రామ్ చరణ్ దగ్గర అలాంటి పవర్: గేమ్ ఛేంజర్ డైరెక్టర్‌ | Director Shankar Comments On Ram Charan Movie Game Changer | Sakshi
Sakshi News home page

Game Changer: ఆ అవకాశం గేమ్ ఛేంజర్ రూపంలో దొరికింది: శంకర్ కామెంట్స్‌

Published Mon, Jul 8 2024 7:25 PM | Last Updated on Mon, Jul 8 2024 8:18 PM

Director Sankar Comments On Ram Charan Movie Game Changer

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ ప్రస్తుతం ఇండియన్‌-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కమల్‌హాసన్ భారతీయుడికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై ‍అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్‌ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు అదేంటో తెలుసుకుందాం.

శంకర్ మాట్లాడుతూ..'నాకు బాగా సపోర్ట్‌ చేస్తున్న తెలుగు ఆడియన్స్‌కు ఒకటే చెప్పాలనుకున్నా. తెలుగులో స్ట్రైట్ పిక్చర్‌ చేయాలని ఎప్పుడు చెబుతూ ఉంటా. ఇప్పుడు ఆ అవకాశం నాకు గేమ్ ఛేంజర్ రూపంలో దొరికింది. చెర్రీ ఒక ఎక్సలెంట్‌ స్క్రీన్ ప్రజెన్స్‌. ఆయన దగ్గర ఒక రకమైన బ్లాస్టింగ్ పవర్‌ ఉంటుంది. ఈ సినిమా చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్‌తో షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఇంకా కేవలం 15 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది.  ఆ తర్వాత సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం. రామ్‌ చరణ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.' అని అన్నారు. కాగా.. శంకర్‌ ఇండియన్‌-2, పార్ట్‌-3 చిత్రాలతో బిజీగా ఉండటంతో గేమ్‌ ఛేంజర్‌ ఆలస్యమైంది. దీంతో ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement