
ప్రమోషన్‌కు నో అంటున్న రెజీనా
నటి రెజీనాకు రెక్కలొచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవల ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
నటి రెజీనాకు రెక్కలొచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవల ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెజీనాకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తెలుగులోనూ చిత్రాలు చేయడంతో నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ జాణ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రంలో నటించింది. వేల్లన్ను వందా వెళ్లక్కారన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత ఎళిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.
ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో ఉదయనిధి పూర్తి వినోదంతో కూడిన హీరో పాత్రలో నటించారు. ఆయనతో సూరి హాస్యాన్ని పండించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధం అవుతోంది. మే నెల 12న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావలిసిందిగా నటి రెజీనాకు కోరగా తాను తెలుగు చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల శరవణన్ ఇరుక్క భయమేన్ చిత్ర ప్రమోషన్‌కు రావడం కుదరదని ఖరాఖండీగా చెప్పేస్తోందట. దీంతో యూనిట్ వర్గాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నటి రెజీనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.