Regina
-
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గతేడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అందుకోసం తెలుగునాట ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించారు. కానీ రెజీనాకు ఇక్కడ అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకలేదు. తమిళంలో ఎప్పుడో రిలీజ్ దాంతో తెలుగు రిలీజ్ డేట్ వాయిదాపడింది. తమిళంలో సినిమా అంతగా ఆడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల చేయాలన్న ఆలోచన సైతం విరమించుకున్నారు. ఇకపోతే రెజీనా తమిళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో ఇదివరకే అందుబాటులో ఉంది. ఇన్నాళ్ల తర్వాత సడన్‌గా తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్‌ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు.. ఛాలెంజింగ్ పాత్రలో.. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ రివేంజ్ థ్రిల్లర్ మూవీలో అనంత్ నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్లో సునైన నటించింది. గత సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేసిన సునైన ఇందులో ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించింది. తన భర్త మరణంపై ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే కథ. ఈ సినిమాలో సునైన నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కథలోని మలుపులు ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు హీరోయిన్గా సునైన కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలైంది. కుమార్ వర్సెస్ కుమారీ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 10th క్లాస్ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'పెళ్లికి ముందు ప్రేమ కథ'తో రీఎంట్రీ ఇచ్చింది. రాజరాజచోర మూవీ, చదరంగం, మీట్ క్యూట్ వెబ్ సిరీస్‌లతోనూ మెప్పించిందీ బ్యూటీ. Telugu version of Tamil film #Regina (2023) by @domin_dsilva, ft. @TheSunainaa @AnanthNag24 @actorvivekpra @actor_saideena & @writerbava, now streaming on @PrimeVideoIN.@SathishNair20 @YugabhaarathiYb @telugufilmnagar @yellowbearprod @JungleeMusicSTH pic.twitter.com/LqN8WCOM5I — CinemaRare (@CinemaRareIN) February 22, 2024 చదవండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబట్టి లైట్..', జీవితం చాలా చిన్నది.. -
లక్కీచాన్స్
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్ టాక్. అజిత్ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఈ నెలలో నేనేనా
రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సూర్పనగై’ (తెలుగులో ‘నేనేనా’). కార్తీక్ రాజు దర్శకత్వంలో ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రోడక్షన్ నిర్మించిన చిత్రం ఇది. అక్షరా గౌడ, అలీ ఖాన్ , జై ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. 19వ శతాబ్దంతో పాటు ప్రస్తుత కాలంతో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా రెండు పాత్రలు చేశారు. ఓ పాత్రలో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారట. -
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
హీరోయిన్ సునయన కామెంట్స్.. నచ్చిందే చేస్తానని!
దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ.. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన రెజీనా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కుటుంబం, తమిళ ప్రేక్షకుల నుంచి ప్రేమ, ఆదరణ చాలానే లభించాయి. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెజీనా చిత్రం నా కెరీర్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2018లో నేన ఏం చేయాలన్న దాని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం అనిపిస్తే అదే చేయాలని ఫిక్సయ్యాను. ఆ తర్వాత మంచి ఆలోచనాత్మక సినిమాలని ఎంపిక చేసుకోవడం ప్రారంభించను.' 'ఈ క్రమంలోనే అలా ఎలా నటించడానికి అంగీకరించావని అన్నారు. ఆ సమయంలో చాలా మందికి వెబ్ సీరీస్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందుకే చాలా మంది అటువైపు దృష్టి సారించలేదని, అయితే వెబ్ సీరీస్‌లో నటించడం నాకు నచ్చింది. అందుకే నచ్చింది చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత తమిళంలో సిల్లుక్కరు పట్టి, తెలుగులో రాజరాజ చోళ లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాను. ఈ 'రెజీనా' చిత్రం కూడా అలాంటిదే' అని సునయన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్‌లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్‌తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
చంద్రముఖి సినిమా చూశాక ఒకటి ఫిక్సయ్యా: హీరోయిన్
హీరోయిన్ సునయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెజీనా. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన డోమిన్ టి.సిల్వా ఈ మూవీని తెరకెక్కించారు. ఎలో బీయర్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష నాయర్ నిర్మించి, సంగీతాన్ని అందించారు. భవీ కె.భవన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన రెజీనా చిత్ర టీజర్ మే 30వ తేదీన విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానికరాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాత టి.శివ, చిత్రా లక్ష్మణన్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, శక్తి పిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తివేలన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై సునయన మాట్లాడుతూ.. 2006లో అమ్మానాన్నల మధ్య కూర్చొని టీవీ సీరియల్స్ చూసే చిన్న అమ్మాయినని, అప్పట్లో తనకు నటిగా రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సెలవులకు హైదరాబాద్ వెళ్లినప్పుడు చంద్రముఖి, గజిని చిత్రాలను చూశానని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాది సినీ కథానాయిక అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి, సిన్సియారిటీ, నిజాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతల దగ్గర నుంచి యూనిట్లో ప్రతి ఒక్కరికీ సమైక్యత ఉందని సునయన అన్నారు. చదవండి: ఆదిపురుష్.. మా అదృష్టం: ప్రభాస్ -
రెండు కాలాలతో...
రెజీనా ప్రధానపాత్రలో కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్, నాన్–థియేట్రికల్ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొం దించిన ఫ్యాంటసీ అడ్వంచరస్ థ్రిల్లర్ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తపాత్ర చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
అలా భయపెట్టడం ఇష్టం: రాజమౌళి
‘‘హారర్ జానర్లో రెండు టైప్స్. ఒకటి ఐడియాతో భయపెట్టడం. మరోటి సడన్‌గా ఎవరో వెనకనుంచి రావడం లేదా సౌండ్‌తో భయపెట్టడం. నాకు ఐడియాతో భయపెట్టడం ఇష్టం. ‘అన్యా’స్ ట్యుటోరియల్ చూసినవారు ఎందుకు మాయం అవుతున్నారనే ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది. పల్లవి, సౌమ్యల ఫ్రెష్ వర్క్, కొత్త ఐడియాలజీ, ఉత్సాహం బాగున్నాయి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ‘‘అన్యా’స్ ట్యుటోరియల్’ కథను నిర్మాత అల్లు అరవింద్‌గారికి చెప్పాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్‌ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్‌కు ఓ సీక్రెట్ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్‌తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ. -
స్పెషల్ సాంగ్స్‌తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు..
కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్... మధ్య మధ్యలో ఫైట్స్.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్.. జిల్.. జిగేల్మనే స్పెషల్ సాంగ్ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్... ఇయర్ ఫీస్ట్... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?' సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా తన కెరీర్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్లానో, ఐటమ్ సాంగ్లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘బోళా శంకర్’ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్‌ల లెక్క ఫస్ట్ టైమ్ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్: చాప్టర్ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు. చదవండి: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది.. తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్‌గా మాస్ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు. ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ సాంగ్స్‌లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది. -
దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?
రెజీనా: కెనడాలోని 1899 నుంచి 1997 వరకు నడిచిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో 751 మంది గుర్తు తెలియని పిల్లల సమాధులు కనుగొన్నారు. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఇక ప్రస్తుత ఘటన జరిగిన ప్రాంతం సస్కట్చేవాన్ రాజధాని రెజీనాకు తూర్పున 87 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ఘటనపై కౌసెస్ చీఫ్ కాడ్ముస్న్ డెల్మోర్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలను నిర్వహిస్తున్న రోమన్ కాథలిక్ చర్చి అక్కడ ఆనవాళ్లు తెలియకుండా గుర్తులను తొలగించింది. దీన్ని నేరంగా భావిస్తున్నాం. ఇది ఓ విధంగా దేశంపై దాడి చేయడం వంటిది. ఇక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలను పూడ్చి పెట్టారో.. వాటన్నింటిని తెలుసుకునే వరకు అన్వేషణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని’ పేర్కొన్నారు. ఇలా వెలుగులోకి.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని ఓ పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి ఏం జరిగిందో.. తెలుసుకోవాల్సిందిగా మత, రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కెనడా ప్రభుత్వం పాఠశాలలో శారీరక, లైంగిక వేధింపులు అధికంగా ఉన్నట్లు, అంతేకాకుండా విద్యార్థులు తమ మాతృభాష మాట్లాడితే వారిపై దాడి చేయడం వంటివి క్రూరమైన చర్యలు కూడా జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. చదవండి: వైరల్:అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి! -
‘అలా నటించడం ఆనందంగా ఉంది’
తమిళ సినిమా: అలా నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది నటి రెజీనా. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా రెజీనా ప్రతినాయకిగా నటించిన చిత్రం చక్ర. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా జీవించారనే చెప్పాలి. ఈ సందర్భంగా చక్ర చిత్రంలో నటించిన అనుభూతిని రెజీనా సోమవారం మీడియాతో పంచుకున్నారు. లాలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ఆనందన్ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారన్నారు. ఆ తరువాత ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణ్యన్ ఫోన్ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారన్నారు. అలా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపారు. పాత్ర, కథ నచ్చితే వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒక వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నానని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. చదవండి: 'సర్కారు వారి పాట' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే.. పంచేంద్రియాల నేపథ్యంలో... -
హిందీలోకి మానగరం
సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’. ‘నగరం’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. విక్రాంత్ మాస్సీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కెమెరామేన్ సంతోష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
నో డూప్
ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్ లేకుండా ఫైట్స్ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. -
ఇద్దరు భామలతో విశాల్
చెన్నై : విశాల్‌కు ఇద్దరు సెట్ అయ్యారు. నటుడు విశాల్ ఆయోగ్య చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. టైటిల్ చూస్తేనే తెలిసి పోతుంది ఇది పుల్ యాక్షన్ చిత్రమని. ఎంటర్టైన్ చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడైన సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన హిట్ చిత్రం ఇరుంబుతిరై ద్వారా పీఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటి సమంత హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్‌కు జంటగా నటి రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారన్నది తాజా సమాచారం. చెన్నై చిన్నది రెజీనా ఇంతకు ముందు పలు తమిళ చిత్రాల్లో నటించి సక్సెస్‌లు అందుకున్నా, స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించలేకపోయ్యింది. కండనాళ్ ముదల్ చిత్రంతో పరిచయ్యమై గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత అళగియ అసుర, పంచామృతం చిత్రాల్లో నటించినా అవి తన కేరీర్‌కు ఉపయోగపడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు విశాల్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం అయినా రెజీనాకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెడుతుందేమో చూద్దాం. ఇక శ్రద్దాశ్రీనాథ్ విషయానికి వస్తే వేదా చిత్రంతోనే తమిళ సినీ ప్రరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. ఇటీవల అజిత్‌తో నటించిన నేర్కొండ పార్వై చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ భామలు ఇద్దరూ విశాల్‌తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. కాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ ప్రస్తుతం శివకార్తీకేయన్‌తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విశాల్‌తో ఇరుంబుతిరై 2 చేయనున్నట్లు సమాచారం. -
‘ఎవరు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్ పాకల దర్శకత్వం : వెంకట్ రామ్‌జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ మరోసారి తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి సక్సెస్ సాధించాడా..? కథ : ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ మహా భార్య, సమీరా మహా(రెజీనా), డీసీపీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసే అశోక్, తమిళనాడు.. కూనుర్‌లోని ఓ రిసార్ట్‌లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది. కేసు విషయంలో సమీరాకు సాయం చేసేందుకు అవినీతి పరుడైన పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్(అడివి శేష్)ఆమెను కలుస్తాడు. తనకు అసలు నిజం చెపితేనే కేసు నుంచి కాపాడగలనని సమీరాకు చెపుతాడు విక్రమ్. మరి సమీరా, విక్రమ్‌తో అసలు నిజం చెప్పిందా..? అశోక్‌తో సమీరాకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసుకు, ఏడాది క్రితం కనిపించకుండా పోయిన వినయ్ వర్మ(మురళీ శర్మ)కు, అతని కొడుకు ఆదర్శ్‌కు సంబంధం ఏంటి..? అసలు విక్రమ్ వాసుదేవ్ ఎవరు? సమీరా ఎవరు? అన్నది తెర మీద చూడాల్సిందే. నటీనటులు : థ్రిల్లర్ కథాంశాల్లో నటించటం అడివి శేష్‌కు కొట్టిన పిండి. అందుకే విక్రమ్ వాసుదేవ్ పాత్రలో ఈజీగా నటించేశాడు శేష్. అనవసరమైన బిల్డప్‌లు భారీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్‌లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజీనా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న రెజీనా ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించింది. సమీరాగా చాలా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కింది. కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, మురళీ శర్మ, నిహాల్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఒక హత్య కేసు, ఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తయారు చేసుకున్న కథను తన కథనంతో రెప్పవేయకుండా చూసేంత ఇంట్రస్టింగ్‌గా మలిచాడు దర్శకుడు వెంకట్ రామ్‌జీ. సినిమాలో పది, పదిహేను నిమిషాలకోసారి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. దర్శకుడు థ్రిల్లర్ జానర్‌కే ఫిక్స్ అయి సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కామెడీ, డ్యూయెట్స్ లాంటివి ఇరికించకపోవటం సినిమాకు కలిసొచ్చింది. రొటీన్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించటం కాస్త కష్టమే. చాలా సన్నివేశాలు రెండు మూడు కోణాల్లో చూపించినా ఎక్కడ బోర్ అనిపించకుండా తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకల సంగీతం. పాటలు కథలో భాగం వచ్చిపోతాయి. నేపథ్య సంగీతంతో ప్రతీ సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు.. సంగీత దర్శకుడు. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సీరియస్‌నెస్‌ను తీసుకువచ్చాడు. సినిమా అంతా రెండు, మూడు లోకేషన్లలోనే తెరకెక్కించినా ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
సెప్టెంబర్‌లో ‘7’
తమిళ, తెలుగు చిత్రాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన నిషార్ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘7’. ఈ చిత్రంలో రెజినా, నందితా సహా ఏడుగురు కథానాయకిలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిషార్ షఫి మాట్లాడుతూ ‘7లో కథను నడిపించేందుకు ఏడు మహిళా కథా పాత్రలు ఉంటాయన్నారు. కనిపించకుండాపోయిన భర్త ఆచూకీ కనిపెట్టి ఇవ్వాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేస్తారని, వీరి ఫిర్యాదులన్నీ పార్థిబన్ పాత్ర చుట్టే తిరుగుతాయని తెలియజేశారు. రెజినా, నందిత, అనిషా ఆంబ్రోస్, సునితా చౌదరి, అతిథి ఆర్య, పూజిత, పొన్నాడా కథానాయకిలుగా నటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు నటుడు హవిష్, పార్తిబన్ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారని, సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. -
అందుకే లెస్బియన్‌గా నటించాను : రెజీనా
తమిళసినిమా: అలాంటి వారినీ అంగీకరించాలి అంటోంది నటి రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్లో నటిగా ఒక టైమ్‌లో రాణించిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసినా, వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందాన ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం పైగా రెజీనా విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ జాణ బాలీవుడ్లో సంచలన నటిగా మారింది. అక్కడ ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా చిత్రంలో నటించింది. ఇందులో నటి సోనం కపూర్‌ను ప్రేమించే లెస్బియన్‌గా నటించింది. గత నెలలో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో లెస్బియన్‌గా నటించిన నటి రెజీనా ధైర్యానికి మెచ్చుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే విమర్శించేవాళ్లూ అదే స్థాయిలో ఉండటం విశేషం. దీని గురించి మనసు విప్పిన రెజీనా సమాజానికి ఏం చెబుతుందో చూద్దాం. ఒక నటిగా ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలి. నేను దక్షిణాది నటిగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. హింది సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ చిత్రంలో లెస్బియన్‌గా నటించడానికి కూడా వెనుకాడలేదు. నటిగా నేను ఎల్లలు అధిగమించాలని కోరుకుంటున్నాను. అయినా మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. కాలం మారుతోంది. లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి. ఎవరు ఎలా జీవించాలని కోరుకుంటే వారిని అలా జీవించనివ్వాలి. సుప్రీంకోర్టే హిజ్రాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాని గురించి చర్చ జరుగుతున్నా, సమాజంలోనూ మార్పు వస్తోంది. ఇదే విషయాన్ని నేను నటించిన హింది చిత్రంలో చర్చించాం అని నటి రెజీనా పేర్కొంది. ఏదేమైనా లెస్బియన్ పాత్రలో నటించి మరోసారి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీకి ఈ సారి అయినా అవకాశాలు వస్తాయా? అన్నది వేచి చూడాలి. -
లెస్బియన్‌గా రెజీనా..!
సౌత్‌లో యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా. సాయి ధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించిన రెజీనా స్టార్ హీరోలతో మాత్రం జతకట్టలేకపోయారు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ఓ బోల్డ్ క్యారెక్టర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘గూఢచారి’ తరువాత..!
గూఢచారి సక్సెస్‌తో యంగ్ హీరో అడివి శేష్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బడా నిర్మాణ సంస్థలు ఈ యంగ్ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. అయితే శేష్ మాత్రం తన స్టైల్లో కూల్‌గా మరో సినిమా పనుల్లో బిజీ అయినట్టుగా తెలుస్తోంది. క్షణం సినిమా తరువాత గూఢచారి తెరకెక్కించేందుకు గ్యాప్ తీసుకున్న శేష్ ఈ సారి వెంటనే మరో సినిమా ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కూడా శేష్ కేవలం కథా కథనాలు మాత్రమే అంధించనున్నాడు. రామ్ జీ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతానికి క్షణం 2 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను క్షణం చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థే నిర్మించనుంది. -
నటి రెజీనా.. నీకు ఇది తగునా?
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి అందులో భాగస్వాములు కావడంతోనే అసలు తంటాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే తమ అభిమాన నటీనటులు, క్రికెటర్లు లేక ఇతర రంగాల వాళ్లు ఎవరు ఏది చేసినా వారి ఫ్యాన్స్ అది ఫాలో అవుతుంటారు. కానీ కిక్ చాలెంజ్ లాంటి ప్రమాదకర విషయాల జోలికి వెళ్లొద్దని ఇదివరకే దీని ప్రభావం ఎక్కువగా కర్ణాటక, ముంబైలలో పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. Not just a risk for you but your act can put life of others at risk too. Desist from public nuisance or face the music ! #DanceYourWayToSafety #InMySafetyFeelingsChallenge pic.twitter.com/gY2txdcxWZ — Mumbai Police (@MumbaiPolice) 26 July 2018 ఇటీవల నటి అదాశర్మ కికి చాలెంజ్ స్వీకరించి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ కదులుతున్న కారు పక్కన కాకుండా ఆగి ఉన్న వాహనం పక్కన స్టెప్పులేశారు. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత టాలీవుడ్ మరో నటి రెజీనా కూడా కికి చాలెంజ్‌ను స్వీకరించారు. హాఫ్ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఇలాంటివి వీరి అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. #inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋 This is the craziness that goes on between shots... 🙄😛 Video and styling: @jaya_stylist Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt — ReginaCassandra (@ReginaCassandra) 29 July 2018 హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా కదులుతున్న వాహహం పక్కనే ముందుకు సాగుతూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. అయితే ఇది మీకు మాత్రమే కాదు, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు. ఎలాంటి జన సంచారం, రద్దీలేని రోడ్లపై ఇలాంటివి చేయాలని, అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరించడకపోవడమే ఉత్తమమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
రెజీనా కూడా చేసేశారు
-
మిస్టర్ చంద్రమౌళికి డేట్ ఫిక్స్
తమిళసినిమా: కోలీవుడ్‌లో తండ్రీ కొడుకులు కలిసి హీరోలుగా నటించడం అన్నది అరుదైన విషయమే. అలా అరుదైన తండ్రీ కొడుకులుగా సీనియర్ నటుడు కార్తీక్, గౌతమ్ కార్తీక్ నమోదవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. చిత్రంలోనూ వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించడం విశేషం. నటి రెజీనా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో ధనుంజయన్ నిర్మించారు. కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్, ముఖ్యపాత్రల్లో సతీష్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, రిచర్డ్, ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.యూ /ఏ. సర్టిఫికెట్తో జూలై 6న తెరపైకి రావడానికి మిస్టర్ చంద్రమౌళి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు వివరాలను తెలుపుతూ చిత్రం ప్రారంభం నుంచి పాజిటివ్‌గానే జరుగుతూ వచ్చిందన్నారు. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తాము అందించిన ఎంటర్టెయిన్మెంట్, ఎమోషనల్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందన్నారు. వారి సమయాన్ని వృథా చేయదన్న గ్యారెంటీ ఇస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గౌతమ్ కార్తీక్, రెజీనాల రొమాన్స్ సన్నివేశాలు యువతను గిలిగింతలు పెట్టిస్తాయని అన్నారు. చిత్రం కలర్‌ఫుల్‌గానూ, అదే సమయంలో చాలా భావోద్రేక సన్నివేశాలతోనూ జనరంజకంగా ఉంటుం దని తెలిపారు. నటుడు గౌతమ్‌కార్తీక్, రెజీనా, సతీష్, వరలక్ష్మి వంటి వారు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారన్నారు. అలాంటి వారితో ఈ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి వారందించిన సహకారమే కారణం అని పేర్కొన్నారు. చిత్రాన్ని జూలై 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తిరు చెప్పారు. -
బాలీవుడ్‌కి హాయ్
సౌత్‌లో మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు కథానాయిక రెజీనా. సౌత్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్పై కన్నేశారు. అదేనండీ.. బాలీవుడ్ నుంచి కాలింగ్ అందుకుని షూట్లో జాయినైపోయారని బీటౌన్ టాక్. అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘1942: ఏ లవ్‌స్టోరీ’ సినిమా ఎంత హిట్ అయ్యిందో.. అందులోని ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ సాంగ్ అంతకు మించి ఫేమస్. ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్‌తోనే ఓ సినిమా రూపొందుతోంది. షెల్లీ చోప్రా దర్వకత్వంలో అనిల్‌కపూర్, సోనమ్ కపూర్, రాజ్‌కుమార్ రావు, రెజీనా, జూహ్లీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’. ఈ సినిమా షూటింగ్లో రెజీనా జాయిన్ అయ్యారట. హిందీ చిత్రం ‘అన్కేన్’ సీక్వెల్ ‘అన్కేన్ 2’ తో రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారని అప్పట్లో వార్తలొచ్చినా కుదుర్లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రెజీనా ప్రేమలో పడిందా?
రెజీనా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నైకి చెందిన రెజీనా కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్లోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆ తరువాత వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఆపై రెజీనా కోలీవుడ్ తెరకు పరిచయమైంది. కండనాళ్ మొదల్ చిత్రంతో హీరోయిన్గా 2012 తెరపైకి వచ్చిన రెజీనా ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందినా, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టిసారించి వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అయితే కోలీవుడ్‌లో ఆ మధ్య నటించిన మానగరం చిత్రం ఈ అమ్మడి ఖాతాలో హిట్‌గా నిలిచింది. దీంతో ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం రెజీనా చేతిలో తమిళం, తెలుగు కలిపి అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వీటిలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నెజైమరప్పదిల్లై, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెజీనా మాత్రం టాలీవుడ్‌కే అధిక ప్రాముఖ్యత ఇస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. కారణం తెలుగు చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు వెళ్లాలనే ఆశతో ఉన్నట్లు సమాచారం. అయితే మరో వైపు రెజీనా ప్రేమలో మునిగి తేలుతోందని చెబుతున్నారు. ఒక టాలీవుడ్ యువ నటుడితో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రెజీనా ఖండిస్తోంది. తానెవరినీ ప్రేమించడం లేదని, అసలు ప్రస్తుతానికి ప్రేమించే సమయం, పెళ్లి చేసుకునే ఆలోచన లేవని అంటోంది. అయితే ప్రేమలో పడ్డ చాలా మంది చెప్పే కబుర్లనే రెజీనా చెబుతోందని, ఇలాంటి వారు సడన్‌గా పెళ్లికి సిద్ధం అవుతారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. -
అప్పుడు ఈగ... ఇప్పుడు చేప..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఆ పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. Playing an interesting role in my next .. been learning swimming coz the script demands ;))#AWE https://t.co/VDmOAuUPHK — Nani (@NameisNani) 23 December 2017 -
'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ
టైటిల్ : బాలకృష్ణుడు జానర్ : కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం : నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పవన్ మల్లెల నిర్మాత : బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నారా రోహిత్, నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాల మీదే దృష్టి పెట్టిన నారావార్బాయి... తొలిసారిగా ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరు పాటలు, నాలుగ ఫైట్లు, పంచ్ డైలాగ్ లు, భారీ చేజ్ లు వీటికి తోడు హీరోయిన్ గ్లామర్ షో.. ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో రూపొందిన బాలకృష్ణుడు నారా రోహిత్ కు కమర్షియల్ హీరో ఇమేజ్ తీసుకువచ్చిందా..? కథ : కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 2006లో సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి, తన చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటారు. జనంలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) రగిలిపోతాడు. కానీ రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు. తాను పోయినా తన ఆశయం మాత్రం బతకాలని ఆఖరి నిమిషంలో చెల్లెలుతో మాట తీసుకుంటాడు రవీందర్ రెడ్డి. (సాక్షి రివ్యూస్) అన్నకిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి లాంటి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా) ఈ గొడవలకు దూరంగా పెంచుతుంటుంది భానుమతి. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా పెడుతుంది. ప్రతాపరెడ్డి నుంచి ఆధ్యను బాలు ఎలా కాపాడాడు..? ఈ ప్రయాణంలో బాలు, ఆధ్యలు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా రొటీన్ కమర్షియల్ సినిమాలో నటించిన నారా రోహిత్, అందుకు తగ్గ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా మార్పులు చూపించాడు. ఎక్కువగా సెటిల్డ్ రోల్స్ లోనే కనిపించిన ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ సినిమాకు కీలకమైన యాక్షన్ సీన్స్, డ్యాన్స్ ల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. హీరోయిన్ గా రెజీనా ఆధ్య పాత్రలో అలరించింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకుంది. కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు మరో ఎసెట్, నీలాంబరి తరహా పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ తనకు అలవాటైన హావాభావాలతో భానుమతి పాత్రను పండించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా నటించిని అజయ్ ది రొటీన్ ఫ్యాక్షన్ విలన్ పాత్రే, తన వంతుగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అజయ్. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ ఇరగదీశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన ఈ కామెడీ స్టార్ అద్భుతమైన టైమింగ్ తో అలరించాడు. విశ్లేషణ : కమర్షియల్ ఫార్ములా తీయాలన్న ఆలోచనతో బాలకృష్ణుడు సినిమా కథ రెడీ చేసుకున్న దర్శకుడు పవన్ మల్లెల పక్కా ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలో ఉండాల్సిన ఫైట్లు, గ్లామర్, పంచ్ డైలాగ్ లు, చేజ్ లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. నారా రోహిత్ ను సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయటంలో సక్సెస్ సాధించాడు. అయితే ఈ తరహా కథా కథనాలు కాలం చెల్లిపోయి దశాబ్దం పైనే అవుతుంది. (సాక్షి రివ్యూస్) మరి ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం. తన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు మణి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్ నటన పృథ్వీ కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
వంటింట్లో ఓ ఆదివారం!
ఎప్పుడూ సినిమాలు, షూటింగులు, సెట్లో మేకప్ కిట్టులు... ఇవేనా? అనుకున్నట్టున్నారు రెజీనా! మేకప్ కిట్ ప్లేసులో కుకింగ్ సెట్ వచ్చింది. మొన్న ఆదివారం కిచెన్‌లోకి వెళ్లారు. చేపల్లో రెండు రకాలను ఇంటికి తెప్పించుకున్నారు. రెండిటినీ బాగా రోస్ట్ చేశారు. ఓ ప్లేటులో వాటిని అందంగా మేకప్ చేసి (అదేనండీ... గార్నిష్ చేసి) ఫొటో తీసుకున్నారు. ఇన్సెట్లో చూస్తున్న ఫొటోలు అవే! కుకింగ్‌కి ముందు.. తర్వాత! ఆదివారం వంట చేశానని చెప్పారు గానీ... వంట రుచి ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ఈసారి మీడియా ముందుకొచ్చినప్పుడు అడుగుదాంలెండి! అన్నట్టు... రెజీనా నటించిన తాజా తెలుగు సిన్మా ‘బాలకృష్ణుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో నారా రోహిత్ హీరో. వీళ్లిద్దరూ జంటగా నటించిన మూడో చిత్రమిది. -
‘బాలకృష్ణుడు’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
‘‘చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేస్తారా?’’
‘‘పసిపిల్లల్నీ వదలడం లేదు పండు ముసలివాళ్లపై కూడా అత్యాచారం చేస్తున్నారు. మృగానికి చిన్నా పెద్దా తెలియదు. చెడు తెలుసు.. అంతే! వేసుకున్న దుస్తులను బట్టి అమ్మాయి క్యారెక్టర్ నిర్ణయించే మగాళ్లు బయల్దేరారు. అమ్మాయిలు తిరగబడితే.. ఇలాంటి పిరికిపందలు పారిపోవాల్సిందే...’’ అంటున్నారు రెజీనా! అమ్మాయిలు వేసుకునే దుస్తులను బట్టి వాళ్ల క్యారెక్టర్ని.. హీరోయిన్లనైతే సినిమాల్లో వాళ్లు వేసుకునే డ్రెస్సులతో క్యారెక్టర్ని ఫిక్స్ చేస్తున్నారు. చిట్టిపొట్టి దుస్తుల వల్లే జరగకూడనివి జరుగుతున్నాయంటున్నారు... మన ఇండియాలో రేప్‌కి గురైన అమ్మాయిలందరూ చిన్న స్కర్టులు వేసుకున్నవాళ్లేనా? పసిపాపలను కూడా రేప్ చేస్తున్నారు, పెద్దవాళ్లనూ వదిలిపెట్టడంలేదు కదా? పోనీ.. నిండుగా సల్వార్ కమీజో, చీరో కట్టుకుంటే రేపులు ఆగుతాయా? రోడ్డు మీదకొచ్చి ఎలా పడితే అలా రెచ్చిపోయే మగవాళ్లను అనడం మానేసి, ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడతారా? సినిమాలో క్యారెక్టర్, కథను బట్టి హీరోయిన్లు డ్రెస్సులు వేసుకుంటారు. అవి చూసి, మా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారా? ఒకవేళ నేను ఏదైనా సినిమాలో చీర కట్టుకుంటే రియల్‌గా ట్రెడిషనల్‌గా ఉన్నట్లా? చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అదో టైపా? డ్రెస్సులను బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేసేవాళ్లలోనే మార్పు రావాలి. ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఏదో ఒక్క చేదు అనుభవం అయినా ఉంటుంది.. మీ లైఫ్‌లో? కాలేజ్ డేస్‌లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్‌ని మరచిపోలేను. కాలేజీకి వెళుతుంటే వెనక నుంచి ఒకడు టచ్ చేసి, ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. నాకలా జరగడం అది ఫస్ట్ టైమ్. అడుగు ముందుకు పడలేదు. తప్పు చేసినవాడు అంత క్యాజువల్‌గా ఉన్నాడు. ఏ తప్పూ చేయని మనం ఎందుకిలా అయిపోయాం? అనుకున్నాను. ఆ ఇన్సిడెంట్‌ని మరచిపోక ముందే మరోసారి ఇలాంటిదే జరిగింది. ఒకడు నన్ను టచ్ చేసుకుంటూ, అసలు తనేమీ చేయనట్లు నడుచుకుంటూ వెళ్లాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ఒక్కటిచ్చాను. తిరగబడతాడనుకున్నా. కానీ, పారిపోయాడు. తప్పు చేసినవాళ్లను వదలకూడదు.. తిరగబడాలి. తిరగబడే ధైర్యం ఉన్న అమ్మాయిలు తక్కువ కావడం వల్లే వేధింపులు ఎక్కువయ్యాయి.. నిజమే. వరల్డ్ మొత్తాన్ని తీసుకుందాం. మన ఇండియాలో జరిగినన్ని రేప్స్ బహుశా ఎక్కడా జరగవేమో? ఎందుకంటే మనవాళ్లల్లో తిరుగుబాటు ధోరణి తక్కువ. మన సొసైటీలో అమ్మాయిల పట్ల చాలా రూడ్‌గా ఉంటున్నారు. అందరినీ అనడం లేదు. అమ్మాయిల దగ్గర ఎవరైతే అమానుషంగా ప్రవరిస్తున్నారో వాళ్ల గురించి అంటున్నా. హర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి వస్తారనుకుంటా. వెకిలి వేషాలు వేస్తారు. ఎదురు తిరిగితే తోక ముడుచుకుంటారు. ఇలాంటి వేధింపుల గురించి పక్కన పెట్టండి.. అసలు అమ్మాయిలకు పెట్టే ఆంక్షలుంటాయే.. అవి టూ మచ్.. కరెక్టే. గోడ దూకామనుకోండి.. ఏంటి అబ్బాయిలా? అంటారు. ఫుట్‌బాల్ ఆడితే.. ఇది ఆడపిల్లల ఆట కాదంటారు. దాంతో అమ్మాయిలు ‘మనం తక్కువ’ అని మెంటల్‌గా ఫిక్సయిపోతారు. లక్కీగా మా ఇంట్లో అలా కాదు. ఎందులోనూ తక్కువ కాదన్నట్లే పెంచారు. అవునూ... ఈ రెండేళ్లల్లో నాలుగు తెలుగు, ఏడు తమిళ సినిమాలు సైన్ చేశారు.. తెలుగు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు తెలుసా? అవునండి. తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నానని నాకూ అనిపిస్తోంది. రెండు భాషలనూ బ్యాలెన్స్ చేయాలి. ఆ సంగతి పక్కన పెడితే.. నాకు తమిళ సినిమాలు చేయడమంటే ఇష్టం. అక్కడి అమ్మాయిని కదా.. మాతృభాష అంటే కొంచెం ‘సాఫ్ట్ కార్నర్’ ఉంటుంది. 1945 – ఓ కొత్త అనుభూతి! ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల్లో ‘1945’ ఒకటి. ఆ కాలం కట్టుబొట్టుతో డిఫరెంట్‌గా కనిపిస్తాను. చీరల గురించి నా డిజైనర్‌తో కలసి చాలా డిస్కస్ చేశా. ఈ సినిమాలో సిల్క్, కాటన్ చీరల్లో కనిపిస్తా. కాంచీపురం చీరలు సెలక్ట్ చేసుకున్నా. మేకప్ చాలా చాలా తక్కువ. అసలు లేకపోయినా నో ప్రాబ్లమ్. మేకప్ వేసుకోవడం నాకు అంతగా నచ్చదు. ఇలా చెబితే.. తెలుగువాళ్లు ఫీలవుతారు.. ఆ క్లారిఫికేషన్ ఇద్దామనుకునే లోపు మీరు క్వొశ్చన్ అడిగేశారు. ఆర్టిస్ట్‌గా నాకు బ్రేక్ ఇచ్చింది తెలుగు పరిశ్రమే. మంచి కెరీర్ ఇచ్చిన తెలుగు పరిశ్రమను మరచిపోతే పెద్ద తప్పవుతుంది. అలాగని ఫస్ట్ చాన్స్ ఇచ్చిన తమిళ ఇండస్ట్రీని కూడా మరచిపోకూడదు. సింపుల్‌గా చెప్పేస్తానండి. రెండు భాషలకూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘బాలకృష్ణుడు’లో మీరు చేసిన క్యారెక్టర్ గురించి? ఇందులో నేను బాగా డబ్బున్న అమ్మాయిని. ధైర్యం ఎక్కువ. నాకేం కావాలంటే అది దక్కాల్సిందే. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. పెంకి అమ్మాయిని. ఇలాంటి క్యారెక్టర్స్‌లో యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉంటుంది. గ్లామరస్‌గా కనిపిస్తాను. బాగా డ్యాన్స్ చేశాను. ఫైట్స్ కూడా చేశానండి. రోప్ షాట్స్ చేశాను. భలే థ్రిల్‌గా అనిపించింది. మీ అమ్మానాన్నలకు మీరు ఒక్కతే కూతురు కాబట్టి, రియల్‌గానూ మీరేదనుకుంటే అదేనా? అంత సీన్ లేదు. మా అమ్మగారి డిక్షనరీలో ‘ప్యాంపర్’ (గారం) చేయడం అనేది లేదు. తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు. అబద్ధాలు ఆడకూడదు. క్రమశిక్షణ పాటించాల్సిందే. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే. మీ ఫ్యామిలీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ పర్సన్ మీరే.. ఇక్కడికి రావాలని డిసైడ్ అయినప్పుడు మీ అమ్మానాన్నల ఫీలింగ్? జనరల్‌గా పిల్లలు కొత్త జాబ్‌కి వెళితే ఏ పేరెంట్స్‌కి అయినా కొంత భయం ఉంటుంది. ఇక, ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి, భయపడ్డారు. నాకూ భయంగానే ఉండేది. అయితే బయట అందరూ చెప్పుకునేంత ఇబ్బందులు ఉండవు. మన పని మనం చేసుకుంటూ వెళితే ఎవరూ ఏమీ అనరు. ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చామని ఎప్పుడైనా ఫీలయ్యారా? ఒకట్రెండుసార్లు అనిపించింది. ముఖ్యంగా 2015లో. ఆ సమయంలో నన్ను ఎగై్జట్ చేసే చాన్స్‌లు రాలేదు. ఎందుకిలా జరుగుతోంది? లైఫ్ ఎటువైపు వెళుతోంది? అనే ఆలోచన మొదలైంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఒక్క విషయం తెలిసింది. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు మన గురించి మనకు ఏమీ తెలియదని. డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్? ఎంత బాగా ఆలోచించగలుగుతాం? నిర్ణయాలు తీసుకోగలుగుతామా? లేదా.. ఇలా మన గురించి మనకు ఓ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అందుకే అంటున్నా.. జీవితంలో ‘డౌన్‌ఫాల్’ కూడా ముఖ్యం. నేను డైలమాలో పడినప్పుడు అవసరాల శ్రీనివాస్ నుంచి ‘జో అచ్యుతానంద’ ఆఫర్ వచ్చింది.. అంగీకరించాను. ఆ సినిమా నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఆ తర్వాత తమిళంలో బిజీ కావడం, తెలుగులోనూ చేస్తుండటంతో ఆ ‘డిఫరెంట్ ఫేజ్’ దాటేశాను. డిసెంబర్లో సర్ప్రైజ్! నేనిప్పటివరకూ 25 సినిమాలకు పైగా చేశాను. వీటిన్నింటిలో కనిపించిన దానికన్నా ఓ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించబోతున్నా. ఈ సినిమాకి సంబంధించిన నా కొత్త లుక్ డిసెంబర్లో వస్తుంది. ఆ లుక్ అందరికీ ఓ సర్ప్రైజ్. ఆ సినిమా వివరాలు కూడా అప్పుడే చెబుతా. హిందీలో ‘ఆంఖే 2’కి అవకాశం వచ్చింది కదా.. ఇప్పుడా సినిమా ముందుకు వెళ్లినట్లు అనిపించడం లేదు? నేనా సినిమా చేయడంలేదు. ‘ఆంఖే 2’ కరెంట్ స్టేటస్ తెలీదు. ప్రస్తుతానికి ఆగిందని విన్నాను. ఫస్ట్ హిందీ మూవీకే ఇలా జరగడం బాధగా... అలాంటిదేం లేదు. ఇది లైఫ్. ఏం జరుగుతుందో చెప్ప లేం. అందుకే లైట్ తీసుకున్నా. మీ మాటలు ‘కర్మ సిద్ధాంతాన్ని’ ఫాలో అవుతారేమో అనిపించేలా ఉన్నాయా? ఎగ్జాట్లీ. ‘ఎల్లామ్ తల విధి. ఎన్న ఎళుది ఇరుక్కో అదుదాన్ నడక్కుం’. (అంతా తలరాత. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అని అర్థం). సడన్‌గా మీ మాతృభాషలోకి వచ్చేశారేంటి? ఇలాంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేటప్పుడు మదర్ టంగ్‌లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ‘తల విధి’ని తెలుగులో ఏమంటారో తెలియదు (నవ్వుతూ). మణిరత్నం ‘యువ’లో సూర్య చెల్లెలి క్యారెక్టర్‌కి తీసుకోవాలనుకుంటే.. మీరేమో అందుబాటు లో లేరట.. అదేమైనా బాధగా ఉంటుందా? దూరదర్శన్ కోసం నేనో షో చేశాను. ఒక్క ఎపిసోడ్‌కే అది ఆగిపోయింది. ఆ షో డైరెక్టర్ మణిరత్నంగారికి అసిస్టెంట్ డైరెక్టర్. ‘యువ’లో చెల్లెలి క్యారెక్టర్ కోసం నన్ను తీసుకోవాలనుకున్నారట. కానీ, మేం వేరే ఇంటికి మారడంతో అడ్రస్ తెలుసుకోలేకపోయారు. అలా ‘యువ’ చాన్స్ మిస్సయ్యాను. మణిరత్నంగారు గ్రేట్ డైరెక్టర్. చూద్దాం.. భవిష్యత్తులో చాన్స్ వస్తుందేమో. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వదులుకోవడం ‘రాంగ్ డెసిషన్’ అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ టైమ్‌కి అదే కరెక్ట్ డెసిషన్ అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. శేఖర్ కమ్ములగారంటే నాకు గౌరవం. ఆయన మంచి డైరెక్టర్. అయితే ఆ టైమ్‌లో ‘సోలో’ హీరోయిన్గా ‘ఎస్సెమ్మెస్’ మూవీలో చాన్స్ వచ్చింది. అందుకని ఆ ∙సినిమా చేయడమే బెటర్ అనిపించింది. ఆ చాన్స్ వస్తే.. కత్తి తిప్పుతా ‘బాహుబలి’ లాంటి సినిమాకి అవకాశం వస్తే.. కాదనకుండా ఒప్పేసుకుంటా. అయితే నాకు హార్స్ రైడింగ్, స్వోర్డ్ ఫైట్ తెలియదు. కానీ, సినిమా కోసం నేర్చుకుంటా. కొత్త విషయాలు నేర్చుకోవడమంటే నాకు సరదా. రిస్క్ అయినా ఫర్వాలేదు.. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ ఏడాది ఎలా గడిచింది? తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడిచింది. మంచి క్యారెక్టర్స్‌కి అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది కూడా ఇలానే పాజిటివ్‌గా ఉండాలనుకుంటున్నా. – డి.జి. భవాని -
తేడా వస్తే!
బాలకృష్ణుడు..పేరుకు తగ్గట్లే కుర్రాడు కూల్‌గా ఉంటాడు. కామ్‌గా తన పనేంటో తాను చూసుకుంటాడు. కానీ, ఏదైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తాడు. ఇంతకీ ఈ బాలకృష్ణుడు ఎవరో కాదు.. హీరో నారా రోహిత్. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. శరత్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ పిక్చర్స్ పతాకాలపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ సిక్స్‌ప్యాక్ చేశారు. రమ్యకృష్ణ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు. రెజీనా బాగా నటించింది. ఇక మణిశర్మగారి సంగీతం సూపర్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు, పృథ్వీ, ఆదిత్యా మీనన్, దీక్షా పంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా విజయ్ సి. కుమార్. -
రెట్రో వీరులు
రెట్రో వీరులు గడియారంలో ముల్లు వెనక్కి తిరుగుతుందా? ఊహూ... గతాన్ని మళ్లీ క్రియేట్ చేయొచ్చా? ఊహూ! రియల్‌గా కుదరదు కానీ... రీల్‌పై కుదురుతుంది. ఎన్నేళ్లయినా ముందుకెళ్లొచ్చు...ఎన్నేళ్లయినా వెనక్కి వెళ్లొచ్చు.ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్లోకొందరు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. ‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’ అనే సామెత తెలుసా?దానర్థం గతమెప్పుడూబాగుంటుందని! అలాగని, భవిష్యత్తు బాగుండదని కాదు.బట్.. ప్రెజెంట్కన్నా ‘పాస్ట్’తెలుసుకోవడంలో ఓ కిక్కుఉంటుంది. మనవాళ్లను రెట్రో వీరులుగా చూడటంలో ఓ మజా ఉంటుంది. అందుకే...కలెక్షన్లను ముందుకుతీసుకెళ్లేందుకు గతంలోకి వెళుతున్నారు కొందరు దర్శక–నిర్మాతలు. 70 ఏళ్లు వెనక్కి రానా! నో.. కాంప్రమైజ్. క్యారెక్టర్స్వైజ్గా రానా రాజీపడరు. అవసరమైతే బరువు తగ్గుతారు. పెరుగుతారు. విలన్‌గానూ నటిస్తారు. అంతెందుకు బాస్.. ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా ఉండే రానా అవసరమైతే పాత కాలం మనిషిలా కనిపించడానికి ‘యస్’ అనేస్తారు. అలా అన్నదే ‘1945’ మూవీ. బర్మాకు వలస వెళ్లిన వారి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం రానాను సుమారు 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు చిత్రదర్శకుడు సత్యశివ. 1945 టైమ్ అది. స్వాతంత్య్రం కూడా రాలేదు. ఆ కాలంలోకి వెళ్లి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు రానా. అందుకే, ఆ కాలం నాటి ఆనవాళ్లు స్క్రీన్‌పై కనిపించాలని టీమ్ అంతా చాలా కష్టపడి సెట్లో స్పెషల్ ఎరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో కోసం 1945 నాటి బైక్, వాచ్‌లను తయారు చేయించారు. రానా ఆల్రెడీ గెడ్డం తీసేశారు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరకర్త. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొచ్చి, చెన్నైలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారట. ఫస్ట్ లుక్‌ను నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. నార్త్‌లోనూ బ్యాక్ టు పాస్ట్ బాలీవుడ్‌లోనూ డైరెక్టర్లు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. 1948 టైమ్‌లో ఒలింపిక్స్‌లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్‌సింగ్ బయోపిక్‌లో అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రీమా కగ్తీ. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా 1950 కొరియన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. క్రికెట్లో ఇండియాకు 1983లో ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన కపిల్‌దేవ్ కథతో రూపొందుతోన్న సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. కబీర్‌ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. హీరోయిన్లలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఆలియా భట్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆలియా 1970 కాలానికి చెందిన కాశ్మీరీ అమ్మాయిగా నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్ వాళ్లూ తమ సినిమాల కోసం వెనక్కి వెళుతున్నారు. వేరే దేశంలో 55 ఏళ్లు వెనక్కి! ప్రభాస్... చెప్పేదేముంది? ఎక్సెప్ట్ ‘బాహుబలి’ మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఆల్మోస్ట్ ఎంతటి ట్రెండీ లుక్స్‌లో కనిపించారో... ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ, ప్రభాస్‌ను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దాదాపు 55 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ల నున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. వీరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా 1960 యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. అంటే... దర్శకుడు రాధకృష్ణ నాటి యూరప్ లొకేషన్ల కోసం వేటడాలి. లేకపోతే సెట్స్ వేయించాలి. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు సెట్స్, లొకేషన్స్‌ని ఫైనలైజ్ చేసేస్తారు. మరి.. ప్రభాస్‌ను రాధాకృష్ణ ఆ కాలంలోకి తీసుకెళ్లి యుద్ధం చేయిస్తారో? ప్రేమలో పడేస్తారో? చూడాలి. గళ్ల లుంగీలో రామ్‌చరణ్ తెలుగువాళ్ల ట్రేడ్ మార్క్ అంటే.. ‘గళ్ల లుంగీ’. కాకపోతే సినిమాల్లో మన హీరోలు కనిపించేది ప్యాంటుల్లోనే కదా. అందుకే, మనోళ్లు ‘గళ్ల లుంగీ’ కడితే.. అభిమానులు ఈలలేసి, గోల చేసేస్తారు. రామ్‌చరణ్ ఫ్యాన్స్ అదే చేయబోతున్నారు. ‘ధృవ’ సినిమాలో చరణ్ ఎంత స్టైలిష్‌గా కనిపించారో చూశాం. కానీ, డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా కోసం 1985 కాలంలోకి రామ్‌చరణ్‌ని తీసుకెళ్లారు. స్టైలిష్ హీరోను కాస్తా .. పక్కా విలేజ్ కుర్రాడిలా రెడీ చేశారు. గళ్ల లుంగీ, గెడ్డం, చేతిలో తువ్వాలు... టోటల్‌గా రామ్‌చరణ్ లుక్ అదిరింది. 30 ఏళ్ల క్రితం అమ్మాయిలు వేసుకున్నట్లే బిగుతుగా అల్లిన జడ, ఆ జడకు కట్టిన రిబ్బను, లంగా–ఓణీలో సమంత లుక్ కూడా బాగుంది. 1985ని తలపించేలా సుకుమార్ వేయించిన విలేజ్ సెట్స్ సూపర్. గోలీసోడా, పూరిళ్లు, కుండలు, ఎడ్లకావిడి.. ఇలా ఒకటేంటి ఆల్మోస్ట్ విలేజ్‌లో ఉండే అన్నింటినీ ఎరేంజ్ చేశారు. ఈ మధ్యే సెట్లో ఓ జాతర పాట తీసినట్లు బయటికొచ్చిన ఫొటో స్పష్టం చేసింది. అప్పటికాలంలో ఉండే జాతర, తిరున్నాళ్లను సినిమాలో చూడవచ్చన్న మాట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వస్తుంది. రూట్ మార్చిన పూరి..! ‘బ్యాక్ టు పాస్ట్’ వెళ్లడం ఇది కొత్త కాదు. గడచిన మూడు నాలుగేళ్లల్లో ‘మనం’, ‘24’ వంటి సినిమాలు సౌత్‌లో వచ్చాయి. అయితే, ఒకేసారి ఇటు సౌత్ అటు నార్త్‌లో ఎక్కువ సినిమాలు ‘ఆన్ సెట్స్’లో ఉండటం విశేషం. ప్రెజెంట్ ట్రెండ్ మూవీస్ ఎలానూ వస్తాయి. పాస్ట్‌ని ప్రెజెంట్ చూపించి, ప్రేక్షకులను మెప్పించి, మంచి వసూళ్లు రాబట్టుకోవాలన్నది ఫిల్మ్ మేకర్స్ టార్గెట్ అయ్యుండొచ్చు. ఫారిన్ లొకేషన్లు, పబ్బులు, హాట్ గాళ్స్... మారిన ట్రెండ్‌కి అప్డేటెడ్ వెర్షన్‌లా ఉంటాయి పూరి జగన్నాథ్ సినిమాలు. అయితే పూరి జగన్నాథ్ రూట్ మార్చారు. 1971కి వెళ్లిపోయారు. తనయుడు ఆకాశ్ పూరీ కోసం ‘మెహబూబా’ పేరుతో ఆయన లవ్‌స్టోరీ తీస్తున్నారు. 1971 చెందిన ఓ యువకుడు–యువతి మధ్య సాగే ప్రేమకథ ఇది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. 1971 అంటే పూరి స్టైల్ రిచ్‌నెస్ కనిపించే వీలుండదు. లేటెస్ట్ గన్స్, వెపన్స్‌ను ఫైట్స్‌లో యూజ్ చేయడం పూరి మార్క్. ఇలాంటివి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేం.. 1971 అంటే పిస్తోల్, రైఫిల్.. లాంటివి వాడాలి కదా మరి. అందులోనూ వార్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి చిట్టిపొట్టి కాస్ట్యూమ్స్‌లో హీరోయిన్ నెహా శెట్టిని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా షూట్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో స్టార్ట్ చేశారు. హిమాలయాల్లో 18వేల అడుగుల ఎత్తులో, మైనస్ 7 డిగ్రీస్‌లో సినిమాను షూట్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
చారిత్రాత్మక చిత్రంలో రెజీనా!
తమిళసినిమా: నటి రెజీనా కోలీవుడ్‌లో మళ్లీ పుంజుకుంటున్నారనే చెప్పాలి. ఇంతకు ముందు తమిళం, తెలుగు అంటూ విజయాలకోసం పరుగులు తీసిన ఈ బ్యూటీకి మానగరం వంటి అనూహ్య విజయం సాధించిన చిత్రంతో ఈ అమ్మడికి ఇక్కడ ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న భారీ చిత్రంలో రెజీనా ఒక కీలక పాత్రను పోషించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సుభాష్‌చంద్రబోస్‌తో పాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు అజాద్ హింద్ ఫౌజ్ పాత్రను నటుడు రానా పోషించనున్నారు. బాహుబలి చిత్రం తరువాత ఆయన నటించనున్న మరో చారిత్రక కథా చిత్రం ఇది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 1945 కాల ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించబడ్డ యువతిగా రెజీనా నటించనున్నారట. ఇందులో ఈమె చాలా తక్కువ మేకప్‌తో విభిన్న గెటప్‌లో కనిపించనున్నారట. బాహుబలి చిత్రంతో అనుష్క, తమన్నా ఎంత పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. మరి ఈ చరిత్ర కథా చిత్రం రెజీనాకు ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో వేచి చూడాలి. -
1945 కట్
న్యూ ఇయర్ రావడానికి ఇంకా టైముంది. కానీ, హీరో రానాకు మాత్రం ఇప్పుడే స్టార్టయ్యిందంట. అయితే అందరూ అనుకున్నట్లు రాబోయే 2018 కాదండోయ్. 1945. విచిత్రంగా ఉందా? ‘వెల్కమ్ టు 1945’ అంటున్నారు రానా. ఎందుకంటే ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ‘1945’ . రెజీనా కథానాయిక. సుభాష్‌చంద్రబోస్ సైన్యంలోని ఒక సైనికుడి పాత్రలో రానా నటిస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. స్వాతంత్య్రానికి పూర్వపు సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. ఆ కాలానికి తగ్గట్టుగా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు రానా. ‘‘జరిగిపోయిన కాలాన్ని సృష్టించబోతున్నాం. ఇప్పుడు మాకు ఇది 1945వ సంవత్సరం. ఈ చిత్రంలోని మేజర్ షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం స్టార్టయ్యింది. తెలుగు, తమిళ్లో షూట్ చేస్తున్నాం. మా టీమ్ సభ్యులు విజయ్, జైపాల్ నా గెటప్ మార్చుతున్నారు’’ అన్నారు రానా. -
తండ్రి కొడుకుల మిస్టర్ చంద్రమౌళి
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్‌కార్తీక్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. క్రియేటీవ్ ఎంటర్టెయినర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మరిందరు ప్రముఖ నటీనటులు చేరుతున్నారు. ఈ క్రేజీ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం నటి రెజీనాను వరించింది. కాగా మరో ప్రధాన పాత్రలో నటి వరలక్ష్మీశర™Œత్‌కుమార్ నటించనున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను ఖరారు చేశారు. మిస్టర్ చంద్రమౌళి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు దర్శకుడు తిరు వెల్లడించారు. ఆయన వివరిస్తూ కార్తీక్, గౌతమ్‌కార్తీక్ కలిసి నటించనున్నారనగానే ఈ చిత్రానికి పరిశ్రమ వర్గాల్లో మంచి క్రేజ్ సంతరించుకుందన్నారు. తాజాగా రెజీనా, వరలక్ష్మీశరత్‌కుమార్, ముఖ్యంగా దర్శకులు మహేం ద్రన్, అగస్థియన్లు నటిస్తుండడంతో చిత్రానికి మరింత హైప్ వచ్చిందన్నారు. అంతే కాదు ఈ మిస్టర్ చంద్రమౌళి చిత్రంపై ఒక దర్శకుడిగా తన బాధ్యత పెరింగిందన్నారు. -
నయా బాలకృష్ణుడు!
బాలకృష్ణుడు...పేరు కొంచెం క్లాసీగా ఉన్నా కుర్రాడిలో మాత్రం మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లున్నాయి. ఏదైనా తేడా కొట్టిందో విలన్స్‌ను ఇరగదీస్తాడంతే. సిక్స్‌ప్యాక్ ఉన్నప్పుడు ఆ మాత్రం కుమ్మేయడానికి ఆలోచించడు కదా. హీరో నారా రోహిత్‌నే ఈ నయా బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై మహేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మిస్తున్నారు. రెజీనా కథనాయిక. మణిశర్మ స్వరకర్త. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన సూపర్‌గా నటిస్తున్నారు. పవన్ మల్లెల చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నాం. మణిశర్మగారి మ్యూజిక్ సినిమాకు హైలైట్’’ అన్నారు. -
కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!
తమిళసినిమా: నేనొకరిని ప్రేమించాను ఆ కారణంగానే.. ఒంటరిగా ఉన్నా నంటోంది రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా కోలీవుడ్‌లో మానగరం, రాజతందిరం, సరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీగణేశనుమ్ సురళీరాజవుమ్ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్జే.సూర్యతో నటించిన నెంజమ్ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకిరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించింది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ నేను తొందర పడడం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడడానికి కారణం ఏమిటి, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడడానికి అదే కారణం. అయినా ఆ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా తెలివిగా ఉన్నాను. నటిగా చిన్న గ్యాప్ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది.అందుకే ఇంకా కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నా. -
రెజీనా కోసం రాశీఖన్నా..!
హీరోలే కాదు.. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సినిమాల్లో నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అదే బాటలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తను హీరోయిన్ గా నటించిన జోరు సినిమా కోసం తొలి సారిగా పాట పాడింది రాశీ. తరువాత మలయాళ చిత్రం విలన్ లోనూ గొంతు సవరించుకుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో పాట పాడుతుంది. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ కాదు. తొలి చిత్రాల్లో తన క్యారెక్టర్ కోసం పాట పాడిన రాశీ ఖన్నా, తొలిసారిగా రెజీనా పాత్ర కోసం పాడుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది. -
లెక్క తప్పింది
తమిళసినిమా: లెక్క తప్పిందన్న మనస్తాపంలో మునిగిపోయిందట రెజీనా . అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడెందుకు అనే సామెత గుర్తుకొస్తోంది రెజీనా పరిస్థితి చూస్తే. నిజానికి ఈ బ్యూటీ మంచి ఫామ్‌లోనే ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ గానే ఉంది. అయితే ఇటీవల రెజీనాకు గ్లామర్‌పై మోజు పుట్టి నక్షత్రం అనే తెలుగు చిత్రం లో విచ్చల విడిగా అందాలను ఆరబోసింది. దీంతో స్టార్ హీరోయిన్ స్థాయి ఖాయం అని సన్నిహితులు చేవిలో బాజా ఊదడంతో చాలానే కలలు కనేసిందట. అయితే ఆ చిత్రం నిరాశ పరచడంతో ఇప్పుడు ఊహల పల్లకిలోంచి దబాల్న ఇహలోకంలోకొచ్చిందట. మితి మించిన గ్లామర్‌గా నటించినా ఫలితం దక్కకపోవడంతో లెక్క తప్పిందని చింతిస్తోందట. ఇకపై అలాంటి పొరపాటు చేయరాద న్న నిర్ణయానికి వచ్చేసిందట. కాగా ప్రస్తు తం ఈ అమ్మడు కోలీవుడ్‌లో సిల్లుక్కువార్పట్టి సింగం, నెంజమ్ మరప్పదిల్లై, రాజతంధిరం–2,పార్టీ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉం ది. వీటిలో ఏ రెండు చిత్రాలు విజయం సాధించినా త న మార్కెట్ పదిలంగా ఉంటుందని రెజీనా భావిస్తోందట. -
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
లుక్.. నయా లుక్
నారా రోహిత్ ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ అయ్యారు. అలా కావడం కోసం సన్నబడ్డారు. ఈ మధ్య నారా రోహిత్ కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సన్నబడిపోతానని ప్రూవ్ చేసుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో సన్నబడిన రోహిత్‌ను చూడొచ్చు. ఈరోజు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పొడవాటి జుత్తు, మెలి తిరిగిన మీసాలు.. సిక్స్‌ప్యాక్ బాడీతో నారా రోహిత్ డిఫరెంట్‌గా కనిపిస్తున్న లుక్ ఇది. ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ డి.యోగానంద్. -
రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?
ప్రజల రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసినోళ్లు భయపడాలి తప్ప సాధారణ ప్రజలు ఎందుకు భయపడాలి? అనే అంశాలను చర్చించడంతో పాటు ఓ అంతర్జాతీయ సమస్యను స్పృశిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన సినిమా ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యతారలుగా కె. శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ సినిమా. హనుమంతుని శక్తియుక్తులు, సేవాభావం పోలీసుల్లో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా సమస్యను చివరికి పరిష్కరించేది పోలీసే. మనం వాళ్లను చూసే దృక్పథం మారాలని ఈ సినిమాలో చెప్పా’’ అన్నారు. తులసి, జేడీ చక్రవర్తి, ప్రకాశ్‌రాజ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర. -
వెంకట్‌ప్రభు పార్టీ మొదలైంది
తమిళసినిమా: కొందరు దర్శకుల చిత్రాలకే ప్రత్యేక బ్రాండ్ ఉంటుంది. అలాంటి వారిలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఒకరు. ఆయన చిత్రాల్లో చాలా మంది హీరోలుంటారు. అయినా అవి వెంకట్‌ప్రభు చిత్రాలుగానే గుర్తింపబడతాయి. చెన్నై 28 రెండు భాగాలు, సరోజ, గోవా లాంటివన్నీ ఆ తరహా చిత్రాలే. తాజాగా వెంకట్‌ప్రభు పార్టీకి రెడీ అయ్యారు. అవును ఆయన తాజా చిత్రం పేరు పార్టీ. ఇంతకు ముందు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స్ పతాకంపై సరోజా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన టి.శివ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే చేస్తున్న చిత్రం పార్టీ. వెంకట్‌ప్రభు గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ ఒక నక్షత్ర బృందమే నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, జై, శివ, కయల్ చంద్రన్, రమ్యకృష్ణ, నివేదా పేతురాజ్, రెజీనా, సంచి తాశెట్టి ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చి త్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. తన సోదరుడైన వెంకట్‌ప్రభు చిత్రానికి ఈయన తొలిసారిగా సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. రాజేశ్ మాధవ్ ఛాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్ర మేజర్ పార్టీ షూటింగ్‌ను ఫిజీ దీవుల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది. -
మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన రమ్యకృష్ణ, మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్, రెజినా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర అంతేకీలకమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నారా రోహిత్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. నారా రోహిత్ పుట్టిన రోజైన జూలై 25న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘నక్షత్రం’ డిజప్పాయింట్ చెయ్యదు
-దర్శకుడు కృష్ణవంశీ ‘‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రీకరణకు రామ్‌చరణ్‌ను కలవడానికి వెళ్లా. అప్పుడు కృష్ణవంశీగారితో ‘ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంటే చెప్పండి. చేస్తా’ అన్నాను. ‘నక్షత్రం’లో అలెగ్జాండర్ అనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యల దగ్గరకు వెళ్లి ‘కృష్ణవంశీగారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నా’ అని చెప్పా. ‘వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్’ అన్నారు. ముఖ్యంగా చిరంజీవిగారయితే చాలా చెప్పారు. నువ్వెంతో నేర్చుకుంటావన్నారు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. సందీప్ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కీలక తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నక్షత్రం’. ఎస్. వేణుగోపాల్, సజ్జు, కె. శ్రీనివాసులు నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో, భరత్, హరి గౌర సంగీత దర్శకులు. పాటల సీడీలను ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్‌లు, తొలి సీడీని శ్రియ, రెజీనా, ప్రగ్యాలకు అందించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘డెఫినెట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయదు. అందరూ చాలా కష్టపడి చేశారు. నేనూ కష్టపడి చేశాను’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి రోజూ ఈ సినిమా సెట్‌కు కాలేజి స్టూడెంట్ లా వెళ్లా. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘2009లో కృష్ణవంశీగారికి ఫేస్బుక్లో ‘మిమ్మల్ని ఓసారి కలవాలని’ మెసేజ్ పెట్టా. ఆయన రిప్లై ఇవ్వలేదు. ఏడేళ్ల తర్వాత ఈ సినిమా కుదిరింది. కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకునే చాలామంది కల ఈ ఒక్క సినిమాతో తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించాను. ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగా తెలిసిన నన్ను నటుడిగా, గాయకుడిగా పరిచయం చేస్తోన్న మా దర్శకునికి కృతజ్ఞతలు’’ అన్నారు భీమ్స్. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ పాట మాత్రమే చేసినందుకు బాధగా ఉంది. నెక్స్›్ట ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అన్నారు శ్రియ. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
తమిళంలోకి రారా కృష్ణయ్య!
తమిళసినిమా: నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలోకి రానుంది. తమిళంలో మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచి వాడిగా పెరుగుతాడన్నారు.అతన్ని తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నించగా, వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తాడన్నారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు.ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు అంటూ చిత్రం పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పార్టీలో ఆ ముగ్గురు!
తమిళసినిమా: పార్టీలో చేరడానికి ముగ్గురు బ్యూటీస్ రెడీ అవుతున్నారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అంతలేదిక్కడ. సాధారణంగా వెంకట్‌ప్రభు చిత్రాల్లో హీరోలు, హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువే ఉంటారు. చెన్నై–28 చిత్రంలో చాలా మంది హీరో లు నటించారు. ఇక మంగాత్తాలో అజిత్‌తో పాటు అర్జున్, త్రిష, ఆండ్రియా అంటూ ప్రముఖ తారలు నటించారు. ఇటీవల వచ్చిన చెన్నై 28–2లోనూ హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇవన్నీ మంచి విజయాన్ని సాధించిన చిత్రాలే అన్నది గమనార్హం. కాగా వెంకట్‌ప్రభు తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి పార్టీ అనే టైటిల్ నిర్ణయించారు. దీన్ని అమ్మాక్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మించనున్నారు. ఇందులో సత్యరాజ్, నాజర్, జయరాం, రమ్యకృష్ణ, జై, శివ, సంపత్, కయల్చంద్రన్ అంటూ చాలా మంది నటులు నటించనున్నారు. కాగా ఈ పార్టీలో నటి రెజీనా, సంచితాశెట్టి, నివేదపెతురాజ్ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారు. దీంతో పార్టీ చిత్రంపై ఆసక్తి పేరుగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మలు పార్టీలో ఎలాంటి మజా అందిస్తారో చూడాల్సిందే. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్‌ను బీజీ దీవుల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. మొత్తం మీద వెంకట్‌ప్రభు ఈ పార్టీతో మరో విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. -
నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేస్తూ వస్తున్నారు యువ నటుడు అధర్వ. ఈటీ, కణిదన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అధర్వ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుం సురుళిరాజానుం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్ టీ. శివ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈయన సంస్థకు ఇది జూబ్లీ చిత్రం అవుతుంది. ఇందులో అధర్వకు జంటగా నటి ఐశ్వర్యారాజేశ్, రెజీనా, ప్రణీత, అతిథి ఇలా నలుగురు బ్యూటీస్ నటిస్తున్నారు. కథ డిమాండ్ మేరకే నలుగురు కథానాయికలను ఎంచుకున్నామన్నారు దర్శకుడు ఓడం ఇళవరసు. చిత్రంలో ఈయనే హీరో, వీళ్లే హీరోయిన్లు, వీళ్లే కమెడియన్లు అన్నదేమీ ఉండదని.. వారి వారి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. రొమాం టిక్ కామెడీ కథా చిత్రంలో నటించాలన్న అధర్వ కోరిక ఈ చిత్రంతో తీరనుందని చెప్పారు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం, శ్రీసరవణన్ ఛాయాగ్రాహణం అందిస్తున్నారు. -
భగవంతుడు వాయిదా వేశాడు
భగవంతుడు వాయిదా వేశాడు అంటోంది నటి రెజీనా. ఈ అమ్మడు అచ్చ తమిళ ఆడపడుచు. కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను ఆశ్రయించింది. అక్కడ మంచి విజయాలనే అందుకుంటోంది. అయితే తమిళ అమ్మాయినై ఉండి తమిళంలో విజయాలను అందుకోలేకపోతున్నాననే మథన పడుతూనే ఉందట. అందుకని మధ్య మధ్యలో తమిళ చిత్రాల అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందట. ఆ మధ్య రాజతందిరం అనే చిత్రం బాగానే ఆడింది. అయినా రెజీనాను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది చాలా కాలం తరువాత మానగరం చిత్రం రూపంలో ఈ అమ్మడి ఖాతాలో ఇటీవల మంచి విజయం నమోదైంది. అంతే కాదు ఇప్పుడు ఇక్కడ రెజీనా టైమ్ బాగుంది. ఎస్జే. సూర్యతో నెంజం మరప్పదిల్లై, అధర్వతో జెమినీగణేశనుం సురళీరాజానుం, ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా సరవణన్ ఇరుక్క భయమేన్తో పాటు రాజతందిరం– 2, సిలుక్కువార్‌పట్టి సింగం మొదలగు ఐదు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ సిక్స్‌ప్యాక్‌తో నటిస్తున్నాడు. ఈయన పక్కన నటిస్తున్న తమిళ హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంటున్నానని రెజీనా తెగ మురిసిపోతోంది. ఈ చిత్రం పాటల్లో అందాలను వెండితెరపై పరిచిందట. ఈ సందర్భంగా ఈ అమ్మడు మనసులోని మాటను బయట పెడుతూ మాతృభాషలో విజయం సాధించాలన్న ఆశ చాలా కాలంగా ఉందని అంది. నిజానికి తాను ఇక్కడ ఎప్పుడో సక్సెస్‌ను అందుకోవాల్సిందని, ఆ భగవంతుడు కాస్త వాయిదా వేశాడని పేర్కొంది. ఇప్పుడు తన టైమ్ బాగుందని, త్వరలోనే కోలీవుడ్‌లో తాను ఆశించిన స్థాయికి చేరుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నిటిలోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానని రెజీనా పేర్కొంది. -
భగవంతుడు వాయిదా వేశాడు
భగవంతుడు వాయిదా వేశాడు అంటోంది నటి రెజీనా. ఈ అమ్మడు అచ్చ తమిళ ఆడపడుచు. కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను ఆశ్రయించింది. అక్కడ మంచి విజయాలనే అందుకుంటోంది. అయితే తమిళ అమ్మాయినై ఉండి తమిళంలో విజయాలను అందుకోలేకపోతున్నాననే మథన పడుతూనే ఉందట. అందుకని మధ్య మధ్యలో తమిళ చిత్రాల అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందట. ఆ మధ్య రాజతందిరం అనే చిత్రం బాగానే ఆడింది. అయినా రెజీనాను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది చాలా కాలం తరువాత మానగరం చిత్రం రూపంలో ఈ అమ్మడి ఖాతాలో ఇటీవల మంచి విజయం నమోదైంది. అంతే కాదు ఇప్పుడు ఇక్కడ రెజీనా టైమ్ బాగుంది. ఎస్జే. సూర్యతో నెంజం మరప్పదిల్లై, అధర్వతో జెమినీగణేశనుం సురళీరాజానుం, ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా సరవణన్ ఇరుక్క భయమేన్తో పాటు రాజతందిరం– 2, సిలుక్కువార్‌పట్టి సింగం మొదలగు ఐదు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ సిక్స్‌ప్యాక్‌తో నటిస్తున్నాడు. ఈయన పక్కన నటిస్తున్న తమిళ హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంటున్నానని రెజీనా తెగ మురిసిపోతోంది. ఈ చిత్రం పాటల్లో అందాలను వెండితెరపై పరిచిందట. ఈ సందర్భంగా ఈ అమ్మడు మనసులోని మాటను బయట పెడుతూ మాతృభాషలో విజయం సాధించాలన్న ఆశ చాలా కాలంగా ఉందని అంది. నిజానికి తాను ఇక్కడ ఎప్పుడో సక్సెస్‌ను అందుకోవాల్సిందని, ఆ భగవంతుడు కాస్త వాయిదా వేశాడని పేర్కొంది. ఇప్పుడు తన టైమ్ బాగుందని, త్వరలోనే కోలీవుడ్‌లో తాను ఆశించిన స్థాయికి చేరుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నిటిలోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానని రెజీనా పేర్కొంది. -
నక్షత్రం వర్కింగ్ స్టిల్స్
-
ఆ దర్శకుల గురించి తెలుసుకోవడం లేదు
గొప్ప దర్శకుల నుంచి ఈ తరం కళాకారులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్న ఆవేదనను దర్శకుడు ఎళిల్ వ్యక్తం చేశారు. వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సరవణన్ ఇరుక్క భయమేన్. నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి తన రెడ్ జెయింట్ మూవీస్ పతకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రెజీనా, సృష్టిడాంగే నాయికలుగా నటించారు. సూరి, యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, రవి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా సవరణన్ ఇరుక్క భయమేన్ చిత్రం మే 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో మాట్లాడుతూ సరవణన్ ఇరుక్క బయమేన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో సృష్టిడాంగే పాత్ర ఏమి చెప్పినా నమ్మేస్తారన్నారు. తాను ఆమె కలిసి నటించిన ఒక పాటను కేరళాలోని కొచ్చి దాటి సముద్ర తీరంలో చిత్రీకరించామన్నారు. అక్కడ సృష్టిడాంగేకు కేరవన్ వ్యాన్ కూడా లేదు. అంతగా ఆమె సహకరించి నటించారు. ఈ చిత్రానికి ముందు రెండు చిత్రాలను అంగీకరించానని, వాటి కంటే ముందుగా ఈ చిత్రం విడుదల కావడానికి దర్శకుడు ఎళిల్ వేగమే కారణం అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఎళిల్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు డీ.ఇమాన్, గీత రచయిత యుగభారతి కలిస్తేనే సూపర్‌హిట్ పాటలు వస్తాయన్నారు. ఇకపోతే మన ముందు తరం దర్శకులు చాలా ప్రతిభావంతులన్నారు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా పేర్కొన్నారు. అయితే అలాంటి వారి గురించి ఈ తరం వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. అది కరెక్ట్ కాదని, ఈ పరిస్థితి మారాలని ఎళిల్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నటి రెజీనా, సృష్టిడాంగే, సూరి, డీ.ఇమాన్, రవి పాల్గొన్నారు. -
ప్రమోషన్‌కు నో అంటున్న రెజీనా
నటి రెజీనాకు రెక్కలొచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవల ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెజీనాకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తెలుగులోనూ చిత్రాలు చేయడంతో నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ జాణ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రంలో నటించింది. వేల్లన్ను వందా వెళ్లక్కారన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ఎళిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో ఉదయనిధి పూర్తి వినోదంతో కూడిన హీరో పాత్రలో నటించారు. ఆయనతో సూరి హాస్యాన్ని పండించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్తో విడుదలకు సిద్ధం అవుతోంది. మే నెల 12న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావలిసిందిగా నటి రెజీనాకు కోరగా తాను తెలుగు చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల శరవణన్ ఇరుక్క భయమేన్ చిత్ర ప్రమోషన్‌కు రావడం కుదరదని ఖరాఖండీగా చెప్పేస్తోందట. దీంతో యూనిట్ వర్గాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నటి రెజీనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
‘రంగస్థల’ జీవితాల ఆధారంగా...
సురభి రంగస్థల కళాకారుల జీవితాలు గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే కథతో రూపొందుతోన్న సినిమా ‘హరే రామ హరే కృష్ణ’. దిలీప్‌ప్రకాశ్, రెజీనా జంటగా అర్జున్‌సాయిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్. నవీన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దిలీప్, రెజీనాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు చందూ మొండేటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎన్. నవీన్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మే నెల్లో కులు–మనాలీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. అర్జున్‌సాయి మాట్లాడుతూ – ‘‘రంగస్థల కళాకారులందరూ ఇప్పుడు కళను వదలి ఉద్యోగాలకు వెళ్తున్నారు. అంతరిస్తున్న సంప్రదాయ కళను కాపాడే ప్రయత్నం చేసే ఓ యువజంట కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు దిలీప్, రెజీనా, నటి ఆమని, కళా దర్శకుడు బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశ్‌రాజ్, ఆమని, నాజర్, కృష్ణభగవాన్, అలీ, బాబూమోహన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఈ విజయం ఆనందాన్నిచ్చింది
‘‘నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. విమర్శకులు సైతం బాగుందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు లోకేష్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని రెజీనా అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ముఖ్యపాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ సమర్పణలో ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ నిర్మించిన ‘నగరం’ గత శుక్రవారం విడుదలైంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విడుదల టైమ్‌లో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉన్నాం. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారని తెలిసి, ఆనందపడ్డాం. కథ బాగుండటంవల్లే ఈ విజయం. కొన్ని కారణాల వల్ల ‘నగరం’ ఆలస్యంగా విడుదలైంది. అయినా తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం, రెండో వారంలో మరిన్ని థియేటర్స్ పెరగడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
నగరం నాకు రిలీఫ్ ఇచ్చింది
‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్ టైమ్‌కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్ అనిపించింది. -
రానాతో జతకట్టనున్న రెజీనా
యువ నటుడు రానాతో జత కట్టేందుకు నటి రెజీనా రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. టాలీవుడ్ టాలెస్ట్ నటుడు రానా. ఈయన ఒక్క తెలుగు చిత్రసీమకే పరిమితం కాకుండా హిందీ, తమిళం అంటూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. కాగా రానా తమిళంలో ఆరంభం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తరువాత బెంగళూర్ నాట్కల్, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాహుబలి–2తో పాటు ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మరో ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు కళగు అనే వైవిధ్య భరిత కథాంశంతో విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడైతిరంద అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగే చారిత్రక కథాంశంతో రూపొందనుందట. చిత్ర కథ నచ్చడంతో రానా ఇందులో నటించడానికి అంగీరించారు. ఈ విషయాన్ని ఇటీవల రానానే స్వయంగా చెన్నైలో ఘాజీ చిత్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ పిరియడ్ కథా చిత్రంలో రానాకు జంటగా నటి రెజీనా నటించనున్నారని సమాచారం. ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుందన్నది గమనార్హం. -
ఫుల్ యాక్షన్
రజనీకాంత్ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించనున్నారట. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఎస్.వి.ఎం.పి. పతాకంపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేయస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్ దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సీనియర్ నటి రమ్యకృష్ణ మా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆమెది’’ అన్నారు. అజయ్, పృధ్వీ, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: యోగానంద్, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: మణిశర్మ. -
‘నగరం’ మూవీ స్టిల్స్
-
నాలుగు జీవితాలు 48 గంటలు...!
నాలుగు జీవితాలు.. మూడు కోణాలు.. రెండు ప్రేమకథలు... 48 గంటల్లో ఊహించని మార్పులు.. అవన్నీ ‘నగరం’లోనే ఉన్నాయి. ఆ ఢిపరెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడాలంటే ఈ నెల 10 వరకు వెయిట్ చేయ్యాల్సిందే. ఏకేఎస్ ఎంటర్టైన్ మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్లపై లోకేశ్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ‘నగరం’. జంటగా నటించారు. చిత్రనిర్మాత అశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘నలుగురు వ్యక్తుల మధ్య ఒక నగరంలో 48 గంటల్లో జరిగే కథ ఇది. సందీప్ కిషన్‌ది ఒక స్టోరి. రెజీనాది ఇంకో కథ. శ్రీ అనే వ్యక్తిది మరో స్టోరి. ఈ ముగ్గురినీ కలిపే డ్రైవర్ పాత్ర ఇంకొకటి. స్క్రీన్‌ప్లే బేస్డ్ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నాం. తమిళంలో ‘మానగరం’గా రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: జావేద్ రియాజ్, కెమెరా: సెల్వకుమార్ ఎస్కె, ఎడిటింగ్: గౌతంరాజు. -
ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్ కావాలన్నాడు!
‘‘ఒక్క ఛాన్స్ కావాలా? అయితే ‘అడ్జస్ట్’ అవ్వాలి.. ఓకేనా?’’ అని అడిగేవాళ్లు ఉంటారని సినిమా రంగం గురించి తెలిసినవాళ్లు అంటుంటారు. ఒకప్పుడు రెజీనాకి ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఆ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రెజీనా మాట్లాడుతూ – ‘‘ఏడేళ్ల క్రితం నేనో తెలుగు సినిమా చేస్తున్నప్పుడు, ఎవరో వ్యక్తి ఒక తమిళ సినిమాకి అవకాశం ఇస్తానంటూ ఫోన్ చేశాడు. ఆ ఛాన్స్ కావాలంటే, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఫోన్ పెట్టాశాను’’ అన్నారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు తెలిసుండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. -
వారికి ఉరి శిక్ష విధించాలి!
నటి భావన లైంగికవేధింపుల సంఘటన దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్యాప్తులో ఆమె కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.మంత్రి కొడుకుల హస్తం ఉందని, ప్రముఖ నటుడికి ఈ దురాగతంలో భాగం ఉందని, మరో మహిళా వ్యాపారవేత్తే ఈ ఘటనకు సూత్రధారి అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు మాత్రం ముమ్మరంగా సాగుతోంది. కాగా భావన లైంగికవేధింపులకు గురైన విషయాన్ని నటి రెజీనా ముందుకు తీసుకురాగా తానూ అడ్జెస్ట్మెంట్ వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని అన్నారు.ఈ బ్యూటీ సందీప్‌కిషన్, శ్రీలతో కలిసి నటించిన మానగరం చిత్రం మార్చి 10వ తేదీన తెరపైకి రానుంది. విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన రెజీనాను భావన సంఘటనపై స్పందించాల్సిందిగా అడిగినప్పుడు సినిమాలో మనతో నటించే యూనిట్‌పై నమ్మకం కలగాలన్నారు.ఇది చాలా క్లిష్టవైున పరిస్థితి అని పేర్కొన్నారు.సెన్సిటివ్ అయిన ఈ అంశం గురించి తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు.అయితే అత్యాచారయత్నానికి పాల్పడ్డ వారికి ఉరి శిక్ష లాంటి దండన విధించాలన్నారు. లేదా వారిని పెట్టే టార్చర్‌కు మరెవరూ మహిళలపై అత్యాచారం చేయడానికి భయపడేలా ఉండాలన్నారు. ఏదేవైునా స్త్రీలు తమ రక్షణ విషయంలో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.తాను ఆరంభంలో తమిళ చిత్రాల్లో నటించానని,ఆ తరువాత తెలుగు చిత్రాల వైపు దృష్టి సారించానన్నారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి తమిళ చిత్రంలో నటించడానికి కాల్షీట్స్ అడిగారన్నారు. తరువాత అడ్జెస్ట్మెంట్ అనే పదాన్ని ఉపయోగించారని, దాంతో తానా చిత్రంలో నటించలేదని తెలిపారు.ఆ తరువాత తనకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదని చెప్పారు.ఏ రంగంలో అయినా మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఎవరి సాయం అవసరం లేకుండా సురక్షితంగా ఉండవచు్చనని అంటున్నారా ఉత్తరాది భామ. -
ఛలో బ్యాంకాక్!
పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లింది. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక, సినిమా కథ ఏంటంటే... పోలీసు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న యువకుడి కథ ఇది. సందీప్ కిషన్,రెజీనా నాయకా నాయికలు. సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘‘రామాయణంలో హనుమంతుని పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, సమాజంలో పోలీసు పాత్రకు అంతే ఉంటుంది. అదెలాగో నా సినిమాలో చూడండి’’ అంటున్నారు చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమా టాకీ పూర్తయింది. నేటి నుంచి బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ ఆరంభిస్తారు. ఒక పాటను సందీప్‌కిషన్, రెజీనా పై, మరోపాటను సాయిధరమ్, ప్రగ్యాపై చిత్రీకరించనున్నారు. అక్కడే ఓ ప్రత్యేక పాటను కూడా షూట్ చేస్తారు. ఆ పాట వివరాలు బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్, భరత్ అందిస్తున్నారు. శ్రీచక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియోషన్స్ కె.శ్రీనివాసులు, విన్‌విన్‌విన్ క్రియేషన్స్ వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు
అందం, అభినయం రెండూ ఉన్న స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటంలో ఫెయిల్ అవుతున్న హీరోయిన్ రెజీనా. తెలుగులో వరుస అవకాశాలు లేకపోవటంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ భామ, టాలీవుడ్లో ఇంట్రస్టింగ్ రికార్డ్‌కు చేరువైంది. ఈ జనరేషన్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్‌తో మరో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అలాంటి సమయంలో ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. సందీప్‌తో రెజీనాకు ఇది మూడో సినిమా. గతంలో రొటీన్ లవ్ స్టోరి, రా రా కృష్ణయ్య సినిమాలో కలిసి నటించిన ఈ జోడికి తెలుగులో ఇది మూడో సినిమా. నక్షత్రం సినిమాలోనే మరో యంగ్ హీరోతో కూడా మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో యంగ్ హీరోతో కూడా హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతోంది రెజీనా. ఇటీవల జ్యో అచ్యుతానంద సినిమాతో నారా రోహిత్ సరసన హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ సాధించింది. అంతకు ముందే ఇదే కాంబినేషన్లో శంకర అనే సినిమాలో వీరు కలిసి నటించినా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి రోహిత్‌తో జోడి కట్టేందుకు రెడీ అవుతోంది. పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. -
ప్రేక్షకులతోనే భయమంతా!
‘ఎ’ ఫర్ అమితాబ్ బచ్చన్. బాలీవుడ్లో అంతే మరి! యాక్టింగ్‌లో ఆయన తర్వాతే ఎవరైనా. అమితాబ్ తర్వాత ‘ఎ’ ఫర్... అనిల్‌కపూర్, అర్షద్ వార్సి, అర్జున్ రాంపాల్ పేర్లు రాసుకోవచ్చు. వీళ్లందరూ కూడా నటనలో తక్కువేం కాదు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆంఖే–2’లో రెజీనా ఈ బాలీవుడ్ మహామహులతో నటించనున్నారు. హిందీ తెరకు పరిచయమవుతున్న తొలి సినిమాలో అమితాబ్ వంటి స్టార్‌తో పాటు హేమాహేమీలతో కలసి నటించడానికి నెర్వస్‌గా ఫీలవుతున్నారా? అని రెజీనాని అడిగితే... ‘‘అమితాబ్ అయినా మరొకరైనా... నేను నెర్వస్‌గా ఫీలవను. నా భయమంతా ప్రేక్షకులతోనే. హిందీలో నా మొదటి సినిమా కదా! ప్రేక్షకులతో పాటు అక్కడి మీడియా ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని భయపడుతున్నా. అందుకే కొంచెం నెర్వస్‌గా ఫీలవుతున్నా’’ అన్నారు. తెలుగులో కృష్ణవంశీ ‘నక్షత్రం’లో రెజీనా నటిస్తున్నారు. -
అర్.. ర్..ర్.. ర్రే!
ఆర్ ఎప్పుడూ రైటే.ఆర్ ఎప్పుడూ రాంగ్ కాదు.ఆర్ ఎప్పుడూ రాణే.ఆర్తో మొదలైతే ఆరా తీయడం అంటూ ఏమీ ఉండదు.హీరోయిన్గా తీసుకోవడం హిట్ సాధించడం... అంతే.ఇప్పుడు తెలుగులో ‘ఆర్’ (తెలుగులో ర) అక్షరంతో మొదలయ్యే నలుగురు నాయికల కెరీర్ చూస్తుంటే.. ‘ఆర్’ ఫర్ రాకింగ్ అని మీరే అంటారు. రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, రాయ్ లక్ష్మీ... ఈ నలుగురికీ 2016 మెమరబుల్.చదివితే అర్రే అని మీరే అంటారు. గ్లామర్‌లో హైపర్..కామెడీలో క్వీన్! కథానాయికలు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదూ! ‘ఊరుకోండి.. మీరు చెప్పేది కామెడీగా ఉంది. ఓ నాలుగు పాటలు, ఐదు సీన్లలో హీరో పక్కన.. అయితే నవ్వుతూ లేదంటే బుంగమూతి పెట్టుకుని కనిపించడం తప్ప హీరోయిన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తారా’ అనేగా మీ సందేహం. కావాలంటే ‘సుప్రీమ్’ సినిమా చూడండి. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా భలే నవ్వించారు. ఈ ముద్దుగుమ్మ గతేడాది మూడు సినిమాలు చేశారు. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గుర్తింపే తీసుకొచ్చాయి. వాటిలో నటిగా తన ప్రత్యేకతను చూపించే అవకాశం రాశీఖన్నాకు దక్కలేదు. ‘సుప్రీమ్’లో ఆ ఛాన్స్ రావడంతో చెలరేగారు. ఎస్ఐగా సీరియస్ డైలాగులు చెప్పి, నవ్వించారు. కామెడీగా ఫైట్స్ చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ‘సుప్రీమ్’ తర్వాత వచ్చిన ‘హైపర్’లో అయితే రాశీఖన్నా గ్లామర్డోస్ పెంచారనే చెప్పుకోవాలి. సినిమాలోనే కాదు.. ‘హైపర్’ ఆడియోకి వేసుకొచ్చిన డ్రస్ కూడా హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు బొద్దుగా ఉందని విమర్శించినోళ్లే, ఈ ఏడాది వచ్చిన సినిమాలు చూసి రాశీఖన్నా ముద్దు ముద్దుగా నవ్వించిందనీ, నటించిందనీ అంటున్నారు. మొత్తం మీద 2015తో పోల్చితే 2016 ఈ బ్యూటీకి కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త ఏడాదిలో గోపీచంద్ ‘ఆక్సిజన్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ రెండు తమిళ సినిమాలకు సైన్ చేసేశారు. వెయిటింగ్ టు రాక్! సై్టల్.. స్మైల్.. గ్లామర్‌గా కనిపించే గట్స్... రెజీనాలో అన్నీ ఉన్నాయి. ఈ హీరోయిన్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఆమె ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. ఈ ఏడాది రెజీనా రెండు సినిమాల్లో నటించారు. అవేవీ చెప్పుకోదగ్గ విజయాలు ఇవ్వలేదు. కానీ, కృష్ణవంశీ ‘నక్షత్రం’తో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటున్నారు రెజీనా. ‘చందమామ’తో కాజల్ అగర్వాల్, ‘మొగుడు’తో తాప్సీ, ‘పైసా’తో కేథరిన్... ఈతరం హీరోయిన్లకు గ్లామర్ పరంగా కృష్ణవంశీ బ్రేక్ ఇచ్చారు. ‘నక్షత్రం’లో రెజీనా ఇప్పటివరకూ కనిపించనంత అందంగా ఉంటుందన్నట్లు ఆమె బర్త్‌డేకి ఓ సాంపిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చెన్నై బ్యూటీని రాక్‌స్టార్‌గా అభివర్ణించారు కృష్ణవంశీ. మరి, సినిమా రిలీజయ్యాక రెజీనా ఏమాత్రం రాక్ చేస్తారో చూడాలి. తెలుగు సంగతి పక్కన పెడితే... రాకింగ్ హీరోయిన్ల జాబితాలో రెజీనాని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 2016 ఆమెకు హిందీ సినిమాకి అవకాశం తెచ్చిపెట్టిన సంవత్సరం. అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సి వంటి స్టార్స్ నటించనున్న హిందీ ‘ఆంఖే–2’లో ఛాన్స్ రావడంతో రెజీనా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా తమిళంలో ఓ ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. కుర్రాళ్లకు పరేషానురా.. ప్రేమలో పడితే పరేషాను ఉంటుందో? లేదో? తెలియదు గానీ... ‘ధృవ’లో రకుల్‌ప్రీత్ సింగ్‌ను చూస్తే కుర్రాళ్లకు పరేషాను తప్పదు. అందమే అసూయ పడేలా ‘పరేషాను రా..’ పాటలో రకుల్ గ్లామర్‌తో రాక్ చేశారు. అందమేనా... సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, తర్వాత ‘సరైనోడు’, ఇప్పుడు థియేటర్లలో ఉన్న ‘ధృవ’ ఈ ఏడాది హీరోయిన్గా నటించిన మూడు సినిమాల్లోనూ అభినయంతో రకుల్ రఫ్ఫాడించేశారు. గతేడాది ఈమె చేసిన సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అప్పుడు రకుల్‌పై గ్లామర్ డాల్ ముద్ర వేశారు. అందం వల్లే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడీ గాళ్ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ఇరగదీస్తుందని అంటున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో అందం, అమాయకత్వం గల అమ్మాయిగా నటించడమే కాదు... ఆ పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ‘సరైనోడు’లో అయితే.. మేకప్ లేకుండా ఎమోషనల్ సీన్స్‌లో నటించిన తీరు నటిగా రకుల్‌కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది. ఇక, ‘ధృవ’తో ముచ్చటగా మూడో హిట్ అందుకుని రాకింగ్ స్టార్ అయ్యారు. ముచ్చటగా మూడు విజయాలతో జోష్ మీద ఉన్న రకుల్‌కి వచ్చే ఏడాది కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే, డైరీ ఫుల్. మహేశ్‌బాబు – ఏఆర్. మురుగదాస్ సినిమా, సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’, బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి సినిమా.. కొత్త ఏడాది కూడా మినిమమ్ మూడు సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందు రావడం గ్యారెంటీ. వీటితో పాటు తమిళ సినిమాలకు కూడా సైన్ చేశారు. రాకింగ్ ఐటమ్ ఒక్క పాట... ఒక్కటంటే ఒక్క పాట.. అది కూడా ఐటమ్ పాట. తెలుగులో రాయ్‌లక్ష్మీకి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఐటమ్ గాళ్ కేటగిరీలో ఈ ఏడాది రాక్‌స్టార్ ఎవరంటే... రాయ్‌లక్ష్మీ పేరే లిస్టులో ముందుంది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్‌తో కలసి రాయ్‌లక్ష్మీ స్టెప్పులేశారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ‘తప్పు తప్పే... శుద్ధతప్పే’ అనే పాట సూపర్ హిట్. అందులో ఆమె స్టెప్పులు, ఆమె గ్లామర్ కూడా హిట్టే. హీరోయిన్గా పదేళ్ల కెరీర్లో ఈమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కానీ, ఐటమ్ గాళ్‌గా రాకింగ్ స్టెప్పులతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్ చేసిన రాయ్‌లక్ష్మీ, రానున్న సంక్రాంతికి రిలీజవుతోన్న ‘ఖైదీ నంబర్ 150’ కోసం చిరంజీవితో కలసి స్టెప్పులేశారు. మరి, అందులో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో!! ఈ పాటలను పక్కన పెడితే.. సౌత్‌లో పదేళ్లకు పైగా పలు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడీ భామ ‘జూలీ–2’తో హిందీలో హీరోయిన్గా అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. 2016లో అతిథిగా కనిపించిన ‘అఖీరా’తో తొలిసారి హిందీ తెరపై కనిపించారు. అది చేస్తున్నప్పుడే ‘జూలీ–2’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు. ఆ రకంగా రాయ్‌లక్ష్మీకి ఈ ఏడాది మెమరబుల్ అవుతుంది. ‘ఆర్’ అంటే హిట్టే! ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే... అప్పట్లో తిరుగులేని తారలు అనిపించుకున్న రాధికా, రాధ, రేవతి తదితరుల పేర్లు ‘ఆర్’తో మొదలైనవే. విశేషం ఏంటంటే.. తమిళ దర్శకుడు భారతీరాజా తాను పరిచయం చేసే కథానాయికలకు ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు పేరు పెడతారు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ సినిమా ద్వారా ఆమెను పరిచయం చేస్తూ, ‘రాధ’గా మార్చారు. విలక్షణ నటి రేవతి తొలి పరిచయం కూడా భారతీరాజా సినిమాతోనే జరిగింది. ‘మన్వాసనై’ అనే సినిమాకి రేవతిని నాయికగా ఎన్నుకున్న తర్వాత ‘ఆశా కుట్టి నాయర్’ అనే ఆమె పేరుని రేవతిగా మార్చారు. ‘ఆర్’ అక్షరంతో మొదలయ్యే మరో నటి రాధిక. ఆమె రియల్ నేమ్‌తోనే స్క్రీన్‌కి పరిచయమయ్యారు. అయితే పరిచయం చేసింది మాత్రం భారతీరాజానే. ‘కిళక్కే పోగుమ్ రైల్’ ద్వారా ఆయన రాధికను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తిరుగు లేని తార అయ్యారు. అలాగే రతీ ఆగ్నిహోత్రిని పరిచయం చేసింది కూడా భారతీరాజానే. ‘పుదియ వార్పుగళ్’ చిత్రం ద్వారా కథానాయికగా తమిళ్ తెరకు పరిచయమైన ఈ హిందీ అమ్మాయి ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యారు. నిత్యానంద స్వామితో లింకప్ వార్తల్లో నిలిచిన రంజిత అసలు పేరు శ్రీ వల్లి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘నాడోడి తెండ్రల్’ ద్వారా ఆమె తమిళ తెరకు పరిచయమయ్యారు. రాధ, రాధిక, రేవతిల రేంజ్ స్టార్డమ్ తెచ్చుకోకపోయినా రంజిత బాగానే పేరు తెచ్చుకున్నారు. దక్షిణాదిన తిరుగు లేని నాయిక అనిపించుకున్న రోజాకి నామకరణం చేసింది కూడా భారతీరాజానే. ఆమె అసలు పేరు శ్రీలత. ‘ప్రేమ తపస్సు’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీరాజా తొలి దృశ్యానికి క్లాప్ ఇచ్చి, రోజాకి పేరు పెట్టారు. నాటి, నేటి తారల్లో ‘ఆర్’తో పేరు మొదలైనవాళ్లు రాక్ చేస్తున్నారు కాబట్టి, ఈ అక్షరం కలిసొస్తుందని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. ఇదండి సంగతి...రకుల్, రాశీ, రెజీనా,రాయ్ లక్ష్మీల కెరీర్ చూస్తుంటే... ‘ఆర్’ ఫర్ రాకింగ్ అనొచ్చు కదూ! -సత్య పులగం -
సరదాగా అన్నాను
సరదాగా అన్నాను. అది అంత దూరం తీసుకెళుతుందని ఊహించలేదు అంటోంది నటి రెజీనా. ఇంతకీ ఈ అమ్మడు ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ సందేహం. రెజీనా కోలీవుడ్ తెరపై కని పించి చాలా కాలమే అయ్యింది. అలాగని పూర్తిగా తెరమరుగైపోయిందనే నిర్ణయానికి వచ్చేయకండి. టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అక్కడ మంచి విజయాలను కూడా చవిచూసిన రెజీ నా తాజాగా కోలీవుడ్‌పై దండెత్తడానికి సిద్ధమవువుతోంది. ప్రస్తుతం తమిళంలోనే నెంజం మరప్పదిల్లై, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీ గణేన్ సురుళీరాజనుమ్, మడై తిరందు వంటి ఐదు చిత్రాల్లో నటిస్తున్న ఆ బ్యూటీ త్వరలో బాలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఈ సందర్భంగా రెజీనా చెప్పిన ముచ్చట్లు.. ప్ర: సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ: నెంజం మరప్పదిలె్లౖ చిత్రం ద్వారా తొలిసారిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాను. ఎస్జే.సూర్య కథానాయకుడు. మరో నాయకిగా నందిత నటిస్తున్నారు. ఇందులో నటించడానికి అంగీకరించినప్పుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం కష్టం అని చాలా మంది భయపెట్టారు. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. పాత్రను వివరించి, సరైన నటనను రాబట్టుకోవడంలో సెల్వరాఘవన్ చాలా సహనశీలి. షూటింగ్లో ఆయన్ని నేను ఒక అధ్యాపకుడిగానే చూశాను. చిత్రాన్ని పూర్తిగా చూసినప్పుడు నేనేనా అలా నటించింది అని ఆశ్చర్యపోయాను. ఇది దెయ్యం కథా చిత్రం కాదు. అయితే నా పాత్ర దెయ్యమా? మామూలు అమ్మాయా? అన్నది చివరి వరకూ తెలియదు. ఇప్పటి వరకూ నేను నటించిన చిత్రాల్లో నెంజం మరప్పదిలె్లౖ ప్రత్యేకంగా ఉంటుంది. ప్ర: తెలుగు, తమిళ భాషల్లో బిజీగా నటిస్తున్నట్లున్నారు? జ: ఈ విషయంలో ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అలా కుదురుతోంది అంతే. మానగరం, మడై తిరం దు చిత్రాలు ఏక కాలంలో రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి. నాకు రెండు భాషల్లోనూ మార్కెట్ ఉంది. అదే విధంగా నేను తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయి. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం? జ: తెలుగులో ఆశించిన అవకాశాలు వస్తుండడంతో పూర్తి గా అక్కడే శ్రద్ధ పెట్టాను. తమిళంలో అవకాశాలు వస్తున్నా, కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. అంతేగాకుండా తమిళంలో ఒక చిత్రం చేసినా వైవిధ్యంగా ఉండాలి. ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తిండిపోవాలని కోరుకున్నాను. ప్రస్తుతం చేస్తున్నవి అలాంటి చిత్రాలే. ప్ర: రెండు భాషల ప్రేక్షకుల గురించి? జ: తెలుగు ప్రేక్షకులు ఎప్పటి విజయాలను అప్పుడే ఎం జాయ్ చేస్తారు. తాజా చిత్రాల పాత్రలనే గుర్తుంచుకుం టారు. ఆ తరువాత వాటిని మరచిపోతారు. తమిళ ప్రేక్షకులు అలా కాదు. ఇక వైవిధ్యభరిత పాత్ర, అద్భుతమైన పాత్రలో నటిస్తే దాన్ని చాలా కాలం తరువాత కూడా అభినందిస్తూనే ఉంటారు. కేడిబిల్లా కిలాడిరంగా చిత్రంలో నేను నటించిన పాప్పా పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ నేను ఇతర ప్రాంతాలకు షూటింగ్‌కు వెళ్లినప్పుడు పాప్పా అని అభిమానంగా పిలుస్తుంటారు. ప్ర: బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్నారట? జ: అవును. ఒక హిందీ చిత్రంలో నటించనున్నాను. ముగ్గురు అంధులు బ్యాంక్ రాబరింగ్ చేసి కోట్ల రూపాయలు దోచుకునే ఇతివృత్తంతో తెరపైకి వచ్చిన చిత్రం ఆంఖే. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది ముగ్గురు అంధులు ఒక పేకాట క్లబ్లో ఎలా దోచుకుంటారన్న ఇతివృత్తంతో తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అనిల్‌కపూర్ తదితర ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. ప్ర: వివాహ వదంతుల గురించి? జ: అదా సరదాగా అన్నాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్‌మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. అందుకు రియాక్ష¯ŒS ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది. ప్ర: సరే, మరి పెళ్లెప్పుడూ? జ: నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతంది. -
నా డ్రీమ్ పాత్ర ఏమిటి?
నా డ్రీమ్ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను నాలో నేనే చాలా సార్లు వేసుకున్నాను అని పేర్కొన్నారు నటి రెజీనా. కోలీవుడ్‌లో కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ సక్సెస్‌ను అందించలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించి అక్కడ మంచి అవకాశాలతో సక్సెస్ఫుల్ నాయకిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కో-2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రాల సక్సెస్‌తో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం మానగరం, నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. చిన్న గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్లై. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న ఎస్జే. సూర్యకు జంటగా రెజీనా నటిస్తున్నారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నది గమనార్హం. స్థానిక ఈసీఆర్ రోడ్డులోని బంగ్లాలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో చాలా ఆసక్తే నెలకొంది. కారణం సెల్వరాఘవన్ హ్యాండిల్ చేస్తున్న తొలి హారర్ కథా చిత్రం కావడమే. అదే విధంగా చాలా గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడంపై నటి రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా కాలంగా తన డ్రీమ్ పాత్ర ఏదని తనలో తానే ప్రశ్నించుకునే దాన్నని, దానికి జవాబు ఆ చిత్రం ద్వారా లభించిందని పేర్కొన్నారు. ఇందులో మరిమయ్ అనే పాత్రలో నటిస్తున్నానన్నారు. తాను ఇంతకు ముందు ఈ తరహా పాత్రను పోషించలేదన్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు సెల్వరాఘవన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కాగా ఇందులో తనది పని మనిషి పాత్ర అని, కొందరి దురాగతానికి బలై దెయ్యంగా వచ్చి పగ తీర్చుకుంటారని రెజీనా వివరించింది. -
వాళ్లిద్దరూ చాలా హాట్!
‘హీరోల్లో మీకెవరంటే ఇష్టం?’ అని ఏ హీరోయిన్ని అడిగినా... ‘అందరూ ఇష్టమేనండి’ అని అంటుంటారు. ఒకళ్ల పేరు చెప్పి, ఇంకొకరి పేరు చెప్పకుండా.. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకని ‘సేఫ్ ఆన్సర్’ ఇచ్చేస్తారు. కానీ, రెజీనా లాంటి కొంతమంది కథానాయికలు మాత్రం, ఎవరు నచ్చితే వాళ్ల పేరు చెబుతారు. అంతవరకూ ఫరవాలేదు.. ‘ఫలానా హీరో చాలా హాట్’ అని కూడా బోల్డ్‌గా చెప్పేస్తారు. ఇప్పుడు రెజీనా అదే చేశారు. ఇటీవల ఓ సందర్భంలో ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ భలే సెక్సీ’’ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు దీని గురించే నలుగురూ చర్చించుకుంటున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఈ బ్యూటీ స్టేట్మెంట్ ఇచ్చేసిందనీ, ఎంతైనా చాలా బోల్డ్ అనీ తెగ మెచ్చుకుంటున్నారు. మహేశ్‌బాబు, రామ్ చరణ్‌లు ‘సెక్సీ’ అని రెజీనా అంటే.. ఈ బ్యూటీని ఉద్దేశించి చాలామంది ఈ మాట అంటున్నారు. దానికి కారణం హిందీ చిత్రం ‘ఆంఖే 2’ కోసం రెజీనా చాలా హాట్‌గా తయారవ్వడమే. ఈ చిత్రంలో ఏ రేంజ్లో కనిపించనున్నారో శాంపిల్ చూపించడానికి ట్విట్టర్లో కొన్ని ఫొటోలు కూడా పెట్టారు. అవి చూసినవాళ్లు ‘రెజీనా చాలా హాట్ గురూ’ అని నోరు వెళ్ళ బెడుతున్నారు. -
రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా?
నటి రెజీనాకు వివాహ నిశ్చితార్థం జరిగిందా? తాజాగా చిత్ర వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇదే. కోలీవుడ్‌లో నిరాదరణకు గురై టాలీవుడ్‌ను ఆశ్రయించిన నటి రెజీనా. ప్రస్తుతం అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇక్కడి బ్యూటీకి చేతి నిండా చిత్రాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తన చర్యలతో రెజీనా పెద్ద కలకలానికే కేంద్రబిందువుగా మారారు. ఈ జాన ఒక ఆడ మగ చేతులు మాత్రమే కనిపించే లాంటి ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తను పేర్కొంటూ ఈ శుభతరుణంలో మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇలా జరగడం కాస్త విచారించదగ్గ విషయయే. అతను ఎవరన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటుందని తెలుసు. అయితే ఆ విషయం గురించి త్వరలోనే వెల్లడిస్తాను. నిజానికి ఇలాంటి సంతోషకరమైన కార్యం జరుగుతుందని నేనూ హించలేదు. అనే వ్యాఖ్యల్ని పొందుపరచిన రెజీనా కొద్ది సేపటికే ఆ ఫొటోనూ, తన వ్యాఖ్యలను తన సైట్ నుంచి తొలగించారు. అయినా సోషల్ మీడియాలో రెజీనా పోస్ట్ చేసిన ఫొటో, తాను పేర్కొన్న భావాలు చాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే రెజీనా క్రికెట్ క్రీడా శిక్షకుడు విక్రమ్ ఆదిత్యతో తీసుకున్న సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక పోతే రెజీనా చాలా కాలంగా ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారన్న వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రెజీనా ఆడ మగ చేతులు కలిపిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటీ? మళ్లీ వెంటనే దాన్ని తొలగించడం ఏమిటీ? అసలు ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం జరిగినట్టా? లేనట్టా? లేక తమిళ చిత్ర ప్రచారంలో ఈ తంతు ఒక భాగమా? అన్న రకరకాల అభిప్రాయాలతో సినీ వర్గాలు అయోమయంలో పడ్డారు. కాగా రెజీనా ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై, నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా శరవణన్ ఉరుక్క భయమే, అధర్వతో జెమినీగణేశనుమ్ సురళీరాజావుమ్, మానగరం, రాజతందిరం 2 చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. -
కిలాడీ లేడీ!
‘‘ఈ అమ్మాయి పేరు జమునా రాణి. పోలీస్ కాదు గానీ అప్పుడప్పుడు పోలీస్ డ్రస్ వేసుకుంటుంది. ఖాకీ చొక్కాపై నక్షత్రాలను చూపిస్తూ హల్ చల్ చేస్తుంది. ఈ లేడీ కిలాడీ కహానీ తెలుసుకోవాలంటే ‘నక్షత్రం’ చూడండి’’ అంటున్నారు రెజీనా. సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో సందీప్‌కి జోడీగా జమునా రాణి పాత్రలో రెజీనా నటిస్తున్నారు. ఆదివారం జమునా రాణి ఫస్ట్ లుక్‌ను రామ్‌చరణ్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు నిర్మిస్తున్నారు. విజయదశమి నుంచి ప్రతి రోజూ చిత్ర బృందం ఒక్కో లుక్ విడుదల చేస్తోంది. పది రోజుల పాటు పది ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తామని చెప్పారు. అందులో రెజీనాది నాలుగో లుక్. ఇంకా ఆరు లుక్స్ ఉన్నాయనమాట. -
తిరుపతిలో రెజినా సందడి
తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది. స్థానిక తీర్థకట్టలో గురువారం ఉదయం ఆమె ఎంజీఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు గుమికూడారు. -
మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?
సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన ‘నగరం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సందీప్ కిషన్ వెరైటీ లుక్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు బతుకులు, మూడు చిక్కులు, రెండు ప్రేమలు అంటూ ట్రైలర్ లో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సందీప్ కిషన్ సినిమాల్లో ఓ మంచి ఎంటర్టైనర్గా ‘నగరం’ ఉంటుందని నమ్ముతున్నామని నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ అన్నారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుందని మరో నిర్మాత రాజేశ్ దండా చెప్పారు. లోకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జావెద్ సంగీతం అందించాడు. త్వరలోనే ‘నగరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి ‘నక్షత్రం’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. -
సంతానంపై పొగడ్తల వర్షం
నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటిది సినిమా రంగంలో ప్రతిభను గుర్తిస్తున్నారో లేదోగానీ సక్సెస్‌ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ లక్కే ప్రధాన పాత్రను పోషిస్తోందని చెప్పక తప్పదు. ఒక భాషలో నిరాదరణకు గురైన వారు మరో భాషలో ఆదరణను పొందితే వారిని మళ్లీ పిలిచి మరీ అవకాశాలివ్వడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు నటి అనుష్క, ఇలియానా, హన్సిక లాంటి వాళ్లంతా ఆదిలో కోలీవుడ్‌లో నిరాదరణకు గురైన వారే. అనుష్క రెండు అనే చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోశారు. అయినా ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌నే నమ్ముకున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న తరువాత మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇలా పలు సంఘటనలు ఉన్నాయి. నటి రెజీనా కథా ఇంతే. మొదట్లో తమిళంలో కేడీబిల్లా కిల్లాడిరంగా తదితర కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఆమెను దూరంగా పెట్టేశారు. టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా అక్కడ విజయాలను అందుకున్నారు. ఫలితం కోలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలందిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెజీనా తాను నటించనున్న హీరోలను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధర్వకు జంటగా జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సెల్వరాఘవన్ ఈ భామకు మరో అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం. సంతానం హీరోగా తాను చేస్తున్న తదుపరి చిత్రంలోనూ రెజీనానే నాయకి అట. హాస్య పాత్రల్లో నటించి కథానాయకుడైన సంతానంతో నటించనున్నారేమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ చాంతాడంత కారణానే చెప్పేస్తున్నారు. అదేమిటో చూద్దాం. నాకు సంతానం హాస్యనటుడిగానూ, కథానాయకుడిగానూ నచ్చుతారు. అంతగా ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. ముఖ్యంగా హీరోగా అవతారమెత్తిన తరువాత తన బాడీలాంగ్వేజ్‌ను పక్కాగా మార్చుకున్నారు. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ ఇతర హీరోలు ఆశ్చర్యపోయేలా సూపర్‌గా నటిస్తున్నారు. అందుకే ఆయనతో నటించనుండడం సంతోషంగా ఉంది. -
జ్యో... అచ్యుత... ఆనంద... జో...
నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్‌ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్‌గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్‌బ్యాక్‌లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్‌లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా. సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్‌ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది. తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్‌లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది. ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్‌లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి. కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్‌లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్‌లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్‌లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్‌లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ -
రెజీనాతో సరదాగా కాసేపు
-
ఊహించని క్లైమాక్స్ ఉంటుందట
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్‌ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'. నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్‌కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్‌ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది.