లుక్.. నయా లుక్
నారా రోహిత్ ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ అయ్యారు. అలా కావడం కోసం సన్నబడ్డారు. ఈ మధ్య నారా రోహిత్ కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సన్నబడిపోతానని ప్రూవ్ చేసుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో సన్నబడిన రోహిత్‌ను చూడొచ్చు. ఈరోజు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
పొడవాటి జుత్తు, మెలి తిరిగిన మీసాలు.. సిక్స్‌ప్యాక్ బాడీతో నారా రోహిత్ డిఫరెంట్‌గా కనిపిస్తున్న లుక్ ఇది. ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి. రెజీనా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ డి.యోగానంద్.