీ ఫైనలైజ్ చేశారు. యూత్‌కు, ఫ్యామిలీస్‌కు నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్. చిక్మగళూరులో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు శివప్రభు. ‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. శివప్రభు కన్నడంలో నాలుగు సినిమాలు చేశాడు. ఈ నెల 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని నాగరాజు నెక్కంటి అన్నారు. ‘‘ఈ సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నా’’ అన్నారు మేఘశ్రీ. ఈ చిత్రానికి కెమెరా: సభా కుమార్, సంగీతం: జెస్సీ గిప్ట్, మాటలు–సహ దర్శకత్వం: సతీష్ కుమార్, సహ నిర్మాత: మంజునాథ. -
‘వీర భోగ వసంత రాయలు’ మూవీ రివ్యూ
టైటిల్ : వీర భోగ వసంత రాయలు జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ఆర్ ఇంద్రసేన నిర్మాత : అప్పారావు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు.. ఈ ముగ్గురు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోలు. విభిన్న కథలను ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాల మరింత భారీగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు. దీంతో రిలీజ్ సమయానికి సినిమా మీద అంచనాలు పడిపోయాయి. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అయి వీర భోగ వసంత రాయలు ఏమేరకు ఆకట్టుకుంది..? కథ ; సినిమా ప్రధానంగా మూడు నేరాలకు సంబంధించిన కథగా సాగుతుంది. క్రికెటర్స్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ విమానం హైజాక్‌కు గురవుతుంది. అదే సమయంలో సిటీలో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తాయి. ఇక మూడో కేసులో ఓ కుర్రాడు తన ఇళ్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. ప్రధానమైన విమాన హైజాక్ కేసును దీపక్ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. మిస్ అయిన ఇంటి కేసును వినయ్ (సుధీర్ బాబు) టేకప్ చేస్తాడు. ఫ్లైట్ హైజాక్ చేసిన వ్యక్తి 300 మంది బంధీలను విడుదల చేసేందుకు అంతే సంఖ్యలో నేరస్తులను చంపేయాలని డిమాండ్ చేస్తాడు. అసలు విమానం హైజాక్ చేసింది ఎవరు..? మిగిలిన రెండు కేసులతో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి..? హైజాకర్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ప్రమోషన్లో శ్రీవిష్ణు పాత్రను హైలెట్ చేసినా సినిమాలో ఎక్కువ సేపు తెర మీద కనిపించింది మాత్రం సుధీర్ బాబు ఒక్కడే. అయితే సుధీర్ బాబుకు మరొకరితో డబ్బింగ్ చెప్పించటం వర్క్ అవుట్ కాలేదు. సుధీర్ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్ తనది కాకపోవటంతో ఆడియన్స్ కనెక్ట్ కావటం కష్టమే. నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు. ఇక కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు విలన్ లుక్‌లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో ఉన్నంతలో తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశ్లేషణ ; సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నా అవి సినిమాను ఏమేరకు కాపాడతాయో చూడాలి. ముఖ్యంగా సినిమాకు నిర్మాణ విలువలే ప్రధాన సమస్యగా మారాయి. క్వాలిటీ పరంగా సినిమా నిరాశపరుస్తుంది. కథా కథనాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో వీర భోగ వసంత రాయలు ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారింది. సినిమాటోగ్రఫి, సంగీతం పరవలేదనిపిస్తాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన కథ మైనస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు స్లో నేరేషన్ ఆసక్తికరంగా లేని సన్నివేశాలు -
భయం వేసింది
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని శ్రీవిష్ణు లుక్‌ను విడుదల చేశారు. ‘‘పచ్చబొట్లు వేయించుకున్నాను. కాస్త భయం కలిగింది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా రకాల అనుభూతులకు లోనయ్యాను’’అని పేర్కొన్నారు శ్రీవిష్ణు. ‘‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మిగతా తారల లుక్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించారు. -
విడుదల రోజు మళ్లీ చూస్తా – సుకుమార్
‘‘ఒక కొత్త ఆలోచనతో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఈ చిత్రం కథే’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారలుగా ఆర్. ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. బెల్లన అప్పారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడానికి ఓ సారి ఇంద్ర వచ్చినప్పుడు కుదరదని చెప్పాను. ఆ తర్వాత ఓ సందర్భంలో ఈ సినిమా ఆలోచన గురించి చెప్పాడు. ఇటీవల ఈ సినిమా చుశా. చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ట్రెండీగానూ ఉంది. ఐడియా పరంగా ఇంద్రకు నేను పోటీ కాదని ఈ సినిమా చూశాక అర్థం చేసుకున్నాను. సినిమా విడుదల రోజు మళ్లీ చూస్తా’’ అన్నారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. నేను మాట్లాడటం కంటే విడుదలయ్యాక ఈ సినిమానే ఎక్కువగా మాట్లాడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఇంద్ర చాలా కష్టపడ్డారు. చిరంజీవి ఇంద్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ఈ కార్యక్రమంలో శ్రియ పాల్గొన్నారు. -
ఆ గొంతు నాది కాదు : సుధీర్ బాబు
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వీర భోగ వసంత రాయలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న (సోమవారం) రిలీజ్ అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్లో సుధీర్ బాబు వాయిస్ డిఫరెంట్‌గా అనిపించటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మీ వాయిస్ ఏంటి ఇలా ఉంది అంటూ అభిమానులు సుధీర్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఈ విషయంపై స్పంధించిన సుధీర్ బాబు ఆ వాయిస్ నాది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ‘కొన్ని కారణాల వల్ల వీర భోగ వసంత రాయలు సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ఆ కారణాలను ట్వీట్లో వివరించడం సాధ్యం కాదు.’ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్ బాబు. ట్రైలర్లో వినిపించిన వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి. సినిమాలో కూడా సుధీర్ వాయిస్ ఇలాగే ఉంటుందా అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. తన సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకునే సుధీర్ బాబు వీర భోగ వసంత రాయలు ట్రైలర్‌ను షేర్ చేయకపోవటంపై చర్చ మొదలైంది. చిత్రయూనిట్‌తో వివాదాల కారణంగానే సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సోమవారం జరిగిన ట్రైలర్ లాంచ్‌కు కూడా సుధీర్ బాబు హాజరు కాకపోవటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. For various reasons, which can't be explained in a tweet, wasn't been able to dub for my character in #VeeraBhogaVasanthaRayalu. Yeah, THAT IS NOT MY VOICE — Sudheer Babu (@isudheerbabu) 16 October 2018 ‘వీర భోగ వసంత రాయలు’ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్, సుకుమార్. -
‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ లాంచ్
-
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘వీర భోగ వసంత రాయలు’
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన యూనిట్ తరువాత టీజర్‌తో ఆకట్టుకున్నారు. తాజా గా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిడ్నాప్, ఫ్లైట్ హైజాక్ లాంటి సీన్స్ తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రెడీ చేశారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియలు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులుగా కనిపిస్తుండగా శ్రీ విష్ణు డిఫరెంట్ లుక్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. -
ఎవరి కోసం ఎదురు చూపులు?
ఎవరో రావాలని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఎదురుచూపులో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు.. ఇలా నెలలు గడిచిపోయాయి. అప్పుడు దేశం కోసం ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అసలు అందరూ ఎవరికోసం ఎదరు చూస్తున్నారు? అనే మిస్టరీలు వీడాలంటే ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చూడాల్సిందే. నారా రోహిత్, శ్రియా, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. అప్పారావ్ బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో సాగే భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ఇది. హీరో హీరోయిన్ల లుక్స్‌కు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్ గురించి చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్. -
ప్రణయ్‌కి అంకితమిస్తూ పాట!
మిర్యాలగూడ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అయితే ఈ పరువు హత్యపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాల్లోంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌ను ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కు ఈ పాటను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
వసంతరాయలు వస్తున్నాడహో...
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరభోగ వసంత రాయలు’. ఇంద్రసేన ఆర్. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావ్ బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా అప్పారావ్ బెల్లాన మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మా చిత్రం టైటిల్ ఆసక్తిగా ఉందని అంటున్నారు. సినిమాలో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ‘కొత్త మతం పుట్టుకొస్తుంది’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్, నవీన్ యాదవ్. -
‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆటగాళ్ళు జానర్ : థ్రిల్లర్ తారాగణం : నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, సుబ్బరాజు, బ్రహ్మానందం సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : పరుచూరి మురళి నిర్మాత : వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లాంగ్ గ్యాప్ తరువాత పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాల్ని ఆటగాళ్ళు అందుకున్నారా..? నారా రోహిత్ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాడా..? కథ ; ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్) . ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్య చేస్తారు. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. (సాక్షి రివ్యూస్) అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగా మున్నానే అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఎత్తుకు పై ఎత్తులతో సాగే కథలో నారా రోహిత్, జగపతిబాబులు ఒకరితోఒకరు పోటి పడి నటించారు. రొమాంటిక్ సన్నివేశాల్లో లవర్ బాయ్ గా కనిపించిన నారా రోహిత్ తరువాత సీరియస్ లుక్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. న్యాయం ఎటు ఉంటే అటు వైపే వాదించే లాయర్‌గా జగపతిబాబు నటన సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన దర్శన బానిక్ ది కథా పరంగా కీలక పాత్రే అయిన నటనకు పెద్దగా ఆస్కారం లేదు. (సాక్షి రివ్యూస్) ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్షోతోను మంచి మార్కులు సాధించింది. చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీకి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. పోలీస్ ఆఫీసర్‌గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో తులసి, శ్రీతేజ్, జీవా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; ఓ కేసు నేపథ్యంలో కథా కథనాలను తయారు చేసుకున్న దర్శకుడు పరుచూరి మురళి నటీనటులు ఎంపికలో సగం సక్సెస్ అయ్యాడు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడు ముందుండే నారా రోహిత్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నటుడు జగపతి బాబు సినిమా స్థాయిని పెంచారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సేపు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలకు కేటాయించిన దర్శకుడు అసలు కథ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం కనిపించలేదు. (సాక్షి రివ్యూస్) ముఖ్యంగా లవ్ ట్రాక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ కాస్త రిలీఫ్. కోర్టు సీన్ స్టార్ట్ అయిన తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. సాయి కార్తీక్ సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నారా రోహిత్, జగపతి బాబు నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; లవ్ సీన్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వారికోసమైనా ‘ఆటగాళ్ళు’ ఆడాలి
‘‘ఆటగాళ్ళు’ వంటి సినిమా చేయడం కొంతవరకూ రిస్కే. అయినా నిర్మాతలు బడ్జెట్లో రాజీ పడకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు. మేమంతా బాగా ఇన్వాల్వ్ అయి ఈ సినిమా చేశాం. మా కోసం కాకపోయినా నిర్మాతల కోసమైనా ఈ సినిమా ఆడాలి’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, దర్శనా బానిక్ జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘నేనీ సినిమా చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ మురళి. నాతో ‘పెదబాబు’ సినిమా చేశాడు. ‘ఆటగాళ్ళు’ అవుట్‌పుట్ చూశాక కచ్చితంగా సక్సెస్ అవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘ఆటగాళ్ళు’ చిత్రంలో ఫస్ట్ టైమ్ కొత్త జోనర్ చేశా. నన్ను కన్విన్స్ చేసి ఈ చిత్రం తీసిన మురళికి ధన్యవాదాలు. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులొస్తే వారు మరిన్ని సినిమాలు తీస్తారు’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ చిత్ర నిర్మాతలు నా ఫ్రెండ్సే. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు పరుచూరి మురళి. ‘‘ఫ్రెండ్ కోసం ఓ పర్పస్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వాసిరెడ్డి రవీంద్రనాథ్. -
ఇద్దరం తెలివైనవాళ్లమే!
‘‘కంటెంట్ బేస్డ్ సినిమాలపై దృష్టి పెట్టా. సినిమాల ఎంపికలో మరింత కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి’’ అన్నారు నారా రోహిత్. పరుచూరి మురళి దర్శకత్వంలో నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ చెప్పిన విశేషాలు... ఇందులో నేను డైరెక్టర్ పాత్ర, జగపతిబాబుగారు క్రిమినల్ లాయర్ పాత్ర చేశాం. ఇద్దరు తెలివైన వ్యక్తులు ఆడే మైండ్ గేమే ‘ఆటగాళ్ళు’. సినిమాలో ఇద్దరి వాయిస్‌లు స్ట్రాంగ్‌గా వినిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. నా నటన బాగుంటుందా? లేక జగపతిబాబుగారి నటన బాగుంటుందా? అంటే అది నేను చెప్పలేను. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ∙పరుచూరి మురళి అనగానే కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ కథ చెప్పినప్పుడు ఇంకో కథ చెప్పమన్నా. కానీ ఆయన ఇది బాగుంటుంది.. నమ్మండి అన్నారు. ఓకే అన్నాను. ఇదే కథని నాకు ఇచ్చి చేయమంటే వేరేలా ఉంటుంది. మురళి స్టైల్ కమర్షియల్ టచ్ ఉంటుంది సినిమాలో. ∙ప్రొడక్షన్ చూసుకుంటూ డైరెక్షన్ చేయడం కష్టం. నా ప్రొడక్షన్లో ఒక్క బాలయ్యతోనే కాదు అందరి హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. మల్టీ లింగ్వల్ సినిమాల ప్లానింగ్ నాకూ ఉంది. ప్రస్తుతం ‘శబ్దం’ కాకుండా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. -
హీరోల్లో ఆ ముగ్గురంటే ఇష్టం
‘‘నాది కలకత్తా. బెంగాలీలో ఆరు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించా. తెలుగులో ‘ఆటగాళ్ళు’ నా తొలి సినిమా’’ అని దర్శనా బానిక్ అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక దర్శనా బానిక్ మాట్లాడుతూ– ‘‘గతేడాది బాంబేలో ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశా. ఆ వీడియో కొరియోగ్రాఫర్ విష్ణుదేవా నా ఫొటోషూట్ పిక్స్‌ని ‘ఆటగాళ్ళు’ చిత్ర దర్శక–నిర్మాతలకి పంపారు. ఆడిషన్స్, రోహిత్‌తో ఫొటోషూట్ చేశాక నన్ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. చాలా ఇండిపెండెంట్, వర్కింగ్ లేడీ. సిన్సియర్ ప్రేమికురాలు కూడా. పరుచూరి మురళిగారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కించారు. నారా రోహిత్, జగపతిబాబుగారు పోటీ పడి నటించారు. బెంగాలీలో అనువాదమైన ‘మగధీర, ఆర్య, ధృవ, అరుంధతి, బాహుబలి’ సినిమాలు చూశా. ‘బాహుబలి’ బాగా నచ్చింది. హీరోల్లో షారుక్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్ అంటే ఇష్టం. డైరెక్టర్స్‌లో రాజమౌళిగారికి అభిమానిని. తెలుగు సినిమాల బడ్జెట్ ఎక్కువ.. బెంగాలీ సినిమాల బడ్జెట్ కాస్త తక్కువగా ఉంటుంది. తెలుగు, బెంగాలీ సినిమాలకి అంతే తేడా. ప్రస్తుతం నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ తెలుగులోనే మాట్లాడతా’’ అన్నారు. -
‘వీర భోగ వసంత రాయలు’ టీజర్ విడుదల
-
ఆసక్తికరంగా ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్
కెరీర్ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ప్రస్తుతం వీరంతా కలిసి చేస్తున్న సినిమానే ‘వీర భోగ వసంత రాయలు’. ఉత్కంఠ రేపే కథనంతో తెరకెక్కినట్లు కనిపిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నారా రోహిత్ డైలాగ్‌లతో సాగిన ఈ టీజర్లో.. సస్పెన్స్‌ను కంటిన్యూ చేసేలా కట్ చేయడం బాగుంది. చివర్లో గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చేది ఎవరో రివీల్ చేయకుండా.. అసలు కథపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ మూవీలో శ్రియా కీలకపాత్రలో నటిస్తోంది. అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమాకు ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వం వహించారు. -
గేర్ మర్చాను
‘‘ఇంతకు ముందు కమర్షియల్ సినిమాలు చేశాను. కానీ ‘ఆటగాళ్లు’ సినిమాతో గేర్ మార్చాను. కమర్షియల్ ఫార్మాట్‌కు ఈ సినిమా భిన్నమైనది. మంచి సినిమా తీశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తే చాలు. దర్శకునిగా నేను సక్సెస్ అయినట్లే’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. జగపతిబాబు, నారా రోహిత్ హీరోలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన సినిమా ‘ఆటగాళ్లు’. ‘గేమ్ విత్ లైఫ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ– ‘‘పర్సనల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ను మైండ్ గేమ్‌తో ఇద్దరు హీరోలు ఎలా సాల్వ్ చేసుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ. ఇందులో జగపతిబాబు, నారా రోహిత్ ఇద్దరు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నారా రోహిత్ పాత్రకు ముందుగా ఏ హీరోనూ సంప్రదించలేదు. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు జోడీగా దర్శనా బానిక్ కనిపిస్తారు. బెంగాల్లో ఆమె మంచి నటిగా పేరు సంపాదించారు. బ్రహ్మానందం, సుబ్బరాజు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మా ఫ్రెండ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. జనరల్‌గా లాభం ఆశించి నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. కానీ ఈ సినిమా నిర్మాతలు కథకు ఖర్చుపెట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు, నారా రోహిత్‌లలో ఎవరిని గెలిపించారు అంటే.. మంచిని గెలిపించాను. ప్రేక్షకులు మెచ్చే ప్రతిదీ మంచే’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా కంటే ముందు యూపీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నా. కానీ నా బంధువు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు ‘ఆటగాళ్లు’ స్టోరీ లైన్ చెప్పాడు. చాలా ఎగై్జట్ అయ్యాను. నిర్మాతలకు కూడా కథ నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు మురళి. -
వైవిధ్యమైన పాత్రలో...
పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు సుధీర్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో శ్రియా శరణ్, నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ఇది. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. అప్పారావు బెల్లన నిర్మించారు. ఇటీవల శ్రియ, నారా రోహిత్, శ్రీవిష్ణు ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన అందరి లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాశ్, నవీన్ నేని తదితరులు నటించిన ఈ సినిమాకు మార్క్ కే. రాబిన్ సంగీతం అందించారు. -
‘ఆటగాళ్ళు’ మూవీ స్టిల్స్
-
జీవితం కోసం ఆట
‘నీ స్నేహం, ఆంధ్రుడు’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ ఫర్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా నటించారు. దర్శనా బానిక్ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్ మూవీ ఇది. కథ వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబుపై వచ్చే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందంగారు తనదైన శైలిలో నవ్విస్తారు. సాయికార్తీక్ సంగీతం, విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలైట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
స్టన్నింగ్
‘మెంటల్ మదిలో, ఉన్నది ఒకటే జిందగీ, నీదీ నాదే ఒకే కథ’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియలు కూడా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నారా రోహిత్, శ్రియల లుక్స్‌ని రిలీజ్ చేశారు. శనివారం శ్రీవిష్ణు లుక్‌ని విడుదల చేశారు. చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ లుక్‌ని రిలీజ్ చేయడం విశేషం. ‘‘నారా రోహిత్, శ్రియల లుక్స్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన శ్రీవిష్ణు స్టన్నింగ్ లుక్ బాగుందని అందరూ అంటున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేన్ ఆర్. దర్శకుడు. మార్క్ కే. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేష¯Œ ్స బ్యానర్‌పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, ఎడిటర్: శశాంక్ మాలి. -
వీర భోగ వసంత రాయలు : నారా రోహిత్ లుక్
నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో శ్రియ లుక్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్ రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో అతడి లుక్‌ను రివీల్ చేశారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో రోహిత్ దివ్యాంగుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి రూమర్స్ కు చెక్ పెట్టారు చిత్రయూనిట్. కొత్త పోస్టర్లో రోహిత్ చేతికి కట్టుతో కనిపించాడు. పోస్టర్ లో ‘హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.. చిత్రంలోని ఆయన పాత్ర స్వభావం కూడా అలానే ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. -
దివ్యాంగుడిగా నారా రోహిత్
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన శ్రియ లుక్కు మంచి రెస్సాన్స్రాగా త్వరలో నారా రోహిత్ లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు కుడిచేయి ఉండదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే లుక్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
లుక్ లుక్.. న్యూ లుక్
ఇక్కడున్న శ్రియ ఫొటోని చూశారా? రఫ్‌గా కనిపిస్తున్నారు కదా. లుక్ చూస్తుంటే ఇప్పటివరకూ చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేశారనిపిస్తోంది. ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలోనే శ్రియ ఇలా కనిపించనున్నారు. నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన ఆర్. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావ్ బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రియ లుక్‌ని నారా రోహిత్ శుక్రవారం విడుదల చేసారు. ఆమె లుక్ చూసి ‘వావ్ .. వాట్ ఎ లుక్’ అంటున్నారు సినీ ప్రేమికులు, శ్రియ అభిమానులు. క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె.రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్. -
ఈ సినిమాలో హీరోలు ఉండరు
‘‘వీరభోగ వసంతరాయలు’ చిత్రంలో హీరోలు అంటూ ఉండరు. ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ప్రయోగాత్మక సినిమా. తెలుగులో కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్ ఇంద్ర ప్రపంచాన్ని తలకిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఉంటుంది’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘వీరభోగ వసంతరాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇంద్రసేన.ఆర్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో రోజూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వినేవాణ్ని. అందులో ‘వీరభోగ వసంతరాయలు’ గురించి విన్నా. అది నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. కథకి తగ్గ టైటిల్ ఇది. పాపాలు పెరిగాయనే అంశం చుట్టూనే కథ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఎవరూ చూడని విధంగా, ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్ ఎంవీకే రెడ్డిగారు. సౌతాఫ్రికా, అమెరికాలో ఉన్న డాక్టర్ మాధవి, డాక్టర్ నిరంజన్‌గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు అప్పారావు బెల్లాన. ‘‘సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమానా? తెలుగు సినిమానా? అనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ ఇంద్ర ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నన్ను టార్చర్ పెట్టాడు. కానీ, అవుట్‌పుట్ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ’’ అన్నారు శ్రీ విష్ణు. -
నారా రోహిత్, శ్రీవిష్ణు కొత్త సినిమా అప్డేట్
నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. మళ్లీ ఇదే కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ నెల 11న ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ మీ ముందుకు రాబోతోంది అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇంతవరకు బయటకు రాలేదు. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్లో ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉన్న చిత్రయూనిట్.. ఈ నెల 11న ఏం ప్రకటించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాబా క్రియేషన్స్‌పై అప్పారావు బెల్లన నిర్మించగా, ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్నారు. -
ఆటాడుకున్నారు
‘‘థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. పరుచూరి మురళి ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశాడు. మురళి స్నేహితుడు కావడంతో నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘సినిమా మైండ్ గేమ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నటన, డైలాగ్స్ పరంగా జగపతిబాబుగారు, నారా రోహిత్‌గారు ఆటాడుకున్నారు. సినిమా బాగా వచ్చింది. జగపతిబాబుగారు తొలిసారి లాయర్ పాత్రలో నటించారు’’ అన్నారు. ‘‘మర్డర్ మిస్టరీ మూవీ ఇది. ఇలాంటి జానర్లో సినిమా చేయడం నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయిస్తే చాలు. ఎందుకంటే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడికి తప్పకుండా సినిమా నచ్చుతుంది. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో నన్ను భరించి సినిమా పూర్తి చేశారు’’ అన్నారు పరుచూరి మురళి. నటులు శ్రీతేజ్, ఫణి, రైటర్ గోపీ పాల్గొన్నారు. -
లాయర్ vs డైరెక్టర్ : ఆటగాళ్లు
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ తన భార్యను చంపిన కేసులో ముద్దగా , జగపతి బాబు, రోహిత్‌కు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా కనిపిస్తున్నారు. రోహిత్‌ను దోషిగా ప్రూవ్ చేసేందుకు జగ్గుబాయ్ ఎత్తులు, కేసు నుంచి బయటపడేందుకు రోహిత్ ప్రయత్నాల నేపథ్యం సినిమా తెరకెక్కించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఆటగాళ్లు చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై 5నప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆటగాళ్లు’
-
వార్ డ్రామాలో నారా రోహిత్
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తున్న నటుడు నారా రోహిత్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్న రోహిత్ త్వరలో పీరియాడిక్ వార్ డ్రామాకు అంగీకరించనట్టుగా తెలుస్తోంది. యువ దర్శకుడు చైతన్య 1971 యుద్ధ నేపథ్యంలో రెడీ చేసుకున్న కథ నారా రోహిత్‌కు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌తో నారా రోహిత్ స్వయంగా నిర్మిత్చేందుకు రెడీ అవుతున్నారు. తన మార్కెట్ రేంజ్‌ను కూడా పక్కన పెట్టి భారీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నారా రోహిత్. ప్రస్తుతం చర్చల దలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
డిఫరెంట్ స్టోరీతో..
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. కృష్ణ విజయ్ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటరై్టన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్. ప్రొడక్షన్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. కృష్ణ విజయ్ ఎల్. మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ’ చిత్రాల తర్వాత ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం అవడంతో పాటు దర్శకత్వం వహిస్తుండటం హ్యాపీగా ఉంది. జూలైలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విజయ్‌గారితో పని చెయ్యడం హ్యాపీ. ఈ సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘విజయ్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. అంత డిఫరెంట్‌గా ఉంది’’ అన్నారు రిజ్వాన్. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు. రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శ్రీ ఓం సినిమా, సహ నిర్మాతలు: ఖుర్షీద్ (ఖుషి), అచ్చుత్ రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మనోజ్ మావిల్ల, లైన్ ప్రొడ్యూసర్: సందీప్ గడ్డపు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వినయ్ మాండ్ల, కెమెరా: సిద్. -
‘తిప్పరా మీసం’ అంటున్న యువ హీరో
‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు శ్రీవిష్ణు. సినీ విశ్లేషకులు ఈ సినిమాకు, సినిమాలోని అతడి నటనకు అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో తాజాగా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. శుక్రవారం (జూన్ 22) ఉదయం ఈ కొత్త సినిమాను షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కెమెరా స్విచ్చాన్ చేయగా, నారా రోహిత్ క్లాప్ కొట్టారు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌లుక్‌లోకి మారిపోయారు శ్రీవిష్ణు. ఈ సినిమాకు ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. .@sreevishnuoffl's new film #ThipparaMeesam launched today Directed by #KrishnaVijay of #Asura fame. Hero #NaraRohith clapped for first shot. Minister #TalasaniSrinivasYadav switched-on the camera. Produced by #RizwanEntertainment & #ShriOmCinema banners pic.twitter.com/ZXQMIoSB9T — BARaju (@baraju_SuperHit) June 22, 2018 -
రేపే శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం!
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ లాంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నారు యువ హీరో శ్రీ విష్ణు. మొదట్లో సహాయ పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు ప్రస్తుతం సోలో హీరోగా ట్రై చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ.. తన నటనతో అందరినీ మెప్పిస్తోన్న ఈ యువ హీరో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. రేపు (జూన్ 22) ఉదయం 11 గంటల 27ని. లకు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నారా రోహిత్ ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, ఓం శ్రీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీ ‘అసుర’ ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. Update on my next movie !!! Directed by “Asura” fame Krishna vijay lingamneni under the production house Rizwan Enterainment & Shri Om cinemas@UrsVamsiShekar pic.twitter.com/GSeayniCyR — Sree Vishnu (@sreevishnuoffl) June 21, 2018 -
పోలిక ఉండదు
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అప్పారావు బెల్లాన మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన కథ చెప్పగానే సినిమా ప్రొడ్యూస్ చేద్దామనిపించింది. అంతగా కథ నచ్చింది. మంచి నటీనటులు కుదిరారు. సినిమాలోని నాలుగు ముఖ్య పాత్రలను ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా దర్శకుడు డిజైన్ చేశారు. ఏ పాత్రకు మరో పాత్రతో పోలిక ఉండదు. ఈ సినిమా తెలుగు అండ్ హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసి, మూవీ రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ మూవీ’’అన్నారు ఇంద్రసేన. శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: రాబిన్. -
న్యూ లుక్‌లో...
నారా రోహిత్, కృతిక, నీలమ్ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కింది. కార్తికేయను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటి తూముల నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నారా రోహిత్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన కెరీర్లో మా చిత్రం బెస్ట్‌గా నిలుస్తుంది. ఇటీవల చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా క్లైమాక్స్ తీశాం. టర్కీలో రెండు పాటలు గ్రాండ్‌గా తీశాం. డైరెక్టర్ కథ చెప్పిన దానికన్నా సినిమా చాలా బాగా తీశారు. అనూప్ రూబెన్స్గారి సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్’’ అన్నారు. నాగబాబు, పోసాని, రఘుబాబు, అలీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర. -
`ఆటగాళ్ళు' టీజర్ రిలీజ్
-
ఆటగాళ్ళు : రోహిత్ vs జగ్గు భాయ్
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ నటుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు. టీజర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసేశారు చిత్రయూనిట్. తన భార్యను చంపిన కేసులో రోహిత్ అరెస్ట్ కాగా రోహిత్‌కు వ్యతిరేకంగా వాధించే లాయర్ పాత్రగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆటగాళ్ళ’ కోసం రానా
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు. శనివారం ఉదయం పదిన్నరకు యంగ్ హీరో రానా చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. రోహిత్ సరసన బెంగాలీ మోడల్ దర్శన బానిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితంతో ఆట
నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ విత్ లైఫ్’ అన్నది ట్యాగ్‌లైన్. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాతో దర్శనా బానిక్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్. మురళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం, విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘ఆటగాళ్లు’ విడుదల తేదీ ఖరారు
కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు నారా రోహిత్. మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వచ్చినా ఆశించిన స్థాయిలో ఈ యువ హీరోకు గుర్తింపు రాలేదు. అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి, రౌడీఫెలో లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆటగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చిత్రబృందం తెలిపింది. రోహిత్‌కు జంటగా దర్శనా బానిక్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించగా.. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. గేమ్ ఫర్ లైఫ్ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ మూవీలో ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకున్నారో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాల్సిందే. -
ఇద్దరు హీరోలు ఫ్రీడమ్ ఇచ్చారు
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ ఫర్ లైఫ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జగపతిబాబు, నారా రోహిత్ కలిసి విడుదల చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ–‘‘మురళి కథ చెప్పినప్పుడు..‘నాకు హీరోగా మార్కెట్ లేదు. విలన్‌గా ఉందని’ చెప్పి వెనక్కి పంపాను. కానీ మురళి పట్టువదలకుండ రోహిత్‌ను ఒకే చేసుకుని వచ్చాడు. రోహిత్ పాత్ర చేయడానికి ఎవరూ సాహసించరు. కథను నమ్మి పాత్ర చేసిన రోహిత్‌కు అభినందనలు’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘జగపతిబాబు గారితో ఫస్ట్‌టైమ్ వర్క్ చేశా. ఇలాంటి జోనర్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. నా పాత్ర నాకే కొత్తగా అనిపించింది’’అన్నారు.‘‘పెదబాబు’ తర్వాత జగపతిబాబుగారితో చేసిన చిత్రమిది. ఫ్రీడమ్ ఇచ్చిన ఇద్దరు హీరోలకు థ్యాంక్స్. నా ముగ్గురు మిత్రులతో పాటు నేనూ నిర్మాతగా మారా. టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ–‘‘షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, ట్రైలర్లను విడుదల చేసి ఆ నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, ఫణిలతో పాటు ఇతర నిర్మాతలు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. -
తెలివైన ఆట
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో దర్శనా బానిక్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నారా రోహిత్ బుధవారం ఈ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఇంటిలిజెంట్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. మేం ఊహించినదానికంటే అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రోహిత్–జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి, వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్.సి. కుమార్, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు. -
జెంటిల్మన్ బ్యూటీతో రోహిత్
జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి నివేదా థామస్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. జెంటిల్మన్ తరువాత నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తరువాత మరో సినిమా అంగీకరించేందుకు చాలా సమయం తీసుకుంది. తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతన్న ‘శబ్దం’ సినిమాలో నివేదాను హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. -
ఆట ముగిసింది
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆటగాళ్లు’. ‘గేమ్ విత్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వైవిధ్యమైన కథ కావడంతో ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. వీరు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మురళి ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. నారా రోహిత్ సరసన దర్శనా బానిక్ కథానాయికగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు. -
గుమ్మడికాయ కొట్టిన ‘ఆటగాళ్లు’
సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ యాక్టర్ జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంటిలిజెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గేమ్ విత్ లైఫ్ అనేది ట్యాగ్‌లైన్. సోమవారంతో ఈసినిమా షూటింగ్ పూర్తయ్యింది. చిత్రబృందం సెట్ లో గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పనులు ముగించారు.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. నారా రోహిత్‌గారు, జగపతిబాబుగారు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. చాలా వైవిద్యమైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు మురళి ‘ఆటగాళ్లు’ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్, జగపతిబాబుల పాత్రలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం’ అన్నారు. -
‘నీది నాది ఒకే కథ’ ప్రీరిలీజ్ ఈవెంట్
-
మనందరి కథలా ఉంది : శేఖర్ కమ్ముల
విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ హీరోయిన్ గా నటించింది. నారా రోహిత్ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల కోసం ప్రత్యేకం ప్రదర్శించారు. సినిమా చూసిన శేఖర్ కమ్ముల చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సమాజానికి అవసరమైన కథను ఎంతో అందంగా రూపొందించిరనందుకు యూనిట్ సభ్యులకు హ్యాట్సాఫ్ అన్నారు. ప్రస్తుతం సొసైటీలో గెలిచిన వాళ్లకే కెరీర్ ఉంటుందని, ఓడిపోయిన వాళ్లను ఎందుకు పనికి రానివారిగా చూస్తున్నారని.. అలాంటి సంఘటనలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారని తెలిపారు. శ్రీవిష్ణు యాక్టింగ్ గత చిత్రాల కన్నా ఇంకా బాగుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమన్నారు. -
ని‘శబ్దం’ అతని ఆయుధం
అందరికీ ఆయుధాలు కత్తో, కొడవలో అయితే అతని ఆయుధం మాత్రం నిశబ్దం. ఎందుకంటే.. మూగవాడు కనుక. నారా రోహిత్ తదుపరి సినిమా ‘శబ్దం’లో మూగవాడి పాత్రలో కనిపించనున్నారు. పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్‌నిచ్చారు. పి.బి.మంజినాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం టీమ్ అంతా కష్టపడతాం. ఈ కథకు ‘శబ్దం’ అనే టైటిల్ చాలా యాప్ట్’’ అన్నారు. ‘‘శబ్దం’ సూపర్ హిట్ అవ్వాలని, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ‘‘రోహిత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నారాయణరావు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన హీరో రోహిత్, నిర్మాతలకు థ్యాంక్స్. ఏప్రిల్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’అన్నారు మంజునాథ్. -
నారా రోహిత్ 'శబ్దం' ప్రారంభం
-
‘అతని మౌనమే అతని ఆయుధం’
నారా వారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు నారారోహిత్. పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.... తను మాత్రం ప్రయోగాత్మక పాత్రలోనే నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు. నారా రోహిత్ సినిమా అంటే కొత్తగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా నారారోహిత్ మూగవాడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఉగాది సందర్భంగా లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.బి. మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వికాస్ కురిమెళ్ల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. -
నీది నాది ఒకే కథ ట్రైలర్ విడుదల
-
మాటల్లేవ్!
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న నారా రోహిత్ ప్రస్తుతం మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. తన తదుపరి సినిమాలో మూగవాడిగా కనిపించనున్నారు. నూతన దర్శకుడు పిబి మంజునాథ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మించనున్నారు. ఉగాదికి ప్రారంభం కానున్న ఈ సినిమాకు కథ–మాటలు: వంశీ రాజేష్, సంగీతం: వికాశ్ కురిమెళ్ల. -
మూగ పాత్రలో యంగ్ హీరో
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో మూగవానిగా కనిపించనున్నాడు. నారా రోహిత్ 18వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణరావు అట్లూరి నిర్మిస్తున్నారు. వంశీ రాజేష్ కథా మాటలు అందిస్తుండగా పీబీ మంజునాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది రోజున ప్రారంభం కానుంది. -
అప్పుడు తెలుగు... ఇప్పుడు ఫిజిక్స్
తెలుగు మాస్టర్‌గా పద్యాలు చెప్పిన వెంకటేశ్ ఇప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఆల్మోస్ట్ పాతికేళ్ల క్రితం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుందరకాండ’ చిత్రంలో వెంకటేశ్ తెలుగు మాస్టర్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తేజ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలోనే వెంకీ ఫిజిక్స్ లెక్చరర్‌గా నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ లుక్ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇంతకీ ఫొటోను బాగా గమనించారు కదా! వెంకీ చేతిలో ఉంది ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి చెందిన బుక్. సో.. ఈ సినిమాలో ఆయన ఫిజిక్స్ లెక్చరర్‌గా కనిపించనున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. నారా రోహిత్ ఓ కీలక పాత్రను చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీలో వెంకటేశ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. -
మరో ప్రాజెక్ట్ ఓకె చేసిన రోహిత్
హిట్.. ఫ్లాప్.. లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. నిర్మాతగానూ బిజీ అవుతున్న రోహిత్ ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు రోహిత్. ఎస్డీ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈఎమ్వీఈ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కతున్న సినిమాలో నటించనున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నీదీ నాదీ ఒకే కథ’ టీజర్ విడుదల
-
నువ్ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథలు కొత్తదనంతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో వంటి సినిమాలు ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందాయి. తాజాగా ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు’ ఫేమ్ శ్రీవిష్ణు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన ఈ సినిమాను నారా రోహిత్ సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకకులను ఆకట్టుకుంటోంది. సరిగ్గా చదువు అబ్బని ఓ యువకుడి జీవిత సంఘర్షణ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనిగొని పొగుడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అన్న పద్యంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఈసారైనా పాస్ అవుతావా? అన్న డైలాగ్ హీరోను వెంటాడుతుంది. తీరా తనకే డౌట్ వచ్చి.. ‘ఈ సారైనా నేను పాస్ అవుతానా?’ అని చెల్లెల్ని అడుగుతాడు.. ‘హండ్రెడ్ పర్సంట్ పాస్ అవుతావ్ అన్నయ్య’ అంటూ చెల్లెలు ధైర్యం చెప్తుంది.. ‘అందుకే డిసైడ్ అయ్యాను చదివేద్దామని..’ అని ఎగ్జామ్ సెంటర్లో హీరో బీరాలు పోతాడు. ‘మరి చదివేశాయా?’ అని ఎగ్జామినర్ అడిగితే.. ‘ఏంది చదివేది రాత్రేగా డిసైడ్ అయింది’ అంటూ తెల్లముఖం వేస్తాడు శ్రీవిష్ణు.. ‘నువ్వు ఆత్మనూన్యత భావంతో బాధపడుతున్నావ్’ అని హీరోయిన్ అంటే.. ‘ఇదేదో బ్లడ్ క్యాన్సరో.. మౌత్ క్యాన్సరో కాదు కదండి’ అని శ్రీవిష్ణు అడిగితే.. దానికంటే పెద్దదని తను బదులిస్తుంది. చదువులో రాణించలేక ఓ యువకుడు పడే ఘర్షణను టీజర్లో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ‘పాన్ షాపోడిది ఓ బతుక్కాదా? కొబ్బరిబొండాలు అమ్ముకునేవోడిది ఓ బతుక్కాదా? మెకానిక్ షెడ్డోది ఓ బతుక్కాదా? డ్రైవర్‌ది బతుక్కాదా? యే.. నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని హీరో ఏమోషనల్‌గా బరస్ట్ అయితే.. చాచి చెంపమీద కొట్టి.. ‘నువ్ మారావురా ప్రపంచందంతా ఒక దారైతే.. నీ ఒక్కడిది ఒక దారి. నువ్ బతకడమే అనవసరం.. ఎందులోనన్నా దూకి చావు’ అని తండ్రి కోపంగా బదులిస్తాడు. ఓ సామాన్యుడి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను ఓ సామాన్య మెకానిక్‌తో ఆవిష్కరింపజేయడం గమనార్హం. ఈ సినిమా టీజర్ 24 గంటల్లోనే 5 లక్షలకుపైగా డిజిటల్ వ్యూస్ సాధించింది. -
‘ఆటగాళ్లు’ మొదలు పెట్టారు..!
విలన్ గా మారిన తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సీనియర్ స్టార్ జగపతి బాబు, త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నారా రోహిత్ తో కలిసి ఆటగాళ్లు అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ జానర్ లో రూపొందుతోంది. ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా తెరకెక్కుతుందంటున్నారు చిత్రయూనిట్. -
త్రీ కజిన్స్.. వన్ బ్రదర్ ఓకే!
నితిన్–రానా–నారా రోహిత్ కజిన్స్‌గా నటించనున్నారా? ‘పీఎస్వీ గరుడ వేగ’ హిట్ జోష్‌లో ఉన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా తీయనున్నారా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ఇదే హాట్ టాపిక్. నితిన్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా ఆల్రెడీ షురూ అయిన విషయం తెలిసిందే. ఇది మల్టీస్టారర్ మూవీ అని, ఇందులో రానా, నారా రోహిత్ నటించనున్నారనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయం గురించి ప్రవీణ్ సత్తారుని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘‘మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నానన్నది నిజమే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. కథ రెడీ. ఇందులో ముగ్గురు హీరోలుంటారు. వారిలో నితిన్ ఒక్కరే ఫైనల్. నితిన్‌కి మాత్రమే కథ వినిపించాను. రానా, నారా రోహిత్ నటిస్తున్నారన్నది నిజం కాదు. ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు. కొత్త ఏడాదిలో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌లో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ చిత్రానికి ‘3 కజిన్స్’ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. త్రీ కజిన్స్ అంటే హీరోయిన్స్ పాయింటాఫ్ వ్యూలోనూ ఉండొచ్చు. అయితే.. ఈ టైటిల్ హీరోలను ఉద్దేశించి ఫిక్స్ చేసినదే అని భోగట్టా. -
టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్?
సాక్షి, సినిమా : వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రీసెంట్గా గరుడవేగ చిత్ర ఘన విజయం సాధించటంతో అతనితో పని చేసేందుకు యువహీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం ప్రవీణ్‌తో ఉంటుందని స్వయంగా నితిన్ ప్రకటించటం చూశాం. అయితే అది మాములు చిత్రం కాదన్న సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. ముగ్గురు యువ హీరోలతో ప్రవీణ్ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నాడని చెబుతున్నాడని ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘త్రీ కజిన్స్’ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని టాక్. నితిన్ ఓ హీరోగా ఇప్పటికే ఎంపిక కాగా, మిగతా ఇద్దరు హీరోలుగా రానా, నారా రోహిత్‌లను తీసుకునే అవకాశం ఉందంట. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రేక్షకులకు మరో క్రేజీ సినిమా అందినట్లే అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువహీరోలు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. -
'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ
టైటిల్ : బాలకృష్ణుడు జానర్ : కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం : నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పవన్ మల్లెల నిర్మాత : బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నారా రోహిత్, నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాల మీదే దృష్టి పెట్టిన నారావార్బాయి... తొలిసారిగా ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరు పాటలు, నాలుగ ఫైట్లు, పంచ్ డైలాగ్ లు, భారీ చేజ్ లు వీటికి తోడు హీరోయిన్ గ్లామర్ షో.. ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో రూపొందిన బాలకృష్ణుడు నారా రోహిత్ కు కమర్షియల్ హీరో ఇమేజ్ తీసుకువచ్చిందా..? కథ : కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 2006లో సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి, తన చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటారు. జనంలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) రగిలిపోతాడు. కానీ రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు. తాను పోయినా తన ఆశయం మాత్రం బతకాలని ఆఖరి నిమిషంలో చెల్లెలుతో మాట తీసుకుంటాడు రవీందర్ రెడ్డి. (సాక్షి రివ్యూస్) అన్నకిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి లాంటి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా) ఈ గొడవలకు దూరంగా పెంచుతుంటుంది భానుమతి. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా పెడుతుంది. ప్రతాపరెడ్డి నుంచి ఆధ్యను బాలు ఎలా కాపాడాడు..? ఈ ప్రయాణంలో బాలు, ఆధ్యలు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా రొటీన్ కమర్షియల్ సినిమాలో నటించిన నారా రోహిత్, అందుకు తగ్గ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా మార్పులు చూపించాడు. ఎక్కువగా సెటిల్డ్ రోల్స్ లోనే కనిపించిన ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ సినిమాకు కీలకమైన యాక్షన్ సీన్స్, డ్యాన్స్ ల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. హీరోయిన్ గా రెజీనా ఆధ్య పాత్రలో అలరించింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకుంది. కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు మరో ఎసెట్, నీలాంబరి తరహా పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ తనకు అలవాటైన హావాభావాలతో భానుమతి పాత్రను పండించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా నటించిని అజయ్ ది రొటీన్ ఫ్యాక్షన్ విలన్ పాత్రే, తన వంతుగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అజయ్. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ ఇరగదీశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన ఈ కామెడీ స్టార్ అద్భుతమైన టైమింగ్ తో అలరించాడు. విశ్లేషణ : కమర్షియల్ ఫార్ములా తీయాలన్న ఆలోచనతో బాలకృష్ణుడు సినిమా కథ రెడీ చేసుకున్న దర్శకుడు పవన్ మల్లెల పక్కా ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలో ఉండాల్సిన ఫైట్లు, గ్లామర్, పంచ్ డైలాగ్ లు, చేజ్ లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. నారా రోహిత్ ను సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయటంలో సక్సెస్ సాధించాడు. అయితే ఈ తరహా కథా కథనాలు కాలం చెల్లిపోయి దశాబ్దం పైనే అవుతుంది. (సాక్షి రివ్యూస్) మరి ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం. తన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు మణి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్ నటన పృథ్వీ కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'బాలకృష్ణుడు' ప్రీ రిలీజ్ వేడుక
-
కథనం కొత్తగా ఉంటుంది!
నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. బి. మహేంద్రబాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మాతలు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఎప్పట్నుంచో కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రతిసారి నేను ఒక కొత్త తరహా కథతో వస్తానని ప్రేక్షకులు నమ్ముతారు. బట్.. ఈ ఒక్కసారికి నన్ను క్షమిండచండి. ఈ సిన్మా కథ పాతదైనా... కథనం కొత్తగా ఉంటుంది. మణిగారు మంచి సంగీతం ఇచ్చారు. పృథ్వీగారి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రతి విషయంలోనూ రోహిత్ తోడుగా ఉన్నారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు పవన్ మల్లెల. ‘‘సిన్మా చూశా. కామెడీ సూపర్‌గా వర్కౌట్ అయ్యింది. రోహిత్ నటన సూపర్. పవన్ బాగా తెరకెక్కించారు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘రోహిత్ ఫస్ట్‌టైమ్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్టవ్వాలి. కమర్షియల్ హీరోగా నారా రోహిత్‌కు మంచి పునాది పడాలని కోరుకుంటున్నాను. పవన్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఈ వేడుకలో హీరోయిన్ రెజీనా, నటుడు ‘వెన్నెల’ కిశోర్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
సిక్స్ ప్యాక్ చేయలేదు
‘‘నేనిప్పటి వరకూ చాలామంది కొత్త దర్శకులతో పనిచేశాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పవన్ మల్లెల మొదటి సిట్టింగ్‌లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ‘బాలకృష్ణుడు’ సినిమా చేశా’’ అని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మించిన ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఫుల్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న టైమ్‌లో ఈ చిత్రం కుదిరింది. కథ మరీ కొత్తగా ఉండదు. కానీ, దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. నటుడు అజయ్ ద్వారా ఈ సినిమా నా దగ్గర వచ్చింది. ఇందులో ప్రధాన విలన్ అతనే. డబ్బు కోసం ఏమైనా చేసే బాలు పాత్రలో కనిపిస్తా. అయితే నెగెటివ్ షేడ్స్ ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే భిన్నమైనది. టైటిల్లోనే కమర్షియల్ సినిమా అని తెలిసిపోవాలని ‘బాలకృష్ణు్ణడు’ పెట్టాం. ‘జ్యో అచ్యుతానంద’కి, ఈ సినిమాకి దాదాపు 21 కిలోలు తగ్గాను. ఈ సినిమాలో పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ చేయలేదు. పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్ళు’ సినిమా చేస్తున్నా. చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్ట్ ఉంది. లవ్‌స్టోరీలు కూడా వింటున్నా’’ అన్నారు. -
‘బాలకృష్ణుడు’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అనిపిస్తోంది – సమంత
‘‘సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి మహేంద్ర. బాలకృష్ణగారికి ‘మువ్వగోపాలుడు’, ఎన్టీఆర్‌కి ‘బృందావనం’ హిట్ అయినట్లే, ‘బాలకృష్ణుడు’ సినిమా నారా రోహిత్‌కి పెద్ద హిట్ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’రాజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఆడియో సీడీలను హీరోయిన్ సమంత విడుదల చేయగా, హీరో సాయిధరమ్ తేజ్ అందుకున్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘మహేంద్రగారు నిర్మించిన ఈ తొలి సినిమా పెద్ద సక్సెస్ కావాలి. పవన్ మల్లెల ఐదేళ్లుగా నాకు మంచి మిత్రుడు. ట్రైలర్ చూస్తే సినిమా పెద్ద హిట్ సాధిస్తుందనిపిస్తో్తంది’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమాలు చేసిన నేను మంచి కథ కుదిరితే కమర్షియల్ మూవీ చేయాలనుకున్నా. ఆ టైమ్‌లో పవన్ మల్లెల ‘బాలకృష్ణుడు’ కథ చెప్పారు. నాకంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నా. సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. పవన్ నా వెనక పడి బరువు తగ్గమనేవాడు. నేను తగ్గానంటే ఆ క్రెడిట్ తనకే దక్కుతుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలని తిరుగుతున్నప్పుడు మహేంద్రతో స్నేహం కుదిరింది. ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. నాకు చిరాకు వచ్చి విజయవాడ వెళ్లిపోయా. సినిమా చేద్దామంటూ హైదరాబాద్‌కు పిలిపించి ‘బాలకృష్ణుడు’ చేయించాడు’’ అన్నారు పవన్ మల్లెల. దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ, హీరో నాగశౌర్య, హీరోయిన్ రాశీఖన్నా, నిర్మాత బెల్లంకొండ సురేష్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటులు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచు హీరో కోసం నారా రోహిత్
కెరీర్ లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీయి ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న యూనిట్ సభ్యులు మరింత హైప్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఓ యంగ్ హీరోతో వాయిస్ ఓవర్ చేయిస్తున్నారు ఒక్కడు మిగిలాడు టీం. ఇప్పటికే వరుస మల్టీ స్టారర్లతో అలరిస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ ఒక్కడు మిగిలాడు సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. సినిమా టైటిల్స్ పడే సమయంలో రోహిత్ వాయిస్ వినిపించనుంది. మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. Terrific voice for the titles of #OkkaduMigiladu by my friend/cousin #NaraRohith ❤❤Love you! Thank you for adding up the intensity! ☺ pic.twitter.com/crUT0e1e0r — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 7 November 2017 -
ఇద్దరు మిత్రుల సవాల్
నారా వారబ్బాయి రోహిత్, యంగ్ హీరో శ్రీవిష్ణుల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాలో శ్రీవిష్ణుకు కీలక పాత్రలు ఇవ్వటంతో పాటు తానే స్వయంగా నిర్మాతగా మారి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న వీరభోగవసంత రాయలు సినిమాలో కూడా ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అయితే ఇంతటి స్నేహంగా ఉంటున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ ముందు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్ మూవీ బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పోటీ తప్పేలాలేదు. రోహిత్ సిక్స్ప్యాక్లుక్లో కనిపిస్తుండటంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ బాలకృష్ణుడు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. పెళ్లిచూపులు లాంటి క్లాస్ హిట్ తరువాత రాజ్ కందుకూరి, సురేష్ బాబులు నిర్మిస్తున్న మెంటల్ మదిలో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు మిత్రుల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. -
తేడా వస్తే!
బాలకృష్ణుడు..పేరుకు తగ్గట్లే కుర్రాడు కూల్‌గా ఉంటాడు. కామ్‌గా తన పనేంటో తాను చూసుకుంటాడు. కానీ, ఏదైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తాడు. ఇంతకీ ఈ బాలకృష్ణుడు ఎవరో కాదు.. హీరో నారా రోహిత్. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. శరత్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ పిక్చర్స్ పతాకాలపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ సిక్స్‌ప్యాక్ చేశారు. రమ్యకృష్ణ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు. రెజీనా బాగా నటించింది. ఇక మణిశర్మగారి సంగీతం సూపర్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు, పృథ్వీ, ఆదిత్యా మీనన్, దీక్షా పంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా విజయ్ సి. కుమార్. -
నారా వారబ్బాయి విలన్ గానా..?
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నేను రాజు నేనే మంత్రి సినిమాతో బిగ్ హిట్ అందుకున్న దర్శకుడు తేజ, అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన రోల్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే కీలకమైన ప్రతినాయక పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్‌అని భావించిన చిత్రయూనిట్, హీరోగా అలరిస్తున్న నారా రోహిత్‌ను విలన్‌గా ఫైనల్ చేశారట. ఇప్పటికే కథలో రాజకుమారి సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్న రోహిత్ పూర్తి స్థాయి విలన్‌గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఎన్టీఆర్ సినిమాలో కామెడీ హీరో..!
జై లవ కుశ సినిమాతో నటుడిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన యంగ్ హీరో ఎన్టీఆర్, తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను లాంచనంగా ప్రారంభించాడు. ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్ అని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ పాత్రకు నారావారబ్బాయి రోహిత్ ను తీసుకున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. నందమూరి, నారా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే పబ్లిసిటీ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం నారా రోహిత్ స్థానంలో కామెడీ హీరో సునీల్ ను తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. హీరోగా మారిన తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సునీల్, ఇటీవల సపోర్టింగ్ రోల్స్ కు రెడీ అంటూ ప్రకటించేశాడు. చాలా కాలంగా సునీల్ కు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్న ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమాతో ఆ కోరిక తీర్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి సునీల్ పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఆటగాళ్లుగా.. రోహిత్, జగ్గుభాయ్
ఇప్పటికే పలువురు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించిన నారా రోహిత్, ఇప్పుడు ఓ సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. విభిన్న పాత్రలతో అలరిస్తున్న స్టార్ జగపతిబాబుతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టిన రోహిత్ మరోసారి మాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆటగాళ్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నారా రోహిత్, జగపతి బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
రోహిత్ హీరోగా మరో యాక్షన్ మూవీ
బాణం సినిమాత సాఫ్ట్ ఇమేజ్ తో హీరోగా పరిచయం అయిన నారా రోహిత్, ప్రయోగాత్మక చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న రోహిత్ ప్రస్తుతం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా దర్శనమివ్వనున్నాడు రోహిత్. ఈ సినిమా తరువాత కూడా మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ జగపతిబాబుతో కలిసి రోహిత్ నటించనున్న ఈ సినిమా బుధవారం ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
డిఫరెంట్ బాలకృష్ణుడు
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ సినిమాలో సిక్స్‌ప్యాక్ దేహంతో కనిపించ నున్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాన్స్, మంచి పాటలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. పవన్ మల్లెల పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించారు. నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పృధ్వీ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ అలరిస్తుంది. రమ్యకృష్ణ ఇందులో పవర్ఫుల్ రోల్లో నటించారు. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్. ఈ నెలాఖరులో పాటలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: డి.యోగానంద్. -
దారిన పోయే రౌడీఫెలో : బాలకృష్ణుడు
విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నారా రోహిత్. కెరీర్ తొలినాళ్ల నుంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న రోహిత్ త్వరలో బాల కృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇన్నాళ్లు లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నారావారబ్బాయి ఈ సినిమాలో ఆరు పలకల దేహంతో కనిపించనున్నాడు. నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ నీలాంబరి తరహా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేసింది. Here is the teaser of #Balakrishnudu https://t.co/nzqNmAZ4sE . All the very best to the team @pavan_mallela @mahendra7997@reginacassandra ❤️ — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 30 September 2017 -
దారిన పోయే రౌడీఫెలో : బాలకృష్ణుడు
-
నయా బాలకృష్ణుడు!
బాలకృష్ణుడు...పేరు కొంచెం క్లాసీగా ఉన్నా కుర్రాడిలో మాత్రం మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లున్నాయి. ఏదైనా తేడా కొట్టిందో విలన్స్‌ను ఇరగదీస్తాడంతే. సిక్స్‌ప్యాక్ ఉన్నప్పుడు ఆ మాత్రం కుమ్మేయడానికి ఆలోచించడు కదా. హీరో నారా రోహిత్‌నే ఈ నయా బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై మహేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మిస్తున్నారు. రెజీనా కథనాయిక. మణిశర్మ స్వరకర్త. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన సూపర్‌గా నటిస్తున్నారు. పవన్ మల్లెల చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నాం. మణిశర్మగారి మ్యూజిక్ సినిమాకు హైలైట్’’ అన్నారు. -
బాలకృష్ణుడు ఫస్ట్ లుక్
విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నారా రోహిత్. కెరీర్ తొలినాళ్ల నుంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న రోహిత్ మల్టీ స్టారర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న నారావారబ్బాయి తన కొత్త సినిమాలో ఆరు పలకల దేహంతో కనిపించనున్నాడు. నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ నీలాంబరి తరహా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే కలర్ ఫుల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా నారా రోహిత్ స్టిల్ ను రివీల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ డ్రెస్ లో రోహిత్ సూపర్బ్ గా ఉన్నాడు. విజయదశమి సందర్భంగా బాలకృష్ణుడు టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
రిజల్ట్ గురించి టెన్షన్ లేదు!
‘‘సినిమా రిజల్ట్ గురించి టెన్షన్ లేదు. కొత్త కథతో తీశాను. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు మహేశ్ సూరపనేని. ఆయన్ను దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజేశ్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మించిన చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. మహేశ్ సూరప నేని మాట్లాడుతూ – ‘‘ఇందులో నారా రోహిత్‌ది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. రాజకుమారిలాంటి అమ్మాయి లైఫ్‌లో ఈ అబ్బాయి ఎలా హీరోగా మారతాడు? అన్నది కథ. నాగశౌర్య, నందితలవి గెస్ట్ రోల్స్. అవసరాల శ్రీనివాసరావుది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక బిట్ పాటతో కలిపి ఈ సినిమాలో 7 పాటలుంటాయి. వీటిలో హీరోయిన్ ఇంట్రో, టీజింగ్ సాంగ్‌కు ఇళయరాజాగారు స్వరాలందించారు. మిగిలినవి విశాల్ చంద్రశేఖర్ చేశారు’’ అన్నారు. ‘‘యూఎస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశాను. ఇండియా వచ్చాక ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, కోనాగారి దగ్గరా వర్క్ చేశాను. అశ్వనీదత్‌గారు నన్ను సపోర్ట్ చేశారు. రెండేళ్లుగా వైజయంతి మూవీస్ తో అటాచై యున్నాను. కొన్ని యాడ్స్ ఫిల్మ్స్ కూడా చేశాను’’ అన్నారు మహేశ్. -
సెప్టెంబర్ 15న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ప్రధాన పాత్రలలో మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరులు ఈసినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. -
జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్!
శ్రియను చూస్తే కొంతమంది అమ్మాయిలకు అసూయగా, అబ్బాయిలకు హ్యాపీగా ఉందట. ఎందుకంటే... ఇప్పుడామె వయసెంత? అల్మోస్ట్ 35 ఇయర్స్. శ్రియను చూస్తే అలా కనిపిస్తారా? పాతికేళ్ల అమ్మాయిలా ఉంటారు కదూ! అందుకే, అమ్మాయిలు అసూయ పడుతున్నారట! ఇప్పుడామె నటిస్తున్న సినిమా విడుదలైనప్పుడు ఆ అమ్మాయిలంతా మరింత అసూయ పడతారేమో? ఎందుకంటే... అందులో అల్ట్రా మోడ్రన్ ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తున్నారీమె. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వీరభోగ వసంతరాయులు’. ఇందులోనే శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ‘పైసా వసూల్’లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా మెప్పించారు శ్రియ. ఇప్పుడా పాత్ర నుంచి బయటకొచ్చేశారు. జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్‌గా మారారు. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయులు’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంద్రసేన దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోలు, విలన్లు ప్రత్యేకంగా ఎవరూ లేరు. కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుందట! -
రెజీనా కోసం రాశీఖన్నా..!
హీరోలే కాదు.. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సినిమాల్లో నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అదే బాటలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తను హీరోయిన్ గా నటించిన జోరు సినిమా కోసం తొలి సారిగా పాట పాడింది రాశీ. తరువాత మలయాళ చిత్రం విలన్ లోనూ గొంతు సవరించుకుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో పాట పాడుతుంది. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ కాదు. తొలి చిత్రాల్లో తన క్యారెక్టర్ కోసం పాట పాడిన రాశీ ఖన్నా, తొలిసారిగా రెజీనా పాత్ర కోసం పాడుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది. -
ఆగష్టు 25న 'కథలో రాజకుమారి'
నారా రోహిత్ నటించిన మరొక విభిన్న కుటుంబ, ప్రేమకధా చిత్రం 'కధలో రాజకుమారి'. రాజేష్ వర్మ సిరువూరి సమర్పణలో నిర్మించబడిన ఈ చిత్రానికి సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ నిర్మాతలు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ అందుకొంది. సెన్సార్ సభ్యుల నుండి విశేష స్పందనను పొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదల చెయ్యడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన 'కథలో రాజకుమారి'ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి' అన్నారు. -
'కథలో రాజకుమారి' మూవీ స్టిల్స్
-
లుక్.. నయా లుక్
నారా రోహిత్ ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ అయ్యారు. అలా కావడం కోసం సన్నబడ్డారు. ఈ మధ్య నారా రోహిత్ కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సన్నబడిపోతానని ప్రూవ్ చేసుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో సన్నబడిన రోహిత్‌ను చూడొచ్చు. ఈరోజు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పొడవాటి జుత్తు, మెలి తిరిగిన మీసాలు.. సిక్స్‌ప్యాక్ బాడీతో నారా రోహిత్ డిఫరెంట్‌గా కనిపిస్తున్న లుక్ ఇది. ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ డి.యోగానంద్. -
‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’
నిర్మాత వి.ఆనంద ప్రసాద్ ‘‘శమంతకమణి’ సినిమా మా భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. మా సంస్థలో ‘లౌక్యం’ చిత్రం తర్వాత 100 శాతం ప్రేక్షకులు బావుందని చెప్పిన సినిమా ‘శమంతకమణి’. కుటుంబమంతా కలిసి చూసే కథ. త్వరలో విజయయాత్ర చేయనున్నాం’’ అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్ అన్నారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన నా మిత్రులతో మరో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చేసిన కార్తీక్ క్యారెక్టర్ నాకు చాలా మెమరబుల్.’’ అన్నారు ఆది. ‘శమంతకమణి’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల ఆదరణ మా అందరి గెలుపుగా భావిస్తున్నాం’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ పాత్ర నాకు ఇచ్చినందుకు శ్రీరామ్ ఆదిత్యకు, ఇటువంటి చిత్రం తీసిన ఆనందప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నారా రోహిత్. ‘‘నా కల నిజం చేసిన మా హీరోలకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
మూవీరివ్యూ: శమంతకమణి
మల్టీ స్టారర్ మూవీ అంటే తెలుగు సినీపరిశ్రమ లాంటి చోట సాహసమే. వెంకీ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు మల్టీ స్టారర్ చేసి సక్సెస్ అయినా ఆ బాటలో నడిచేందుకు పెద్దగా దర్శకులు ఆసక్తి కనబరచలేదు. అయితే తాజాగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నలుగురు అప్ కమింగ్ హీరోలను తీసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ కథతో చేసిన ప్రయత్నమే శమంతకమణి. టాలీవుడ్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నలుగురు హీరోలతో తెరకెక్కింది ఈ సినిమా. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. వీళ్లకి తోడు నలుగురు హీరోయిన్ల సందడి.. ఇంకోవైపు, రాజేంద్రప్రసాద్, సుమన్. ఇలా.. భారీ కాస్టింగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం. నలుగురు యువకుల జీవితాలతో కథ మొదలవుతుంది. కృష్ణ (సుధీర్ బాబు), శివ(సందీప్ కిషన్), కార్తీక్ (ఆది), సి.ఐ రంజిత్‌గా నారా రోహిత్‌లు ఎవరి జీవితాలు, ఎవరి గోలలో వాళ్లుంటారు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ(సుధీర్‌బాబు) ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. అయితే పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి పార్కింగ్‌లోకి వచ్చిన కృష్ణకు అక్కడ ఉండాల్సిన ఐదు కోట్ల విలువచేసే తన కారు శమంతకమణి చోరీ అయ్యిందని తెలుస్తుంది. ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసును సిఐ రంజిత్‌కుమార్ డీల్ చేయడం మొదలుపెడుతాడు. కేసు విచారణలో భాగంగా కృష్ణ ఇచ్చిన పార్టీకి వచ్చిన వారిలో అనుమానంగా కనిపించిన శివ, కార్తీక్, రాజేంద్రప్రసాద్‌లను విచారిస్తాడు. అయితే వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతూ ఉండడంతో ఆ కారు ఎవరు దొంగలించారన్న దానిపై స్పష్టత పోతుంది. అయితే ఆ కారును ఏం చేశారు? దేనికోసం 5కోట్ల విలువచేసే కారును తీసుకెళ్లారు? ఆ కారుకి వీళ్లకి సంబంధం ఏంటి? అసలు రంజిత్ కుమార్‌కు ఆ కారుకు ఉన్న సంబంధం ఏంటి? మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగలించారన్నదే ‘శమంతకమణి’ స్టోరీ. నటీనటులు నటుల పరంగా ఎవరిని ఎత్తి చూపడానికి లేదు. ఈ సినిమాకున్న అతి పెద్ద బలం నలుగురు కథానాయకులు. ఎవరికి బలమైన ఇమేజ్ లేకపోవడమే పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ బ్రాండ్ ఒక్కరికి ఉన్నా కూడా తేడాలు కనిపించేవి కాని అందరు ఒకే రేంజ్ కాబట్టి ఆ సమస్య రాలేదు. ఒకపాత్రతో వేరేదానికి పోలిక లేకపోవడం వల్ల ఎవరికి వారు బాగా బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అవకాశం దక్కింది. కానీ వీళ్ల టాలెంట్ ని పూర్తిగా వాడుకోవడంలోనే దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ అందరికి సమానంగా రావాలి అనే ప్రయత్నంలో ట్రాక్ కొద్దిగా తప్పడం సెకండ్ హాఫ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అందరిలోకి ఎవరు బాగా చేసారు అంటే చెప్పటం కష్టమే. సుధీర్ బాబు ఆ పాత్రకు సరిపోయాడు కాని సందీప్ కిషన్, నారా రోహిత్ పాత్రలతో పోలిస్తే అతని స్పాన్ తక్కువే. రాజేంద్ర ప్రసాద్ తన భుజాలపై మోయడానికి మాగ్జిమం ట్రై చేసాడు. అంతవరకు మెచ్చుకోవచ్చు. హీరొయిన్లు కైరా దత్, అనన్య సోని, చాందిని జస్ట్ గ్లామర్ డోస్ కోసమే కానీ నటనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదు. సుమన్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో ఆశ్చర్యపరుస్తాడు. ఇతని పాత్రే కీలకం. తనికెళ్ల భరణి, బెనర్జీ, ఇంద్రజ, హేమ, కృష్ణతేజ అవసరమైనప్పుడు వచ్చి అనవసరం అనేది లేకుండా మేనేజ్ చేసారు. సాంకేతికవర్గం నలుగురు యువకులను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి కథను తయారు చేసుకున్నాడు. మొదట్లో ట్రైలర్ లో చూపించినట్టే సినిమా కథ మొత్తం శమంతకమణి కారు చుట్టూనే ఉంటుంది. సినిమా మొదలై ఎండ్ వరకు కారునే ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రైమ్ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ అనుకున్నాడు. అయితే మనకు ట్రైలర్ లో కనిపించిన క్యూరియాసిటీ సినిమాలో కనబడదు. ఒక కారు ఎంతో విలువైంది కాబట్టే దాన్ని దొంగలు కొట్టెయ్యడంం. దాన్ని పోలీస్ లు కనిపెట్టడం వంటిది ఎన్నో సినిమాల్లో వచ్చేసింది. కథ పరంగా కొత్తగా శమంతకమణిలో మనకేం కనబడదు. అసలు కారు చుట్టూ కథను అల్లినపుడు కారు గురించి ప్రేక్షకులకు ఎటువంటి థ్రిల్లింగ్ కలగదు. అసలా కారు స్పెషాలిటీ ఏమిటనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.ఇక మ్యూజిక్ విషయానికొస్తే మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సీన్స్ కి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు విషయంలో కాస్త అసంతృప్తే కనబడుతుంది. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఆ నలుగురి నమ్మకమే ఈ విజయం!
‘‘కెరీర్ స్టార్టింగ్‌లో హీరోగా ట్రై చేద్దామనుకున్నా. కానీ, కెమెరా వెనకాల డైరెక్టర్‌గా ఉండటమే బాగుందనిపించింది. అందుకే ప్రస్తుతానికి డైరెక్టర్‌గానే ఉందామని డిసైడ్ అయ్యా’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శమంతకమణి’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉందంటోన్న శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా ‘భలే మంచిరోజు’ కన్నా ముందే ఈ చిత్రకథ రాశా. ఫస్ట్ సినిమాకి నలుగురు హీరోలంటే కష్టం కదా! ‘భలే మంచిరోజు’ తర్వాత నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్‌లను కలిశా. నలుగురికీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఓపెనింగ్ సీన్, ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్... ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు నెరేట్ చేశాను. అప్పుడు నలుగురికీ పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ నలుగురి నమ్మకమే ఈ రోజు ‘శమంతకమణి’ విజయం. రాజేంద్ర ప్రసాద్‌గారు చేసిన పాత్ర మాకు చాలా ఫ్లస్ పాయింట్. నలుగురు హీరోలను హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ డే భయపడ్డాను. క్లైమాక్స్ సీన్లో నలుగురితో పాటు రాజేంద్రప్రసాద్‌గారు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఆ సీన్ బాగా రావాలని కోరుకున్నాను. సినిమాకు మౌత్ టాక్ బాగుంది. నాకు తెలియనివాళ్లు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఐయామ్ హ్యాపీ. మరో రెండేళ్లపాటు క్రైమ్ కామెడీ సినిమాలు చేయకూడదనుకుంటున్నా’’ అన్నారు. -
కొన్నాళ్ల పాటు మల్టీస్టారర్స్ చేయను!
‘‘ఇప్పటివరకూ నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఏదీ ప్లాన్ చేసుకుని చేయలేదు. కానీ, ఈ సిన్మా తర్వాత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు సందీప్ కిషన్. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ రేపు విడుదలవుతోంది. సందీప్ చెప్పిన సంగతులు... ♦ ఇందులో లవ్‌లో ఫెయిలైన కోటిపల్లి శివ అనే యువకుడి పాత్ర చేశా. ఓ పల్లెటూరిలో థియేటర్ నడిపే శివకు, కారుకు సంబంధం ఏంటనేది తెరపైనే చూడాలి. కొన్నిసార్లు పాత్రలు బాగున్నా... సినిమా అంతా ఉండవు. కానీ, ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. శివ పాత్ర అలాంటిదే. ఇందులో ఊర మాస్ సీనుంది. లుంగీ కట్టుకుంటే సీన్ బాగుంటుందని నేనూ, దర్శకుడు డిస్కస్ చేసుకుని ఈ లుక్ డిజైన్ చేశాం. ♦ శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమా ‘భలే మంచిరోజు’ టేకింగ్ నాకు బాగా నచ్చింది. మనిషిగానూ నచ్చాడు. నలుగురు హీరోలం శ్రీరామ్ ఆదిత్యను కలసినప్పుడు చాలా సింపుల్‌గా కథ చెప్పాడు. అందరికీ ఎగై్జటింగ్‌గా అనిపించి ఓకే చేశాం. ఆదితో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటే ఇప్పటికి కుదిరింది. సుధీర్ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో రోహిత్ బాగా క్లోజ్ అయ్యాడు. ఒకరి పాత్రతో మరొకరి పాత్రకు పోలిక ఉండదు. ఇందులో రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు మల్టీస్టారర్స్ చేయకూడదనుకుంటున్నా. ♦ ‘నక్షత్రం’ త్వరలోనే విడుదలవుతుంది. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తెలుగులో కునాల్ కోహ్లీ దర్శకత్వంలో నేను, తమన్నా జంటగా ఓ సినిమా, మంజులగారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ రెండూ కాకుండా తెలుగు, తమిళ భాషల్లో సుసీంద్రన్ దర్శకత్వంలో ‘నా పేరు శివ’కు సీక్వెల్‌గా ‘కేరాఫ్ సూర్య’, తమిళ హిట్ ‘డీ–16’ దర్శకుడు కార్తీక్ నరేన్‌తో ‘నరకాసురుడు’ చేస్తున్నా. ♦ నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్. ‘నరకాసురుడు’కి ముందు తననే అడిగారట. తనెందుకు చేయలేదో నాకు తెలీదు. దర్శకుణ్ణి కూడా నేనింతవరకు అడగలేదు. వరుసగా మంచి దర్శకులతో పనిచేసే అవకాశాలు వస్తుండడం హ్యాపీ. వినోదం పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నా. -
అదే డ్రస్‌లో మరోసారి..!
బాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నారా రోహిత్ తొలి సినిమాలోనే పోలీస్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత రౌడీఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవారు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించాడు రోహిత్. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న శమంతకమణి సినిమా కోసం ఐదో సారి అదే పాత్ర చేశాడు. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రోహిత్. ఇప్పటికే ఐదు సార్లు పోలీస్ పాత్రల్లో కనిపించిన యంగ్ హీరో నారా రోహిత్ మరోసారి అదే పాత్రకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మల్టీ స్టారర్ సినిమా వీరభోగవసంత రాయలు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడట. సుధీర్ బాబు, శ్రీవిష్ణులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరభోగవసంత రాయలు తో పాటు పంగలా వచ్చాడు, నీది నాది ప్రేమ సినిమాలు పూర్తి కావచ్చాయి. పవన్ మల్లెల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీద ఉంది. సావిత్ర ఫేం పవన్ సాధినేనితో ఒక సినిమా, బాణం ఫేం చైతన్య దంతులూరితో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. -
అదంత ఈజీ కాదు!
‘‘ఈ కథ మిస్సయితే మంచి సినిమా మిస్సయినట్లే అనిపిస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఆ సినిమా ఒప్పేసుకుంటా. స్క్రిప్ట్ ఎగై్జటింగ్‌గా ఉంటే మళ్ళీ మల్టీస్టారర్ చేయడానికి కూడా రెడీయే’’ అన్నారు నారా రోహిత్. సందీప్‌కిషన్, నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శమంతకమణి’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర చేశారు. వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. నారా రోహిత్ చెప్పిన విశేషాలు. ♦ నలుగురు హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ స్క్రిప్ట్‌లో ఎవరి ఇంపార్టెన్స్ వారికి ఉంది. ఇందులో పోలీసాఫీసర్ రంజిత్ కుమార్‌గా చేశా. రంజిత్ ‘క్రాకీ’. ఎప్పుడెలా ఉంటాడో ఎవరికి తెలీదు. జోకులేస్తాడు. నవ్వేలోపు సీరియస్ అవుతాడు. ♦ ‘భలే æమంచిరోజు’ తర్వాత శ్రీరామ్ ఆదిత్య చేసిన సినిమా ఇది. రెండో సినిమానే 37 రోజుల్లో కంప్లీట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. బ్రిలియంట్ స్క్రిప్ట్ రాసుకోవడంతో పాటు పక్కా క్లారిటీగా తీశాడు. సినిమాలో నా కో–స్టార్స్ డామినేట్ చేస్తారని భయపడను. నా రోల్‌కి న్యాయం చేస్తానా? లేదా అని భయపడుతుంటాను. ఒకవేళ భయపడి ఉంటే ‘ప్రతినిధి’ సినిమాలో కోటాగారిలాంటి సీనియర్ యాక్టర్‌తో నటించేవాణ్ణి కాదు. ♦ నిజానికి ఇంకో పాత్రకోసం తగ్గుతుంటే ఈ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ 25న నా బర్త్‌డే. ఆ రోజు నా అప్‌కమింగ్ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నాం. టైటిల్ కూడా డిఫరెంట్‌గా, ఎగై్జటింగ్‌గా ఉంటుంది. దీనికి పవన్ మల్లెల డైరెక్టర్. ఈ సినిమా కోసం 21 కిలోలు బరువు తగ్గా. డిఫరెంట్ డైట్ ఫాలో అయ్యా. ప్రస్తుతం 79 కేజీలు బరువు ఉన్నా. ఇంకో 6 కిలోలు తగ్గాలి. ♦ శమంతకమణి తర్వాత ‘కథలో రాజకుమారి’ విడుదల కానుంది. ‘పండగలా వచ్చాడు’ సినిమాలో నాకు కొంచెం గెటప్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ సినిమా చర్చల దశలో ఉంది. ♦ తెలుగులో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచిదే. ‘నిన్ను కోరి’ సినిమా ఒక ఐదేళ్ల క్రితం వస్తే ఎలా ఉండేదో? ‘కథలో రాజకుమారి’ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాను. ‘బాణం’ చేయడం వల్ల ‘అసుర, ప్రతినిధి’ లాంటి సినిమాలు వచ్చాయి. ♦ ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ షో చేయడం ఆనందంగా ఉంది. నాకు హోస్ట్ చేయాలని లేదు. ప్రజెంట్ కాన్సెన్ట్రేషన్ అంతా సినిమాలపైనే ఉంది. -
నారావారబ్బాయి న్యూ లుక్
సక్సెస్‌ల పరంగా ఆకట్టుకోలేకపోయినా స్టోరి సెలక్షన్లో బెస్ట్ అనిపించుకున్న యంగ్ హీరో నారా రోహిత్. వరుసగా 'ప్రతినిథి', 'రౌడీఫెలో', 'అసుర', 'జ్యో అచ్యుతానంద', 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలతో మంచి విజయాలు సాధించిన నారారోహిత్, లుక్ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో బాగా బొద్దుగా కనిపించిన రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు. తన నెక్ట్స్ సినిమాతో అభిమానులకు అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పవన్ మల్లెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం నారా రోహిత్ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే 21 కిలోల బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయినా రోహిత్ మరో 5 కిలోలు తగ్గటమే తన టార్గెట్ అంటున్నాడు. త్వరలో రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన రమ్యకృష్ణ, మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్, రెజినా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర అంతేకీలకమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నారా రోహిత్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. నారా రోహిత్ పుట్టిన రోజైన జూలై 25న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేశ్ సినిమాలో ఒక్క ఫ్రేములో కనిపించినా చాలు!
‘‘నా కెరీర్ ‘భలే మంచిరోజు, బాఘీ’ సినిమాల తర్వాత పీక్స్‌లో ఉంది. ఈ టైమ్‌లో మల్టీస్టారర్ ఎందుకు? సోలో హీరోగా చేస్తే మంచి రీచ్ ఉంటుందేమో! అని ఆలోచించా. గతంలో విన్న మల్టీస్టారర్ కథలు నచ్చలేదు. అందువల్ల, శ్రీరామ్ ఆదిత్య ఈ కథ చెబుతానంటే అయిష్టంగా వినేసి ‘నో’ చెబుదామనుకున్నా. కానీ, కథ విన్నాక ‘యస్’ అనేశా’’ అన్నారు సుధీర్‌బాబు. ఆయనతో పాటు నారా రోహిత్, సందీప్‌కిషన్, ఆదీ సాయికుమార్ హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘భవ్య’ ఆనంద ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలవుతోంది. సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు.. ∙శ్రీరామ్ ఆదిత్య లైఫ్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన చిత్రమిది. ఇందులో ‘అమ్మ ప్రేమ తెలీకుండా పెరిగిన కుర్రాడి’గా నేను చేసిన పాత్ర మా అమ్మను నాకు పరిచయం చేసింది. రియల్ లైఫ్‌లో మా అమ్మ పుట్టిన వెంటనే అమ్మమ్మ చనిపోయారు. అందువల్ల, తల్లి ప్రేమ లేకుండానే మా అమ్మ పెరిగారు. ఈ పాత్ర చేస్తున్నంత సేపూ ‘తల్లి ప్రేమ తెలీకుండానే అమ్మ నన్నెంత ప్రేమగా పెంచింది’ అని ఆలోచించా. ∙ఇప్పుడు రోహిత్‌తో ‘వీరభోగ వసంతరాయులు’ అనే సినిమా చేస్తున్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్, రాజా దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించా. గోపీచంద్ బయోపిక్ కోసం ఏడెనిమిది కిలోలు బరువు తగ్గాలి. మూడు కిలోలు తగ్గాను. ∙‘మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా చేస్తారా?’ అని అడగ్గా... ‘‘భాఘీ’ తర్వా చాలామంది విలన్ రోల్స్ ఆఫర్ చేసినా, నచ్చక చేయలేదు. మహేశ్ సినిమాలో విలన్‌గా ఏంటి? చిన్న ఫ్రేములో కనిపించినా చాలు’’ అన్నారు. -
అందుకే నాన్నగారి పేరు పెట్టుకున్నా!
‘‘వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాననిపించింది. వైవిధ్యమైన పాత్రలు చేద్దామని చాలా కథలు విన్నా. ఆ ప్రాసెస్‌లో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం తర్వాత గ్యాప్ వచ్చింది’’ అని హీరో ఆదీ సాయికుమార్ అన్నారు. ఆదీ సాయికుమార్, నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు హీరోలుగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శమంతకమణి’. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఆది చెప్పిన విశేషాలు. ⇒ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రకథ చెబుతానన్నప్పుడు నలుగురు హీరోలు.. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుందా? అనుకున్నా. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్ ఆల్రెడీ ఫిక్స్. భవ్య క్రియేషన్స్ మంచి సంస్థ. ఇంత మంది కలిసి చేస్తున్నారంటే నాకు నమ్మకం వచ్చి, కథ విన్నా. పాత్ర బాగా నచ్చి ఓకే చెప్పేశా. ⇒ ‘శమంతకమణి’లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. శ్రీరామ్ కథ రెడీ చేసుకున్నప్పుడే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఎలా ఉండాలో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అంత క్లారిటీతో కథ తయారు చేశాడు. సినిమాలో రోల్స్ రాయిస్ కారు పేరు ‘శమంతకమణి’. ఆ కారుకీ, కథకీ, మాకు సంబంధం ఏంటన్నది తెరపైనే చూడాలి. ⇒ ఈ సినిమాలో అందరి పాత్రలూ సమానంగా ఉంటాయి. ఈ చిత్రంలో పాటలున్నా డ్యాన్స్‌లు ఉండవు. సందర్భాన్ని బట్టి వస్తుంటాయి. ∙నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్.. ఇలా అందరికీ రెండు పేర్లున్నాయి. ఆది అంటే ఒకే పేరుంది.. ఏదైనా యాడ్ చేద్దామన్నారు దర్శకుడు. అందుకే నాన్నగారి పేరు (సాయికుమార్) పెట్టుకున్నా. ఆదీ సాయికుమార్ అని ఉంచాలా? వద్దా? అన్నది శమంతకమణి’ రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతా. ⇒ ప్రస్తుతం ప్రభాకర్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. రెండు మూడు కథలు వింటున్నా. సొంత ప్రొడక్షన్లో మరో సినిమా చేద్దామని నాన్నగారు అన్నారు. నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల కొద్ది రోజులు ఆగుదామన్నా. -
కారు... కిరికిరి... కితకితలు!
శమంతకమణి... ఇదేదో పురాణాల్లో కథ కాదు! పాత సినిమాల్లో ఐటమ్ సాంగో లేదంటే అమ్మాయి పేరో అంత కన్నా కాదు. మరేంటి? అంటే... ఓ కారు! సదరు కారుతో నలుగురు కుర్రాళ్ల జీవితాలు ఏ విధంగా ముడి పడ్డాయనే కథతో రూపొందిన సినిమా ‘శమంతకమణి’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఎవరూ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగుతుందీ సినిమా. జూలై 14న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్‌గా నారా రోహిత్, కృష్ణగా సుధీర్‌బాబు, కార్తీక్‌గా ఆది, ‘కోటిపల్లి’ శివగా సందీప్ కిషన్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారి. వీళ్ల మధ్య సంబంధం ఏంటి? ఎలా కలుసుకున్నారు? అనే అంశాలతో పాటు వీళ్ల మధ్య సీన్లు ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటాయి. ఇక, కారు కిరికిరి ఏంటనేది తెరపై చూడాలి’’ అన్నారు. చాందినీ చౌదరి, జెన్నీ, హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
'శమంతక మణి' వర్కింగ్ స్టిల్స్
-
ఎన్టీఆర్‌తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..?
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్, ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్, కథా కథనాలు సిద్ధం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జై లవ కుశ షూటింగ్ తరువాత బిగ్ బాస్ తెలుగు షో షూటింగ్ కోసం కొంత కాలం ముంబైలోనే ఉండనున్నాడు జూనియర్. -
నలుగురు హీరోలు.. నాలుగు నెలల్లో పూర్తి!
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన చిత్రమిది. క్యారెక్టర్ బాగా నచ్చడంతోనే ఈ సినిమా చేశా. నలుగురు హీరోలను ఒక తాటి మీదకు తీసుకొచ్చారు ఆనంద్ ప్రసాద్‌గారు. ‘బాణం, సోలో’ చిత్రాల తర్వాత మణిశర్మ సంగీతంలో చేశాను’’ అన్నారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉండే కథ ఇది. ఈ చిత్రంలో తల్లిని కోల్పోయిన కొడుకు పాత్ర చేశా. నలుగురు హీరోలతో సినిమా చేయడం ఇబ్బంది అనుకుంటున్న ఈ తరుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘనత ‘శమంతకమణి’ టీమ్‌ది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘కార్తిక్ అనే లవబుల్ పాత్ర చేశా. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదరడంతో నాలుగు నెలల్లోనే పూర్తి చేయగలిగాం’’ అన్నారు ఆది. ‘‘శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ కథతో ఈ సినిమా తీశారు. ఈ మల్టీస్టారర్ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. జూలై 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలూ నాకు చాలా సపోర్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్, సుమన్, తనికెళ్ల భరణి, మణిశర్మ వంటి సీనియర్లతో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్యా సోని, జెన్ని తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ. -
శమంతకమణా.. ఆవిడెవరు సార్..!
యంగ్ హీరోస్ నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుదీర్ బాబులు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి. గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు యంగ్ హీరోస్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ పోస్టర్ లో మరింత హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ తో మరోసారి ఆకట్టుకుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మెకానిక్ మహేష్ బాబుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాపై మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
జూన్ 30న 'కథలో రాజకుమారి'
డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా కథలో రాజకుమారి. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అరకు ప్రాంతంలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా రెండు పాటలకు సంగీతమందించగా.. 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఫేం విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలకు మ్యూజిక్ చేశాడు. త్వరలో ఈ సినిమా ఆడియోను అరన్ మ్యూజిక్ ద్వారా మర్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో నారా రోహిత్ నటిస్తుండగా మరో యంగ్ హీరో నాగశౌర్య ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. వీరి ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 30న సినిమాలను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. -
నా స్వార్థంతో ఈ సినిమా చేశా
‘‘నేనిప్పటి వరకూ పలు వైవిధ్యమైన పాత్రలు చేశా. ‘కథలో రాజకుమారి’ కథ రాసిన విధానం కొత్తగా ఉంది. లైన్ వినగానే ఎగ్జయిట్ అయ్యా. పదిహేను నిమిషాల పాత్ర కోసం గడ్డం కూడా పెంచా’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య పాత్రల్లో మహేశ్ సూరపనేని దర్శకత్వంలో సౌందర్య నారా, ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘కథలో రాజకుమారి’ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘నాగశౌర్య అడిగి మరీ ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు. ఇళయరాజాగారు కొన్ని పాటలు కంపోజ్ చేశారు. విశాల్ కూడా మంచి మ్యూజిక్ అందించారు’’ అన్నారు. ‘‘న్యూ ఏజ్ ఎమోషన్లో సాగే ప్రేమకథా చిత్రమిది. పరుచూరి వెంకటేశ్వరరావుగారు మాకు స్క్రిప్ట్ విషయంలో సపోర్ట్ చేశారు’’ అన్నారు దర్శకుడు మహేశ్. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘జ్యో అచ్యుతానంద’ తర్వాత నేను, రోహిత్‌గారు కలిసి నటిస్తే బావుంటుందని ఈ సినిమాలో నేను కూడా నటిస్తానని చెప్పా. నా స్వార్థం కోసం ఈ సినిమా చేశా. అవుట్‌పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యా’’ అన్నారు. -
హీరోలు... విలన్లు ఉండరు!
నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ ఇద్దరితో పాటు శ్రియ, సత్యదేవ్ కలసి నటించనున్న మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే సమర్పణలో అప్పారావు బెల్లన నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్. ఇంద్రసేన దర్శకునిగా పరిచయం కానున్నారు. మే రెండో వారంలో చిత్రీకరణ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన నాకు మంచి మిత్రుడు. కథ చెప్పగానే మైండ్ బ్లో అయింది. కథ విన్న వెంటనే నారా రోహిత్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రియాగారు, సత్యదేవ్ స్టోరీ విని ఎగై్జట్ అయ్యారు. ఈ నలుగురి పాత్రలను ఇంద్రసేన చక్కగా తీర్చిదిద్దాడు’’ అన్నారు. ‘‘సమాజంలో జరిగే విభిన్న కోణాలను టచ్ చేసే మల్టీస్టారర్ స్టోరీ ఇది. పాత్రలు తప్ప సినిమాలో హీరోలు.. విలన్లు ఉండరు ’’ అన్నారు ఆర్. ఇంద్రసేన. ఈ చిత్రానికి సంగీతం: సతీష్ రఘునాథన్. -
రిపీట్ అవుతోన్న హిట్ కాంబినేషన్
నారా రోహిత్, శ్రీ విష్ణులది హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే మరోసారి ఈ హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు అసోసియేట్‌గా పనిచేసిన ఇంద్రసేనను దర్శకుడిగా పరిచయంచేస్తూ నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాను మే రెండో వారంలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో కనిపించనుంది. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కు జ్యోతిలక్ష్మి ఫేం సత్యదేవ్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం నారా రోహిత్, శ్రీ విష్ణులు చేస్తున్న ప్రాజెక్ట్స్‌తో పాటు ఈ సినిమాను కూడా ఒకసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
బాణం కాంబినేషన్లో మరో సినిమా
డిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు. తను హీరోగా పరిచయం అయిన తొలి సినిమా.. బాణంను డైరెక్ట్ చేసిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య తరువాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండో ప్రయత్నంగా బ్రహ్మనందం కొడుకు గౌతమ్ హీరోగా తెరకెక్కించిన బసంతి కూడా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్‌గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న చైతన్య, మరోసారి తన తొలి చిత్ర హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రోహిత్ కు పొలిటికల్ థ్రిల్లర్ కథ వినిపించి, ఓకె చేయించుకున్నాడు. ఇప్పటికే కథలో రాజకుమారి, పండగలా వచ్చాడు సినిమాలను పూర్తి చేసిన రోహిత్, పవన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చైతన్య దంతులూరి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు. -
ఫుల్ యాక్షన్
రజనీకాంత్ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించనున్నారట. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఎస్.వి.ఎం.పి. పతాకంపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేయస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్ దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సీనియర్ నటి రమ్యకృష్ణ మా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆమెది’’ అన్నారు. అజయ్, పృధ్వీ, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: యోగానంద్, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: మణిశర్మ. -
నారా రోహిత్ కొత్త సినిమా
-
ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు
అందం, అభినయం రెండూ ఉన్న స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటంలో ఫెయిల్ అవుతున్న హీరోయిన్ రెజీనా. తెలుగులో వరుస అవకాశాలు లేకపోవటంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ భామ, టాలీవుడ్లో ఇంట్రస్టింగ్ రికార్డ్‌కు చేరువైంది. ఈ జనరేషన్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్‌తో మరో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అలాంటి సమయంలో ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. సందీప్‌తో రెజీనాకు ఇది మూడో సినిమా. గతంలో రొటీన్ లవ్ స్టోరి, రా రా కృష్ణయ్య సినిమాలో కలిసి నటించిన ఈ జోడికి తెలుగులో ఇది మూడో సినిమా. నక్షత్రం సినిమాలోనే మరో యంగ్ హీరోతో కూడా మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో యంగ్ హీరోతో కూడా హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతోంది రెజీనా. ఇటీవల జ్యో అచ్యుతానంద సినిమాతో నారా రోహిత్ సరసన హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ సాధించింది. అంతకు ముందే ఇదే కాంబినేషన్లో శంకర అనే సినిమాలో వీరు కలిసి నటించినా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి రోహిత్‌తో జోడి కట్టేందుకు రెడీ అవుతోంది. పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. -
ధైర్యంగా సినిమా తీసినందుకు అభినందనలు – రోజా
‘‘ఓ మంచి కథను నమ్మి, ధైర్యంగా సినిమా తీసిన ప్రకాశ్రావుగారికి అభినందనలు. డైరెక్టర్ టేకింగ్ గొప్పగా ఉంది. శ్రీ విష్ణు చక్కగా నటించడంతో పాటు డ్యాన్సులు బాగా చేశాడు. ఈ సినిమా విజయవంతమై, ఇదే యూనిట్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అని రోజా అన్నారు. శ్రీ విష్ణు, చిత్రా శుక్లా జంటగా కుమార్ వట్టి దర్శకత్వంలో బేబి సాక్షి సమర్పణలో బలగం ప్రకాశ్‌రావు నిర్మిస్తోన్న చిత్రం ‘మా అబ్బాయి’. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా పాటల సీడీలను హీరోలు నారా రోహిత్, నాగశౌర్య విడుదల చేశారు. రోజా, నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు విరించి వర్మ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళంలో పుట్టిన నేను ఈ రోజు సినిమా నిర్మించడం ద్వారా ఏదో సాధించానని అనుకుంటున్నా. దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయగలుగుతాడా? అనిపించింది. కానీ, వట్టి కుమార్ కాదు.. తాను గట్టి కుమార్ అని నిరూపించుకున్నాడు’’ అని నిర్మాత అన్నారు. ‘‘మార్తాండ్ కె.వెంకటేశ్‌గారి వద్ద ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నా. ‘మా అబ్బాయి’ పాత్రకు వేరే ఎవరూ సరిపోరనేలా శ్రీవిష్ణు నటించాడు’’ అన్నారు దర్శకుడు. శ్రీవిష్ణు, మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిర్మాత సాయి కొర్రపాటి, ఐజీ ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు హీరోలతో సినిమా అసాధ్యం అన్నారు
‘భలే మంచి రోజు’ వంటి హిట్ చిత్రం తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య టాలీవుడ్లో ఓ సంచలనానికి తెరలేపారు. ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ మూవీ తీసేందుకే కొందరు దర్శకులు ఆలోచిస్తుంటే, ఏకంగా నలుగురు హీరోలతో పాటు, ఓ సీనియర్ నటుడితో మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా, డా. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్రలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్ ఇచ్చారు. నటుడు రాజేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆనంద్ ప్రసాద్‌గారితో ‘అమ్మాయి నవ్వితే’ సినిమా చేశా. నలుగురు హీరోలున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో నేను కీలకపాత్ర చేస్తున్నా. మేమంతా కలిసి చేస్తున్న ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఫేస్బుక్లో ఉద్యోగం చేసే టైమ్‌లో రాసుకున్న తొలి కథ ఇది. ఈ కథ చాలామందికి వినిపించా. ‘నలుగురు హీరోలు కలిసి తెలుగులో సినిమా ఎక్కడ చేస్తారు.. ఇది అసాధ్యం’? అన్నారందరూ. ఈ కథ వినగానే ఆనంద్ ప్రసాద్‌గారు ఎగ్జయిట్ అయ్యి, మనం సినిమా చేద్దామన్నారు. ఇంత మంది హీరోలు తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. భారీ మల్టీస్టారర్ చిత్రాలకు మా సినిమా నాంది పలుకుతుంది’’ అన్నారు. ‘‘మార్చి మొదటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని ఆనంద్ ప్రసాద్ తెలిపారు. -
నలుగురు హీరోలతో మల్టీ స్టారర్
టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు, ఆదిలు కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట. సుదీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్‌ను రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ భారీ మల్టీ స్టారర్లో నటించేందుకు నలుగురు హీరోలు ఒకే చెప్పేశారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
చిన్న సినిమాలే ఊపిరి
‘‘రెండేళ్ల కిందట మన సినిమాలు చూస్తే చాలా బాధేసింది. ఇతర భాషల సినిమా వాళ్లు కొత్త క్రియేటివిటీతో ముందుకెళుతుంటే మనం ఎక్క డున్నాం? అని మూడేళ్లుగా నాకు అనిపించింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూశాను. నచ్చింది. నారా రోహిత్ ఇతర హీరోలకు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. శ్రీవిష్ణు నటన బాగుంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో సాగర్.కె చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్‌మీట్‌లో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలంటే కమర్షియల్. వాటి గురించి మాట్లాడటం అనవసరం. ఎప్పుడూ చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ఊపిరి. సినిమా రివ్యూలు, రేటింగుల మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకుని బాధ్యతతో రాయాలి. ఓవర్సీస్లో వీటి ప్రభావం ఉంటుంది. నిజాయతీ రివ్యూలు ఇచ్చేందుకు ‘గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్’ అని ఆరుగురితో టీమ్‌ను ఏడాదిలోపే ఏర్పాటు చేయా లనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘కథపై మేం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. మరో 100 థియేటర్లను పెంచుతున్నాం’’ అని నారా రోహిత్ అన్నారు. దర్శక, నిర్మాతలు, శ్రీవిష్ణు, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆ సినిమా కోసం తగ్గుతున్నా!
‘‘నారా రోహిత్ బాగా చేశాడనే ప్రశంసల కన్నా సినిమా బాగుందంటే చాలు. ఎక్కువ సంతోషపడతా. కథ నచ్చితే నా పాత్ర నిడివి గురించి ఆలోచించను’’ అన్నారు నారా రోహిత్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. గత ఏడాది డిసెంబర్ 31న విడుదలైన ఈ సినిమా గురించి రోహిత్ చెప్పిన సంగతులు... ► మూడేళ్లు ఈ కథపై వర్క్ చేశాం. ఈ సినిమాలోని ఇంతి యాజ్ అలీ తరహా పాత్ర మళ్లీ రావడం కష్టమే. అందుకే లెంగ్త్ తక్కువైనా ఆ పాత్ర చేశా. నాకు హీరోయిన్ పెట్టాలా? వద్దా? అని ఆలోచించి 3 నెలలు షూటింగ్ పక్కన పెట్టాం. కథ ప్రకారం హీరోయిన్ లేకపోతేనే బాగుంది. అలాగే, మొదటి నుంచి రైల్వేరాజుగా శ్రీవిష్ణు సెట్ అవుతాడనుకున్నా. మా క్యారెక్టర్లకి మంచి పేరుతో పాటు సినిమా హిట్ కావడం హ్యాపీ. ఈ సినిమాతో నిర్మాతగా మారడంతో ఈ హిట్ మరింత హ్యాపీనిచ్చింది. ► గత ఏడాది నా తప్పులేంటో నేను తెలుసుకున్నా. ముఖ్యంగా ఓ సినిమా రిలీజైన తర్వాతే తదుపరి సినిమా లుక్, టైటిల్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఒకేసారి ఎక్కువ సినిమాలు ప్రకటించి లుక్స్ రిలీజ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతోంది. మళ్లీ అటువంటి తప్పు చేయను. ప్రస్తుతం చేస్తున్న ‘కథలో రాజకుమారి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా. ► ఫిబ్రవరిలో పవన్ మల్లాలని దర్శకునిగా పరిచయం చేస్తూ నటించబోయే కమర్షియల్ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం సన్నబడాలని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నా. శ్రీవిష్ణు హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా నిర్మిస్తున్నా. -
చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!
మీడియం బడ్జెట్‌తో చిన్న సినిమాగా తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు'.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాసిటివ్ మౌత్‌టాక్ రావడం, మంచి రివ్యూలు వెలువడటంతో పరిమితమైన థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు రూ. 20 కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశముందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వచ్చేవారం ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బిగ్ సినిమాలు వస్తుండటంతో కలెక్షన్లు తగ్గవచ్చునని భావిస్తున్నారు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర తన రెండో సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు' మంచి ఆదరణ పొందుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీ విష్ణు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ
టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు జానర్ : పీరియాడిక్ యాక్షన్ డ్రామా తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను, సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సాగర్ కె చంద్ర నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్ కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే యంగ్ హీరో నారా రోహిత్, తానే సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సినిమా తనకు రీలాంచ్ లాంటిదంటూ ప్రకటించిన రోహిత్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తన గత చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు మరో హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు నారా రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిందా..? కథ : 1990లలో జరిగే కథ అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు (శ్రీ విష్ణు)... అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైన రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటాడు. అదే కాలనీలో ఉండే నిత్యా (తాన్యా హోపె)తో ప్రేమలో ఉంటాడు. ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తను నమ్మిన ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకాడని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. రైల్వే రాజు అక్క, అహల్య కాలేజీ రోజుల్లో సవ్యసాఛి అనే నక్సలైట్‌ను ప్రేమించి దళంలోకి వెళ్లిపోతుంది. దళంలో యాక్టివ్‌గా పనిచేసే అహల్య వివరాలు తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ, రైల్వే రాజును పిలిపించి ఇంటరాగేట్ చేస్తాడు. తన అక్క ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. రాజుకు రంజీ టీంలో క్రికెట్ ఆడే అవకాశం దక్కకుండా చేస్తాడు. అదే సమయంలో తను ప్రేమించిన నిత్యాను ఎత్తుకెళ్లిన భగవాన్ దాస్ అనే రౌడీతో గొడవపడిన రాజు ఆ రౌడీని చంపి, అరెస్ట్ అవుతాడు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజు జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. దళంలో పనిచేసే అక్క చనిపోతుంది. ఆ విషయం తెలిసి రాజు తల్లి కూడా చనిపోతుంది. ఇలా తనకు ఇష్టమైనవన్ని ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో వీటన్నింటికీ కారణమైన ఇంతియాజ్ అలీ మీద కోపం పెంచుకుంటాడు రాజు. అదే సమయంలో ఓ ఇండస్ట్రియలిస్ట్ తన అవసరాల కోసం రాజుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువస్తాడు. తన ఆస్తులకు రాజును బినామీగా మారుస్తాడు. ఆ ఇండస్ట్రీయిలిస్ట్ అండతో రాజు ఎన్నో చీకటి వ్యాపారాలు, దందాలు మొదలుపెడతాడు. ప్రేమించిన నిత్యాను పెళ్లి చేసుకుంటాడు. తన జీవితం కష్టాలపాలవ్వడానికి కారణమైన ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేయించి, ఇక జీవితంలో నీ ఒంటి మీదకు పోలీస్ డ్రెస్ రానివ్వనని ఛాలెంజ్ చేస్తాడు. ఒక్కొక్కటిగా రాజు ఆగడాలు ఎక్కువవుతాయి. తనకు అడ్డొచ్చిన వారిని చంపటం బెదిరించటంతో పాటు రియల్ ఎస్టేట్, హవాలా లాంటి వ్యాపారాలతో చాలా డబ్బు సంపాదిస్తాడు. అంతే కాదు దేశాన్నే కుదిపేసే స్టాంప్ పేపర్ల స్కాంలోనూ భాగస్వామి అవుతాడు. దీంతో రాజు ఆటకట్టించడానికి ఇంతియాజ్ అలీనే కరెక్ట్ అని భావించిన పోలీస్ డిపార్టెమెంట్, రాజును వేటాడటానికి ఇంతియాజ్‌కు పోస్టింగ్ ఇస్తుంది. తిరిగి డ్యూటిలో జాయిన్ అయిన ఇంతియాజ్, రాజు అనుచరలను, వ్యాపారాలను, అన్నింటిని నాశనం చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరిదిపై చేయి అయ్యింది. తప్పుడుదారిలో వెళ్లిన రాజు చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మొదట నుంచి ఇది నారా రోహిత్ సినిమాగా ప్రచారం జరిగినా.. కథ అంతా శ్రీవిష్ణు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రోహిత్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్, బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక శ్రీ విష్ణు తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. లక్ష్యం కోసం ప్రయత్నించే అమాయకుడైన కుర్రాడిగా, సమాజం మీద ఎదురుతిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌లో శ్రీ విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్గా నటించిన తాన్యా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇతర పాత్రలో బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీనులు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాతో నిర్మాతగానూ మారిన హీరో నారా రోహిత్ తన మార్క్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర, అప్పట్లో ఒకడుండేవాడుతో ఆకట్టుకున్నాడు. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న దర్శకుడు, ఆకట్టుకునే కథనంతో సినిమాను నడిపించాడు. పెద్దగా పాటలు అవసరం లేని కథలో సాయి కార్తీక్ అందించిన పాటలు స్పీడు బ్రేకర్లలా అనిపించాయి. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్, శ్రీ విష్ణు నటన నేపథ్య సంగీతం కథా కథనం మైనస్ పాయింట్స్ : పాటలు తొలి 15 నిమిషాలు స్లో నారేషన్ ఓవరాల్‌గా అప్పట్లో ఒకడుండేవాడు.. 2016కు వీడ్కోలు చెప్పే సక్సెస్ఫుల్ యాక్షన్ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎప్పుడూ అరడజను సినిమాలను లైన్లో రెడీగా ఉంచుతున్నాడు రోహిత్. అంతేకాదు ఒకే ఏడాదిలో నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ పాతతరం నటులను గుర్తుకు తెస్తున్నాడు. ఇన్నాళ్లు హీరోగానే జోరు చూపించిన ఈ యంగ్ హీరో ఇక మీదట నిర్మాణ రంగంలోనూ అదే స్పీడు చూపించాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమాను తన స్నేహితులు కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి తానే స్వయంగా నిర్మించాడు. ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ నిర్మాతగా కొనసాగే ఆలోచనలో ఉన్నాడు ఈ యువ హీరో. కొత్త సంవత్సరంలో తమ అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ మీద మూడు సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాను హీరోగా చేసే సినిమాలనే కాదు ఇతర హీరోల సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. -
డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అని సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది అంటుంటారు. అయితే శ్రీవిష్ణు దీన్నే మరోలా అంటున్నారు. ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ నని! నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య తారలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి పదకొండేళ్లవుతోంది. నాకున్న మొహమాటానికి యాక్టర్ అవుతానని ఊహించలేదు. కానీ, అయ్యాను. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశాన్నే వణికించిన ఐదారు అంశాలు ఇందులో ఉంటాయి. ఒక క్రికెటర్, ఓ పోలీసాఫీసర్ మధ్య జరిగిన కథే ఈ చిత్రం. ఇందులో క్రికెటర్ రైల్వే రాజు పాత్రలో నటించాను. ఉద్యోగం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను నారా రోహిత్ చేసారు. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘నీది నాది ఒకే ప్రేమకథ’ అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నా. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్న ‘మెంటల్ మదిలో’ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. -
‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీ స్టిల్స్
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒకడుండేవాడు`
బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో అలరిస్తున్నాడు. ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నారా రోహిత్ నటించిన మరో విలక్షణ చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా నారారోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
ఈ సారైనా లుక్ మారుస్తాడా..!
కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. స్టార్ ఇమేజ్ కోసం పోటి పడకుండా, డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తొలి నాళ్లలో బాగానే ఉన్నా తరువాత మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. మరీ బొద్దుగా తయారైన రోహిత్, చాలా రోజులుగా లుక్ మారుస్తానని చెపుతున్నా ప్రతీ సినిమాలో లావుగానే దర్శనమిస్తున్నాడు. ఈ మధ్యే ఫిజిక్ మీద దృష్టి పెట్టిన రోహిత్ త్వరలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నారా రోహిత్ జిమ్‌లో చెమటోడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన అప్పట్లో ఒకడుండేవాడుతో పాటు, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కథలో రాజకుమారి సినిమాల్లో కూడా రోహిత్ కాస్త లావుగానే కనిపించే అవకాశం ఉంది. ఆ తరువాత తెరకెక్కబోయే సినిమా కోసమే రోహిత్ న్యూలుక్ ట్రై చేస్తున్నాడట. -
పాతికేళ్ల క్రితం కథతో...
‘‘ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో మా చిత్రం సాగుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కొంత నక్సలిజాన్ని కూడా టచ్ చేశాం. ప్రేమ, వినోదం, యాక్షన్ అన్నీ ఉంటాయి. నారా రోహిత్ సపోర్ట్‌తోనే సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తా. కొత్త తరహా కథతో తెరకెక్కిన చిత్రమిది. నా కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సాయికార్తీక్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి’’ అన్నారు. ‘‘ఈ తరహా చిత్రంలో నేను నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విజయం సాధిస్తే మరికొన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. శ్రీవిష్ణు, తాన్యా హోప్, నటులు సత్య, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్. -
జ్యో అచ్యుతానంద కాంబినేషన్లో మరో సినిమా
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా.. చెప్పుకోదగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న హీరో నారా రోహిత్. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ కోరిక తీర్చిన సినిమా జ్యో అచ్యుతానంద. కమెడియన్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. నారా రోహిత్‌తో పాటు నాగశౌర్య మరో హీరోగా నటించిన జ్యో అచ్యుతనంద సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్, 'కథలో రాజకుమారి' సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ భామ నమితా ప్రమోద్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరోసారి నారా రోహిత్, నాగశౌర్యలు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య చేస్తుంది అతిథి పాత్రేనట. ప్రస్తుతం రోహిత్, నాగశౌర్యల కాంబినేషన్లో రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నారు. -
ఒకరు కాదు... అయిదుగురు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి హీరోలు వెనకాడడం లేదు. కానీ, ఇద్దరు మహా అయితే ముగ్గురు హీరోలు కలసి నటిస్తుంటారు. తాజాగా ఐదుగురు హీరోలతో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. తొలి చిత్రం ‘భలే మంచి రోజు’తో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందట. ఇప్పటికే నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్యలకు కథ వినిపించగా వారు ఓకే అన్నారనీ, మిగిలిన ఇద్దరు హీరోలను ఎంపిక చేసే పనిలో దర్శకుడున్నారని తెలుస్తోంది. ఐదుగురిలో ఒక పెద్ద వయస్సు ఉన్న హీరో కథకి అవసరమట. సో, ఆ హీరోని ఫైనలైజ్ చేసే పని మీద ఉన్నారట. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు భోగట్టా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
క్రేజీ మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నారు
యంగ్ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నారు. అందుకే దర్శకులు కూడా క్రేజీ కాంబినేషన్లలో మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అదే బాటలో భలేమంచి రోజు సినిమా ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే జ్యో అచ్యుతానంద సినిమాలో కలిసి నటించిన నారా రోహిత్, నాగశౌర్యలతో పాటు సందీప్ కిషన్‌లు హీరోలుగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా ఇద్దరు హీరోలు చేసిన మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రాగా, శ్రీరాం ముగ్గరు హీరోలకు సరిపోయే ఇంట్రస్టింగ్ కథను సిద్దం చేశాడట. ఇప్పటికే కథ విన్న నారా రోహిత్, నాగశౌర్య, సందీప్ కిషన్‌లు ఈ ప్రాజెక్ట్‌కు అంగకరించారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో అందరికంటే బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన రోహిత్ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోహిత్, శంకర, అప్పట్లో ఒకడుండే వాడు, పండగలా వచ్చాడు, కథలో రాజకుమారి సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు నారా రోహిత్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రోహిత్, ఈ సారి మరో కొత్త జానర్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. భీముడు పేరుతో హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకుడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
నారా vs నందమూరి
వెండితెర మీద ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు యువ కథనాయకులు బాక్సాఫీస్ ముందు తలపడేందుకు రెడీ అవుతున్నారు. పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. నారా రోహిత్, రెజీనా జంటగా తెరకెక్కిన శంకర సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమాను ఈ సారి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెండితెరపై నారా, నందమూరి హీరోల పోటి తప్పేలా కనిపించటం లేదు. మరి ఈ పోటిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. -
`శంకర` మూవీ స్టిల్స్