
నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. బి. మహేంద్రబాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మాతలు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఎప్పట్నుంచో కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలనుంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రతిసారి నేను ఒక కొత్త తరహా కథతో వస్తానని ప్రేక్షకులు నమ్ముతారు. బట్.. ఈ ఒక్కసారికి నన్ను క్షమిండచండి. ఈ సిన్మా కథ పాతదైనా... కథనం కొత్తగా ఉంటుంది. మణిగారు మంచి సంగీతం ఇచ్చారు. పృథ్వీగారి కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
‘‘ఈ సినిమా ప్రతి విషయంలోనూ రోహిత్ తోడుగా ఉన్నారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు పవన్ మల్లెల. ‘‘సిన్మా చూశా. కామెడీ సూపర్‌గా వర్కౌట్ అయ్యింది. రోహిత్ నటన సూపర్. పవన్ బాగా తెరకెక్కించారు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘రోహిత్ ఫస్ట్‌టైమ్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్టవ్వాలి. కమర్షియల్ హీరోగా నారా రోహిత్‌కు మంచి పునాది పడాలని కోరుకుంటున్నాను. పవన్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఈ వేడుకలో హీరోయిన్ రెజీనా, నటుడు ‘వెన్నెల’ కిశోర్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment