చివరి క్షణంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'అజిత్'
రేసులో మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి సినిమా మాత్రమే
సౌత్ ఇండియాలో ఈ సారి సంక్రాంతికి సినీ సంబరాలు గ్యారెంటీ అనిపిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా బరిలోకి చాలా చిత్రాలు ఉన్నా యి. తెలుగులో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు టాప్‌లో ఉన్నాయి. కానీ, తమిళ్‌లో నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' ప్రధానంగా రేసులో ఉంది. ఈ చిత్రం పొంగల్‌కు తెరపైకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నటుడు అజిత్ అభిమానులను నిరాశ పరచే విషయమే అవుతుంది.
కాగా విడాముయర్చి చిత్రం వాయిదా పడటంతో కొత్తగా మరిన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అజిత్ సినిమా వాయిదాతో ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పొంగల్ రేసులో తమిళ పెద్ద హీరోలు ఎవరూ లేకపోవడంతో శంకర్, రామ్ చరణ్‌లు అక్కడ గేమ్ ఛేంజర్స్‌గా నివలనున్నారు.
అయితే, ఈ సంక్రాంతి బరిలో నటుడు జయంరవి, నిత్యామీనన్ జంటగా నటించిన 'కాదలిక్క నేనమిలై' చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. అదే విధంగా సంచలన దర్శకుడు బాలా తెరకె క్కించిన వణంగాన్ చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుంది. నటుడు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్‌కామాక్షీ భారీ ఎత్తున నిర్మించారు.
ఇకపోతే వీటంన్నిటిలో భారీ బడ్జెట్ సినిమాగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్‌పైనే కోలీవుడ్ అభిమానులు ఉన్నారు. సంక్రాంతి బరి నుంచి అజిత్ నటించిన విడాముయర్చి తప్పుకోవడంతో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు భారీ ప్లస్ అవుతుందని చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి చిత్రాల్లో ఈ రెండు చిత్రాలపైనే భారీ అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. చివరి క్షణంలో అజిత్ తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్‌కు కలిసొచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌తో కోలీవుడ్ సినీ అభిమానులకు చరణ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు లేవు కాబట్టి గేమ్ ఛేంజర్‌కు భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment