'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడింది'.. గేమ్ ఛేంజర్‌పై ఎస్‌జే సూర్య | Kollywood Star SJ Surya Shares Game Changer Update Of His role | Sakshi
Sakshi News home page

SJ Surya: 'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడింది'.. గేమ్ ఛేంజర్‌పై ఎస్‌జే సూర్య

Published Thu, Nov 21 2024 6:11 PM | Last Updated on Thu, Nov 21 2024 6:47 PM

Kollywood Star SJ Surya Shares Game Changer Update Of His role

మెగాహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.

అయితే తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య. ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో అలరించిన ఆయన.. గేమ్ ఛేంజర్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తాను రెండు ముఖ్యమైన సీన్లకు డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నానని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఒకటి రామ్ చరణ్‌తో.. మరొకటి శ్రీకాంత్‌తో సీన్స్‌ కాగా.. వీటికి ఏకంగా మూడు రోజుల సమయం పట్టిందని తెలిపారు. అయితే అవుట్‌పుట్‌ మాత్రం 'దీనమ్మ దిమ్మదిరిగి బొమ్మ కనపడిందని'.. థియేటర్లలో పిచ్చేక్కిస్తాయని సూర్య పోస్ట్ చేశారు. 'పోతారు మొత్తం పోతారు' అంటూ తనతు ఈ అవకాశమిచ్చిన డైరెక్టర్ శంకర్‌కు, నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతికి థియేటర్లలో కలుసుకుందాం అంటూ ఎస్‌జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

ఇటీవల విడుదల చేసిన గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఇప్పటికే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ మొదలెట్టారు. ఈ నెలలోనే ఫ్యాన్స్‌కు మరో అప్‌డేట్ ఇవ్వనున్నారు. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజవ్వగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో సింగిల్‌ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని హింట్ ఇచ్చారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి, ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌, సముద్రఖని, జయరామ్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement