![Ram Charan Shankar Movie Game Changer another scene leaked Online](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/16/game.jpg.webp?itok=VqSH9c-O)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శంకర్ ప్రకటించారు.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 థియేటర్లలో రిలీజైంది.
#Gamechanger Leaked scene here it's...
An Airport sequence 🌟
Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx— Vikki (@stupid_guy_07) July 16, 2024
Comments
Please login to add a commentAdd a comment